in east godavari
-
రేపు డీజీపీ సాంబశివరావు రాక
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) : రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు గురువారం రాజమహేంద్రవరం పోలీసు అర్బ¯ŒS జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక లాహాస్పి¯ŒS హోటల్లో కోస్తా కోస్టల్ రీజియ¯ŒS పోలీసు ఉన్నతాధికారులతో ఎ¯ŒSడీ యాక్ట్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం లాలాచెరువులో ఇటీవల నిర్మాణం చేపట్టిన పోలీసు అర్బ¯ŒS జిల్లా కార్యాలయాలను పరిశీలిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన నేపథ్యంలో డీజీపీ ఏ పోలీస్‌స్టేçÙనైనా తనిఖీ చేస్తారన్న ఉద్ధేశంలో అన్ని పోలీస్‌స్టేçÙన్లను శుభ్రం చేయిస్తున్నారు. ఆవరణలో మొక్కలు నాటిస్తున్నారు. -
హెచ్చరికలు బేఖాతరు
పండగ మూడు రోజుల్లో రూ.30 కోట్ల మేర సాగిన కోడిపందేలు కత్తులు కట్టి మరీ బరితెగించిన పందెగాళ్లు కోర్టు ఆదేశాలు, 144 సెక్ష¯ŒS ఉన్నా.. పట్టించుకోని వైనం యథేచ్ఛగా గుండాటలు, అశ్లీల నృత్యాలు అయినా పత్తా లేని పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోడిపందేలు నిర్వహించరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ఈ నెల 25వ తేదీ వరకూ 144 సెక్ష¯ŒS విధిస్తున్నామని, ఐదుగురికంటే ఎక్కువమంది గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా జిల్లా కలెక్టరే హెచ్చరించినా.. పందెగాళ్లు బేఖాతర్ అన్నారు. ఫలితంగా సంక్రాంతి పండగా మూడు రోజులూ.. సంప్రదాయం ముసుగులో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాట, మూడుముక్కలాటలు, అశ్లీల నృత్యాలు యథేచ్ఛగా సాగాయి. మునుపెన్నడూ లేని రీతిలో పందెగాళ్లు ఈ మూడు రోజుల్లో రూ.30 కోట్ల మేర కొల్ల గొట్టారు. ఇందులో ‘తమ్ముళ్ల’కు, పోలీసులకు వాటాలు అందడంతో పందెంకోళ్లకు పగ్గాలు వేసేవారే లేకపోయారు. ప్రధానంగా కోనసీమలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పందేలు విచ్చలవిడిగా సాగాయి. మురమళ్లలో డ్రోన్ల వినియోగం ఐ.పోలవరం మండలం మురమళ్లలోని కోడిపందేల బరి జిల్లాలోనే అతి పెద్దది. దీంతో దీనినో క్రీడాస్థలంలా తయారు చేశారు. బరుల చుట్టూ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలు జరుగుతున్న తీరును డ్రో¯ŒS కెమెరాలతో చిత్రించారు. ఈ బరిలో ప్రతి పందెం రూ.లక్షల్లోనే సాగింది. ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు వీఐపీ గ్యాలరీలో తొలి వరుసలోనే కూర్చుని ఇక్కడి పందేలను స్వయంగా జరిపించారు. భోజన విరామం కూడా లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ పందేలు నిర్విరామంగా నిర్వహించారు. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో గ్యాలరీలో కూర్చునవారికి నిర్వాహకులు చికె¯ŒS బిర్యానీ బాక్సులు అందించడంతో ఏమాత్రం బ్రేక్ లేకుండా పందేలు సాగాయి. ఈ ఒక్క బరిలోనే రోజూ దాదాపు రూ.5 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.15 కోట్ల మేర పందేలు జరిగాయి. మురమళ్ల బరిలో పందేలు చూసేందుకు జిల్లావ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఇక్కడ గుండాట కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బరి వద్ద గుండాట ఏర్పాటుకు రూ.38 లక్షలతో హక్కులు సొంతం చేసుకున్న నిర్వాహకులు రోజుకు రూ.50 లక్షల పైనే ఆర్జించారు. ఇందులో తెలుగు తమ్ముళ్లకు కూడా 30 శాతం వాటాలు అందాయి. డిప్యూటీ సీఎం ఇలాకాల్లో.. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురంతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మూడు రోజులూ కోడిపందేలు జోరుగా జరిగాయి. అల్లవరం మండలం గోడి, గోడిలంక, గుండెపూడి, అల్లవరం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, ఎ¯ŒS.కొత్తపల్లి, చల్లపల్లి, కూనవరంలో అమాత్యుని అండ ఉందనే ధైర్యంతో పందెగాళ్లు లక్షల్లోనే పందేలు కాశారు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, మేడపాడు, వీకే రాయపురం, మాధవపట్నం గ్రామాల్లోని బరుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజోలు దీవిలో కూడా పందేలు యథేచ్ఛగా సాగాయి. మండలంలోని చింతలపల్లి, ఉయ్యూరివారి మెరక, మలికిపురం, అంతర్వేది, సఖినేటిపల్లిలంక తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించారు. మెట్టప్రాంతంలో.. మెట్టలోని జగ్గంపేట నియోజకవర్గంలో భోగి నుంచి కనుమ పండగ వరకూ కోడిపందేలు జోరుగా జరిగాయి. ప్రధానంగా కిర్లంపూడిలో కోడిపందేలు జరిగాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం తన కుమారుడు, అల్లుడితో కలిసి ఆదివారం సాయంత్రం ఇక్కడ పందేలను తిలకించారు. కిర్లంపూడి మండలంలో వేలంక, గోనేడ, తామరాడ, కృష్ణవరం, జగ్గంపేట మండలం కాట్రావుపల్లి, మర్రిపాక, రాజపూడి, జె.కొత్తూరు, వెంగాయమ్మపురం, గోవిందపురం, గండేపల్లి మండలం సింగరంపాలెం, మల్లేపల్లి, నీలాద్రిరావుపేట, గోకవరం మండలం కృష్ణునిపాలెం, కామరాజుపేట, మల్లవరం తదితర గ్రామాల్లో జరిగిన కోడిపందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజమహేంద్రవరం రూరల్ కవలగొయ్యి, కోలమూరు, వేమగిరి, కడియపులంక తదితర గ్రామాల పరిధిలో ఈ మూడు రోజులూ కోడిపందేలు అర్ధరాత్రి వరకూ నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు దగ్గరుండి మరీ పందేలను ప్రోత్సహించారు. కోడిపందేలకు తోడుగా ఆయా బరుల వద్ద గుండాట, ముక్కతిప్పుడు, మద్యం, సారా అందుబాటులోకి తెచ్చారు. ఈ మూడు రోజుల్లోనే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ చేతులు మారాయి. మండపేట నియోజకవర్గం మండపేట అర్బన్, రాయవరం, కపిలేశ్వరపురం మండలం లంకల్లోనూ రూ.50 లక్షలకు పైగా పందేలు జరిగాయి. అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం, అనపర్తి, గొల్లల మామిడాడ, మెట్ట గ్రామాల్లోను, రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు, యండగండి, పల్లిపాలెం తదితర గ్రామాల్లోనూ, కాకినాడ రూరల్ పరిధి భావారం తోటలు, గొర్రిపూడి, పెనుమర్తి, గురజనాపల్లి, పెద్దాపురప్పాడు తదితర గ్రామాల్లోనూ, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, రాజానగరం నియోజకవర్గాల పరిధిలోనూ భారీగా పందేలు నిర్వహించారు. విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు సందట్లో సడేమియా అన్నట్టు కొన్నిచోట్ల అశ్లీల నృత్యాలకూ తెర తీశారు. మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గుడిమెళ్లంక, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, కొత్తపేట ప్రభల తీర్థాల్లో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు నిర్వహించారు. రాత్రి మొదలైన ఈ నృత్యాలు అర్ధరాత్రయ్యేసరికి శృతి మించిపోయాయి. కోనసీమవ్యాప్తంగా కుర్రకారు ఈ నృత్యాలను తిలకించేందుకు తండోపతండాలుగా వెళ్లారు. వీటి విషయంలో కూడా పోలీసులు మౌనంగానే ఉండిపోయారు. -
ఉసురు తీసిన సినిమా సరదా..
