PBKS vs DC: బోణీ కొట్టిన పంజాబ్‌.. ఢిల్లీపై ఘన విజయం | IPL 2024: Punjab Kings vs Delhi Capitals Toss, Playing XI Updates & Highlights | Sakshi
Sakshi News home page

IPL 2024 PBKS vs DC: బోణీ కొట్టిన పంజాబ్‌.. ఢిల్లీపై ఘన విజయం

Published Sat, Mar 23 2024 3:10 PM | Last Updated on Sat, Mar 23 2024 7:33 PM

IPL 2024 Punjab Kings vs Delhi Capitals Toss Playing XI Updates Hilights - Sakshi

IPL 2024 PBKS vs DC- Updates:

బోణీ కొట్టిన పంజాబ్‌.. ఢిల్లీపై ఘన విజయం
ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. చంఢీఘర్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పంజాబ్‌ బ్యాటర్లలో సామ్‌ కుర్రాన్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్‌ స్టోన్‌(38) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, ఖాలీల్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ శర్మ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్‌ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

►100 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన జితేష్ శ‌ర్మ‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో స్టంపౌట‌య్యాడు.

మూడో వికెట్ డౌన్‌..
84 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 26 ప‌రుగులు చేసిన ప్ర‌భు సిమ్రాన్ సింగ్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి జితేష్ శ‌ర్మ వ‌చ్చాడు.
ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు.. 
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఒకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో శిఖర్‌ ధావన్‌(22) బౌల్డ్‌ కాగా.. బెయిర్‌ స్టో(9) రనౌటయ్యాడు. 5 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 53/2. క్రీజులో ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్‌(16), సామ్ కుర్రాన్‌(3) ప‌రుగుల‌తో ఉన్నారు.

టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ ఆహ్వానం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్‌ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అభిషేక్‌ పోరెల్‌ మెరుపులు మెరిపించాడు.

కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 32 పరుగులతో 21 ఏళ్ల ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌ కారణంగా ఢిల్లీ ఈ మేరకు స్కోరు చేయగలిగింది.

తొమ్మిదో వికెట్‌ డౌన్‌
19.6: హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో అభిషేక్‌తో సమన్వయలోపంతో కుల్దీప్‌ యాదవ్‌(1) రనౌట్‌

 18.3: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సుమిత్‌ కుమార్‌(2) వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా ఢిల్లీ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 149-8(19)

17.1: ఏడో వికెట్‌ డౌన్‌
అక్షర్‌ పటేల్‌(21) రనౌట్‌ కావడంతో ఢిల్లీ ఏడో వికెట్‌ కోల్పోయింది. అభిషేక్‌ పోరెల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 138/7 (17.1)

15.4:  ఆరో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌(5) శశాంక్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సుమిత్‌ కుమార్‌క్రీజులోకి వచ్చాడు. అక్షర్‌ 12 పరుగులతో ఉన్నాడు. స్కోరు:  128-6(16)

13.2: ఐదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో రికీ భుయ్‌(3) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 117-5(14). అక్షర్‌ ఐదు, స్టబ్స్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

12.4: నాలుగో వికెట్‌ డౌన్‌
దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్‌ హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోగా ట్రిస్టన్‌ స్టబ్స్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 111-4 (13)

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
షాయీ హోప్‌(33) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కగిసో రబడ బౌలింగ్‌లో హర్‌ప్రీత్‌ బ్రార్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అతడి స్థానంలో రికీ భుయ్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు:  95-3(11). పంత్‌ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నాడు.

పది ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు: 86-2
షాయీ హోప్‌ 26, పంత్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. క్రీజులోకి పంత్‌
7.6: హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో వార్నర్‌(29) అవుట్‌. పంత్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 74-2(8)

పవర్‌ ప్లేలో స్కోరు?
ఓపెనర్‌ వార్నర్‌ దంచి కొడుతున్నాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి అతడు 14 బంతుల్లో 22 రన్స్‌, హోప్‌ 10 బంతుల్లో 4 పరుగులు చేశాడు. స్కోరు: 54-1(6 ఓవర్లలో). 

3.2: తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ తొలి వికెట్‌(20(12)గా వెనుదిరిగాడు. షాయీ హోప్‌ క్రీజులోకి వచ్చాడు.

ఓపెనర్లుగా వార్నర్‌, మార్ష్‌
ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించారు. తొలి ఓవర్‌ ముగిసే సరికి స్కోరు: 10-0

రిషభ్‌ పంత్‌ రీఎంట్రీ
ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లో కొత్తగా నిర్మించిన ముల్లన్‌పూర్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ తలపడనుంది.  టాస్‌ గెలిచిన ఆతిథ్య పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

డిసెంబరు 2022లో ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలపాలైన రిషబ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు.. పంజాబ్‌ శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో బరిలోకి దిగనుంది.

ఇక ఇరుజట్లు గత సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాయి. పంజాబ్‌ కింగ్స్‌ పద్నాలుగింట కేవలం ఆరు గెలిచి ఎనిమిదో స్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచాయి. తాజా ఎడిషన్‌ను గెలుపుతో ఆరంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్: 
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్‌, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.

పంజాబ్ కింగ్స్
శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్‌, జితేశ్ శర్మ( వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్‌ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్.

చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement