JD
-
కర్ణాటకలో మూడు ముక్కలాట!
అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి 40 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని తహతహలాడుతూ బీజేపీ.. కన్నడ నాట పార్టీ జెండా ఎగురవేసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలని కాంగ్రెస్.. కన్నడ ఆత్మగౌరవ నినాదాన్ని మరింత రాజేసి కింగ్‌మేకర్ స్థాయి నుంచి కింగ్‌గా మారాలని జేడీ(ఎస్).. పార్టీ ల వ్యూహ ప్రతివ్యూహాలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి సాక్షి, నేషనల్ డెస్క్ : కర్ణాటక ఓటర్లు ప్రతీసారి ఒకే తీర్పు ఇవ్వడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 1985 నుంచి ఏ పార్టీ కూడా వరసగా రెండోసారి గెలవలేదు. ఈసారీ అదే సంప్రదాయం కొనసాగుతుందా, అధికార బీజేపీకి మళ్లీ పట్టం కడతారా అన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై అధికార వ్యతిరేకతను ప్రధాని మోదీ ఇమేజీతో ఎదుర్కొనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకుంది. బలహీనంగా ఉన్న పాత మైసూరు (ఉత్తర కర్ణాటక)లో బలపడటంపై దృష్టి పెట్టింది. 89 స్థానాలున్నా ప్రాంతంలో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తరచూ పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అంతగా బలంగా లేకపోవడం, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్నే వారు నమ్ముకున్నారు. 100 సీట్లలో కీలకమైన లింగాయత్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. బీజేపీ ఇలా కేంద్ర నాయకత్వాన్ని నమ్ముకుంటే, కాంగ్రెస్‌కు స్థానిక నాయకత్వమే బలంగా ఉంది. పీసీసీ చీఫ్ డి.కె శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల రద్దు, ధరల పెరుగుదల, హిజాబ్ వంటివాటిపై పార్టీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకుంటోంది. జేడీ(ఎస్) కన్నడ ఆత్మగౌరవ నినాదంతో ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి అంతా తానై నడుపుతున్నారు. ముక్కోణ పోరులో విజయం ఎవరిదోనన్న ఉత్కంఠ నెలకొంది.... బీజేపీ.. అనుకూలం.. ♦ ప్రధాని మోదీ ఇమేజ్. కేంద్ర నేతలు చేస్తున్న పర్యటనలు. డబుల్ ఇంజిన్ నినాదం. ♦ సంఘ పరివార్ సంస్థాగత బలం. ♦లింగాయత్ సామాజిక వర్గం మద్దతు, వక్కలిగ అనుకూల వైఖరితో మైసూర్ ప్రాంతంలో పెరుగుతున్న పట్టు. ♦ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు. ♦ డిజిటల్ మీడియా ప్రచారంలో పార్టీ కున్న పట్టు. వ్యతిరేకం.. ♦ ప్రభుత్వ వ్యతిరేకత, బొమ్మై ♦ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు. ♦ 40% కమీషన్ల ప్రభుత్వమన్న విపక్షాల ఉధృత ప్రచారం. ♦ ఎన్నికలకు ముందు మైనార్టీ ల ఓబీసీ కోటా రద్దుతో ముస్లింలు పార్టీకి మరింత దూరం. ♦ టికెట్ దక్కే అవకాశం లేని ఆశావహుల అసమ్మతి. జేడీ(ఎస్) అనుకూలం.. ♦ వక్కలిగ సామాజిక వర్గం మద్దతు. ♦ కన్నడ ఆత్మగౌరవం నినాదం మిన్నంటుతున్న వేళ ప్రాంతీయ పార్టీ గా ఉన్న ఇమేజ్. ♦ రైతు అనుకూల విధానాలతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు. ♦ హంగ్ వస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరికైనా మద్దతివ్వగల వైఖరి. వ్యతిరేకం.. ♦ కుటుంబ పార్టీ ముద్ర. ♦ వక్కలిగ మినహా మిగతా సామాజిక వర్గాల ఆధిపత్యమున్న ప్రాంతాల్లో ఎదగకపోవడం. ♦ సొంత బలంపై పార్టీ అధికారంలోకి వచ్చే సత్తా లేకపోవడం.. చాలాచోట్ల గెలుపు గుర్రాలు లేకపోవడం. ♦ 2018 నుంచి పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు. కాంగ్రెస్ అనుకూలం ♦ బలమైన స్థానిక నాయకత్వం. ♦ బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న అహిండా (మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల) సోషల్ ఇంజనీరింగ్ విధానంతో. తద్వారా వర్గాల ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం. ♦ బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై పేసీఎం, 40% కమీషన్ అంటూ చేస్తున్న ప్రచారం. ♦ కర్నాటకకు చెందిన దళిత నేత మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశం. ♦ గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్రాడ్యుయేట్లకు రూ.3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,000 ఆర్థిక సాయం వంటి హామీలు. వ్యతిరేకం ♦ శివకుమార్, సిద్దరామయ్య వర్గాల మధ్య పోరు. ♦ జి.పరమేశ్వర, హెచ్.కె.పాటిల్, కె.హెచ్.మునియప్ప వంటి నేతల్ని పక్కన పెట్టడంతో అసమ్మతి. కీలకమైన లింగాయత్ సామాజిక వర్గంలో ఓటు బ్యాంకును పెంచుకోలేకపోవడం. ♦ ప్రధాని మోదీ ఇమేజ్‌కి దీటైన కేంద్ర నాయకత్వం లేకపోవడం. ♦ ఆశావహులు ఎక్కువవటంతో అసమ్మతి భగ్గుమనే ఆస్కారం. కాంగ్రెస్‌దే అధికారం..! కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే విడుదలైన ఏబీపీ–సీఓటర్ ఎన్నికల సర్వే కాంగ్రెస్ పార్టీ యే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు వస్తాయని, బీజేపీ 68–80 సీట్లు గెలుచుకుంటే జేడీ (ఎస్) 23–25 సీట్లతో సరిపెట్టుకుంటుందని సీ ఓటర్ సర్వేలో తేలింది. బసవరాజ్ బొమ్మై పరిపాలన అసలు బాగోలేదని సర్వేలో పాల్గొన్న ఏకంగా 50.5%మంది తేల్చి చెప్పారు. 57శాతం మంది ప్రస్తుత ప్రభుత్వం మారిపోవాలని అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది. -
నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ లీవ్‌లో వెళ్లిన అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ అనారోగ్య సమస్యలతో నెలరోజులపాటు మెడికల్ లీవు పెట్టారు. సాయి ప్రసాద్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్ పెట్టారు. అయితే ముగ్గురు లీవ్ పెట్టినప్పటికి జేడీ సాయి ప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ( టీడీపీతో నిమ్మగడ్డ చెట్టపట్టాల్ ) ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వకూడదన్న ఎస్ఈసీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు విస్మయం చెందాయి. ఉద్యోగులను బెదిరించడం ద్వారా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారంటూ వాపోతున్నాయి. -
జీరోయిజమ్
‘‘ప్రేక్షకులు ఇప్పటి వరకు íహీరోయిజమ్ చూసి ఉంటారు. కానీ, మా చిత్రంలో జీరో యిజమ్ చూస్తారు’’ అని డైరెక్టర్ జేడీ అన్నారు. సురేశ్ పాని, మేఘన జంటగా జేడీ దర్శకత్వంలో చింతల జెఎస్ కుమార్ (జోషి) నిర్మిస్తున్న చిత్రం ‘మామ రెండు జెగ్గులు’. ఈ సినిమా ప్రారంభోత్సవంలో డైరెక్టర్ సాగర్, నిర్మాత ప్రసన్నకుమార్, కూచిపూడి వెంకట్ పాల్గొన్నారు. జేడీ మాట్లాడుతూ– ‘‘ఒక ఊర మాస్ అబ్బాయికి, స్వచ్ఛ భారత్‌కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ‘మామ’ అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన సురేశ్ హీరోగా పరిచయమవుతున్నారు. డిసెంబర్‌లోపు సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
పిల్లలకు దానగుణం నేర్పించండి
