కర్నూలు(అర్బన్):
పలు రకాల ఎరువుల ధరలు తగ్గాయని వ్యవసాయ శాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్, ఇఫ్‌కో, ఆర్‌సీఎఫ్, క్రిభ్‌కో, ఫాక్ట్, జీఎన్‌వీఎన్‌సీ, జీఎస్‌ఎఫ్‌సీ, పీపీఎల్, ఎంసీఎఫ్,జెడ్‌ఐఎల్, నాగార్జున, స్పిక్ తదితర కంపెనీలు ధరలు తగ్గించినట్లు తెలిపారు. ఇఫ్‌కో, ఆర్‌సీఎన్, ఐపీఎల్, కోరమాండల్ కంపెనీలు తగ్గిన ధరలను పాత నిల్వలకు కూడా వర్తింపజేసేందుకు అంగీకరించాయన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని డీలర్లకు సమాచారం అందించి తగ్గిన ఎరువుల ధరలు అమలయ్యేలా చూడాలని సూచించారు. అన్ని దుకాణాల్లో ధరల పట్టికలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మకాల్లో ఎలాంటి తేడాలున్నా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
కంపెనీ ప్రాడక్టు పాతధర కొత్తధర
––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఐపీఎల్ ఎంఓపీ రూ.840 రూ.577.00
డీఏపీ రూ.1244.25 రూ.1140.00
20–20–0–13 రూ.945 రూ.898.00
16–16–16 రూ.945 రూ.892.50
ఇఫ్‌కో(జింకేటెడ్) 10–20–26 రూ.1103 రూ.1077.30
ఆర్‌సీఎఫ్ డీఏపీ రూ.1155 రూ.1102.00
యూరియా రూ.298 రూ.298.00
క్రిభ్‌కో డీఏపీ రూ.1244 రూ.1191.50
స్పిక్ డీఏపీ రూ.1312.50 రూ.1155.00
20–20–0–13 రూ.971 రూ.913.00
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
దిగొచ్చిన ఎరువుల ధర
Published Wed, Jul 27 2016 12:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement