టీమిండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అతని కోచింగ్ బృందంలోని సభ్యులను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ బృందంలో ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నాడు. ఒకవేళ ద్రవిడ్‌తో పాటు అతని సహాయ బృందం మొత్తం తప్పుకుంటే.. బీసీసీఐ కొత్త కోచింగ్ టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన సపోర్టింగ్ స్టాఫ్ ఎంచుకునే విషయంలో గంభీర్ పూర్తి స్వేచ్చను ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా గంభీరే రోడ్స్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. గంభీర్, రోడ్స్ 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు సేవలందించారు. గంభీర్ మెంటార్, రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా లక్నో ఫ్రాంచైజీకి పని చేశారు.
కోచ్‌గా తొలిసారి..
గంభీర్ భారత ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే ఇదే అతనికి హెడ్ కోచ్‌గా మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment