DD
-
కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..
బనశంకరి: నకిలీ బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)లు తయారుచేస్తున్న నలుగురిని బెంగళూరు ఎల్రక్టానిక్ సిటీ ఉపవిభాగ బేగూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.18 కోట్ల విలువ చేసే 25 నకిలీ డీడీలను, ముద్రణ ఉపకరణాలను సీజ్ చేశారు. నిందితులు ఇంద్రజిత్ నాయక్, ఇతడి భార్య మంజుళ, స్నేహితులు మునిరాజు, ఆనంద్. ఫెడరల్ బ్యాంకులో రట్టు ఇంద్రజిత్ ఒక రియాల్టీ కంపెనీ పేరుతో రూ.4.95 లక్షల నకిలీ డీడీని ముద్రించి దానిని జయరామ్ అనే వ్యక్తికి అందజేశాడు. దానిని బ్యాంకులో మార్చి నగదు తెచ్చిస్తే నీకు రూ.1.50 లక్షలు అందజేస్తానని చెప్పాడు. సరేనని జయరామ్ ఆ డీడీని ఫెడరల్ బ్యాంకులో ఇచ్చాడు. సిబ్బంది పరిశీలించగా నకిలీ డీడీ అని తెలిసింది. దీంతో జయరామ్, ఇంద్రజిత్నాయక్లపై బేగూరు పీఎస్‌లో బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఇంద్రజిత్ స్నేహితుడు మునిరాజు ఒక అసలైన డీడీని అందించి అదే తరహాలో నకిలీ డీడీలను తయారుచేయాలని సూచించాడు. తద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని పన్నాగం పన్నారు. ఇంద్రజిత్ ఆ డీడీని ఇంటికి తీసుకెళ్లి భార్య మంజుళతో కలిసి స్కాన్ కొన్ని నకిలీ డీడీలను తయారుచేశాడు. ఆనంద్ అనే వ్యక్తి నుంచి వివిధ బ్యాంకుల రబ్బర్ సీళ్లను సంపాదించారు. ఇంతలోనే బండారం బయటపడింది. డీడీలు, ఉపకరణాలు సీజ్ ఇంద్రజిత్ నుంచి రూ.9 వేల నగదు, స్కానర్, ప్రింటర్, ఆరు సీళ్లు, రూ.7.18 కోట్ల విలువ చేసే 25 నకిలీ డీడీలను స్వా«దీనం చేసుకున్నారు. ఆనంద్ వద్ద రబ్బర్‌సీళ్లు, కంప్యూటర్, ఇతర ఉపకరణాలు దొరికాయి. ఆగ్నేయ విభాగ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మహదేవజోíÙ, అసిస్టెంట్ కమిషనర్ పవన్, బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ మంజు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు. (చదవండి: బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం) అప్పు.. అక్రమ సంబంధం.. ఓ హత్య -
మోదీ స్పీచ్‌కు చెక్ : డీడీ అధికారిపై వేటు
చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ మద్రాస్‌లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్ కేంద్రం అధికారిపై ప్రసార భారతి వేటు వేసింది. ప్రధాని ప్రసంగం ప్రసారాన్ని డీడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వసుమతి అడ్డుకున్నారనే అభియోగాలపై ఆమెను ప్రసారభారతి సస్పెండ్ చేసింది. సీనియర్ అధికారుల నుంచి అనుమతి ఉన్నా ప్రధాని ప్రసంగాన్ని డీడీ పొదిగై టీవీ ప్రసారం చేయలేదని సమాచారం. వసుమతిని సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణం పేర్కొనకపోయినా ప్రధాని ప్రసంగం వ్యవహారంపైనే ఆమెపై చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సెప్టెంబర్ 30న వర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉందా అని అసిస్టెంట్ డైరెక్టర్ వసుమతి తన ఉన్నతాధికారులకు ఈమెయిల్ చేయగా ప్రధాని ప్రసంగాన్ని లైవ్ ఇవ్వాలని వారు బదులిచ్చినట్టు ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి. స్పష్టమైన ఉత్తర్వులున్నా అసిస్టెంట్ డైరెక్టర్ వసుమతి ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నారని ప్రసార భారతి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు 1965 కింద వసుమతిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రసార భారతి వెల్లడించింది. -
సంక్షేమంలో అవినీతి సామ్రాట్
నెల్లూరు(అర్బన్): దళిత వర్గాల అభ్యున్నతికి పాటు పడేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ (సోషల్ వెల్ఫేర్) జిల్లాలో అవినీతికి అడ్డాగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్ పేరిట భారీగా వసూళ్లు, బ్యాంక్‌ల ఖాతాల్లో నగదు తారుమారు, గురుకుల పాఠశాలల పేరుతో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చేయడం వంటివి పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన డీడీ మధుసూదన్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి కంపు మరోసారి గుప్పుమంది. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డీడీగా మధుసూదన్‌రావు 2015 డిసెంబర్లోబాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 81 వరకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహ అధికారుల నుంచి ప్రతి నెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయనకు ముడుపులు ఇచ్చుకునేందుకు వసతి గృహ అధికారులు విద్యార్థుల మెనూకు కోత వేసి తమ అధికారిని సంతృప్తి పరిచేవారనే ఆరోపణలు లేకపోలేదు. వసూళ్లకు శ్రీకారం ఆ శాఖకు చెందిన బ్యాక్లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నారని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారనే ప్రచారం జరుగుతోంది. నాయుడు పేటలో దళిత వర్గాల కోసం స్ఫూర్తి గురుకుల పాఠశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక్కడ కళాశాల ప్రారంభించక ముందే ప్రారంభించినట్టు చూపి రూ.కోటి వరకు నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 17 బ్యాంక్‌ల్లో రూ. 86.90 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇందులో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయానికి రూ.42 లక్షలకే లెక్కలు చూపుతున్నట్టు సమాచారం. డీడీ కార్యాలయ కోటరీపైన ఏసీబీ దృష్టి మధుసూదనరావుకు డిప్యూటీ డైరెక్టర్ కార్యాయలంలో కొందరు ఉద్యోగులు అన్ని తామై చూసుకునే వారు. నెలవారీ మామూళ్లు మొదలుకుని అన్ని అంశాలు వీరే చక్కబెట్టేవారు. గతంలో ఎన్ని బదిలీలు జరిగినా పైరవీలు, కోర్టులకు వెళ్లి మరీ బదిలీలు నిలుపుదల చేయించుకున్నారు. తాజాగా మధుసూదనరావు నివాసంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో కొందరు కార్యాలయ సిబ్బందిలో తీవ్ర అలజడి మొదలైంది. ముఖ్యంగా 8 మంది ఉద్యోగులు అన్ని తామై చక్రం తిప్పారని సమాచారంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు వారిపై దృష్టి సారించినట్లు సమాచారం. బదిలీ జరిగినా వారాల తరబడి ఇక్కడే అక్టోబర్ 12వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా మధుసూదన్‌రావు తూర్పుగోదావరి జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన రెండు వారాలకు పైగా జిల్లా నుంచి రిలీవ్ కాలేదు. తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు పైస్థాయిలోనే పైరవీలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రిలీవ్ కాకుండానే కార్యాలయానికి వచ్చి ప్రమోషన్ల, ఇన్చార్జీ, బదిలీలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పేరిట పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు తెర లేపారని సమాచారం. అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్ వంటి మహానేతల జయంతులను ప్రభుత్వం రాష్ట్ర పండగలుగా గుర్తించి నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ వారి ఉత్సవాల పేరిట వసతిగృహ అధికారుల నుంచి నిధులు వసూలు చేసి ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని దిగమింగారనే వార్తలు గుప్పుమన్నాయి. భారీగా ఆస్తులు గుర్తింపు ఏసీబీ అధికారులు దాడి చేసి మధుసూదనరావుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఒక కిలో బంగారం నగలు, ఒకటిన్నర కిలోల వెండి, రూ.లక్ష వరకు నగదు దొరికింది. ఇవి కాక వివిధ బ్యాంక్ ఖాతాలు.. అందులో ఉన్న నగదు, చెక్కులకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. డీడీ ఉద్యోగ ప్రస్థానాలు దాసరి మధుసూదనరావు నెల్లూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తూ ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. అదే నెల 29వ తేదీన ఆయన నెల్లూరు నుంచి బదిలీ అయ్యారు. ఇంత వరకూ తూర్పుగోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదు. గుంటూరు జిల్లాకు చెందిన మధుసూదనరావు 2004 జూలై 20వ తేదీన చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి (సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పని చేశారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. డీడీగా వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలో పని చేసి 2015 డిసెంబర్లో నెల్లూరు సోషల్ వెల్ఫేర్ డీడీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పాటు జిల్లాలో పని చేసి ఇటీవల బదిలీ అయ్యారు. -
గడువు పొడిగిస్తున్నా స్పందన కరువు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో గ్రామాల్లో పేదలకు ప్రజాపంపిణీ సరుకులు పంపిణీ చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గడువు పొడిగిస్తున్నా రేషన్ డీలర్లు డీడీలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఈ నెలలో ఇబ్బందులు తప్పేలా లేవు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించి డీడీలు కట్టాలని పలు పర్యాయాలు కోరినా, గడువు పొడిగించినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లే దిక్కుగా మారాయి. పేదలకు అసౌకర్యం కలుగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృమవుతాయోననే ఆందోళన అధికారులను వెంటాడుతోంది. నేటి నుంచి సమ్మె ప్రజాపంపిణీలో భాగమైన రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘాల పిలుపు మేరకు జూలై 1 నుండి రేషన్ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ గడువులు ఇస్తున్నా రేషన్ డీలర్లు మెట్టు దిగకపోవడం, ప్రజాపంపిణీ సరుకులకు డీడీలు చెల్లించకపోవడంతో ఐకేపీ సంఘాలను అప్రమత్తం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రజాపంపిణీపై శిక్షణ ఇవ్వడం, పంపిణీకి గ్రామాల్లో ప్రదేశాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా బిజీబిజీగా ఉన్నారు. ఐకేపీ సంఘాలకు ఆర్వోలు జారీ చేయాలని సంబంధిత తహసీల్దార్లకు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుండి ఈ నెల 5వ తేదీ వరకు గ్రామాలకు సరుకులు చేరవేస్తామని తెలిపారు. అయితే ప్రజాపంపిణీ సరుకులను ఈ నెల ఈ–పాస్ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గానే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా డీలర్లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు డీడీలు చెల్లించేందుకు గడువు ఇస్తూ మీ–సేవా కేంద్రాల ద్వారా డీడీలు చెల్లించి ఆర్వోలు పొందేలా డీలర్లకు అవకాశం కల్పించింది. కాగా, జిల్లా వ్యాప్తంగా 804 రేషన్ షాపులకు గాను శనివారం సాయంత్రం వరకు 27 మంది డీలర్లు డీడీలు చెల్లించారు. కాగా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డీలర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయొద్దని జేసీ తహసీల్దార్లకు సూచించారు. మట్టి తిని బతకాలా? జడ్చర్ల: ‘ప్రజలు భోజనం చేసేలా బియ్యం అందజేసే చేతులకే అన్నం కరువైతే ఎలా.. తాము మట్టి తిని బతకాలా.. ఇదేనా బంగారు తెలంగాణ?’ అంటూ రేషన్ డీలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సమ్మె నోటీసు ఇవ్వగా.. పరిష్కరించాల్సింది పోయి షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ శనివారం జడ్చర్ల రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లేట్లలో మట్టి పోసుకుని భోజనం చేస్తున్న మాదిరిగా కూర్చున్నారు. న్యాయమైన సమస్యలు పరిశ్కరించాలని కోరితే సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.250 పైగా ఇస్తున్నారని.. అంతకంటే అధ్వానంగా తమ పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని డీలర్లు వాపోయారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సమస్యల సాధన సమితి అధ్యక్షులు పాలాది రమేశ్, బాధ్యులు కొంగలి నాగరాజు, శ్రీనువాసులు, కృష్ణయ్య, నగేశ్, చెన్నయ్య ,తుంగ రఘు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇక డీలర్ల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిక్ షాకీర్, పరమటయ్య, ఎంపీటీసీ సభ్యులు బాలవర్దన్‌గౌడ్ తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. -
ఓటమిపై స్పందించిన ధోని..