మూడు రోజుల సంక్రాంతి పండుగల ను ముచ్చటగా చేసుకునేందుకు పట్టరాని ఉత్సాహంతో ఊరూర సందడి నెలకొంటే.. మరోవైపు వేర్వేరు ప్రమాదాల్లో జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. వీటిలో 23 మంది గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. బైక్‌లపై ప్రమాదాలకు గురైన ఇద్దరు యువకులు, రెండు బైక్‌లు ఢీకొని మరో ఇద్దరు, రెండు ఆటోల ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుడు, గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. రాయవరం/కపిలేశ్వరపురం (మండపేట) : సంక్రాంతి పండుగ.. సినిమా చూసిన సరదా జోరులో బైక్‌పై దూసుకుపోతున్న వారికి.. మృత్యువు ఆర్టీసీ బస్సు రూపంలో ఎదురొచ్చింది. ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ఒకరు అక్కడికక్కడే మృతి చెందిగా, మరొకడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనకు మృతుడి కుటుంబీకుల ఆవేదన కట్టలు తెచ్చుకుంది. సంక్రాంతి సందడితో ఉత్సాహంగా ఉన్న కపిలేశ్వరపురం మండలంలోని నల్లూరి గ్రామం.. ఒక్కసారి విషణ్ణ వదనంతో దిగాలుపడింది. కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామానికి చెందిన నరాల వెంకటేష్ (18), బక్కి క్రాంతికుమార్ మోటార్‌సైకిల్‌పై సినిమా చూసేందుకు రామచంద్రపురం వెళ్లారు. సినిమా చూసి వస్తుండగా మాచవరం–పసలపూ డి గ్రామాల మధ్య మండపేట– కాకినాడ ప్రధాన రహదారిపై.. రావులపాలెం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఢీకొట్టింది. వెంకటేష్ తలపై నుంచి బస్సు టైరు వెళ్లడంతో అతడి తల ఛిద్రమైంది. రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన క్రాంతి కుమార్‌ను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అతడిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో విషాదం పండగనాడు జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది. రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో ప్ర మాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆవిరైన ఆనందం.. సినిమా చూసి ఇంటికి వస్తారనుకుంటున్న వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఈ ఘటన సమాచారం అందడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలింది. వెంకటేష్ తండ్రి ఏడుకొండలు, తల్లి వెంకటలక్షి్మల ఆవేదనను అదుపు చేయడం గ్రామస్తులకు కష్టమైంది. చేతికి అందివచ్చాడనుకుంటున్న తరుణంలో వెంకటేష్ మృతి చెందడాన్ని వారు తట్టుకోలేకపోయారు. వెంకటేష్‌కు ఇద్దరు సోదరిలు ఉన్నాయి. పెద్ద సోదరి మహాలక్షి్మకి వివాహం కాగా, లోవకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. పండుగ అనంతరం లోవకు వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్న తరుణంలో ఈ షాక్‌ను ఎలా తట్టుకోవాలని వారు తల్లిడిల్లిపోయారు. ఇదిలాఉండగా, మృతుడు వెంకటేష్ తల్లి వెంకటలక్షి్మకి ఇటీవలే మేజర్ ఆపరేష¯ŒS అయింది. ప్రమాద ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయవరం ఎస్సై వెలుగుల సురేష్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు. బస్సు ఢీకొని సైక్లిస్టు మృతి గండేపల్లి (జగ్గంపేట) : మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో సైక్లిస్టు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు తాళ్లూరుకు చెందిన చిట్టూరి వెంకట్రావు (ఆనందరావు) (65) సైకిల్‌పై గ్రామంలోని డివైడర్ దాటుతుండగా విశాఖ వైపు నుంచి విజయవాడ వెళుతున్న అద్దెకు తీసుకున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై కొనఊపిరితో కొట్టుకుంటున్న క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు 108 అంబులె¯Œ్సకు సమాచారం అందజేశారు. అంబులె¯Œ్స సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. స్ధానికులు, ఏఎస్సై వరహాలరాజు, నాగేశ్వర్రావు, చిరంజీవి స్తంభించిన ట్రాఫిక్‌ను నియంత్రించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రజనీకుమార్ తెలిపారు. సైకిల్‌ను ఢీకొని... సామర్లకోట (పెద్దాపురం) : సినిమా చూసేందుకు హడావుడిగా బైక్‌పై వెళుతోన్న ఇద్దరు యువకులను సైకిల్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక కెనాల్ రోడ్డులో శనివారం రాత్రి వేట్లపాలెం గ్రామానికి చెందిన కడిమిపల్లి ఏసుబాబు (26), అతడి స్నేహితుడు ఆకుమర్తి సత్యనారాయణ మోటారుసైకిలుపై సామర్లకోటలోని సినిమా చూడటానికి వస్తున్నారు. సుగర్ ఫ్యాక్టరీ వద్ద సైకిలు ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వారు రోడ్డుపై పడిపొయారు. దీంతో ఏసుబాబు అకడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ గాయపడ్డాడు. మృతుడు ఏసుబాబుకు భార్య, ఐదు ఏళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
పందేనికి సై
సంక్రాంతి కోడిపందేలకు సిద్ధమవుతున్న బరులు బరితెగిస్తున్న తమ్ముళ్లు ఎమ్మెల్యే స్వగ్రామంలో మినీ స్టేడియాన్ని తలపించేలా ఏర్పాట్లు డ్రో¯ŒS కెమెరాలతో చిత్రీకరణ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గాల్లోనూ భారీ ఏర్పాట్లు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు ‘‘కోడిపందేలు జరగనివ్వం. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కోర్టులు కూడా అవే చెప్పాయి. అంతకీ పెద్ద పండగకు సంబరాలు కావాలంటే కాకినాడ రండి’’ – జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెబుతున్న మాటలివి. కానీ, వాస్తవంగా జరుగుతున్నది వేరేలా ఉంది. ఆయన సొంత నియోజకవర్గమైన అమలాపురం, ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం ప్రాంతాలతోపాటు.. కోనసీమలోని పలు ప్రాంతాల్లో పందెగాళ్లు బరితెగిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కనుసన్నల్లో కోట్లలో పందేలు నిర్వహించేందుకు బరులు రెడీ చేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించుకోవచ్చు. కానీ కోళ్లకు కత్తులు కడితే మాత్రం స్వాధీనం చేసుకోవాలి. సరిగ్గా దీనినే పందేల నిర్వాహకులు అవకాశంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కోడిపందేలకు ఇక్కడ బరులు సరిపోవనే ఉద్దేశంతో పందెగాళ్లు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లేవారు. కానీ, ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నేలా.. కోనసీమలోని మురమళ్ల, గోడి గ్రామాల్లో కోట్లలో పందేలు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. మురమళ్లలో భారీ ఏర్పాట్లు ఐ.పోలవరం మండల ముఖద్వారం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం వెనుక శరభయ్య చెరువు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో కోట్లలో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్కింగ్‌కే పదెకరాలు కేటాయించారంటే ఏ స్థాయిలో పందేలు జరుగుతాయో ఊహించవచ్చు. ఆక్వా రంగంలో చేయి తిరిగిన ఒక ప్రముఖుడు అక్కడి ముఖ్యనేత సూచనతో ఈ స్థలాన్ని ఉచితంగా అందించారు. ఏర్పాట్లు మినీ స్టేడియంను తలపిస్తున్నాయి. భారీ షామియానాలు, పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. తోపులాటలు జరగకుండా భారీ గేట్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ స్టేడియంలో మాదిరిగా 500 మంది వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ. 3 వేల మంది కూర్చుని వీక్షించేలా సాధారణ గ్యాలరీ ఏర్పాౖటెంది. నిర్వహణ ఏర్పాట్లకే సుమారు రూ.15 లక్షలు వెచ్చించారు. ఆ సొమ్మును గుండాట వేలం పాట సొంతం చేసుకున్నవారు అడ్వాన్సుగా ఇచ్చారని సమాచారం. నియోజకవర్గ ముఖ్యనేతకు వరుసకు సోదరుడైన మురమళ్లకు చెందిన తెలుగు యువత నాయకుడు అన్నీ తానే అన్నట్టుగా బేరసారాలు నిర్వహిస్తున్నారు. మురమళ్ల బరి నిర్వాహకులు వాట్సాప్‌లో ఆహ్వానాలు కూడా పంపించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు స్వగ్రామం మురమళ్ల. ఆయన అనుచరగణం కనుసన్నల్లోనే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. గత సంక్రాంతికి ఎల్ఈడీ తెరలతో కోడిపందేలను చూపించారు. ఈసారి డ్రో¯ŒS కెమేరాల సాయంతో పందేలను చిత్రీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. కోడిపందేలకు ముహూర్తం శుక్రవారం ఉదయం 8 గంటలుగా నిర్ణయించారు. రూ.10 లక్షల పందేలు ఎనిమిది, రూ.8 లక్షల పందేలు ఐదు, కత్తులు లేని పందేలు (జట్టీ పందేలు) మరో ఐదింటి కోసం నిర్వాహకులు సన్నాహాలు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిర్వహించేందుకు విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేశారు. పండగ మూడు రోజులూ ఇక్కడ రూ.10 కోట్లు పైబడే పందేలు జరుగుతాయి. మూడు రోజులూ జరిగే గుండాటను రూ.38 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. ఐ.పోలవరంలో ఒక టీడీపీ నాయకుడి అతిథి గృహంలో ఈ వేలం నిర్వహించారు. పేకాటకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యధికంగా స్కోర్ కొట్టే పేకాటగాడికి బంపర్ ఆఫర్‌గా రూ.15 లక్షల విలువైన కారును బహుమతిగా ప్రకటించారు. పేకాటకు ససేమిరా అంటున్న పోలీసు అధికారులపై టీడీపీ నేతలు ‘అన్ని రకాల’ ఒత్తిళ్లూ తెస్తున్నారు. అధికార పార్టీ నేతలే కోడిపందేలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ గొడవ ఎందుకని పోలీసులు స్థానికంగా ఉండకుండా కాకినాడ సాగర సంబరాలకు డ్యూటీలు వేయించేసుకున్నారని తెలిసింది. ఇటు అమలాపురం.. అటు పెద్దాపురం.. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది పెద్దాపురం నియోజకవర్గం. ఈ రెండు ప్రాంతాల్లో కూడా కోడిపందేలకు పందేలరాయుళ్లు ‘బరి’ తెగిస్తున్నారు. అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం గోడి, గుండెపూడి, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఉప్పలగుప్తం మండలం కూనవరంతోపాటు.. మిగిలిన కోనసీమలోని మలికిపురం మండలం ఉయ్యూరువారి మెరక, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక, అంతర్వేది, రావులపాలెం మండలం దేవరపల్లి, అంబాజీపేట మండలం వాకలగరువు ఇలా ఒక్క కోనసీమలోనే సుమారు 20 ప్రాంతాల్లో పందేలు నిర్వహించనున్నారు. అల్లవరం మండలం గోడిలో భారీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇక పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెం, వీకే రాయపురం గ్రామాల్లో రూ.70 లక్షలకు వేలం హక్కులు సొంతం చేసుకున్నారు. ఎవరెన్ని చెప్పినా పందేలు నిర్వహించి తీరుతామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. నగదు సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పెద్ద నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు పందెగాళ్లు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు కొత్త రూ.2000, రూ.500 నోట్లు అవకాశం ఉన్నంత మేర సిద్ధం చేసుకున్నారు. మరికొందరు తమ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదుకు అనుసంధానంగా చెక్కు బుక్కులు, స్వైపింగ్ మెషీన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అన్నిచోట్లా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై మాకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. – ఎల్.అంకయ్య, డీఎస్పీ, అమలాపురం -
నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాక
అల్లవరం : అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం మంగళవారం ఓడలరేవు ఓఎ¯ŒSజీసీ టెర్మినల్‌కు రానున్నారని జిల్లా మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లాడి హనుమంతరావు సోమవారం తెలిపారు. ఓఎ¯ŒSజీసీ కార్యకలాపాలతో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకెళతామన్నారు. చమురు నిక్షేపాల కోసం చేస్తున్న సిస్మిక్ సర్వే వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ముందుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయకుండా యథేచ్ఛగా సర్వే చేస్తున్నారని ఆరోపించారు. అంతర్వేది నుంచి ఎస్.యానం వరకూ ఉన్న 50 మత్స్యకార గ్రామాలు స్టాండింగ్ కమిటీ ముందు తమ సమస్యలను వివరిస్తాయని తెలిపారు. ఏటా ఓడలరేవు మత్స్యకారులకు ఓఎ¯Œజీసీ ఇచ్చే నిత్యావసరాల కిట్లను ఈ ఏడాది పంపిణీ చేయలేదన్నారు. -
తప్పిన సెంటిమెంట్ ముప్పు
1956 నుంచి ప్రతీ పదేళ్లకు తుపాన్ల గండం అంతులేని ఆస్తి నష్టం భయపడ్డ జిల్లా ప్రజలు ఎలాంటి ఇక్కట్లు లేకపోవడంపై హర్షం అమలాపురం : సంవత్సరం చివరిలో ‘ఆరు’ సంఖ్య వస్తే జిల్లా వాసులు ఏదో ఒక ఉపద్రవాన్ని ఎదుర్కొనడం సెంటిమెంట్‌గా మారింది. 1956 నుంచి 2006 వరకు ప్రతీ పదేళ్లకు ఒకసారి పెను తుపాను.. మరోసారి గోదావరికి భారీ వరదలు ముంచెత్తి జిల్లాను అతలాకుతలం చేశాయి. పెద్ద సంఖ్యలో ప్రాణ, కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ ఏడాది 2016లో కూడా చివరన ఆరు ఉండడంతో విపత్తు తప్పదని జిల్లా వాసులు, మరీ ముఖ్యంగా కోనసీమ వాసులు ఏడాదంతా ఆందోళనతోనే గడిపారు. ఇందుకు విరుద్ధంగా ఈ ఏడాది వరదలు, తుపాను వంటి విపత్తులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. 1956లో తుపాను సంభవించి కోనసీమలో బీభత్సం సృష్టించింది. ప్రజలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 1966లో భారీ వరదలు ముంచెత్తాయి. కాట¯ŒS కాలంలో నిర్మించి ఆనకట్టకే గండి పడిందంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 1976 దివిసీమకు ఉప్పెన తాకిన సమయంలోనే జిల్లాను తుపాను గడగడలాడించి పెద్ద నష్టాన్నే మిగిల్చింది. ఇవన్నీ ఒక ఎత్తయితే 1986 గోదావరికి భారీ వరదలు సంభవించి ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తాయి. ఆ ఏడాది ఆగస్టులో గోదావరికి మొదటసారి వచ్చిన వరదతో రెండు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో 35 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అప్పుడు.. ఇప్పుడు అదే అతి పెద్ద వరద. దీని ఉధృతికి రెండు జిల్లాలో పలుచోట్ల గండ్లు పడ్డాయి. మొత్తం డెల్టా ఏటిగట్లు నాశనమయ్యాయి. జిల్లాలో పి.గన్నవరం మండలం నాగుల్లంక, గంటి గ్రామాల వద్ద పెద్ద గండ్లు పడ్డాయి. అంతులేని ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం చోటుచేసుకుంది. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి. 1996లో తుపాను మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు. పెనుగాలులు 175 కిమీల వేగంతో వీచాయి. ఈ తుపానుకు కోనసీమలో సుమారు 552 మంది మృత్యువాత పడ్డారు. పెనుగాలులకు 32 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. 55 లక్షల చెట్ల మొవ్వులు ఒడితిరిగి పోయాయి. తుపాను నుంచి కొబ్బరి కోలుకుని సాధారణ దిగుబడి ఇవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఐ.పోలవరం మండలం భైరవపాలెం గ్రామం దాదాపు తుడుచుపెట్టుకుపోయింది. ఆ తుపాను గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో 2006 వచ్చిన వరదలు కోనసీమకు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. సుమారు 28 లక్షల క్యూసెక్కుల నీరు వదలడంతో అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడి ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకున్నాయి. సంవతర్సం చివర ‘ఆరు’ వచ్చినప్పుడల్లా జరుగుతున్న విపత్తులను చూసి ఈ ఏడాది కూడా విపత్తు తప్పదని జిల్లా వాసులు ఏడాదంతా ఆందోళనతోనే గడిపారు. ఈ ఏడాది ఆగస్టులో వరద రావడం, నవంబరు, డిసెంబర్లలో తుపాను హెచ్చరికలు తీవ్ర కలవరాన్ని రేపాయి. వాటి ముప్పుతప్పడంతో పాటు మరో నాలుగు రోజుల్లో ఏడాది పూర్తికావస్తుండడంతో ఆనవాయితీ తప్పిందని ఉపరిపీల్చుకుంటున్నారు. -
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.. మేరీ మేరీ క్రిస్మస్
పాపుల రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి, సత్యం, ధర్మం, శాంతి, దయ, ప్రేమ మార్గంలో మనందరం నడవాలని లోకానికి బోధించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆదివారం జిల్లాలో ఉత్సాహంగా జరుపుకున్నారు. పలు చర్చిల్లో పశువుల పాకలో క్రీస్తు జననాన్ని తెలిపే ఇతివృత్తాలను ప్రదర్శించారు. వాటి ముందు కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థనలు చేశారు. విద్యార్థులు క్రిస్మస్ తాత వేషధారణతో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ పాటలు పాడారు. కేక్‌లు కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాస్టర్లు భక్తి సందేశాన్ని వినిపించారు. -
కాకినాడలో జూనియర్ ఎన్టీఆర్ సందడి
కాకినాడ రూరల్ : ప్రముఖ సినీనటులు జూనియర్ ఎన్టీ రామారావు, నందమూరి హరికృష్ణలు శుక్రవారం కాకినాడలో సందడి చేశారు. శనివారం సాయంత్రం దివంగత నందమూరి జానకీరామ్ కుమారులు, ప్రముఖ ల్యాండ్‌లార్డ్ యార్లగడ్డ ప్రభాకరచౌదరిల మనుమలకు పంచెకట్టు కార్యక్రమం జరగనుంది. కరప మండలం వేళంగిలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, హరికృష్ణలు కాకినాడలోని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం ఎన్టీఆర్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడన్న సమాచారం ఉదయమే తెలియడం, దానికి తోడు కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టడం తదితర సమాచారం మేరకు పెద్ద ఎత్తున అభిమానులు సర్పవరం జంక్షన్ సమీపంలోని చుండ్రు శ్రీహరి నివాసానికి తరలివచ్చారు. భారీ ఎత్తు అభిమానులు తరలిరావడంతో కాకినాడ– పిఠాపురం రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఎన్టీఆర్, హరికృష్ణ, శ్రీహరిలు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు. కోటలో సందడి.. సామర్లకోట : రాజమండ్రి నుంచి కాకినాడ వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్ సామర్లకోటలో కొద్ది సేపు సందడి చేశారు. పెద్దాపురం ఏడీబీ రోడ్డు మీదుగా కాకినాడ వెళుతున్న సమయంలో శుక్రవారం ఏడీబీ రోడ్డులో అభిమానులు తరలి వచ్చారు. ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడు కె.భాస్కర్‌చౌదరి, పిల్లి కృష్ణప్రసాద్, వెంకట్, తోట గోపి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే వచ్చి వెళ్లిన సీఎం సతీమణి భువనేళ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శుక్రవారం కరప మండలం వేలంగి యార్లగడ్డ ప్రభాకరచౌదరి ఇంటికి వచ్చి వెళ్లారు. ఈమె పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు. ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా విదేశీ పర్యటన కారణంగా ఆయన సతీమణి వచ్చివెళ్లినట్టు చుండ్రు వెంకన్నరాయ్చౌదరి తెలిపారు. -
నేడు బీవీ రాఘవులు రాక
కాకినాడ సిటీ : సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు శనివారం జిల్లాకు రానున్నారని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.వీరబాబు శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కొంతకాలంగా దివీస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందేనని అయితే బహిరంగసభకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శనివారం దివీస్ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బీవీ రాఘవులు వస్తారన్నారు. -
జిల్లాలో కేరళకు దీటైన అందాలు
కోటగమ్మం (రాజమహేంద్రవరం) : పర్యాటకంగా అభివృద్ధి చెందిన కేరళ వంటి రాష్ట్రాలకు దీటుగా జిల్లాలో రమణీయమైన పర్యాటక ప్రాంతాలు, వనరులు ఉన్నాయని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, ఆహారశుద్ధి పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, రారాష్ట్రాన్ని పర్యాటకరంగంలో అగ్రగామిగా నిలిపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పర్యాటక, ఆహారశుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులపై ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో గురువారం హోటల్ రివర్‌బేలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సద్వినియోగం చేసుకుని, తగిన ప్రాజెక్టులతో ముందుకు రావాలని సూచించారు. కాకినాడ బీచ్ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని, మొదటి దశ పనులను ఈనెలలో ప్రారంభిస్తామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద రూ. 56 కోట్లతో రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలన్నింటినీ అనుసంధానం చేసి, గోదావరితీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఈట్‌స్ట్రీట్, జల క్రీడలు నిర్వహిస్తామన్నారు. కడియం నర్సరీలను అనుసంధానిస్తూ బోటు రైడింగ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు. పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ పర్యాటక ప్రాజెక్టు చేపట్టిన ఔత్సాహికులకు మూడేళ్ల పాటు లీజు, అద్దెలపై మారటోరియంను అమలు చేస్తామన్నారు. మారేడుమిల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టామని, కాకినాడ బీచ్, హోప్ ఐలాండ్, కోరింగ మడ అడవులను, అఖండ గోదావరి తీరాన్ని, కోనసీమ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాకినాడ తీరాన్ని, హోప్ఐలాండ్, కోరింగ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ.70 కోట్లు, అఖండ గోదావరి తీరాన్ని ఎకో, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కోనసీమలో హెరిటేజ్, గ్రామీణ, వ్యవసాయ రంగాలన కలుపుతూ ప్రత్యేక పర్యాటక ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఫిక్కీ చైర్మ¯ŒS వి.వాసుదేవరావు, టూరిజం సబ్ కమిటీ చైర్మ¯ŒS కె.లక్ష్మినారాయణ, అఖండ గోదావరి ప్రాజెక్టు ఈడీ జి.భీమశంకరం తదితరులు పాల్గొన్నారు. -
‘వార్దా’వరణం
ఉగ్రరూపమెత్తిన కడలి ఉప్పాడ తీరంపై విరుచుకుపడుతున్న అలలు ధ్వంసమవుతున్న బీచ్‌రోడ్డు అన్నదాతల కలవరం చి‘వరి’లో నష్టం తప్పదేమోనని ఆందోళన పిఠాపురం : వార్దా తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులకు తోడు అత్యంత వేగంగా దూసుకువస్తున్న కెరటాల తాకిడికి ఉప్పాడ సాగరతీరం ముక్కలవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో బలంగా నిర్మించిన జియో ట్యూబ్ రక్షణ గోడను సైతం చిన్నాభిన్నం చేస్తూ.. గ్రామంలోని మత్స్యకారుల ఇళ్లపై అలలు విరుచుకుపడుతున్నాయి. సుమారు 6 మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్న కెరటాల తాకిడితో ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డు ధ్వంసమవుతోంది. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రయాణిస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో తీరం వెంబడి కొత్తపల్లి పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రికి బీచ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. సముద్రంలోనే ఉన్న బోట్లు? కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన పలు బోట్లు ప్రస్తుతం తీరానికి దూరంగా సముద్రంలో చేపల వేటలో ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో వెంటనే ఒడ్డుకు వచ్చేయాలంటూ ఆ బోట్లపై ఉన్న మత్స్యకారులకు వారి కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బోట్లు వివిధ ప్రాంతాల్లో ఒడ్డుకు చేరుకుంటున్నాయని వారు చెబుతున్నారు. కొన్ని బోట్లలో ఉన్న మత్స్యకారుల సెల్ ఫోన్లు పని చేయకపోవడంతో వారికి సమీపంలోని బోట్లలో ఉన్న మత్స్యకారుల ద్వారా సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, సముద్రంలో ఎవరూ లేరని, సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లూ తీరానికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్ని బోట్లపై చేపల వేటకు వెళ్లారు? ఎక్కడ ఉన్నారనే విషయాలపై మత్స్యశాఖ అధికారులు దృష్టి సారించారు. మండల అధికారులు గ్రామాల్లో సమాచారం సేకరిస్తున్నారు. సముద్రంలో ఉన్నవారికి వీహెచ్ఎఫ్ సెట్ల ద్వారా సమాచారం అందించి, వారు తీరానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రమాదాన్ని లెక్క చేయకుండా.. ఓపక్క కెరటాలు అత్యంత ప్రమాదకరంగా విరుచుకుపడుతున్న సమయంలో కూడా కొందరు తమ సెల్ఫోన్లకు పని చెప్పారు. ప్రమాదకర పరిస్థిల్లో రక్షణ గోడలపై నిలబడి సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. వారిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అమలాపురం : ఈశాన్యం కరుణించడంతో ఒడ్డున పడ్డామని సంతోషంగా ఉన్న ఖరీఫ్ రైతులను వార్దా తుపాను భయపెడుతోంది. దీని ప్రభావం జిల్లా మీద కూడా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడం రైతులను కలవరానికి గురి చేస్తోంది. ఈ నెల రెండో తేదీన నాడా తుపాను ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని వరి రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ గండం గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుని కోతలు ముమ్మరం చేశారు. తీరా ఇప్పుడు వార్దా తుపాను రావడం వారిని మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్ కోతలు దాదాపు పూర్తి కావస్తున్నా.. తీరప్రాంత మండలాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తూర్పు డెల్టా పరిధిలోని కరప, కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం సబ్ డివిజన్ల పరిధిలో సుమారు 60 వేల ఎకరాల్లో ఇంకా వరి కోతలు జరగాల్సి ఉంది. సాగు ఆలస్యం కావడంవల్ల ఇక్కడి పంటలు ఇప్పుడు కోతలకు వచ్చాయి. మరో 20 వేల ఎకరాల్లో పంట పనల మీద ఉంది. పెద్ద నోట్ల రద్దువల్ల కూలీలకు సొమ్ములు సర్దలేక చాలామంది రైతులు కోత కోసిన పనలను, నూర్పిళ్ల తరువాత ధాన్యాన్ని చేలల్లోను, కళ్లాలోను ఉంచేశారు. నోట్ల రద్దు వల్ల అటు అమ్మకాలు కూడా లేకపోవడంతో ధాన్యం కళ్లాలను వీడడం లేదు. ఈ సమయంలో వార్దా తుపాను వల్ల భారీ వర్షాలు కురిస్తే పంట నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాశులు, పనల మీద బరకాలు కప్పి ఒబ్బిడి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చేలల్లో పనలను గట్ల మీదకు తరలిస్తున్నారు. మరో వారం, పది రోజులు వాతావరణం సహకరిస్తే గట్టెక్కుతామని, జిల్లాలో తుపాను ప్రభావం లేకుండా చూడాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. వార్దా తుపాను నేపథ్యంలో పనలమీద, కళ్లాల్లో ధాన్యం ఉంచుకున్న రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆక్వాపైనా ప్రభావం వరి రైతులతోపాటు ఆక్వా రైతులను సైతం వార్దా తుపాను ఆందోళనకు గురి చేస్తోంది. వైరస్ వల్ల పోయినంత పోగా, చాలా తక్కువ విస్తీర్ణంలో ఆక్వా రెండు, మూడు పంటలు ఉన్నాయి. ఇవి కొంత ఆశాజనకంగా ఉండగా తుపాను వల్ల భారీ వర్షాలు కురిసి వాతావరణం మరింత చల్లబడితే తమకు నష్టం తప్పదని ఆక్వా రైతులు అంటున్నారు. తీవ్ర తుపాను ‘వార్దా’ ప్రభావంతో ‘తూర్పు’ తీరం వణుకుతోంది. అది తీరం దాటేది దక్షిణ కోస్తాలోనే అని చెబుతున్నప్పటికీ.. దాని ప్రభావంతో ఎగసి పడుతున్న అలలతో కడలి ఉగ్రరూపం దాల్చింది. విరుచుకుపడుతున్న అలలతో ఉప్పాడ తీరం ముక్కలవుతోంది. మరోపక్క ఆదివారం ఉదయం నుంచి వీస్తున్న ఈదురుగాలులతో కోతకు వచ్చిన వరిచేలు నేలకు ఒరిగిపోయే పరిస్థితి నెలకొంది. దీనికి వర్షాలు కూడా తోడైతే ఈ ఏడాది కూడా పంట నష్టం తప్పదని అన్నదాతలు కలవరపడుతున్నారు. అధికారయంత్రాంగం అప్రమత్తం కాకినాడ సిటీ : వార్దా తుపాను ప్రభావం జిల్లాపై అంతగా ఉండనప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. క్షేత్రస్థాయిలో ప్రధానంగా తీరప్రాంత మండలాల్లో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇప్పటికే నియమితులైన ప్రత్యేకాధికారులు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా పౌరసరఫరాల శాఖ నిత్యావసర సరుకులను మండల స్థాయి స్టాక్ పాయింట్లలో సిద్ధంగా ఉంచింది. కాకినాడ పోర్టులో జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. -
