
ఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న తర్వాత పరుగులు రాబట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, గురువారంనాటి మ్యాచ్‌తో తిరిగి పుంజుకున్నానని శిఖర్ ధావన్ చెప్పాడు. ఐపీఎల్ 2018లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్(50 బంతుల్లో 92 పరుగులు) ఆడిన ధవన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సన్‌రైజర్స్ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చిన ఈ విజయం ఆనందకరమే అయినా.. ఢిల్లీ ఓటమి ఒకింత బాధకలిగించిందని మ్యాచ్ అనంతరం అన్నాడు.
గబ్బర్ ఎప్పుడూ ఉంటాడు: ‘‘అద్భుతంగా ఆడారు.. గబ్బర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా..’ అన్న కామెంటేటర్ ప్రశ్నకు ధావన్.. ‘‘తిరిగిరావడం కాదు.. గబ్బర్ ఈస్ ఆల్వేస్!’ అని చమత్కరించాడు. ‘‘నేను నా స్టైల్లో రెచ్చిపోయా. కేన్ విలియమ్సన్ తన శైలిలో ఆడాడు. బ్యాటింగ్‌కు దిగే ముందు కోచ్ మూడీ ఒక్కటే అన్నాడు.. అన్ని పరుగులు వాళ్లు(ఢిల్లీ) సాధించగాలేనిది మనం సాధించలేమా? అని! ప్రత్యేకమైన వ్యూహాలేవీలేకుండా మా సహజశైలిలో ముందుకెళ్లాం. ఇన్నింగ్స్ మధ్యలో కేన్, నేను పెద్దగా మాట్లాడుకున్నదిలేదు..’’ అని వివరించాడు.
పాపం ఢిల్లీ: మ్యాచ్ గెలిచింది సన్‌రైజర్సే అయినా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం పంత్ ఇన్నింగ్సేనన్న అభిప్రాయంతో ధావన్ ఏకీభవించాడు. ‘‘రిషభ్ లాంటి యంగ్‌స్టర్ అద్భుతంగా ఆడటం చాలా బాగుంది. భారత క్రికెట్‌కు సంబంధించి కూడా ఇవి శుభపరిణామాలే. సీనియర్స్‌తో గడిపే సమయం కుర్రాళ్లకు చాలా విలువైనది. పంత్ చెలరేగి ఆడినా చివరికి ఢిల్లీ ఓడిపోవడం ఒకింత బాధకలిగించింది. బహుశా వాళ్లు ఇంకా ఎక్కువ పరుగులు చేయాల్సిందేమో!’ అని శిఖర్ ధావన్ అన్నాడు.(శిఖర్ స్టన్నింగ్ ఇన్నింగ్స్ హైలైట్స్ వీడియోలో చూడండి)
Comments
Please login to add a commentAdd a comment