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్ 2018 సీజన్లో ఎప్పటి మాదిరే వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు దూరమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు.. ఎంతో పటిష్టమైన జట్టుగా పేరొందిన చెన్నైసూపర్కింగ్స్ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా తమ జట్టు పరాజయం పాలవడంపై చెన్నై కెప్టెన్ ధోని స్పందించారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ధోని.. ఓటమి తనను ఎంతో నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. ‘మేం ఇంకాస్త బాగా బ్యాటింగ్ చేయాల్సింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ చాలా నెమ్మదించింది. దానికి తోడు ఢిల్లీ బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయినా వికెట్ ఎలా ఉంటుందో ముందుగానే ఊహించడం కష్టం. ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉంటుంది. మరోసారి ఇదిగో ఇలా రివర్స్ అవుతుందంటూ’ ధోని వ్యాఖ్యానించారు. భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. ‘మేము మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఓపెనర్లపై పూర్తిగా ఆధారపడకుండా మిడిల్ ఆర్డర్ రాణించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకూ ఎక్కువ మంది బ్యాట్స్మెన్ల సేవలను వినియోగించుకోలేదు. రానున్న మ్యాచ్‌లలో వారికి అవకాశం లభించవచ్చు. కాబట్టి అందుకు వారు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలి’ అంటూ ధోని చెప్పారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ బాగా మెరుగుపడాల్సివుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్‌లో ఉండగా, సీఎస్కే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే రన్‌రేట్ ప్రకారం సీఎస్కే మెరుగైన స్థానంలో ఉండటంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిచితే టాప్ ప్లేస్‌ను ఆక్రమించాలని ఆశించిన ధోని జట్టుకు నిరాశే మిగిలింది. -
ఢిల్లీ ఓటమికి బాధపడ్డా
-
ఢిల్లీ ఓటమికి బాధపడ్డా: శిఖర్ ధావన్
ఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న తర్వాత పరుగులు రాబట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, గురువారంనాటి మ్యాచ్‌తో తిరిగి పుంజుకున్నానని శిఖర్ ధావన్ చెప్పాడు. ఐపీఎల్ 2018లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్(50 బంతుల్లో 92 పరుగులు) ఆడిన ధవన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సన్‌రైజర్స్ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చిన ఈ విజయం ఆనందకరమే అయినా.. ఢిల్లీ ఓటమి ఒకింత బాధకలిగించిందని మ్యాచ్ అనంతరం అన్నాడు. గబ్బర్ ఎప్పుడూ ఉంటాడు: ‘‘అద్భుతంగా ఆడారు.. గబ్బర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా..’ అన్న కామెంటేటర్ ప్రశ్నకు ధావన్.. ‘‘తిరిగిరావడం కాదు.. గబ్బర్ ఈస్ ఆల్వేస్!’ అని చమత్కరించాడు. ‘‘నేను నా స్టైల్లో రెచ్చిపోయా. కేన్ విలియమ్సన్ తన శైలిలో ఆడాడు. బ్యాటింగ్‌కు దిగే ముందు కోచ్ మూడీ ఒక్కటే అన్నాడు.. అన్ని పరుగులు వాళ్లు(ఢిల్లీ) సాధించగాలేనిది మనం సాధించలేమా? అని! ప్రత్యేకమైన వ్యూహాలేవీలేకుండా మా సహజశైలిలో ముందుకెళ్లాం. ఇన్నింగ్స్ మధ్యలో కేన్, నేను పెద్దగా మాట్లాడుకున్నదిలేదు..’’ అని వివరించాడు. పాపం ఢిల్లీ: మ్యాచ్ గెలిచింది సన్‌రైజర్సే అయినా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం పంత్ ఇన్నింగ్సేనన్న అభిప్రాయంతో ధావన్ ఏకీభవించాడు. ‘‘రిషభ్ లాంటి యంగ్‌స్టర్ అద్భుతంగా ఆడటం చాలా బాగుంది. భారత క్రికెట్‌కు సంబంధించి కూడా ఇవి శుభపరిణామాలే. సీనియర్స్‌తో గడిపే సమయం కుర్రాళ్లకు చాలా విలువైనది. పంత్ చెలరేగి ఆడినా చివరికి ఢిల్లీ ఓడిపోవడం ఒకింత బాధకలిగించింది. బహుశా వాళ్లు ఇంకా ఎక్కువ పరుగులు చేయాల్సిందేమో!’ అని శిఖర్ ధావన్ అన్నాడు.(శిఖర్ స్టన్నింగ్ ఇన్నింగ్స్ హైలైట్స్ వీడియోలో చూడండి) -