నిరసనల మధ్య సీఎం పర్యటన
రుణాలు మాఫీ అన్నారు ఏమయిందని డ్వాక్రా మహిళలు ప్రశ్నలు నిలదీయడానికి వెళ్తామంటే అడ్డుకుంటారా : పోలీసులపై పలువురి ఆగ్రహం హామీలిచ్చి తప్పుకోవడం ఇదేమి పద్ధతంటూ ఆవేదన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు దళిత, గిరిజన గర్జన సభలో బాబును సత్కరించిన కారెం శివాజీ సాక్షి, రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో నిర్వహించిన సుడిగాలి పర్యటన నిరసనల మధ్య సాగింది. ఆర్ట్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పలువురు మహిళలు పలు ప్రశ్నలతో సీఎంను నిలదీయడానికి ముందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీఎం కూడా అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాధితులు నినాదాలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో గురజాల అక్కమ్మతల్లి ఆలయాన్ని కొందరుక కూల్చివేసి స్థలాన్ని ఆక్రమించారని, న్యాయం చేయాలని సీఎం పాదయాత్ర సందర్భంగా గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన తెలి పారు. పోలీసులువ వీరిని మందలించి ప్లకార్డులను లాక్కున్నారు. ఆలస్యంగా ప్రారంభం... ముందుగా నిర్ణయించిన ప్రకారంకన్నా గంటన్నర ఆలస్యంగా పర్యటన సాగింది. మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా రాజమహేద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఎం పరిపాలన భవనాన్ని ప్రారంభించి, 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ జైలులో వృత్తులు నేర్చుకుని విడదలైన తరువాత ఉపాధి పొందాలని సూచించారు. శాటిలైట్ సిటీలో జన చైతన్య యాత్రలో భాగంగా గ్రామంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించే రైతు బజారు, చేపల మార్కెట్‌కు శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు. బాబు జగ్జీవ¯ŒSరామ్, ఎన్టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం చెరుకూరి కల్యాణ మండంలో తెలుగు దేశం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. మున్సిపల్ స్టేడియంలో డ్వాక్రా సంఘాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. మొబైల్ నగదు రహిత లావాదేవీలు జరిపేలా పరిజ్ఞానం పెంచుకోవాలంటూ తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలో లైట్లు ఆ¯ŒS చేసి చూపాలని మహిళలను కోరారు. కారెం శివాజీ ఆధ్వర్యంలో జరిగిన దళితగిరిజన సభలో మాట్లాడుతూ దళిత సంక్షేమమే ధ్యే యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబును దళిత, గిరిజన నేతలు సన్మానించారు. సాయంత్రం దివా¯ŒSచెరువులో నగర వనాన్ని ప్రారంభించారు. అటవీ అకాడమీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నన్నయ్య యూనివర్సిటీలో లైబ్రరీ, హాస్టల్ భవనాలను ప్రారంభించారు. చివరగా జీఎస్ఎల్ డెంటల్ కళాశాలను ప్రారంభించారు. ఎంపీలు ఎం.మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, తోట నరసింహం, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, తోట త్రిమూర్తులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, అప్పారావు, చైతన్యరాజు, మేయర్ పంతం రజనీశేషసాయి, జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణ¯ŒS తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలతో ముఖాముఖి : స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి కార్యక్రమానికి అధికారులు ఉభయగోదావరి జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో భోజన ం, జనచైతన్య యాత్ర సభలో పాల్గొన్న ప్రజలకు పులిహోర ప్యాకెట్లు అందించిన నేతలు మహిళలకు బిస్కెట్లు పంచారు. అవికూడా అందిరికీ ఇవ్వకపోవడంతో చిన్నపిల్లతో వచ్చిన మహిళలు ఆకలితో ఇబ్బంది పడ్డారు. ప్రకటించిన విధంగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈపీల జీతం రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, శ్రీరాములు సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మార్గాని సత్యనారాయణ విజ్ఞాపన పత్రం ఇచ్చారు. -
దివీస్ బాధితులకు దన్నుగా..
సర్కారు దౌర్జన్యాలపై సమరోన్ముఖంగా 22న జిల్లాకు రానున్న వైఎస్సార్ సీపీ అధినేత జగ¯ŒS పర్యటనను విజయవంతం చేయాలన్న జిల్లా నేతలు కాకినాడ : దివీస్ పరిశ్రమ కారణంగా నిర్వాసితులయ్యే కోన ప్రాంత ప్రజలకు అండగా నిలిచి, ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఈ నెల 22న జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. దివీస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి జగ¯ŒSకు మద్దతుగా నిలవాలని కోరింది. వైఎస్సార్ సీపీ జిల్లా «అధ్యక్షుడు కురసాలకన్నబాబు అ««దl్యక్షతన శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్ల సమావేశం జరిగింది. కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం దివీస్ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఇళ్లకిలోకి చొరబడి దాడులు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. వేలాది పేద కుటుంబాల జీవితాలను పణంగా పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం దివీస్ «కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తోందని, జనపక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీపై అభివృద్ధి నిరోధక శక్తిగా ముద్రవేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఎస్ఈజడ్ పేరుతో సేకరించిన పదివేల ఎకరాలుండగా కొత్తగా దివీస్ కోసం 650 ఎకరాలు సేకరించడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. మితిమీరుతున్న ‘దేశం’ అరాచకాలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తుని సహా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు మితిమీరి పోతున్నాయని, ఇందుకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ చేస్తున్న ‘గడపగడపకూ వైఎస్సార్’కు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే.. టీడీపీ జనచైతన్య యాత్రలు వెలవెల బోతున్నాయన్నారు. కలెక్టర్ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ప్రోటోకాల్ విషయంలో 5 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న జగనన్న నేతృత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ దివీస్ బాధితులకు మనోధైర్యం కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ టీడీపీది ఆటవిక పాలనని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాస్తూ పోలీసురాజ్యాన్ని నడుపుతున్నారన్నారు. జిల్లాలో రాక్షస పాలన పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో అధికార పార్టీ రాక్షస పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజమండ్రి రూరల్æ కో ఆర్డినేటర్ గిరజాల బాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ మాట్లాడుతూ తమ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.2 కోట్లు అక్రమంగా వసూలు చేయడంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ అధికార పక్ష వేధింపులపై సమష్టిగా పోరాడాలన్నారు. రాజమండ్రి కౌన్సిల్లో పార్టీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలంతా సైనికుల్లా పోరాడాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టి బత్తులు రాజాబాబు, అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ జగ¯ŒSకు జిల్లా అంతటా మద్దతుగా నిలవాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS ని««దlులను దారి మళ్ళించడాన్ని సమావేశం తప్పుబట్టింది. పంచాయతీల్లో పన్నులను మూడింతలు పెంచాలన్న ప్రభుత్వ విధానాన్ని పునః సమీక్షించాలని కోరింది. వివిధ నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్రప్రసాద్, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, ఆకుల వీర్రాజు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, మోతుకూరి వెంకటేష్, వట్టికూటి రాజశేఖర్, పెయ్యల చిట్టిబాబు, ఏడిద చక్రం, పాలెపు ధర్మారావు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు వలవల బాబ్జీ, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు పెట్టా శ్రీనివాస్, అబ్దుల్ బషీరుద్దీన్, సిరిపురపు శ్రీనివాసరావు, జిల్లా అ«ధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కాకినాడ నగరకమిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబీ, అమలాపురం పట్టణ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ పద్మవ్యూహంలో సీఎం పర్యటన
విస్తృత బందోబస్తు 1600 మంది పోలీసులతో పహారా ముఖ్యమైన కాపు నేతల గృహ నిర్బంధం! రాజమహేంద్రవరం క్రైం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో కాపు ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉండడంతో సీఎం పర్యటనపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా పరిధిలో 600 మంది పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, పోలీస్, ఏజీఎస్. హోమ్ గార్డులు, (రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా పోలీసులతో) పాటు మొత్తం 1600 మందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. పోలీస్ పద్మవ్యూహంలో సీఎం పర్యటన సాగనుంది. ఆయన ఉదయం 9.20 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాజమహేంద్రవరం నగరం, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో 8 ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ముందుగానే పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాపు ఉద్యమంలో పాల్గొంటున్న ముఖ్య నాయకులను ఇళ్లకే పరిమితం చేసేలా చర్యలు చేపట్టారు. వారి ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చోటా మోటా కాపు నాయకుల కదలికలపై నిఘా పెట్టారు. -
ఆదాయం ప‘డిపో’యింది
రాజమహేంద్రవరం సిటీ : ప్రధానమంత్రి మోదీ చేపట్టిన నోట్ల రద్దుతో జిల్లా ఆర్టీసీ రీజియ¯ŒSను 50 లక్షల మేర నష్టాల్లోకి నెట్టి వేసింది. ఐదు రోజులుగా రోజుకు రూ.10 లక్షల చొప్పున ఈ నష్టం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది డిపోలనుంచి ప్రతి రోజూ 6 లక్షలమంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. జిల్లాలో 650 సంస్థ బస్సులు, 200 అద్దె ప్రాతిపదికన 900 సర్వీసులను నడుపుతూ మూడు లక్షల 25 వేల కిలోమీటర్ల మేర ప్రయాణాలు సాగిస్తున్న ఈ బస్సులు నడిచేందుకు 55 నుంచి 60 వేల లీటర్ల డీసెల్ వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణకు సంస్థ రోజుకు రూ.1.10 కోట్ల వ్యయమవుతోంది. నోట్ల రద్దుతో ఐదు రోజులుగా డబ్బులు లేక ప్రయాణికులు బస్సులు ఎక్కలేక ప్రయాణాలను విరమించుకున్నారు. రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణించే ప్రజలు సుమారు 75 వేల మంది వరకూ బస్సులు ఎక్కకపోవడంతో సంస్థ నష్టాల్లో చిక్కుకుంది. రోజుకు తొమ్మిది డిపోల నుంచి రూ.కోటి పైబడి రావాల్చి ఉండగా 10 శాతం మేర నష్టాలు రావడంతో రోజుకు రూ.10 లక్షల పైబడి సంస్థ నష్టాలను చవిచూడాల్చిన పరిస్థితి ఎదురైంది. ఆవిషయమై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్‌ను వివరణ కోరగా ప్రయాణికుల వద్ద సక్రమంగా డబ్బులు లేకపోవడం వల్ల 10 శాతం పైబడి ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోయాయని, రోజుకు కోటి పైబడి రావల్సిన ఆదాయం రూ.85 లక్షలకు పడిపోయిందని తెలిపారు. -
22న జిల్లాకు జగన్ రాక
17వ తేదీ పర్యటన వాయిదా దివీస్ బాధితులతో ముఖాముఖి కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న జిల్లాకు రానున్నారు. తుని నియోజకవర్గంలో ప్రతిపాదించిన దివీస్ రసాయన పరిశ్రమ బాధితులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం కాకినాడలో విలేకర్లకు తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 17వ తేదీన జగన్ జిల్లాకు రావల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన 22వ తేదీకి మారిందని చెప్పారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు, దివీస్ నివాసిత ప్రాంత ప్రజలు ఈ మార్పును గమనించాల్సిందిగా వారు కోరారు. -
జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉంది
కాకినాడ క్రైం: జిల్లాలో సెక్షన్ 30 ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్టు అమల్లో ఉందని, పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టరాదని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి, అంతర్గత భద్రతల పరిరక్షణలో భాగంగా నవంబర్ ఒకటి నుంచి 30వ తేదీ దాకా సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు. దీని ప్రకారం కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజ¯ŒS పరిధిలో ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని, ఈ ఉత్తర్వులను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
10 లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జేసీ సత్యనారాయణ ఆదేశం కాకినాడ సిటీ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 10లోగా ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై తహసీల్దార్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్షించారు. గత సీజ¯ŒSలో వచ్చిన అభియోగాలు, అసంతృప్తులు పునరావృతం కాకూడదన్నారు. చౌకధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీలో అవకతవకలు నిరోధించేందుకు ప్రతీరోజు రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో నివేదికలు అందజేయాలని సూచించారు. ప్రజాసాధికార సర్వే ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ డీఎం కృష్ణారావు, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, డీసీఓ ప్రవీణ, మార్కెటింగ్ శాఖ ఏడీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
‘బయో’త్పాతం
ఆర్పీ బయో 226 వరి వంగడం సాగుతో 30 శాతానికిపైగా దిగుబడి నష్టం ఏపీ సీడ్ విత్తనాల్లో సగం వరకూ కల్తీ ఈనిక దశలో కేళీలు ప్రత్యక్షం లబోదిబోమంటున్న రైతులు వరమివ్వాల్సిన వారే శపించిన చందంగా వ్యవసాయ శాఖ అధికారులు చేతుల మీదుగా పంపిణీ చేసిన విత్తనాలే నష్టాల బాటలోకి నెట్టేశాయి. అన్నీ పరిశోధించి ... పరిశీలించి ఇచ్చిన విత్తనాలన్న ధీమాతో సాగు చేస్తే కేళీగా మారి రైతన్న బతుకులను ఎగతాళి చేశాయి. నష్టాల్లో ఉన్న కర్షకులను మరింత కష్టాల్లోకి నెట్టేశాయి. ఎకరాకు సగం పంట కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు అయోమయంలో పడ్డారు. రాజమహేంద్రవరం రూరల్/జగ్గంపేట : వ్యవసాయశాఖ రాయితీపై సరఫరా చేసిన వరి విత్తనాలు రైతులను నట్టేటా ముం చాయి. బీపీటీ 5204 (బొండాలు)కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) సొసైటీల ద్వారా సరఫరా చేసిన ఆర్పీబయో 226 వరి రకానికి కేళీల సమస్య ఉత్పన్నమైంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ రకానికి సుమారు ఐదు నుంచి ఆరు రకాల సంకర జాతి విత్తనాలు తోడవడంతో ఈనిక దశలో వెన్నులు కాక కేళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ అధికారుల సూచనలతోనే... చంద్రన్న వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు ద్వారా రైతులకు బీపీటీ 5204కు బదులుగా ఆర్పీ బయో 226 వరి రకాన్ని వేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఏపీ సీడ్స్ ద్వారా 1044.90 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలోని రైతులకు సరఫరా చేశారు. జగ్గంపేట, రంగంపేట, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేట మండలాల్లో రైతులు ఈ విత్తనాలతో సాగు చేపట్టారు. ప్రస్తుతం ఈనిక దశలో ఉన్న పంటలో వెన్నులు కాక కేళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేళీలు 20 నుంచి 25 శాతం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నా రైతులు మాత్రం 50 శాతంపైనే ఉంటుందన్నారు. పంట చేతికి వచ్చినా కేళీలు ఎక్కువగా ఉండడంతో ధాన్యాన్ని కొనేవారు ఉండరన్నారు. రాజమహేంద్రవరం రూరల్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, రంగంపేట, జగ్గంపేట, గండేపల్లి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో ఇవి అధికంగా ఉన్నాయి. కేజీకి రూ.5 సబ్సిడీ చొప్పున రైతులకు రాయితీగా ఈ రకాన్ని జగ్గంపేట మండలంలోని మెట్టప్రాంతంలో తదితర ప్రాంతాల రైతులకు అందజేశారు. ఒక్క జగ్గంపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 167 ఎకరాల్లో ఈ విత్తనంతో సాగు చేశారు. పండిన పంటలో సగం వరకు కేళి ఉండడంతో తాము మోసపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలైన ఆర్పీ బయో చేను మాత్రం ప్లవరింగ్ దశలోనే ఉన్నాయని, నకిలీలతో మోసపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఆర్పీబయో 226 వరి రకాన్ని మూడు ఎకరాల్లో సాగుచేశాను. పొలంలో 50 శాతానికి పైగా కే ళీలు ఉన్నాయి. ప్రభుత్వమే రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – సుంకవల్లి అప్పారావు, రైతు, తొర్రేడు ఎకరాకు రూ.15వేలు వరకు నష్టం... వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సహంతో ఏపీ సీడ్ నుంచి ఆర్పీ బయో 226 వరకు వరి వంగడం విత్తనాలను తీసుకునే సాగు చేశాం. కేళి సగం వరకు ఉంది. ఇది పనికిరాదు. ఇప్పటికే రూ.15వేలు వరకు ఎకరాకు పెట్టుబడులు పెట్టాం. కోతలు పూర్తయ్యేందుకు మరో రూ.10 వేలు అవసరమవుతాయి. కల్తీ విత్తనాలు కాకుండా రూ.15 వేల నుంచి 20 వేల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – జాస్తి వీరభద్రరావు, రైతు, కాట్రావులపల్లి. దిగుబడి తగ్గే అవకాశం... ఆరు ఎకరాల్లో ఆర్పీ బయో వరిరకాన్ని సాగుచేశాం. ఎకరానికి రూ.37 వేలు ఖర్చు అయ్యింది. కేళీల కారణంగా దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయాధికారులే రైతులకు నష్టపరిహారం అందించాలి. – కొత్తపల్లి రామకృష్ణ, కౌలురైతు, తొర్రేడు రైతులు చెప్పింది నిజమే ఆర్పీ బయో 226 రకం వరి విత్తనాలను ఏపీ సీడ్ ద్వారా రైతులకు అందజేశాం. ప్రస్తుతం చేను బాగుంది. కల్తీ ఎక్కువగా ఉండడంతో కేళి కనిపిస్తుంది. దీనిపై మార్టేరు శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. 30 శాతానికిపైగా కేళీ ఉన్నట్టు వారు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేస్తున్నాం. – ఎల్.రాంబాబు, వ్యవసాయాధికారి, జగ్గంపేట -
