ముస్తఫిజుర్ ఆడతాడు! | Mustafizur Rahman may be play for Sunrisers Hyderabad in IPL 2017 | Sakshi
Sakshi News home page

ముస్తఫిజుర్ ఆడతాడు!

Published Sun, Apr 2 2017 7:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

ముస్తఫిజుర్ ఆడతాడు!

ముస్తఫిజుర్ ఆడతాడు!

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌ ఐపీఎల్‌-10లో ఆడే అవకాశం ఉందని కోచ్‌ టామ్ మూడీ అన్నారు. ముస్తఫిజుర్ రహమాన్ పూర్తిగా దూరమైనట్లు వస్తున్న వార్తలపై తమకు స్పష్టత లేదన్నారు. గత ఏడాది రైజర్స్ జట్టు చాంపియన్‌గా నిలవడంతో ముస్తఫిజుర్ కీలక పాత్ర పోషించాడు. శుక్రవారంలోగా అతను జట్టుతో చేరే అవకాశం ఉందని మూడీ వెల్లడించారు. " మాకున్న సమాచారం ప్రకారం ఈ నెల 7న ముస్తఫిజుర్‌ రావాలి. అతను రావడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి అతను ఐపీఎల్‌లో ఆడతాడనే భావిస్తున్నాం" అని మూడీ చెప్పారు.

డిఫెండింగ్ చాంపియన్‌గా తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని, గత ఏడాది విజయం ముగిసిన అధ్యాయమని కోచ్‌ చెప్పారు. కెప్టెన్ డేవిడ్‌ వార్నర్ వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని, ఆస్ట్రేలియా నుంచి సరైన సమయంలో తిరిగొస్తాడని చెప్పిన మూడీ... శిఖర్ ధావన్‌ ఫామ్‌పై కూడా తాము ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు ఆప్ఘన్ ఆటగాళ్లు నబీ, రషీద్ తమ జట్టుకు అదనపు బలంగా భావిస్తున్నట్లు ఈ ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు సన్‌రైజర్స్ ఆటగాళ్లు క్రిస్ జోర్డాన్, బెన్ లాఫ్‌లిన్‌ ఈ సీజన్‌లో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement