వార్నర్- టామ్ మూడీ(PC: IPL/BCCI)
Tom Moody eyeing to replace Ravi Shastri?: టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబోయే కోచ్‌లుగా అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా... మరో కొత్త పేరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ డైరెక్టర్ టామ్ మూడీ భారత జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ దిశగా ఎస్‌ఆర్‌హెచ్ పెద్దలు పావులు కదుపుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
‘‘సన్‌రైజర్స్ వరుస వైఫల్యాల నేపథ్యంలో డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ప్లేయర్ల పట్ల కఠిన వైఖరి అవలంబించడం సహా.. యువ ఆటగాళ్లతో జట్టును నింపాలని గట్టిగా వాదించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టామ్ మూడీ.. టీమిండియా కోచ్‌గా వస్తే మెరుగైన ఫలితాలు తీసుకురాగలడు’’అని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై ప్రభావం చూపగల ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ పెద్దలు అధికారుల వద్ద ప్రస్తావించినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది బీసీసీఐ ప్రకటన తర్వాతే తేలుతుంది.
కాగా తొలి టైటిల్(2016) సాధించిపెట్టిన వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం సహా తుది జట్టు నుంచి కూడా ఫ్రాంఛైజీ అతడిని తప్పించిన సంగతి తెలిసిందే. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌ను సారథిగా నియమించారు. ఈ నిర్ణయాల వెనుక టామ్ మూడీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పలు మార్పులు చేసినప్పటికీ హైదరాబాద్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
14 మ్యాచ్‌లలో కేవలం 3 మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఇక గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ తదితర విదేశీ కోచ్‌లు టీమిండియాకు శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు!
Comments
Please login to add a commentAdd a comment