జిల్లాలో 300 కొత్త రేషన్ దుకాణాలు
డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు రావులపాలెం : జిల్లాలో కొత్తగా 300 రేషన్ దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం రాత్రి రావులపాలెంలోని 31, 34, రేషన్ దుకాణాల్లో జరుగుతున్న సరుకుల పంపిణీని ఆయన తనిఖీ చేశారు. తూనిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద ప్రస్తుతం 138 షాపులు ఖాళీ ఉన్నాయన్నారు. ఒక డీలర్‌కు 500లోపు కార్డు ప్రాతిపదికన విడదీసి కొత్తగా 300 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 438 షాపులకు సంబంధించి ఇప్పటికే ఆర్డీవో సబ్ కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్నారు. జిల్లాలో బెస్ట్ ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్‌డీ) 92 శాతం కార్డులు పూర్తి అయ్యాయన్నారు. యూనిట్లు సంఖ్య ద్వారా 70 శాతం పూర్తి అయ్యిందన్నారు. బీఎఫ్డీతోపాటు కార్డుదారుల వారి కుటుంబ సభ్యుల ఐరీష్ కూడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలను డీలర్లు వారి ఇళ్ళకు వెళ్ళి పూర్తి చేయాలన్నారు. ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకూ రేషన్ ఇస్తామని అయితే సాధ్యమైనంత ముందుగానే రేషన్ పంపిణీ పూర్తి చేయాలని డీలర్లను ఆదేశిస్తున్నామన్నారు. ఆయన వెంట ఎంఎస్ఓ టి.సుభాష్ ఉన్నారు. -
జిల్లాలో 18 హెచ్ఆర్డీ కేంద్రాలు
నన్నయ వర్సిటీ వీసీ ముత్యాలునాయుడు తుని : విద్యను పూర్తి చేసిన విద్యార్ధులకు ఉపాధి కల్పించేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో 18 మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఆది కవి నన్నయ్య వర్సిటీ వీసీ ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం తుని పట్టణం ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెచ్ఆర్డీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వర్సిటీ పరిధిలో 450 కళాశాలు ఉన్నాయని, ఏటా 30 వేల మంది బయటకు వస్తున్నారని, లక్ష మంది వరకు చదువుతున్నట్టు ఆయన వివరంచారు. విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు హెచ్ఆర్డీ సెంటర్లను ప్రారంభిస్తున్నామని, అక్టోబరు 17 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవు తాయన్నారు. 45 రోజుల శిక్షణ తర్వాత ఉద్యోగ మేళా నిర్వహించి డిసెంబర్లో పోస్టింగ్ ఇస్తామన్నారు. వికాస్ సంస్థతో సంయుక్తంగా 150 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. యూనివర్సిటీకి 39 ప్రొఫెసర్ పోస్టులు , వసతులకు రూ.46 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. వికాస్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అతలాకుతలం
విజృంభిస్తున్న జ్వరాలు, విస్తరిస్తున్న అతిసారంతో జిల్లా అతలాకుతలం అవుతోంది. విషజ్వరాల బారినపడిన రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పలువురికి డెంగీ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. మరో వంక నేనున్నానంటూ అతిసారం పట్టిపీడిస్తోంది. అడవిపేటలో పలువురు జ్వరాల బారిన పడ్డారు. గ్రామంలో డెంగీ పీడితులు కూడా ఎక్కువగానే ఉన్నారు. కృష్ణవరం, అల్లిపూడి గ్రామాల్లో పదుల సంఖ్యలో అతిసారంతో అలమటిస్తున్నారు. విజృంభించిన అతిసారం జగ్గంపేట ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న బాధితులు జగ్గంపేట : కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో అతిసార వ్యాధి సోకి 15 మంది అస్వస్థకు గురయ్యారు. కొత్త కృష్ణవరం రామాలయం, దుర్గమ్మ ఆలయం వీధిలకు చెందిన 15 మందికి అతిసారం సోకింది. వీరిలో ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో రెండు రోజులుగా జగ్గంపేటలోని ఒక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఏలేశ్వరంలో ప్రైవేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు తెలిసింది. జగ్గంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం రాత్రి బొదిరెడ్ల చక్రం, అల్లం దుర్గాప్రసాద్, చింతల రత్నం, నక్కన అప్పారావు, శనమనశెట్టి నాగభూషణం, కోశెట్టి నూకరత్నం చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు ఆదివారం ఇళ్లకు వెళ్లినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. వీరి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు ప్రైవేటు వైద్యుడు ప్రసాద్ తెలిపారు. గ్రామంలో కలుషిత నీటితోనే అతిసారం ప్రబలిందని భావిస్తున్నారు. డ్రైన్లలోని మురుగునీరు వాటర్‌పైపుల లీకులనుంచి కుళాయి నీటిలో కలిసి కలుషితం అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అల్లిపూడిలో.. అల్లిపూడి (కోటనందూరు): గ్రామంలో డయేరియా విజృంభించింది. సుమారు 50 మందికి పైగా డయేరియా సోకిన ట్టు స్థానికులు చెబుతున్నారు. ఆది వారం రాత్రి, సోమవారం గ్రామంలోని రామాలయం వద్ద వైద్యశిబిరం నిర్వహించి రోగులకు వైద్యసేవలందించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. డయేరియా బాధితులకు మాత్రలు పంపిణీ చేశారు. అవసరమైన వారిని కోటనందూరు పీహెచ్‌సీకి తరలించి సెలైన్ బాటిళ్లు పెట్టారు. గ్రామంలో పరిస్థితిని పీహెచ్సీ వైద్యాధికారి సూర్యప్రభ పర్యవేక్షించారు. సూపర్వైజర్ అప్పారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు గ్రామంలో డయేరియా వ్యాపించడంతో పంచాయితీ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో మాంసం విక్రయాలు నిలిపేయాలంటూ ఆదేశాలిచ్చారు. బ్లీచింగ్ చల్లించి మంచినీటి ట్యాంకును క్లోరినేషన్ చేయించి నీటిని సరఫరా చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి గవర్రాజు తెలిపారు. జ్వరాల అడవిపేట కాట్రేనికోన: డెంగీ, విషజ్వరాల ధాటికి కాట్రేనికోన శివారు అడవిపేట గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. గ్రామానికి చెందిన జనిపెల్లె నరసింహమూర్తికి 12 రోజుల క్రితం జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త పరీక్షల్లో ఆయనకు డెంగీ జ్వరం సోకినట్టు వైద్యులు గుర్తించి ఐదు రోజులు వైద్యం అందించారు. ఆయన కోలుకొని ఇంటికి వచ్చిన వెంటనే ఆయన భార్య మంగ డెంగీ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. ప్లేట్లెట్ల సంఖ్య బాగా పడిపోవడంతో ఆమె ఆరు రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. అదే విధంగా బడుగు శ్రీను కూడా డెంగీ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నాడు. మరో వంక విషజ్వరాలు గ్రామస్తులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకే కుటుంబంలో బూల అప్పారావు, అతని భార్య సింహాద్రిమ్మ, కుమార్తె మౌనిక, మనుమరాలు సింధు జ్వరంతో మంచాన పడ్డారు. మౌనికకు రెండవ సారి టైఫాయిడ్ జ్వరం వచ్చిందని, ఫ్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 3వతరగతి చదువుతున్న కొంకి రమ్యశ్రీ ఐదు రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతోంది. వడ్డి రాజ్‌కుమార్, తాళ్ల హర్షిత, తాళ్ల విద్యలతో పాటు ఇంటికి ఒకరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. కాట్రేనికోన పంచాయతీ పరిధిలో చెత్త పేరుకుపోయి వర్షాలకు కుళ్లిపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, పూడిక తీయకపోవడంతో మురుగు పేరుకుపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా కాలువలు మారాయి. రొయ్యల వ్యాపారులు మురుగు నీరు, మాంసపు వ్యర్థాలను వదులుతున్నారు. గ్రామంలో పందుల సంచారం ఎక్కువగా ఉంది. అడవిపేటలో మరుగు దొడ్డి నీళ్లు సీసీ రోడ్డుపై నిలిచి పోవడంతో దోమలు పెరిగిపోతున్నాయి. గ్రామంలో మంచి నీటి కుళాయిలు మురుగు నీటి గుంటలలో ఉండటంతో తాగు నీరు కలుషితం అవుతోంది. అందువల్లే తాము రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిపై కాట్రేనికోన పీహెచ్సీ ఇన్చార్జి వైద్యధికారి, అమలాపురం ఎడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పుష్కరరావును ‘సాక్షి’ వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. గ్రామంలో మంగళవారం సర్వే చేయిస్తానని అన్నారు. -
రేషన్‌షాపుల విభజన పూర్తి
