1.90 లక్షల హెక్టార్లలో నాట్లు పూర్తి
Published Mon, Aug 15 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్
గొల్లప్రోలు:
జిల్లాలోని 2 లక్షల 33 వేల హెక్టార్లకుగాను లక్షా 9 వేల హెక్టార్లలో నాట్లు పూర్తయినట్లు వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ తెలిపారు. మండలంలోని తాటిపర్తి గ్రామానికి సోమవారం వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 80శాతం నాట్లు పూర్తికాగా మెట్టలో 20శాతం మేరకు నాట్లు వేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 450 టన్నులు జింక్, 700 టన్నులు జిప్సం, 17 టన్నులు బోరాన్ రైతులు సబ్సిడీపై సరఫరా చేశామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో భాగంగా 5900 మంది రైతులు బీమా చేయించారన్నారు. ఈ ఏడాది యాంత్రికీకరణకు రూ. 19 కోట్ల 70 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. 40 హెక్టార్లలో పొలం గట్లుపై కంది పెంపకానికి వందశాతం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నామన్నారు. 77,745 మంది రైతులకు రుణమాఫీ వర్తించిందన్నారు. గొల్లప్రోలు మండలానికి 33 శాతం రాయితీపై అపరాలు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీడీ విటి రామారావు, ఏడీ జీవీ పద్మశ్రీ తదితరులు ఉన్నారు.
15పీటీపీ85–23050001: వ్యవసాయశాఖ జెడి ప్రసాద్
వరి నాట్లు, 1.90 లక్షల హెక్టార్లు, జేడీ, sagu process, jd, in east godavari
Advertisement
Advertisement