tom moody
-
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్‌ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్‌ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
మళ్లీ ముంబై కెప్టెన్‌గా రోహిత్?!.. అదైతే బిగ్ సర్ప్రైజ్!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు అంశాన్ని ఆ జట్టు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా.. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సైతం పాండ్యాను తమ నాయకుడిగా అంగీకరించేందుకు ఇంకా సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో తమ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోరు సందర్భంగా ఆటగాళ్ల ప్రవర్తన ఇందుకు ఊతమిచ్చింది. ముఖ్యంగా హార్దిక్.. రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరు.. అదే విధంగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ ఎటాక్‌కు దిగడం వంటివి విమర్శలకు తావిచ్చాయి. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై గుజరాత్ చేతిలో ఓడిపోవడంతో.. అటు ముంబై, ఇటు గుజరాత్ ఫ్యాన్స్ నుంచి పాండ్యా ఘాటైన కామెంట్ల ఒకరకంగా తీవ్ర అవమానమే ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజా ఎడిషన్ మధ్యలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ను మళ్లీ మారుస్తారా అనే చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఒకప్పటి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్ టామ్ మూడీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఒకవేళ అదే జరిగితే అంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉండదు. ఐదు లేదంటే ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత ఓ ఫ్రాంఛైజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది తొందరపాటు నిర్ణయమే అవుతుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకున్న నిర్ణయం. హార్దిక్ పాండ్యా విషయానికొస్తే.. నాయకుడి పాత్రలో అతడిని నియమించడం వివాదానికి దారితీసింది. అంతేకాదు.. చాలా మందిని ఈ నిర్ణయం విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచింది. అయినా.. ముందుగా చెప్పినట్లు అది దీర్ఘకాల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. అయితే, ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఎందుకో తడబడ్డాడు. గుజరాత్ టైటాన్స్ సారథిగా గత రెండేళ్లుగా తను ఎంతో రిలాక్స్డ్గా కనిపించాడు. కానీ ఇప్పుడిలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు’’ అని టామ్ మూడీ పేర్కొన్నాడు. ఇప్పట్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తొలగించి మళ్లీ అతడి స్థానంలో రోహిత్ శర్మను సారథి చేసే అవకాశం లేదని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. కాగా 2022లో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా తప్పుకొని రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, జడ్డూ విఫలం కావడంతో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేసి వెళ్లగా ధోని తిరిగి బాధ్యతలు చేపట్టాడు. 2023లో జట్టును మరోసారి చాంపియన్‌గా నిలిపి..తాజా సీజన్లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బదలాయించాడు. A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk — IndianPremierLeague (@IPL) March 24, 2024 -
'స్మిత్‌ను ఎవరూ కొనరు.. అతడికి మాత్రం ఏకంగా రూ.20 కోట్లు'
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది.ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో 77 స్ధానాలకు గానూ మొత్తంగా 330 ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. భారత్ నుంచి 214 ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ వేలంలో నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గం, ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ జోస్యం చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ మిచిల్ స్టార్క్ మాత్రం భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వేలంలో స్టీవ్ స్మిత్‌ను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. కానీ మిచిల్ స్టార్క్‌పై మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అత్యధిక ధర కలిగి ఉన్న శామ్ కుర్రాన్(రూ.18.50) రికార్డును స్టార్క్ బ్రేక్ చేస్తాడు. స్టార్క్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2024 Auction Updates: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. జాక్‌పాట్ ఎవరికో? -
WC 2023: తిలక్ ఉండగా అతడిని ఎలా సెలక్ట్ చేస్తారు: ఆసీస్ మాజీ క్రికెటర్
ICC ODI WC 2023: Ex-Australia cricketer names ‘lucky’ Suryakumar's replacement: టీమిండియా ప్రపంచకప్-2023 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను ఎలా ఎంపిక చేశారని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ ప్రశ్నించాడు. అతడికి బదులు హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మను సెలక్ట్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. కేవలం అదృష్టం కారణంగానే సూర్య వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడని పేర్కొన్నాడు. 15 మంది సభ్యుల జట్టు భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే ప్రపంచకప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఆతిథ్య టీమిండియా సహా మొత్తంగా పది జట్లు ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 ప్రధాన జట్టులో భాగమైన తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణ.. ట్రావెలింగ్ రిజర్వ్ సంజూ శాంసన్‌ను మినహాయించి మిగతా వాళ్లందరినీ మెగా ఈవెంట్‌కు సెలక్ట్ చేసింది. టీ20లలో నంబర్ 1 అయినప్పటికీ.. వన్డేల్లో పేలవ రికార్డు ఉన్న ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపిక విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. తిలక్ ఉండగా సూర్యను ఎలా సెలక్ట్ చేస్తారు? మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా ఇషాన్ కిషన్ రూపంలో ఆప్షన్లు ఉన్నప్పటికీ అతడికి అవకాశం ఇవ్వడం ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మిడిలార్డర్లో తిలక్ వర్మ రూపంలో లెఫ్టాండ్ బ్యాటింగ్ స్పెషలిస్టు, పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్‌కు ఈ జట్టులో చోటు దక్కిందంటే అది అతడి అదృష్టమనే చెప్పాలి. ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడని మనం అనుకోవచ్చు. అయినా... జట్టులో ఇద్దరు లెఫ్టాండర్లు ఉంటే వారి సేవలను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందే తప్ప నష్టం లేదు. ఫ్లెక్సిబిలిటీ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో మాట్లాడుతూ ఉంటాడు కదా! కాబట్టి నా అభిప్రాయం సరైందే అనుకుంటున్నా’’ అని టామ్ మూడీ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. దేశవాళీ వన్డేల్లో అదరగొట్టిన తిలక్ కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్(173 పరుగులతో టాప్ స్కోరర్)తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తిలక్ వర్మ.. వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడి దేశవాళీ వన్డే రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లలో 5 శతకాలు, 5 హాఫ్ సెంచరీలతో 1236 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో.. ఎడమచేతి వాటం గల బ్యాటర్ కావడం తిలక్‌కు ఉన్న అదనపు అర్హత అని పేర్కొంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అతడికి ఆసియా కప్ జట్టులో చోటిచ్చినట్లు తెలిపాడు. కానీ.. ఐసీసీ టోర్నీలో మాత్రం ఈ యువ సంచలనానికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ వన్డేల్లో సూర్య పేలవ రికార్డు ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 26 వన్డేలు ఆడిన సూర్యకుమార్ యాదవ్ రెండు అర్ధ శతకాల సాయంతో 511 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 64. ఇక ఐపీఎల్లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు సూర్య, తిలక్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! -
అతడు లేకపోవడమే ఆర్సీబీకీ ఈ పరిస్ధితి.. ఉండింటేనా
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ గ్రూపు దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ఆర్సీబీ సరిపెట్టుకుంది. అయితే ఈ సీజన్ ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మినహా మిగితా బ్యాటరంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో జట్టు బ్యాటింగ్ బాధ్యతను వీరిముగ్గురూ తమ భుజాలపై వేసుకున్నారు. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ మిడిలార్డర్ వైఫల్యంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ కీలక వాఖ్యలు చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ లేకపోవడమే బెంగళూరుకు ఈ పరిస్థితి ఏర్పడందని మూడీ తెలిపాడు. కాగా ఈ ఐపీఎల్ 16వ సీజన్‌కు గాయం కారణంగా రజిత్ పాటిదార్ దూరమయ్యాడు. "ఆర్సీబీలో పటిదార్ లేని లోటు సృష్టంగా కన్పించింది. అతడు మూడో స్థానంలో అద్భుతమైన ఆటగాడు. అతడు జట్టులో లేకపోవడం విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్‌వెల్‌లపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ ఈ ముగ్గురు అంత ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడారు. అదే విధంగా మిడిలార్డర్లో మాత్రమే కాకుండా ఫినిషింగ్‌లో కూడా సరైన ఆటగాళ్లు కన్పించలేదు. గత సీజన్లో ఫినిషర్‌గా అదరగొట్టిన దినేష్ కార్తీక్.. ఈ ఏడాది మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఛాంపియన్స్‌గా నిలవాలంటే ఒకరిద్దరు ఆడితే సరిపోదు. ఏ జట్టు అయితే సమిష్టిగా రాణిస్తుందో అందే విజేతగా నిలుస్తుంది. ఈ సీజన్ ఆర్సీబీకి ఒక గుణపాఠం అవుతుంది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కచ్చితంగా తమ జట్టులో కొన్ని మార్పులు చేయాలని" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు -
'సూర్యను చూస్తుంటే సర్ వివియన్ రిచర్డ్స్ గుర్తొస్తున్నాడు'
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రశంసల వర్షం కురింపిచాడు. వెస్టిండీస్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్‌తో సూర్యను పోల్చాడు. కాగా సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదేవిధంగా టీ20ల్లో వరల్డ్ నెం1 బ్యాటర్‌గా సూర్య కొనసాగుతున్నాడు. ఇటీవలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో సూర్య చెలరేగాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్న సూర్యకు టెస్టు జట్టులో కూడా చోటు దక్కింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఈ ముంబైకర్ భారత సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టాక్‌తో మూడీ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే విధానం అద్భుతమైనది. నేను క్రికెట్ ఆడే తొలి రోజుల్లో సర్ వివియన్ రిచర్డ్స్ కూడా సూర్యలానే బ్యాటింగ్ చేసేవాడు. ప్రస్తుతం సూర్యను చూస్తుంటే మళ్లీ నాకు రిచర్డ్స్ గుర్తొస్తున్నాడు. అతడకి ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉంది" అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL 3rd ODI: పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు -
IPL 2023: అతడు పూర్తిగా విఫలం.. 14 కోట్లు ఖర్చుపెట్టడం అంటే!
