![IPL Winning Coach Calls Out PBKS Leadership For Repeated Failure](/styles/webp/s3/article_images/2024/05/13/pbk.jpg.webp?itok=LQqj6l6M)
PC: BCCI
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.
కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.
ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.
‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్‌మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్‌ను విమర్శించాడు.
కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది.
ఇక పంజాబ్‌ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది.
చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
Comments
Please login to add a commentAdd a comment