తప్పు చేశా.. అందుకే ఆడా: రిషభ్ పంత్
ఢిల్లీ: ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ షాట్స్ అంటే.. దిల్‌స్కూప్.. స్విచ్ షాట్స్.. ర్యాంప్ షాట్.. వాక్‌వే కట్.. పెరిస్కోప్ షాట్.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధోనీ హెలికాప్టర్ షాట్.. అని టకటకా చెప్పేయొచ్చు. కానీ గురువారంనాటి మ్యాచ్‌లో రిషభ్ పంత్ కొట్టినషాట్లకు మాత్రం కొత్త పేర్లు వెతుకుతున్నారు క్రీడాపండితులు!! ఐపీఎల్ 2018లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ రిషభ్.. బ్రహ్మాండం బద్దలయ్యే రేంజ్లో(63 బంతుల్లో 7 సిక్సర్లు, 15 ఫోర్లు 128 పరుగులు) ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మామూలుగానే అగ్రెసివ్ ఆటను ప్రదర్శించే పంత్.. నిన్న ఘోరతప్పితాలు చేసినందుకే ద్విగుణీకృత బాధ్యతతో ఆడానని చెప్పుకొచ్చాడు. అప్పుడే నిర్ణయించుకున్నా: ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి అర్ధభాగంలో.. అసలే మందకోడిగా సాగుతున్నవేళ అయ్యర్, హర్షల్ పలేట్లు అనూహ్యరీతిలో రనౌట్ అయ్యారు. ఆ ఇద్దరినీ మింగింది పంతే! మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నాడు. ‘‘నేను తప్పు చేశాను. పరుగు తీయాలా వద్దా అని సరిగా అంచనా వేయలేకపోయాను. దీంతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయా. అఫ్కోర్స్ ఇది క్రికెట్లో సహజమే. అయితే, ఆ రెండు రనౌట్ల తర్వాత నేను మరింత బాధ్యతగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఇది నా కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అని ఇప్పుడే చెప్పలేనుగానీ, వన్ ఆఫ్ ది బెస్ట్‌గా మాత్రం నిలుస్తుంది..’’ అని వ్యాఖ్యానించాడు. మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు–2009లో) తర్వాత ఐపీఎల్లో సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా పంత్ (20 ఏళ్ల 218 రోజులు) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒంటిచేత్తో సిక్సర్: ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతోన్న భువీకి పంత్ చుక్కలు చూపించాడు. చివరి ఓవర్లో ఐదు బంతులు ఆడిన రిషబ్ ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. 4,4,6,6,6 గణాంకాలు నమోదయ్యాయి. వీటిలో నాలుగో బంతిని ఒంటిచేత్తో సిక్సర్‌గా మలిచిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. (ఆ వీడియోను కింద చూడొచ్చు) మ్యాచ్ రిపోర్ట్: గురువారం ఫిరోజ్‌షా కోట్లాలో జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. వరుసగా ఆరో విజయంతో ఈ సీజన్లో తొమ్మిదో గెలుపుతో హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (63 బంతుల్లో 128 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత హైదరాబాద్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (50 బంతుల్లో 92 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి గెలిపించారు. -
రిషబ్ పంత్ పరుగుల సునామీ
-
‘గౌతం గంభీర్‌తో జాగ్రత్త’
కోల్‌కతా: గతేడాది వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా చేసిన గౌతం గంభీర్.. ఈ ఏడాది సొంత జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో గంభీర్‌ను కేకేఆర్ వదిలేసుకోవడంతో అతన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకుంది. అదే సమయంలో గంభీర్ కెప్టెన్ బాధ్యతల్ని సైతం కట్టబెట్టింది. అయితే సోమవారం ఈడెన్ గార్డెన్లో కేకేఆర్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో గంభీర్ హైలైట్‌గా నిలవనున్నాడు. ఒకప్పటి కెప్టెన్ కెప్టెన్ ఇప్పుడు ప్రత్యర్థిగా తలపడటంతో గంభీర్ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలోనే కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కాటిచ్ మాట్లాడుతూ.. గంభీర్‌పైనే దృష్టి నిలపాలని జట్టు సభ్యులకు సూచించాడు. గంభీర్‌ను టార్గెట్ చేయకపోతే అతను కేకేఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయమని హెచ్చరించాడు. ‘ మా జట్టు(కేకేఆర్) గురించి గంభీర్‌కు బాగా తెలుసు. అందులోనూ ఈడెన్ వికెట్‌పై గంభీర్‌కు మంచి అవగాహనం ఉంది. కేకేఆర్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో గంభీర్‌కు ఆడిన అనుభవం ఉంది. దాంతో అన్ని రకాలుగా కేకేఆర్ లోటుపాట్లు గురించి తెలిసిన గంభీర్ పక్కాప్రణాళికతో మాతో పోరుకు సిద్ధమవుతాడు. గంభీర్‌పై ఏదొక కోణంలో మాత్రమే దృష్టి సారిస్తే మనకే ముప్పు పొంచి ఉంటుంది. గంభీర్ జాగ్రత్త’అని కాటిచ్ హెచ్చరించాడు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీడీ
కరీంనగర్ : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) పెరిక యాదయ్య ఏసీబీకి చిక్కారు. కూరగాయల కాంట్రాక్టర్ కనకయ్యకు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు వంట వండే క్యాటరింగ్ పర్మిషన్ ఇచ్చేందుకు డీడీ యాదయ్య రూ.1.30 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కనకయ్య ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. దీంతో పధకం ప్రకారం యాదయ్యను అరెస్ట్ చేసేందుకు వ్యూహం పన్నారు. అనుకున్న విధంగా రాంనగర్లో కనకయ్య రూ.లక్ష ఇస్తుండగా యాదయ్యను పట్టుకున్నారు. మధ్యవర్తిగా వెళ్లిన లక్ష తీసుకున్న అటెండర్ శ్యామ్ సుందర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐపీఎల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
కాన్పుర్: గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య ఇక్కడ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఢిల్లీ జట్టులో రబడా స్ధానంలో బ్రాత్ వైట్ తీసుకోగా గుజరాత్ లయన్స్ ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. నాకౌట్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ఇరు జట్లు పరువు కోసం పోరాడుతున్నాయి. పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన గుజరాత్ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకుని తిరిగి విజయాల బాట పట్టాలని ఢిల్లీ కృతనిశ్చయంతో ఉంది. ఈ సీజన్ లో ఇరుజట్లు ఓసారి తలపడగా ఢిల్లీ పై చేయి సాధించింది. ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తోంది. తుది జట్లు ఢిల్లీ డేర్ డెవిల్స్: సంజూ శాంసన్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, అండర్సన్, శ్రేయస్ అయ్యర్, శ్యాముల్స్, బ్రాత్ వైట్, పాట్ కమ్మిన్స్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ,, జహీర్ ఖాన్ ( కెప్టెన్) గుజరాత్ లయన్స్: డ్వాన్ స్మిత్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా( కెప్టెన్), ఫించ్, రవీంద్ర జడేజా, ఫాల్కనర్, దినేశ్ కార్తీక్, బసీల్ తంపి, అంకిత్ సోని, కులకర్ణి, ప్రదీప్ సంగ్వన్. -
జిల్లా పౌరసంబంధాల ఏడీగా సుకుమార్
కర్నూలు (అగ్రికల్చర్): జిల్లా పౌరసంబంధాల శాఖ ఉపసంచాలకులుగా శ్యామేల్ సుకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఅండ్పీఆర్లో అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి అధికారి అయిన ఇతను ఇప్పటి వరకు ఇన్చార్జి డీడీగా పని చేస్తున్నారు. తాజాగా పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా ఏడీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