తల్లిదండ్రులకు మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ సూచన ఘనంగా కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవం అమలాపురం టౌన్ : పుట్టినరోజు వేడుకలు చేసుకుని అవి వాట్సాప్‌ల్లో పెట్టి ఆనందించే నేటి యువత అదే పుట్టిన రోజున రక్తం దానం చేసి ఆ దృశ్యాన్ని వాట్సాప్‌ల్లో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు పవిత్రం, పరమార్థంతో ఉంటాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అడిషనల్ డీజీసీ లక్ష్మీనారాయణ అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇదే స్ఫూర్తిని.. దానగుణాన్ని నేర్పించాలని ఆయన సూచించారు. అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం జరిగిన యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ సూక్తిని అందరూ తప్పకు పాటించాలని లక్ష్మీనారాయణ సూచించారు. నేత్ర, అవయవ, రక్త దానాలు చేయడం అలవర్చుకోవాలని కోరారు. మనం చనిపోయిన తర్వాత మన్నులో కలిసిపోయే అవయవాలను నిర్వీర్యం చేసే కంటే అవయవదానం చేస్తే మన మరణాంతరం మానవాళికి ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఒక పల్లె ప్రాంతమైన కోనసీమలో యర్రా బలరామమూర్తి ఐ బ్యాంక్ గత ఏడేళ్లలో 1200 కార్నియాలను సేకరించి 700 మందికి కంటి చూపు ఇచ్చేందుకు దోహదపడిదంటే సాధారణ విషయం కాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఆ ఐబ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబును, వారి తండ్రి యర్రా బలరామమూర్తిని సభాముఖంగా ప్రశంసించారు. మనకు మంచి చేసినప్పుడు భగవంతుడికి మన థాంక్స్ చెప్పుకోవడం కాదు... సమాజ హితమైన నేత్ర, రక్త, అవయవ దానాలు చేసినప్పుడు భగవంతుడే మనకు థాంక్స్ చెప్పినట్టుగా మీ దానాలు పొందిన వారే పొగుడుతున్నప్పుడు అనిపిస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఐ బ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుక సభలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, పాముల రాజేశ్వరిదేవి, చిల్లా జగదీశ్వరి, రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ డైరెక్టర్ గణపతి వీర రాఘవులు, రాష్ట్ర కాపు వెబ్ సైట్ అధ్యక్షుడు యాళ్ల వరప్రసాద్ పాల్గొని ఐ బ్యాంక్ సేవలను కొనియాడారు. తొలుత వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం నేత్రదానం చేసిన వారి కుటుంబీలకు, ప్రొత్సహించిన వారికి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కోనసీమ ఐ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు, టెక్నీషియన్ కె. స్వర్ణలత సేవలను కూడా వక్తలు కొనియాడారు. -
ఉపాధి కల్పన జేడీ ఇళ్లపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి కల్పన, శిక్షణ శాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ) గోపురం మునివెంకటరమణకు సంబంధించిన ఇంటిత సహా బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు శనివారం ఉదయం దాడులు నిర్వహిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ నేతృత్వంలో హైదరాబాద్, తిరుపతి, విజయవాడలోని మునివెంకటరమణ ఇంటితో సహా ఆయన బంధువులకు చెందిన ఇళ్లపై ఏడు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మునివెంకటరమణ ఇంటిలో భారీ ఎత్తున నగదు, బంగారు, పలు ఇళ్లు, భూములకు చెందిన పత్రాలు దోరికినట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున పూర్తి వివరాలు వెల్లడికాలేదు. -
పశుసంవర్ధక శాఖ జేడీగా సుదర్శన్‌కుమార్
– డీడీ నుంచి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు – రెగ్యులర్ జేడీగా బాధ్యతల స్వీకరణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధకశాఖ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సుదర్శన్‌కుమార్‌ను పూర్తిస్థాయి జేడీగా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా బహుళార్ధ పశువైద్యశాలలో డిప్యూటి డైరెక్టర్‌గా ఉన్న సుదర్శన్‌కుమార్ పూర్తి అదనపు బాధ్యతలతో ఏడాదిగా జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు డిప్యూటి డైరెక్టర్లకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 228 జారీ చేసింది. ఇందులో డాక్టర్ సుదర్శన్ కుమార్ కూడా ఉన్నారు. రెగ్యులర్ జేడీగా డాక్టర్ సుదర్శన్‌కుమార్ వెంటనే బాధ్యతలు స్వీకరించారు. ఖాళీ అయిన డీడీ స్థానాన్ని అక్కడి సీనియర్ ఏడీతో భర్తీ చేయనున్నారు. జేడీగా పదోన్నతి పొందిన సుదర్శన్‌కుమార్‌ను డీడీ చెన్నయ్య, ఏడీలు విజయుడు, రామచంద్రయ్య, చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్.నాగరాజు, జిల్లా నేతలు పార్థసారథి, రామసుబ్బారెడ్డి, టెక్నికల్ అధికారి డాక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు అభినందించారు. -
1.90 లక్షల హెక్టార్లలో నాట్లు పూర్తి
వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ గొల్లప్రోలు: జిల్లాలోని 2 లక్షల 33 వేల హెక్టార్లకుగాను లక్షా 9 వేల హెక్టార్లలో నాట్లు పూర్తయినట్లు వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ తెలిపారు. మండలంలోని తాటిపర్తి గ్రామానికి సోమవారం వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 80శాతం నాట్లు పూర్తికాగా మెట్టలో 20శాతం మేరకు నాట్లు వేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 450 టన్నులు జింక్, 700 టన్నులు జిప్సం, 17 టన్నులు బోరాన్ రైతులు సబ్సిడీపై సరఫరా చేశామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో భాగంగా 5900 మంది రైతులు బీమా చేయించారన్నారు. ఈ ఏడాది యాంత్రికీకరణకు రూ. 19 కోట్ల 70 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. 40 హెక్టార్లలో పొలం గట్లుపై కంది పెంపకానికి వందశాతం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నామన్నారు. 77,745 మంది రైతులకు రుణమాఫీ వర్తించిందన్నారు. గొల్లప్రోలు మండలానికి 33 శాతం రాయితీపై అపరాలు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీడీ విటి రామారావు, ఏడీ జీవీ పద్మశ్రీ తదితరులు ఉన్నారు. -
1.90 లక్షల హెక్టార్లలో నాట్లు పూర్తి
వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ గొల్లప్రోలు: జిల్లాలోని 2 లక్షల 33 వేల హెక్టార్లకుగాను లక్షా 9 వేల హెక్టార్లలో నాట్లు పూర్తయినట్లు వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ తెలిపారు. మండలంలోని తాటిపర్తి గ్రామానికి సోమవారం వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 80శాతం నాట్లు పూర్తికాగా మెట్టలో 20శాతం మేరకు నాట్లు వేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 450 టన్నులు జింక్, 700 టన్నులు జిప్సం, 17 టన్నులు బోరాన్ రైతులు సబ్సిడీపై సరఫరా చేశామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో భాగంగా 5900 మంది రైతులు బీమా చేయించారన్నారు. ఈ ఏడాది యాంత్రికీకరణకు రూ. 19 కోట్ల 70 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. 40 హెక్టార్లలో పొలం గట్లుపై కంది పెంపకానికి వందశాతం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నామన్నారు. 77,745 మంది రైతులకు రుణమాఫీ వర్తించిందన్నారు. గొల్లప్రోలు మండలానికి 33 శాతం రాయితీపై అపరాలు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీడీ విటి రామారావు, ఏడీ జీవీ పద్మశ్రీ తదితరులు ఉన్నారు. 15పీటీపీ85–23050001: వ్యవసాయశాఖ జెడి ప్రసాద్ వరి నాట్లు, 1.90 లక్షల హెక్టార్లు, జేడీ, sagu process, jd, in east godavari -
దిగొచ్చిన ఎరువుల ధర
కర్నూలు(అర్బన్): పలు రకాల ఎరువుల ధరలు తగ్గాయని వ్యవసాయ శాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్, ఇఫ్కో, ఆర్సీఎఫ్, క్రిభ్కో, ఫాక్ట్, జీఎన్వీఎన్సీ, జీఎస్ఎఫ్సీ, పీపీఎల్, ఎంసీఎఫ్,జెడ్ఐఎల్, నాగార్జున, స్పిక్ తదితర కంపెనీలు ధరలు తగ్గించినట్లు తెలిపారు. ఇఫ్కో, ఆర్సీఎన్, ఐపీఎల్, కోరమాండల్ కంపెనీలు తగ్గిన ధరలను పాత నిల్వలకు కూడా వర్తింపజేసేందుకు అంగీకరించాయన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని డీలర్లకు సమాచారం అందించి తగ్గిన ఎరువుల ధరలు అమలయ్యేలా చూడాలని సూచించారు. అన్ని దుకాణాల్లో ధరల పట్టికలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మకాల్లో ఎలాంటి తేడాలున్నా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కంపెనీ ప్రాడక్టు పాతధర కొత్తధర –––––––––––––––––––––––––––––––––––––––––––––– ఐపీఎల్ ఎంఓపీ రూ.840 రూ.577.00 డీఏపీ రూ.1244.25 రూ.1140.00 20–20–0–13 రూ.945 రూ.898.00 16–16–16 రూ.945 రూ.892.50 ఇఫ్కో(జింకేటెడ్) 10–20–26 రూ.1103 రూ.1077.30 ఆర్సీఎఫ్ డీఏపీ రూ.1155 రూ.1102.00 యూరియా రూ.298 రూ.298.00 క్రిభ్కో డీఏపీ రూ.1244 రూ.1191.50 స్పిక్ డీఏపీ రూ.1312.50 రూ.1155.00 20–20–0–13 రూ.971 రూ.913.00 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ
ఆత్రేయపురం : జిల్లా వ్యాప్తంగా 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసిందని పశు సంవర్ధక శాఖ జేడీ వి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పులిదిండి, కట్టుంగ గ్రామాల్లో పశు వైద్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 18 నుంచి 31 వరకు ఆయా గ్రామాల్లో 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపీణీ చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ మందు వల్ల పశువుల్లో పారుడు తగ్గి త్వరగా ఎదకు వచ్చి పాలదిగుబడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 50 వేల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు. అలాగే పశువులకు సంబంధించి జిల్లాలో 450 బోన్లు, గ్రామ స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొలంలో గడ్డి పెంచితే డెల్టా పరిధిలోని 18 వేలు, వెస్ట్రన్ డెల్టాలో రూ.20వేలు, మెట్టప్రాంతంలో రూ.16వేలు, ఏజెన్సీలో రూ.10 వేలు అందిస్తామన్నారు. పశుగ్రాసాన్ని కిలో రూపాయికి అందించాలని రైతులకు సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అజోల్లా నాచు పెంచుకునేందుకు కిట్లు పంపిణీ చేస్తామన్నారు. కిట్ ఒక్కంటికి రూ.3250 కాగా రూ.325కి అందజేస్తున్నామన్నారు. నాచు, తవుడు నీళ్లల్లో కలిపి పశువులకు పెట్టడం ద్వారా అవి ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి పెరుగుతుందన్నారు. పశుమిత్రలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆత్రేయపురం, ర్యాలి పశువుల ఆస్పత్రి నిర్మాణాలకు ఒకొక్క భవనానికి రూ.16లక్షలు మంజూరయ్యాయన్నారు. గొర్రెలకు సంబంధించి వచ్చే నెల 5 నుంచి 15 వరుకు శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఆయన ఆత్రేయపురం పశువైద్యశాలను పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, సర్పంచ్‌లు కనుమూరి ప్రసాదవర్మ, దొడ్డపనేని వెంకట్రావు, ఎంపీటీసీలు గొలుగులవాణి, దండు రాంబాబు, పశుసంవర్ధక శాఖ డీడీ గాబ్రియేల్, ఏడీ విశ్వేశ్వరరావు, వెలిచేరు, ర్యాలి పీహెచ్సీ వైద్యాధికారులు యు.ముఖేష్, రవి తేజ, వైద్య సిబ్బంది సూర్యనారాయణ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
మనీ... కాపీయే కానీ...
ఆ సీన్ - ఈ సీన్ తను రూపొందించే సినిమాల వెనుక ఉన్న అసలు సినిమాల గురించి, తను కాపీ కొట్టిన విధానం గురించి చాలా ఉత్సాహవంతంగా వివరిస్తాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఫలానా సినిమాలోని ఫలానా సీన్లో ఫలానా ఫ్రేమ్‌ను ఫలానా హాలీవుడ్ సినిమా నుంచో, ఇంకో విదేశీ సినిమా నుంచినో కాపీ కొట్టాను అని ఆయన సగర్వంగా చెబుతూ ఉంటారు. కేవలం వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనే కాదు... ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాల్లో కూడా కావాల్సినంత కాపీ కళ ఉంటుంది. అలా ఆర్జీవీ కంపెనీలో తొలితొలిగా ఉత్పత్తి అయిన సినిమా ‘మనీ’. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, చిన్నా, జయసుధ, రేణుకా సహానీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకి ‘రూత్‌లెస్ పీపుల్’ సినిమా ఆధారం. 1986లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా మాదిరిలోనే 1992లో ‘మనీ’ సినిమాని రూపొందించారు. అతి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసే నిరుద్యోగ యువకులు జేడీ, చిన్నా... తమ పొరుగింటిలో ఉండే ధనికురాలు జయసుధను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసేందుకు వ్యూహం పన్నుతారు. ఎలాగో ఆమెను అపహరిస్తారు. తీరా డబ్బు కోసం ఆమె భర్త సుబ్బారావు (పరేష్ రావల్) కు ఫోన్ చేస్తే, ఆమెను చంపేస్తే డబ్బులిస్తాను అంటూ బేరం పెడతాడు. తర్వాత వాళ్లు ఏం చేశారనేది మిగతా కథ. అయితే ఒరిజినల్ వెర్షన్లో హీరోలు ఇద్దరు కాదు... ఒక్కడే. నిరుద్యోగం కామన్ ప్రాబ్లెమ్. తను గతంలో పనిచేసిన కంపెనీ యజమానురాలిని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ పనిలో అతడికి భార్య సహాయంగా నిలుస్తుంది. కిడ్నాప్ తతంగం పూర్తైఓనర్ భర్తకు ఫోన్ చేస్తే.. అతడేమో వీరికి ట్విస్ట్ ఇస్తాడు. మనీ సినిమాలో పరేష్ రావల్ పోషించిన సుబ్బారావు పాత్ర తీరు అంతా హాలీవుడ్ సినిమాలో పాత్ర తీరులో కనిపించేదే. భార్య కిడ్నాప్ కావడం అతడికి సంబరంగా మారుతుంది. ఈ ఆనందంలో ఎంత తాగుతున్నాడో తెలీనంతగా తాగేస్తూ డ్యాన్సులు కూడా చేసేస్తూ ఉంటాడు. అయితే కిడ్నాప్ కేసు గురించి విచారణ జరపడానికి వచ్చిన పోలీసుల ముందు మాత్రం వినయం నటిస్తూ ఉంటాడు. వారి ముందుకు వచ్చేటప్పుడు కళ్లకు సబ్బు పట్టించుకుని ఏడుస్తున్నట్టుగా నటించడం, ఇతర వినయాలు అన్నీ హాలీవుడ్ వెర్షన్లో ఈ పాత్రను పోషించిన నటుడు ఎంత అద్భుతంగా చూపించాడో... పరేష్ రావల్ కూడా అంతే స్థాయిలో జీవించేశారు. క్లయిమాక్స్‌లో సుబ్బారావు అసలు స్వరూపం మేడమ్‌కు వివరిస్తారు కిడ్నాపర్లు. మొదట్లో ఆమె నమ్మదు. తర్వాత అర్థమయ్యేలా చేస్తారు. మరోవైపు ఈ కిడ్నాపింగ్ ముఠాను వెంటాడే పోలీసులు, వారిని తప్పించుకోవడానికి వీళ్లు పడే పాట్లు... ఈ ఎపిసోడ్లు అన్నీ రెండు సినిమాల్లోనూ కామన్. ఈ రెండు సినిమాల మధ్య మరిన్ని పోలికలు ఏమిటంటే... రెండూ కామెడీ ఎంటర్టైనర్లు. సూపర్ హిట్లు. మూల కథను హాలీవుడ్ నుంచి తీసుకున్న ఆర్జీవీ కంపెనీ దాన్ని తెలుగులో తీర్చిదిద్దిన విధానం మాత్రం అమోఘంగా ఉంటుంది. కథ ఎంత కాపీ అయినా కథనంలో మాత్రం ‘మనీ’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను, హాలీవుడ్ వెర్షన్‌తో ఏమాత్రం సంబంధం లేని‘ఖాన్ దాదా’ పాత్రను సూపర్‌బగా చూపించారు ‘మనీ’ మేకర్లు. ఆ పాత్రలో బ్రహ్మానందం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తర్వాత ఈ సినిమాకు ‘మనీ మనీ’ రూపంలో సీక్వెల్ కూడా వచ్చింది. అంటే హాలీవుడ్ వాళ్లు ఆగిపోయిన చోట నుంచి ఆర్జీవీ కంపెనీ మొదలు పెట్టిందన్నమాట! - బి.జీవన్‌రెడ్డి -
సీసీఐ జాడేది?
గజ్వేల్, న్యూస్‌లైన్: పత్తి రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తా లేకుండా పోయింది. ఈసారి జిల్లాలో భారీగా పత్తి దిగుబడులు వచ్చే అవకాశమున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది. పైగా ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తుండటం.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ఊపందుకున్న తరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం శాపంగా మారింది. జిల్లాలో ఈసారి 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.6 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.4 వేల మద్దతు ధర కూడా రైతులకు అందడంలేదు. గజ్వేల్‌లో పది రోజులుగా వ్యాపారులు కేవలం క్వింటాలుకు రూ. 3,700 నుంచి 3,800 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు సుమారు 2 వేల క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రాలలో తెల్ల బంగారానికి రూ.4,500నుంచి 5,000 వరకు ధర పలుకుతుండగా ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో లారీలను వ్యాపారులు తరలిస్తున్నారు. రైతులవద్ద తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తూ పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ దండుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉత్పత్తులు తొందరగా మార్కెట్లోకి వచ్చాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేది. కమర్షియల్ పర్చేజ్ జరిగేనా.. 2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. రూ.4 వేల నుంచి ప్రారంభమైన ధర డిసెంబర్, జనవరి నెలలో రూ.7 వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3 వేలు మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా రాష్ట్రంలోని వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్‌తోపాటు గజ్వేల్ కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులతో పోటీ పడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7 వేల వరకు ధరను కూడా చెల్లించింది. ఈ లెక్కన గజ్వేల్‌లో ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ పోటీలు పడి కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఇక్కడ 2.72 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రికార్డును సృష్టించారు. కానీ రెండేళ్లుగా సీసీఐ సక్రమంగా కొనుగోళ్లను చేపట్టడం లేదు. కేంద్రాలను తెరవాలని సీసీఐని కోరాం పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని సీసీఐ ఉన్నతాధికారులను కోరాం. ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల పత్తి ఉత్పత్తులు మార్కెట్లోకి తొందరగా రావడం ఆరంభమైందని వివరించాం. త్వరలోనే కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశమున్నది. ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టాలని కూడా కోరాం. సంబంధిత అధికారుల సానుకూలంగా స్పందించారు. జిల్లాలో కొత్తగా సదాశివపేట, వట్పల్లిలలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల పంపాం. -రాజశేఖర్, జేడీ, మార్కెటింగ్‌శాఖ