కొత్తగా 293 ఏర్పాటుకు ఆమోదం మండలాల వారీగా జారీకానున్న నోటిఫికేషన్ కాకినాడ సిటీ : జిల్లాలో రేషన్‌షాపుల విభజన ప్రక్రియను రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు పూర్తిచేశారు. 64 మండలాల్లో ప్రస్తుతం 2,647 రేషన్‌షాపులు ఉండగా వీటి పరిధిలో 15,29,883 రేషన్‌కార్డులు ఉన్నాయి. అనేక మండలాలలోని పలు షాపులను పరిశీలిస్తే ఒక్కోషాపు పరిధిలో అత్యధికంగా 1200 కార్డుల వరకు ఉన్నాయి. దీంతో కార్డుదారుల సౌకర్యార్థం ఎక్కువ కార్డులు ఉన్న షాపుల విభజనకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో షాపునకు 400 కార్డుల నుంచి 450, పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 550 నగరాల్లో 600 నుంచి 650 కార్డులు ఉండేలా షాపుల విభజన ప్రక్రియను చేపట్టారు. దీని ప్రకారం క్షేత్రస్థాయి నుంచి జిల్లావ్యాప్తంగా 44 మండలాల్లో 293 కొత్త రేషన్‌షాపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆమోదముద్ర వేశారు. దీంతో జిల్లాలో రేషన్‌షాపుల సంఖ్య 2,940కు పెరగనుంది. డీలర్లు లేక ఖాళీగా ఉండి ఇన్చార్జిల పర్యవేక్షణలో ఉన్న 160 షాపులతో పాటు కొత్తగా ఆమోదముద్ర వేసిన 293 షాపులకు డీలర్ల భర్తీకి మండలాలవారీగా నోటిఫికేషన్జారీకి ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఆ ప్రకారం డివిజన్లవారీగా నోటిఫికేషన్ల జారీకి అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా పెరగనున్న షాపుల సంఖ్య మండలాలవారీగా..... అమలాపురంలో 2, బిక్కవోలు 8, పెదపూడి 9, రంగంపేట 8, గండేపల్లి 6, గోకవరం 3, జగ్గంపేట 17, కిర్లంపూడి 7, కాకినాడ సిటీ 13, కాకినాడ రూరల్ 34, కరప 4, కొత్తపేట 2, ఆత్రేయపురం 4, ఆలమూరు 4, రావులపాలెం 7, కపిలేశ్వరపురం 10, మండపేట 21, రాయవరం 8, ఐ.పోలవరం 2, కాట్రేనికోన 5, ముమ్మిడివరం 1, తాళ్లరేవు 2, పెద్దాపురం 22, సామర్లకోట 11, పిఠాపురం 11, గొల్లప్రోలు 10, యు.కొత్తపల్లి 5, ప్రత్తిపాడు 4, ఏలేశ్వరం 5, రాజమహేంద్రవరం రూరల్ 2, కడియం 1, రాజానగరం 4, కోరుకొండ 2, సీతానగరం 1, కాజులూరు 5, కె.గంగవరం 5, రామచంద్రపురం 11, మలికిపురం 1, మామిడికుదురు 2, రాజోలు 3, సఖినేటిపల్లి 1, కోటనందూరు 2, తొండంగి 1, తుని 7 -
కాయ్ రాజా కాయ్
జిల్లాలో జోరుగా పేకాట గెలుపోటములపై కూడా పందేలు రోజూ చేతులు మారుతున్న భారీ నగదు నిర్వాహకులకు పర్సంటేజీలు దండిగా పోలీసుల అండదండలు! రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో జోరుగా పేకాట సాగుతోంది. గతంలో లాడ్జీలు, ఇళ్లులు అద్దెకు తీసుకుని పేకాట నిర్వహించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో నిర్వాహకులు కొత్త పంథాలు, వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పట్టణ శివారు ప్రాంతాల్లో్ల పేకాట నిర్వహిస్తున్నారు. – సాక్షి, రాజమహేంద్రవరం నిత్యం రాత్రి నుంచి వేకువజామున ఐదు గంటల వరకు పేకాట యథేచ్ఛగా ఆడుతున్నారు. రాజమహేద్రవరంలోని క్వారీ ఏరియా, గాదిరెడ్డి నగర్ల్లో ఓ మాజీ కార్పొరేటర్ పేకాటను నిర్వహిస్తున్నాడు. ఇక్కడ నిత్యం రూ.20 లక్షల వరకు చేతులు మారుతున్నాయి. గెలుపోటములపై కూడా పందేలు కాస్తున్నారు. పేకాట రాయుళ్లకు కావాల్సిన భోజనం, ఇతర అవసరాలు అన్నీ నిర్వాహకులే సమకూరుస్తున్నారు. వీరు ప్రతి ఆటకు వచ్చే మొత్తంపై పర్సంటేజీలు తీసుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించే పేకాట ద్వారా ఓ మాజీ కార్పొరేటర్‌కు రోజుకు రూ.50 వేలు పర్సంటేజీల రూపంలో అందుతున్నట్టు సమాచారం. స్థానికులకు అనుమానం రాకుండా.. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలోని మధురపూడి, దివాన్‌చెరువు, పాలచర్లలో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఒకే వ్యక్తి వీటిని నిర్వహిస్తున్నాడు. రోజుకో చోట చొప్పన పేకాట నిర్వహిస్తూ పోలీసులుకు, స్థానికులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. గోకవరం శివారు ప్రాంతాల్లో జరుగుతున్న పేకాటలో రోజుకు రూ.10 లక్షలు చేతులు మారుతున్నట్టు సమాచారం. జగ్గంపేట నియోజకవర్గం ఏలేశ్వరం కాలువ గట్టును పేకాటరాయుళ్లు తమ స్థావరంగా మార్చుకున్నారు. కోనసీమలో ఏటిగట్లపై.. కోనసీమలో కూడా పేకాట యథేచ్ఛగా సాగిపోతోంది. రావులపాలెం కేంద్రంగా ఏటిగట్లపై గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతోంది. పోలీసులు అడపాదడపా దాడులు చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేస్తున్నారు. రాజకీయ నేతల పలుకుబడితో వారు బయటపడుతున్నారు. బయటి ప్రాంతాల వ్యక్తులూ ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. రాజమహేంద్రవరంలో భారీ స్థాయిలో పందేలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ నిర్వాహకులకు ఆయా ప్రాంతాల పరిధిలోని పోలీసుల అండదండలు దండిగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. మాముళ్ల రూపంలో ప్రతినెలా రూ.3.5 లక్షలు ఆ ప్రాంత స్టేషన్‌కు అందుతున్నట్టు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటాం పేకాట ఆడుతున్నట్టు సమాచారం ఉంది. నిఘా పెడుతున్నాం. నిర్వాహకులు, పేకాట ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తమకు తెలిసిన సమాచారం అందజేయాలి. – బి.రాజకుమారి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ -
ఈ ‘తూర్పు’నకు ఏమైంది?
పట్టిపీడిస్తున్న డెంగీ, మలేరియా విజృంభిస్తున్న ప్రాణాంతక వ్యాధులు మృత్యువాత పడుతున్న రోగులు ప్రత్యేక దృష్టి సారించని జిల్లా యంత్రాంగం ఒకవైపు డెంగీ.. మరోవైపు మలేరియా.. ఇంకోవైపు విషజ్వరాలు.. ఇలా జిల్లాను ప్రాణాంతక వ్యాధులు కుదిపేస్తున్నాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలనూ ఈ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. అనేక గ్రామాల్లో పరిస్థితులు చేజారుతున్నప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో బ్లీచింగ్ చల్లించి చేతులు దులుపుకొంటున్నారు. వందలాది మంది రోజుల తరబడి జ్వరాలతో బాధపడుతున్నా.. అనేక మంది అంతుచిక్కని రోగాలకు బలవుతున్నా.. జిల్లా యంత్రాంగం సరైన స్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో నానాటికీ ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన ఆవశ్యకతపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎం.కొత్తూరు (రౌతులపూడి) : వారం రోజులుగా ఎం.కొత్తూరు ప్రజలు వ్యాధులతో మంచానపడ్డారు. సుమారు 30 మంది మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాల వంటి ప్రాణాంతక వ్యాధులకు గురై, ఆస్పత్రుల బాటపట్టారు. ఆరోగ్య సిబ్బంది ఇస్తున్న కొద్దిపాటి మందుబిళ్లలతో వ్యాధులు తగ్గుముఖం పట్టడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో గత ఆరు మాసాలుగా ఎలాంటి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టకపోవడంతో క్రిమి కీటకాలు వ్యాపించి, ప్రజలు అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు. వారం రోజులుగా గ్రామానికి చెందిన గిరిజనులు యరగడ చక్రమ్మ, యరగడ దేవి, వంతు దాలియ్యదొర, వంతు చినబుల్లి, గంటిమళ్ల దేవుడమ్మ, వంతు మాతయ్యదొర, గంటిమళ్ల గంగరాజు, యరగడ రాంబాబు తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. కూలీ పనులు చేసుకునే తాము జ్వరాలతో ఆస్పత్రులకు తిరుగుతూ, పూటగడవక నానా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా లక్షణాలతో యువతి మృతి ఇదే గ్రామానికి చెందిన ఎం.ప్రియ(21) అనే యువతి మలేరియా లక్షణాలతో ఆదివారం రాత్రి మరణించింది. రాఖీ పండగ మరుసుటి రోజు తలనొప్పి, జ్వరం, వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను రౌతులపూడిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తుని, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించిందని ఆమె తండ్రి ఎం.రాజు విలపించాడు. వివాహితను బలిగొన్న డెంగీ మలికిపురం : మలికిపురానికి చెందిన పూసి అనిల్‌కుమారి(35) అనే వివాహిత డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మరణించింది. రెండు రోజులుగా జ్వరంతో ఉన్న ఆమెను బంధువులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు డెంగీ జ్వరమని వైద్యులు తేల్చినట్టు బంధువులు సోమవారం తెలిపారు. కాగా రామరాజులంక, దిండి గ్రామాల్లో కూడా అనేక మంది డెంగీ లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన కొప్పాడి సిరి(7) వారం రోజుల క్రితం ప్లేట్లెట్లు గణనీయంగా తగ్గి మరణించిన సంగతి విదితమే. బాలికను కాటేసిన డెంగీ? ర్యాలి(ఆత్రేయపురం) : డెంగీ లక్షణాలతో బాధపడుతూ విద్యార్థిని మరణించిన ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. ర్యాలి గ్రామానికి చెందిన కత్తుల సుందరరావు మనవరాలు కుసుమే కీర్తి (15) పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులకు దూరంగా ఆమె కొన్నేళ్లుగా ర్యాలి గ్రామంలో తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటోంది. మూడు నెలల క్రితం ఆమెకు జ్వరం సోకడంతో, పలుచోట్ల చికిత్స చేయించారు. జ్వరం తీవ్రం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైద్యం అందించారు. అప్పటీకీ జ్వరం తగ్గకపోవడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె రక్తంలో ప్లేట్లెట్లు పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో సోమవారం చనిపోయింది. తమ పాపకు డెంగీ సోకడంతోనే మరణించిందని ఆమె బంధువులు చెబుతున్నారు. మూడు నెలల నుంచి విపరీతమైన జ్వరం, ఇతరత్రా శారీరక వ్యాధులు తలెత్తడంతో తమకు దక్కకుండా పోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. డెంగీ అని చెప్పలేం.. ఇటీవల కాలంలో వాతావారణంలో మార్పుల కారణంగా అనేక మంది జ్వరాలు బారిన పడుతున్నారు. నిత్యం జ్వర పీడితులు వైద్యశాలకు వస్తున్నారు. ఎవరికీ డెంగీ లక్షణాలు కనిపించలేదు. కొన్ని విషజ్వరాల వల్ల ప్లేట్లెట్లు తగ్గిపోతాయి. అంతమాత్రాన డెంగీగా నిర్ధారించలేం. మా వైద్యశాలకు డెంగీ కేసులు రాలేదు. – ఝాన్సీలక్ష్మి, వైద్యాధికారి, ర్యాలి