పశుసంవర్ధక శాఖ జేడీగా సుదర్శన్‌కుమార్
– డీడీ నుంచి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు – రెగ్యులర్ జేడీగా బాధ్యతల స్వీకరణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధకశాఖ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సుదర్శన్‌కుమార్‌ను పూర్తిస్థాయి జేడీగా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా బహుళార్ధ పశువైద్యశాలలో డిప్యూటి డైరెక్టర్‌గా ఉన్న సుదర్శన్‌కుమార్ పూర్తి అదనపు బాధ్యతలతో ఏడాదిగా జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు డిప్యూటి డైరెక్టర్లకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 228 జారీ చేసింది. ఇందులో డాక్టర్ సుదర్శన్ కుమార్ కూడా ఉన్నారు. రెగ్యులర్ జేడీగా డాక్టర్ సుదర్శన్‌కుమార్ వెంటనే బాధ్యతలు స్వీకరించారు. ఖాళీ అయిన డీడీ స్థానాన్ని అక్కడి సీనియర్ ఏడీతో భర్తీ చేయనున్నారు. జేడీగా పదోన్నతి పొందిన సుదర్శన్‌కుమార్‌ను డీడీ చెన్నయ్య, ఏడీలు విజయుడు, రామచంద్రయ్య, చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్.నాగరాజు, జిల్లా నేతలు పార్థసారథి, రామసుబ్బారెడ్డి, టెక్నికల్ అధికారి డాక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు అభినందించారు. -
డీడీని కలిసిన టీఎన్జీవోస్ నేతలు
హన్మకొండ అర్బన్ : నర్సంపేట ఎస్సీ హాస్టల్ వార్డెన్ మధును సస్పెండ్ చేసిన నేపథ్యంలో టీఎన్జీవోస్ నేతలు సోమవారం దళిత సంక్షేమ శాఖ డీడీ శంకర్‌ను హన్మకొండలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ఉద్యోగిపై ముందుగా సమగ్ర విచారణ చేయాలని అలా కాకుండా సస్పెండ్ చేయడంవల్ల వార్డెన్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. అంతేకాకుండా హాస్టళ్లకు సకాలంలో సరుకులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు సస్పెన్షన్ల విషయంలో ఉన్నతాధికారులు ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలని కోరారు. డీడీని కలిసిన వారిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, వార్డెన్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కృష్ణ, ఏఎస్‌డబ్ల్యూవోలు భవానీప్రసాద్, గట్టుమల్లు తదితరులు ఉన్నారు. -
ఓలాలో చైనా డీడీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల కంపెనీ ఓలాలో చైనా సంస్థ డీడీ కువైడీ ఇన్వెస్ట్ చేసింది. అయితే, ఎంత పెట్టుబడి పెట్టినదీ వివరాలు వెల్లడి కాలేదు. ప్రత్యర్థి సంస్థ ఉబెర్‌తో పోటీపడేందుకు ఓలా 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,320 కోట్లు) సమీకరించడానికి ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజా పెట్టుబడులు.. ఓలా చిన్న పట్టణాల్లో కార్యకలాపాలు విస్తరించేందుకు తోడ్పడనున్నాయి. మరోవైపు, యాప్ ద్వారా ట్యాక్సీ సేవలు అందించే డీడీ డాషే, కువైడీ డాషే కంపెనీల విలీనంతో డీడీ కువైడీ ఏర్పడింది. ఇది చైనా సహా హాంకాంగ్‌లో రెండు బ్రాండ్ల పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో ఆలీబాబా గ్రూప్, టెన్సెంట్ వంటి చైనా టెక్ దిగ్గజాల పెట్టుబడులు ఉన్నాయి. -
ఇసుక డీడీలకు అధిక డిమాండ్