IPL 2023 Mini Auction - Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబరు 23న ఆక్షన్ నిర్వహించనున్న నేపథ్యంలో తమతో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇందుకు మంగళవారం (నవంబరు 15) ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ హెడ్‌కోచ్ టామ్ మూడీ.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘మెగా వేలానికి ముందు కేన్ విలియమ్సన్ వంటి సమర్థుడైన ఆటగాడిని 14 కోట్ల రూపాయలకు జట్టు రిటైన్ చేసుకుందంటే.. యాజమాన్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే ఈ పని చేసిందని అర్థం. అయితే, గత నాలుగు నెలలుగా టీ20 క్రికెట్లో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తను గొప్ప నాయకుడు అని తెలుసు. ఆటలో తన శక్తిసామర్థ్యాల గురించి కూడా మాకు తెలుసు. కెప్టెన్‌గా ఐపీఎల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అతడికి మంచి గుర్తింపు ఉంది. 14 కోట్లు అంటే చాలా ఎక్కువ అందుకే కేన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఒకవేళ అతడిని ఫ్రాంఛైజీ రిలీజ్ చేసినా చేయకపోయినా.. నా దృష్టిలో ఒక ఆటగాడి మీద 14 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టామ్ మూడీకి గుడ్ బై చెప్పిన ఎస్ఆర్ హెచ్.. విండీస్ లెజెండ్ బ్రియన్ లారాను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా.. కెప్టెన్‌గా కేన్ విఫలం ఇదిలా ఉంటే.. గత సీజన్లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక గత టీ20 వరల్డ్‌కప్‌లో కేన్ బృందం రన్నరప్‌గా నిలవగా.. ఈసారి సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గానూ కేన్ ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: IPL 2023: వేలంలో స్టోక్స్, సామ్ కర్రన్.. రికార్డు ధర ఖాయం..! IPL 2023: కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. మరో ఇద్దరు ఔట్ -
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే : సునీల్ గవాస్కర్
టీ20 ప్రపంచకప్-2022లో ప్రస్తుతం క్వాలిఫియర్స్(రౌండ్-1) మ్యాచ్‌లు జరగుతున్నాయి. తొలి మ్యాచ్ నుంచే ఈ మెగా ఈవెంట్లో సంచలనాలు నమోదయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆసియాకప్ విజేత శ్రీలంకను పసికూన నమీబియా మట్టి కరిపించగా.. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ చిత్తు చేసింది. ఇక సూపర్-12 రౌండ్ ఆక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022కు ఫైనల్‌కు చేరే రెండు జట్లను భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా లెజెండ్ టామ్ మూడీ అంచనా వేశారు. టీమిండియా, ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుతాయి" అని గవస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అదే విధంగా టామ్ మూడీ మాట్లాడుతూ.. టాప్-4లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, టీమిండియా నిలుస్తాయి. అయితే ఫైనల్లో మాత్రం భారత్, ఆస్ట్రేలియా జట్లు అడుగు పెడతాయి అని తెలిపాడు. చదవండి: T20 WC 2022: సహనం కోల్పోయిన షాదాబ్ ఖాన్.. 'కెప్టెన్‌గా పనికిరావు' -
IPL- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. ఇకపై..
Indian Premier League- Sunrisers Hyderabad: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీని తప్పించింది. అతడి స్ధానంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఎస్ఆర్హెచ్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్హెచ్ శనివారం ప్రకటించింది. కాగా బ్రియాన్ లారా ప్రస్తుతం సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ లారాతో ఒప్పందం కుదుర్చకుంది. "క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే ఐపీఎల్ సీజన్లకు మా జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు" అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. 🚨Announcement 🚨 The cricketing legend Brian Lara will be our head coach for the upcoming #IPL seasons. 🧡#OrangeArmy pic.twitter.com/6dSV3y2XU2 — SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022 కాగా ఈ ఏడాది ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్..కేవలం 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక టామ్ మూడీ విషయానికి వస్తే... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త టీ20 లీగ్‌లో పాల్గొనున్న డెసర్ట్ వైపర్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. As his term with us draws to an end, we would like thank Tom for his contributions to SRH. It has been a much cherished journey over the years, and we wish him the very best for future endeavours. pic.twitter.com/aGKmNuZmq8 — SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022 చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్.. -
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..!
వరుస ఓటముల బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ కుడి చేతికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండా ఫీల్డ్‌ను విడిచి వెళ్లాడు. ఇక ఇదే విషయాన్ని ఎస్ఆర్హెచ్ హెడ్‌కోచ్ టామ్ మూడీ ధృవీకరించాడు. కాగా అంతకుముందు ఈ సీజన్లో చేతి వేలు గాయం కారణంగా సుందర్ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మళ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుందర్ తిరిగి వచ్చాడు. "దురదృష్టవశాత్తూ.. మళ్లీ సుందర్ కుడి చేతికి గాయమైంది. అతడు ప్రస్తుతం బౌలింగ్ చేసే స్థితిలో లేడు. అయితే అతడికి బ్యాండేజ్ వేసే అంత గాయం కాలేదు. మా తదపరి మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అతడు దూరమైతే.. అది మా జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అతడు మా జట్టులో కీలక బౌలర్లలో ఒకడని" టామ్ మూడీ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: జడేజాకు ముందే తెలుసు.. అయినా ప్రతీదీ విడమరిచి చెప్పలేం కదా! ధోని ఘాటు వ్యాఖ్యలు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సన్‌రైజర్స్‌కు భారీ షాక్!
IPL 2022 Sunrisers Hyderabad: వరుస విజయాలతో ఆనందంలో ముగినిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. కాగా ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా గుజరాత్ స్కోరును కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, అప్పటికే చేతికి గాయమైన కారణంగా సుందర్ తన బౌలింగ్ కోటా పూర్తిచేయలేకపోయాడు. ఇక ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్‌కు గాయం తీవ్రతరమైనందున జట్టుకు దూరం కానున్నాడు. ఈ విషయం గురించి.. సన్‌రైజర్స్ హెడ్‌కోచ్ టామ్ మూడీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... ‘‘వాషింగ్టన్ కుడి చేతి బ్రొటన వేలు, మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది. రాబోయే రెండు మూడు రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. అతడు కోలుకోవడానికి ఓ వారం రోజులు పట్టవచ్చు’’ అని తెలిపాడు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలుపుతో ఐపీఎల్-2022లో బోణీ కొట్టిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయం అందుకుంది. సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు గుజరాత్ టైటాన్స్- 162/7 (20) సన్‌రైజర్స్ హైదాబాద్- 168/2 (19.1) చదవండి: IPL 2022: కెప్టెన్‌వి అని అహంకారమా? నీకసలు ఆ అర్హతే లేదు! మరీ ఇంత అతి పనికిరాదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
IPL 2022- SRH: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే
ఐపీఎల్-2022 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. అదే విధంగా ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ ఫ్రాంఛైజీకి సంబంధించిన కొత్త సిబ్బంది వివరాలను ట్విటర్ వేదికగా వీడియో రూపంలో వెల్లడించింది. ఇక ఎస్ఆర్హెచ్కు తొలి టైటిల్ అందించిన హెడ్‌కోచ్ టామ్ మూడీని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా తమతో ప్రయాణం కొనసాగిస్తారని పేర్కొంది. అదే విధంగా ప్రొటిస్ లెజండ్ డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నట్లు సన్‌రైజర్స్ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్ -2022: సన్‌రైజర్స్ సిబ్బంది హెడ్‌కోచ్- టామ్ మూడీ అసిస్టెంట్ కోచ్- సైమన్ కటిచ్ బ్యాటింగ్ కోచ్- బ్రియన్ లారా ఫాస్ట్ బౌలింగ్ కోచ్- డేల్ స్టెయిన్ స్పిన్ బౌలింగ్ కోచ్- ముత్తయ్య మురళీధరన్ ఫీల్డింగ్ కోచ్, స్కౌట్- హేమంగ్ బదాని Introducing the new management/support staff of SRH for #IPL2022! Orange Army, we are #ReadyToRise! 🧡@BrianLara #MuttiahMuralitharan @TomMoodyCricket @DaleSteyn62 #SimonKatich @hemangkbadani pic.twitter.com/Yhk17v5tb5 — SunRisers Hyderabad (@SunRisers) December 23, 2021 -
Boxing Championship: కోచ్‌లుగా దేవేంద్రో సింగ్, సురంజయ్ సింగ్
Boxing Championship: భారత మాజీ బాక్సర్లు దేవేంద్రో సింగ్, సురంజయ్ సింగ్ కోచ్‌లుగా మారారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు నిర్వహించే శిక్షణ శిబిరం కోసం ఎంపిక చేసిన 14 మంది కోచ్‌లలో దేవేంద్రో, సురంజయ్లకు స్థానం లభించింది. 35 ఏళ్ల సురంజయ్ 2009 ఆసియా చాంపియన్షిష్, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గాడు. 29 ఏళ్ల దేవేంద్రో 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచాడు. టీమిండియా కోచ్ రేసులో టామ్ మూడీ! భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ఆ్రస్టేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ ఆసక్తి కనబరుస్తున్నాడు. . ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు డైరెక్టర్‌గా మూడీ ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం వచ్చే నెలలో ముగిసే టి20 ప్రపంచకప్ అనంతరం ముగుస్తుంది. దాంతో కోచ్ పదవి కోసం మూడీ దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ -
Team India head Coach: రవిశాస్త్రి స్థానంలో ఆయనా?!
Tom Moody eyeing to replace Ravi Shastri?: టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబోయే కోచ్‌లుగా అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా... మరో కొత్త పేరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ డైరెక్టర్ టామ్ మూడీ భారత జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ దిశగా ఎస్ఆర్హెచ్ పెద్దలు పావులు కదుపుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘‘సన్‌రైజర్స్ వరుస వైఫల్యాల నేపథ్యంలో డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ప్లేయర్ల పట్ల కఠిన వైఖరి అవలంబించడం సహా.. యువ ఆటగాళ్లతో జట్టును నింపాలని గట్టిగా వాదించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టామ్ మూడీ.. టీమిండియా కోచ్‌గా వస్తే మెరుగైన ఫలితాలు తీసుకురాగలడు’’అని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై ప్రభావం చూపగల ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ పెద్దలు అధికారుల వద్ద ప్రస్తావించినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది బీసీసీఐ ప్రకటన తర్వాతే తేలుతుంది. కాగా తొలి టైటిల్(2016) సాధించిపెట్టిన వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం సహా తుది జట్టు నుంచి కూడా ఫ్రాంఛైజీ అతడిని తప్పించిన సంగతి తెలిసిందే. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌ను సారథిగా నియమించారు. ఈ నిర్ణయాల వెనుక టామ్ మూడీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పలు మార్పులు చేసినప్పటికీ హైదరాబాద్ ఈ సీజన్లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లలో కేవలం 3 మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఇక గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ తదితర విదేశీ కోచ్‌లు టీమిండియాకు శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు! -
వార్నర్‌కు ఏమీ అర్థం కాలేదు: టామ్ మూడీ
ఢిల్లీ: కెప్టెన్సీ పదవి నుంచి తప్పిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై డేవిడ్ వార్నర్ షాక్‌కు గురయ్యాడని ఆ జట్టు క్రికెట్ డైరక్టర్ టామ్ మూడీ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వార్నర్ ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాడన్నాడు. అతని ముఖంలో చాలా నిరాశ, అసంతృప్తి కనిపించిందని మూడీ తెలిపాడు. ‘ వార్నర్ మంచి క్రికెటర్.. కెప్టెన్ కూడా. అటువంటప్పుడు మేనేజ్మెంట్ నిర్ణయం షాక్ గురిచేస్తోంది. టీమ్‌గా గాడిలో పడటానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం తప్పితే వేరే మార్గం కనిపించలేదు. వార్నర్‌కు ఉద్వాసన చెప్పడంతో అతనికి ఏమీ అర్థం కాలేదు. మాకున్న ప్రస్తుత విదేశీ ఆటగాళ్ల పరిమితిని బట్టి వార్నర్‌పై వేటు పడింది. బెయిర్ స్టో, విలియమ్సన్, రషీద్ ఖాన్, ఒక ఆల్‌రౌండర్ ఉండాలనేది మేనేజ్మెంట్ నిర్ణయం. బాగా ఎక్కువగా ఆలోచించిన తర్వాతే వార్నర్‌పై వేటు పడింది. విలియమ్సన్, బెయిర్‌స్టోల ఫామ్ బాగుంది. దాంతో వారిని తప్పించే ఉద్దేశం లేదు. ఇక్కడ వార్నర్ ఒక్కడే ప్రత్యామ్నాయం. ఇది మొత్తం టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయమే. ఫ్రాంచైజీ కోణంలో చూసినా, జట్టుగా చూసినా ఈ లాజిక్‌ను వార్నర్ అర్థం చేసుకుంటాడు. జట్టు ప్రయోజనాల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకోక తప్పలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ చదవండి: మ్యాచ్ గెలవడం కోసం క్రీడాస్పూర్తిని పక్కనబెట్టారు వార్నర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వైరల్ -
వన్డే: తను బాగా ఆడినా, ఆడకపోయినా సరే!
కాన్బెర్రా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ ఎట్టకేలకు టీమిండియా తుది జట్టులో సంపాదించుకున్నాడు. తద్వారా భారత జట్టుకు ఆడాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మహ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసిన నటరాజన్.. అరంగేట్ర మ్యాచ్‌లో తొలుత లబుషేన్ వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును ఇరకాటంలోకి నెట్టాడు. కెప్టెన్ కోహ్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ఈ యార్కర్ల వీరుడు బౌలింగ్‌ను కొనసాగిస్తున్నాడు. కాగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న నటరాజ్ ప్రయాణంపై క్రికెట్ దిగ్గజాలు ఇయాన్ బిషప్, టామ్ మూడీ ప్రశంసలు కురిపించారు. ‘‘ఈరోజు తను బాగా ఆడినా, ఆడకపోయినా సరే.. టి. నటరాజన్.. మనసును హత్తుకునే కథ తనది’’ అంటూ ఇయాన్ బిషప్ కొనియాడగా.. ‘‘నేడు నటరాజన్ భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్ ఆడబోతున్నాడు. తన కల ఈరోజు నిజమైంది. అత్యుద్భుతమైన స్టోరీ నటరాజన్‌ది’’ అని టామ్ మూడీ కితాబిచ్చాడు. (చదవండి: ‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’) ఎవరీ నటరాజన్?! తమిళనాడులోని సేలం సమీపంలో గల చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. కనీసం పుస్తకాలు, పెన్సిళ్లు కూడా కొనుక్కోలేని దీనస్థితిని ఎదుర్కొన్నాడు. నటరాజన్ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు.(చదవండి: అదరగొట్టిన పాండ్యా, జడేజా; 300 దాటిన స్కోరు!) నటరాజన్ ఆసక్తిని గమనించిన జయప్రకాశ్ అనే వ్యక్తి అతడికి అండగా నిలబడ్డాడు. ఆయన ప్రోత్సాహంతోనే 2011లో తనకు టీఎన్‌సీఏ 4వ డివిజన్ క్రికెట్లో పాల్గొనే అవకాశం లభించిందని, ఆయనే తన గాడ్‌ఫాదర్ అని నటరాజన్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు. అంతేగాక ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మైదానంలో దిగిన ఈ యార్కర్ కింగ్ తన షర్టుపై జేపీ నట్టు అనే పేరును ముద్రించుకుని జయప్రకాశ్‌పై అభిమానం చాటుకున్నాడు. కాగా నటరాజన్ 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ల సలహాలు నటరాజన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. రూ. 3 కోట్లకు కొనుక్కున్న పంజాబ్.. కానీ! కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 2017లో నటరాజన్‌ను కొనుగోలు చేసింది. అక్షరాలా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. దీంతో పంజాబ్ అతడిని వదులుకుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ యాజమాన్యం 2018లో కేవలం 40 లక్షలు పెట్టి నటరాజన్‌ను కొనుక్కుంది. హైదరాబాద్ జట్టులో చేరిన తర్వాత రెండు సీజన్లపాటు బెంచ్‌కే పరిమితమైన నటరాజన్.. సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో 13 వికెట్లు(11 మ్యాచ్‌లు) తీసి మరోసారి సత్తా చాటాడు. దీంతో ఐపీఎల్-2020లో ఆడే అవకాశం లభించింది. ఇక సన్‌రైజర్స్ తరఫున ఆడిన నటరాజన్ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ సారథి కోహ్లి వికెట్ తీసి పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సీజన్లో మొత్తంగా 16వికెట్లు తీసి తనదైన ముద్రవేశాడు. ముఖ్యంగా ప్లేఆఫ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్‌ను అద్భుతమైన యార్కర్‌తో పెవిలియన్‌కు చేర్చిన తీరుపై ప్రశంసలు కురిశాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్.. ‘‘ఐపీఎల్లో నా హీరో నటరాజన్’’ అంటూ కితాబిచ్చాడు. అకాడమీ స్థాపించి! అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో చోటు సంపాదించుకున్న నటరాజన్ తమ గ్రామంలోనే తన మెంటార్‌తో కలిసి ఓ క్రికెట్ అకాడమీని స్థాపించాడు. తనకున్న వనరుల సాయంతో పేదరికంలో మగ్గుతున్న ఔత్సాహిక క్రికెటర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాడు. క్రికెటర్లు కావాలన్నవారి కలను నెరవేర్చుకునేందుకు తనవంతు సాయం అందిస్తున్నాడు. కాగా నటరాజన్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పవిత్ర నవంబరు 7న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అదే సమయంలో ఇక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైనట్లు సమాచారం అందడంతో పాప వల్లే తనకు అదృష్టం వచ్చిందంటూ అతడు మురిసిపోయాడు. ఇక ఇప్పుడు వన్డేల్లో అరంగేట్రం చేయడంతో అతడి సంతోషం రెట్టింపు అయ్యింది. However he does today good or otherwise, the T. Natarajan story is so heart warming and encouraging. #IndiaDebut. — Ian bishop (@irbishi) December 2, 2020 -
ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు..
