పశుసంవర్ధక శాఖ జేడీగా సుదర్శన్‌కుమార్
పశుసంవర్ధక శాఖ జేడీగా సుదర్శన్‌కుమార్
Published Wed, Sep 14 2016 11:15 PM | Last Updated on Sat, Jun 2 2018 8:44 PM
– డీడీ నుంచి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు
– రెగ్యులర్ జేడీగా బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధకశాఖ ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సుదర్శన్‌కుమార్‌ను పూర్తిస్థాయి జేడీగా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా బహుళార్ధ పశువైద్యశాలలో డిప్యూటి డైరెక్టర్‌గా ఉన్న సుదర్శన్‌కుమార్ పూర్తి అదనపు బాధ్యతలతో ఏడాదిగా జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు డిప్యూటి డైరెక్టర్లకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 228 జారీ చేసింది. ఇందులో డాక్టర్ సుదర్శన్ కుమార్ కూడా ఉన్నారు. రెగ్యులర్ జేడీగా డాక్టర్ సుదర్శన్‌కుమార్ వెంటనే బాధ్యతలు స్వీకరించారు. ఖాళీ అయిన డీడీ స్థానాన్ని అక్కడి సీనియర్ ఏడీతో భర్తీ చేయనున్నారు. జేడీగా పదోన్నతి పొందిన సుదర్శన్‌కుమార్‌ను డీడీ చెన్నయ్య, ఏడీలు విజయుడు, రామచంద్రయ్య, చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్.నాగరాజు, జిల్లా నేతలు పార్థసారథి, రామసుబ్బారెడ్డి, టెక్నికల్ అధికారి డాక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు అభినందించారు.
Advertisement
Advertisement