రూ.లక్షల్లో చేతులు మారుతున్న వైనం చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు ఏటూరునాగారం : లారీల్లో ఇసుక కావాలంటే డీడీ చెల్లించాలి. దీని కోసం వాహనదారులు అధిక డబ్బులు చెల్లించాల్సిందే. ఓ శాఖ అధికారుల కనుసన్నల్లో చేలామణి అవుతున్న అక్రమ దందా.. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లు, యజమానుల దత్తకే డీడీలు వచ్చి చేరుతారుు. లారీల్లో ఇసుక నింపాలంటే బినామీ పేర్లపై తొలుత వేలాది డీడీలను ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. డ్రైవర్లకు ఎలాంటి కష్టంగా లేకుండా చేస్తారు. కాకపోతే.. కొంత డబ్బు ఎక్కువ చెల్లించాలి.. అంతేకాదు.. తమ వద్ద డీడీలు తీసుకుంటే లారీల్లో ఇసుక కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా నింపేస్తారు. సీరియల్ నంబర్ కూడా వెంటనే లభిస్తుందనే ఆఫర్లను ప్రకటిస్తున్నారు. దీంతో డీడీలకు యమ డిమాండ్ పెరిగింది. 13.50క్యూబిక్ మీటర్లకు రూ.7,425.. 13.50 క్యూబీక్ మీటర్ల ఇసుక లారీకి ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా రూ. 7425 నిర్ణయించింది. అరుుతే, తాము ఆన్లైన్లో డీడీలు ఇస్తామని దళారులు రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు అక్రమంగా విక్రయిస్తున్నారు. ఆన్లైన్ వ్యాపారులతోపాటు ఏటూరు, తుపాకులగూడెం వద్ద ఏజెంట్లకు, ఇసుక క్వారీ నిర్వాహకులకు ఇందులో వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీడీల పేరిట రోజూ కనీసం రూ. 3లక్షల- రూ.6 లక్షల అక్రమ వ్యాపారం కొనసాగుతోందని ప్రచారం సాగుతోంది. డీడీ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. డీడీలను అధిక ధరలతో కొనుగోలు చేసి యజమానులు.. మార్కెట్‌తోపాటు లబ్ధిదారులు, భవన నిర్మాణదారులకు ఒక్కో లారీకి రూ.40- రూ.50 వేల వరకు విక్రరుుస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. పేరుకే ప్రభుత్వ క్వారీ అరుునా.. అంతా అక్రమ వ్యాపారమేనని కొందరు ఆరోపిస్తున్నారు. డీడీల దందా మొదలుకొని ఇసుక లారీలు, సీరియల్ రావడం.. అధికలోడు నింపడం.. ఒకేరాత్రి 100-200 లారీలను చెక్‌పోస్టు దాటించడం నిత్యకృత్యమైందంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే దళారులు ప్రభుత్వ క్వారీని అక్రమ క్వారీగా మార్చే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఏటూరు, తుపాకులగూడెం ఇసుక క్వారీ టీఎస్ఎండీసీ ప్రాజెక్టు ఆఫీసర్ తారకరత్నను సంప్రదించగా, డీడీల దందాతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. అంతా ఆన్లైన్లోనే సాగుతోంది కాబట్టి అక్రమాలకు తావుండదన్నారు. -
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 1): డిడి
-
ఎన్నికల్లో లంచం ఇస్తే... డీడీతో చెప్పు దెబ్బ
చెన్నై : తమిళనాడు ఓటరు శ్రీరంగం అభ్యర్థులకు తన తడాఖా చూపించాడు. ఉప ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చిన సొమ్మును ఎన్నికల కమిషన్‌కు అప్పగించాడు. తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఉప ఎన్నిక సందర్భంగా గత నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో యథేచ్ఛగా నగదు, బహుమానాలు పంపిణీ జరిగినట్లు అభ్యర్థులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఎన్నికలో అన్నాడీఎంకే భారీ మెజారిటీతో గెలుపొందింది. ఓటర్లను మభ్యపెట్టిన ట్లు వచ్చిన ఆరోపణలపై కొందరిపై ఆనాడే ఈసీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఒక ఓటరు, శ్రీరంగం ఎన్నికల్లో ఓటు కోసం తన కుటుంబానికి నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు రూ.12 వేల డిమాండ్ డ్రాఫ్ట్‌ను పంపాడు. ఆరుగురు సభ్యులు కలిగిన తన కుటుంబానికి ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.12 వేలు చెల్లించారని ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని 10 మంది వ్యక్తులు గత నెల 9వ తేదీన బలవంతంగా తనకు అందజేసినట్లుగా అతను వివరించాడు. ఈ ఫిర్యాదును సీఈసీ విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక పంపాల్సిందిగా తిరుచ్చి పోలీస్ సూపరింటెండెంట్‌ను ఆదేశించగా మూడు సెక్షన్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.