సిడ్నీ: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ విజయాల్లో పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లలో కానీ బౌల్ట్ తనదైన పేస్‌తో చెలరేగిపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన క్వాలిఫయర్-1లో బౌల్ట్ ఆరంభంలోనే రెండు వికెట్లు సాధించి తన బౌలింగ్ వేడిని రుచి చూపించాడు. తొలి ఓవర్లోనే పృథ్వీ షా, అజింక్యా రహానేలను డకౌట్లుగా పంపి ఢిల్లీని కోలుకోని దెబ్బకొట్టాడు. కాగా, ఈ సీజన్లో బౌల్ట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయడం ఆ జట్టు చేసిన తప్పిదంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. (ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్!) ముంబైకు బౌల్ట్‌ను ఒక గిఫ్ట్‌గా ఢిల్లీ అప్పగించిందని విమర్శించాడు. ‘ అదొక అసాధారణమైన చర్య. ట్రేడింగ్ ద్వారా బౌల్ట్‌ను ముంబైకు వదిలేయడం సరైన నిర్ణయం కాదు. ప్రస్తుతం ముంబై జట్టులో బౌల్ట్ కీలక బౌలర్‌గా మారిపోయాడు. టోర్నమెంట్ యూఏఈలో జరుగుతుందని వారికి తెలియకపోవడంతోనే బౌల్ట్‌ను వదిలేసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా ముంబై దొరికిన ఒక గిఫ్ట్ బౌల్ట్. పవర్ ప్లేలో బౌల్ట్ ఒక అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. బలమైన జట్టుకు బౌల్ట్‌ను అప్పగించి తప్పుచేసింది ఢిల్లీ. ఒకవేళ ట్రేడింగ్ ద్వారా బౌల్ట్ ముంబైకు వెళ్లకపోతే అతని కోసం వేలంలో చాలా జట్లు పోటీ పడేవి. ఏది ఏమైనా బౌల్ట్‌ను వదిలేయడం ఢిల్లీ చేసిన అది పెద్ద తప్పు’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మూడీ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్ బౌల్ట్ జతకట్టాడు. ట్రేడింగ్ విండో విధానం ఐపీఎల్-2015 నుంచి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. (‘ఫినిషర్ అంటే అలా ఉండాలి’) -
‘ఫినిషర్ అంటే అలా ఉండాలి’
సిడ్నీ: క్రికెట్లో ఫినిషర్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేపేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. వరల్డ్ అత్యుత్తమ ఫినిషర్‌గా ధోని ఆడిన ఎన్నో ఇన్నింగ్స్‌లే అతన్ని బెస్ట్ ఫినిషర్‌ను చేశాయి. అయితే మరో అత్యుత్తమ ఫినిషర్ భారత క్రికెట్ జట్టులోనే ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అంటున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ సాధించిన తర్వాత హార్దిక్ పాండ్యాపై మూడీ ప్రశంసలు కురిపించాడు. 14 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సాధించి మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే హార్దిక్ మార్చేశాడని మూడీ కొనియాడాడు. ఆ ఇన్నింగ్స్‌లో హార్దిక్ ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా ఐదు సిక్సర్లు సాధించడాన్ని మూడీ ప్రస్తావించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మూడీ..‘ హార్దిక్ లాంటి ఫినిషర్లను చాలా అరుదుగా చూస్తాం. ఫినిషర్ అంటే అలా ఉండాలి. ముంబై 170-175 పరుగులు చేస్తుందనే దశ నుంచి రెండొందలకు తీసుకెళ్లాడు. ప్రతీ ఒక్కరూ ఆ తరహా ఫినిషింగ్ ఇవ్వాలని అనుకుంటారు. హార్దిక్ పాండ్యా ఆటతో మ్యాచ్ అప్పుడే వారి వశమై పోయింది. ఆ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది హార్దిక్ ఆడిన ఇన్నింగ్సే’ అని మూడీ పేర్కొన్నాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తుది బెర్తును ఖరారు చేసుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని ఏదశలోనూ తేరుకోనివ్వని ముంబై తనమార్కు ఆట తీరుతో చెలరేగిపోయింది. హార్దిక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 201 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. -
నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ సీఎస్కే: మూడీ
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌లే టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్లని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెట్లో తాను చూసిన అత్యుత్తమ ఓపెనర్లు ఎవరైనా ఉన్నారంటే వార్నర్, రోహిత్లేనని మూడీ తెలిపాడు. టీ20 క్రికెట్లో బెస్ట్ ఓపెనర్లు ఎవరని ట్వీటర్లో మూడీని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రోహిత్, వార్నర్‌ల పేర్లు ఎంచుకున్నాడు మూడీ. ఇది నిజంగా కష్టమైన ప్రశ్న అయినప్పటికీ ఆ ఇద్దరే తాను చూసిన ఉత్తమ ఓపెనర్లన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు వన్డేలు మాత్రమే ఆడిన శుబ్‌మన్ గిల్ మోస్ట్ ఎమెర్జింగ్ ప్లేయర్ అని మూడీ తెలిపాడు.(‘నేను కెప్టెన్ ఎందుకు కాకూడదు’) ఇక మీ ఫేవరెట్ టీమిండియా క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించగా విరాట్ కోహ్లి అని సమాధానమిచ్చాడు. ఎంఎస్ ధోనిని బెస్ట్ కెప్టెన్‌గా ఎంచుకున్నాడు మూడీ. అదే సమయంలో తన ఫేవరెట్ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)అని మూడీ పేర్కొన్నాడు. ఐపీఎల్లో మంచి రికార్డు ఉన్న సీఎస్కే తన ఫేవరెట్ టీమ్ అని తెలిపాడు. భారత ఫీల్డర్ల విషయాని కొస్తే రవీంద్ర జడేజా అత్యుత్తమం అని మూడీ మనసులోని మాటను వెల్లడించాడు. బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్స్ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు మూడీ ఓటేశాడు. ట్వీటర్లో క్వశ్చన్ అండ్ అన్సర్స్ సెషన్స్‌లో పాల్గొన్న మూడీ.. యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానమిచ్చాడు. (కోహ్లిని వద్దన్న ధోని..!) -
అతని వల్లే ఓడాం: టామ్ మూడీ
ముంబై: ఐపీఎల్-11 సీజన్ ఫైనల్లో తమ ఓటమికి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సనే కారణమని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మూడీ మాట్లాడుతూ.. ‘వాట్సన్ ఇన్నింగ్స్ ప్రత్యేకం. మేం పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాం. కానీ తన ప్రత్యేకమైన ఆటతో మా విజయాన్నిలాగేసుకున్నాడు. ఈ సీజన్ అద్భుతంగా సాగింది. మేం ఇంట (హోం గ్రౌండ్), బయట అద్భుతంగా రాణించాం. కొన్ని మ్యాచ్‌లు ఓడినప్పటికి టోర్నీలో మాపై అంతగా ప్రభావం చూపలేదు. కేన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తనలోని మూడు కోణాలను ప్రపంచానికి చాటి చెప్పాడు. రషీద్ గొప్ప క్రికెటర్. భారత అభిమానులు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అతని మాయలో పడిపోయింది. బౌలింగ్‌లోనే కాదు.. మైదానంలోని అతని కమిట్మెంట్ చాలా గొప్పది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో షేన్ వాట్సన్ అద్భుత సెంచరీతో చెన్నై టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. -
‘అతను ఐపీఎల్‌ను శాసించే ఆటగాడు’
మొహాలి : అఫ్గాన్ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సీజన్ ఐపీఎల్లో అత్యంత ప్రభావం చూపే ఆటగాడని ఆ జట్టు కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్.. రషీద్ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తాడు. ‘రషీద్ స్థిరత్వం కలిగిన ఆటగాడు. గత సీజన్లో అతను మాతో కలిసి విజయవంతంగా రాణించాడు. అతని బలం రోజు రోజుకి.. టోర్నీటోర్నీకి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని టోర్నీల్లో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే తన దేశం తరపున కూడా ఇరగదీస్తున్నాడు. మా గేమ్ ప్రణాళికలో అతను అత్యంత ముఖ్యమైన బౌలర్. మా ప్రణాళిక దగ్గట్టు వికెట్లు తీయడంలో అతను దిట్టా.’ అని ఈ యవక్రికెటర్ని ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు కొనియాడాడు. ఇక విలియమ్సన్ కెప్టెన్సీపై స్పందిస్తూ.. ‘కేన్ విలియమ్సన్ అనుభవంగల సారథి. అతను అంతర్జాతీయ జట్టుకు సారథ్యం వహించాడు. అతనికి నాయకత్వంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడం తెలుసు. తొలుత కెప్టెన్‌కు తన వ్యక్తిత్వం, బలాలపై నమ్మకం ఉండాలి. విలియమ్సన్ అలానే కొనసాగుతున్నాడు. మేం కూడా అతన్ని ఆ విధంగానే ప్రోత్సహిస్తున్నామని’ టామ్ మూడీ తెలిపాడు. 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రషీద్‌ఖాన్ అనతి కాలంలోనే ప్రపంచ అత్యత్తుమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఐసీసీ టీ20, వన్డే ర్యాంకుల్లో తొలి స్థానాన్ని సాధించాడు. 2019 ప్రపంచకప్ టోర్నీకి అఫ్గనిస్తాన్ అర్హత సాధించడంలో సారథిగా కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు.. తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈసీజన్లో వరుస విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. -
‘వార్నర్ లేకున్నా నష్టం లేదు’
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో 2014 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2016లో కెప్టెన్‌గా జట్టును గెలిపించడంలో కూడా కీలక పాత్ర పోషించిన వార్నర్... ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధం కారణంగా ఈసారి జట్టుకు దూరమయ్యాడు. అయితే వార్నర్ లేకపోవడాన్ని తాము లోటుగా భావించడం లేదని రైజర్స్ కోచ్ టామ్ మూడీ స్పష్టం చేశారు. అతను గొప్ప బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదని, అయితే ఆ స్థానంలో వచ్చే ఆటగాడు కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వగలడని తాము నమ్మతున్నట్లు మూడీ వ్యాఖ్యానించారు. ‘కారణాలు ఏమైనా వార్నర్ టీమ్‌లో లేడనే వాస్తవాన్ని గుర్తించాలి. ఇది టీమ్ గేమ్. ఎవరో ఒక ఆటగాడిపై ఆధారపడి ఫలితం ఉండదు. ఇదంతా సమష్టి కృషి. వార్నర్ స్థానంలో అవకాశం దక్కితే సత్తా చాటేందుకు ఎంతో మంది ఆటగాళ్లు మా జట్టులో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా దృష్టిలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరిచే ఉంటుంది’ అని మూడీ అభిప్రాయపడ్డారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో గురువారం రైజర్స్ జట్టు పరిచయ కార్యక్రమం జరిగింది. ఇందులో కోచ్ మూడీ, మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ మీడియాతో జట్టు విజయావకాశాల గురించి మాట్లాడారు. బ్యాటింగ్ పరంగానే కాకుండా విలియమ్సన్ ఉండటంతో తమ టీమ్ కెప్టెన్సీ గురించి కూడా అసలేమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకపోయిందని మూడీ చెప్పారు. ‘వార్నర్ ఆసీస్‌కు వైస్ కెప్టెన్ అయితే విలియమ్సన్ మరో జాతీయ జట్టుకు కెప్టెన్ అనే విషయం మరచిపోవద్దు. పైగా కివీస్ ఆటగాళ్లు ఎంత క్రీడాస్ఫూర్తితో ఆడతారో ప్రపంచానికి తెలుసు. అలాంటి జట్టును అతను నడిపిస్తున్నాడు. నాకు కేన్ నాయకత్వ పటిమ గురించి బాగా తెలుసు. కెప్టెన్‌గా లేకపోయినా గతంలోనూ జట్టు కీలక సూచనలు చేసేవాడు. కాబట్టి అతనిపై మాకు నమ్మకముంది. కాబట్టి ఈ దశలో వార్నర్ గురించి ఆలోచించడం అనవసరం’ అని మూడీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ కావడంతో పాటు కుడిచేతి వాటం ఓపెనర్ కావడం వల్లే అలెక్స్ హేల్స్‌ను ఎంచుకున్నట్లు మూడీ వెల్లడించారు. వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... ‘వేలంలో మా వ్యూహం ప్రకారం చాలా వరకు ఆశించిన జట్టునే ఎంపిక చేసుకోగలగడం అదృష్టం. 2–3 సీజన్లుగా సమస్యగా ఉన్న మిడిలార్డర్‌ను ఈసారి పటిష్టపరిచాం. స్థాయికి తగినట్లుగా ఆడితే మేం మరోసారి టైటిల్ సాధించగలం’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తమ జట్టులోని ఇద్దరు ప్రధాన స్పిన్నర్లలో షకీబ్‌ను పరుగులు నియంత్రించేందుకు, రషీద్‌ను ప్రధానంగా వికెట్లు పడగొట్టేందుకు వాడుకుంటామని బౌలింగ్ కోచ్ మురళీధరన్ తమ వ్యూహాన్ని వివరించారు. -
భారత్ కొత్త కోచ్ ఈయనేనా?
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య వచ్చిన మనస్పర్ధలు టామ్ మూడీకి లాభం చేకూర్చుతాయా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. టీమిండియా కోచ్‌కు అప్లికేషన్లు స్వీకరించడం బుధవారంతో ముగిసింది. భారత్ మాజీ క్రికెటర్లు చాలా మంది కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. దరఖాస్తు చేసుకున్న హై ప్రొఫైల్ వ్యక్తుల్లో టామ్ మూడి ఒకరని తెలిసింది. కొత్త కోచ్ ఎంపిక విషయంపై మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి టామ్ మూడీకి చాన్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. గతంలో కూడ మూడీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కోచ్ పదవికి చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మూడీ గతంలో శ్రీలంకకు కోచ్ వ్యవహరించారని ఆయనకు భారత్ క్రికెట్ పరిస్ధితులపై మంచి అవగాహన ఉందని అన్నారు. -
ఐపీఎల్- ప్లేఆఫ్స్: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ
- గాయంతో నెహ్రా ఔట్.. యూవీ ఫిట్‌నెస్‌పై డౌట్స్ - హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్‌పైనే అదనపు భారం.. బెంగళూరు: ప్లేఆఫ్స్ ముంగిట ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురు‘దెబ్బ’! పేస్ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న వెటరన్ బౌలర్ ఆశిశ్ నెహ్రా ఇకపై జట్టుకు దూరం కానున్నాడు. అటు, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫిట్నెస్పైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రా నిష్క్రమణను అధికారికంగా ప్రకటించారు. ప్లేఆఫ్ బెర్త్ కోసం గుజరాత్ లయన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ నెహ్రా స్టాండ్స్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ సిరాజ్ సత్తా చాటడం, ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న సంగతి తెలిసిందే. నెహ్రా గైర్హాజరీతో సన్‌రైజర్స్ ఆడబోయే అన్ని ప్లేఆఫ్ మ్యాచ్‌లలో సిరాజ్‌కు స్థానం ఖాయమైనట్లే. అయితే ఈ యువ బౌలర్ అదనపు భారాన్ని సునాయాసంగా మోయగడా? లేదా? లైవ్‌లో చూడాల్సిందే! నేడు యూవీకి పరీక్షలు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా యువీ చిటికెన వేలికి తీవ్రగాయం కావడం, దాంతో గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అతను ఆడలేకపోవడం తెలిసిందే. బుధవారం యువీ ఫిట్నెస్ పరీక్షల్ని ఎదుర్కొంటాడని, ఫిట్‌గా ఉన్నట్లు తేలితే తుది జట్టులో ఖచ్చితంగా ఆడతాడని కోచ్ టామ్ మూడీ చెప్పారు. ప్లే ఆఫ్స్‌లో భాగంగా హైదరాబాద్ జట్టు.. 17న(బుధవారం) బెంగళూరు వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.