mustafizur Rahman
-
'ఆరే'సిన ముస్తాఫిజుర్.. పరువు కాపాడుకున్న బంగ్లాదేశ్.. అయినా..!
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ఆఖరి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పసికూన చేతిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య యూఎస్ఏ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. హ్యూస్టన్ వేదికగా నిన్న (మే 25) జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ ధాటికి కకావికలమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ హసన్, సౌమ్య సర్కార్ చెలరేగడంతో వికెట్ కూడా నష్టపోకుండానే విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్‌లో ఓడినా యూఎస్ఏ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రారంభానికి ముందు ఒకానొక ఆతిథ్య దేశమైన యూఎస్ఏకు ఇది బూస్టప్ సిరీస్ విజయం కాగా.. ఐసీసీ రెగ్యులర్ సభ్యదేశమైన బంగ్లాదేశ్‌కు ఈ సిరీస్ ఓటమి విషాదాన్ని మిగిల్చింది.ఆరేసిన ఫిజ్..ఈ మ్యాచ్‌లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి యూఎస్ఏ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. ఫిజ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫిజ్‌కు టీ20ల్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఇతను వన్డేల్లో భారత్‌పై ఆరు వికెట్ల ప్రదర్శన (6/43) నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున తొలి ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ ఫిజ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన ఆరో బౌలర్‌గా (అజంత మెండిస్ (2), దీపక్ చాహర్, యుజ్వేంద్ర చహల్, ఓబెద్ మెక్కాయ్, అస్టన్ అగర్) ఫిజ్ చరిత్రపుటల్లోకెక్కాడు. The celebrations of USA Team after winning the T20I series against Bangladesh.- The Historic Moments for USA Cricket. 🙌 pic.twitter.com/zyQcygwjPL— Tanuj Singh (@ImTanujSingh) May 26, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ముస్తాఫిజుర్‌తో పాటు రిషద్ హొసేన్ (4-1-7-1), తంజిమ్ హసన్ (4-1-32-1), షకీబ్ అల్ హసన్ (3-0-23-1) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 104 పరుగులకు పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో ఆండ్రియస్ గౌస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓపెనర్లు తంజిద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 11.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. బంగ్లాదేశ్‌కు టీ20ల్లో ఇది అతి భారీ విజయమైనప్పటికీ పసికూన యూఎస్ఏ చేతిలో సిరీస్ పరాభవం అంతుచిక్కని విషాదాన్ని మిగిల్చింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (10 వికెట్లు) ముస్తాఫిజుర్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
వరల్డ్ కప్‌నకు బంగ్లా జట్టు ప్రకటన.. అనూహ్యంగా అతడికి చోటు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొసేన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌లో ఆడబోయే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. సీనియర్లు, ఇటీవల పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.అయితే, గాయంతో బాధపడుతున్న మరో పేసర్ టస్కిన్ అహ్మద్ అనూహ్య రీతిలో జట్టులో చోటు సంపాదించడంతో పాటు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ లిటన్ దాస్ సైతం చోటు దక్కించుకున్నాడు.కాగా 29 ఏళ్ల ఈ పేస్ బౌలర్ గతవారం జింబాబ్వేతో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే, ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మాత్రం అదరగొట్టాడు. 4.56 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. షకీబ్ అల్ హసన్ 2007 నుంచి టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌ను ఒక్కసారి కూడా మిస్ కాలేదు.ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. ఇందులో భాగంగా డల్లాస్‌లోని టెక్సాస్ వేదికగా జూన్ 7న బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో మ్యాచ్‌తో మెగా ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్- 2024కు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ కుమర్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తవ్హిద్ హృదోయ్, మహమూద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్. -
IPL 2024: పీల్చి పిప్పిచేయాలని చూస్తున్నారు.. మా భయం అదే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్ సేవలను వందకు వంద శాతం ఉపయోగించుకోవాలని సీఎస్కే భావిస్తోందని.. దాని వల్ల తాము నష్టపోయే పరిస్థితి వస్తుందన్నాడు. అదే విధంగా.. ఇప్పటికే ముస్తాఫిజుర్ తానేంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్నాడని.. అతడు కొత్త ఐపీఎల్లో కొత్త నేర్చుకునేది ఏమీ లేదని యూసన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా సీఎస్కే రూ. 2 కోట్ల కనీస ధరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ముస్తాఫిజుర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు తీశాడు. చెన్నై విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు కేవలం మే 1 వరకే ఐపీఎల్లో ఆడేలా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) జారీ చేసింది. జింబాబ్వేతో సిరీస్ నాటికి తిరిగి రావాలని నిబంధన విధించింది. అయితే, సీఎస్కే మాత్రం ఒకరోజు గడువు పొడిగించాలని విజప్తి చేసింది. మే 1న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం అతడిని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు బీసీబీకి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు బీసీబీ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యూనస్ బంగ్లా మీడియా ‘డైలీ స్టార్’తో మాట్లాడుతూ.. ‘‘మే 1 వరకు ముస్తాఫిజుర్ ఐపీఎల్లో ఆడేందుకు అనుమతించాం. అతడు మే 2న తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజు నుంచి అతడు బంగ్లా జట్టుకు అందుబాటులో ఉంటాడు. అయినా.. ముస్తాఫిజుర్ ఐపీఎల్లో ఆడటం ద్వారా కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. అతడు నేర్చుకునే దశ పూర్తైంది. నిజానికి చాలా మంది అతడిని చూసే నేర్చుకుంటున్నారు. ఐపీఎల్లో ఆడించడం ద్వారా బంగ్లాదేశ్‌కు ఒరిగేదేమీ లేదు. పీల్చి పిప్పిచేయాలని చూస్తున్నారు.. మా బాధ మాది! మా ఆందోళనంతా ముస్తాఫిజుర్ ఫిట్నెస్ గురించే! వాళ్లు అతడి నుంచి 100 శాతం ఎఫర్ట్ రాబట్టాలని చూస్తున్నారు. అతడి ఫిట్నెస్ గురించి వాళ్లకెందుకు పట్టింపు ఉంటుంది. మాకు మాత్రం అతడు ముఖ్యం. అందుకే తనని వెనక్కి రప్పిస్తున్నాం. కేవలం జింబాబ్వేతో సిరీస్‌లో ఆడేందుకే కాదు.. అతడిపై పనిభారం తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా యూనస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్లో తమ ఆటగాడిని వాడుకుంటున్నారని బాధపడే బదులు అతడిని మొత్తానికే పంపకుండా ఉండే బాగుండేదని యూనస్‌కు చురకలు అంటిస్తున్నారు సీఎస్కే ఫ్యాన్స్. ఫ్రాంఛైజీ క్రికెట్లో డబ్బు కోసమే అందరూ ఆడతారని.. అలాంటపుడు వేలంలోకి రాకుండా ముస్తాఫిజుర్‌ను ఆపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మే 3 - 12 వరకు బంగ్లాదేశ్ స్వదేశంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK Vs MI: వావ్ వాట్ ఏ క్యాచ్.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ హైవోల్టేజ్ పోరులో సీఎస్కే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో దంచి కొట్టిన సీఎస్కే.. తర్వాత బౌలింగ్‌లోనూ సత్తాచాటింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మన్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ముస్తాఫిజుర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ముస్తాఫిజుర్ అద్బుతమైన క్యాచ్‌తో ముంబై విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పతిరాన తొలి బంతికే ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అయితే ఆ ఓవర్లో మూడో బంతిని పతీరణ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధిచాడు. సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బౌండరీ లైన్‌వద్ద ముస్తాఫిజుర్ అద్బుత విన్యాసం చేశాడు. థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెహ్మాన్ కాస్త ఎడమవైపు జరిగి జంప్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. కానీ జంప్ చేసే క్రమంలో సమన్వయం కోల్పోయిన రెహ్మన్.. బంతిని గాల్లోకి విసిరేసి తిరిగొచ్చి అందుకున్నాడు. ఇది చూసిన మిస్టర్ 360 బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్య ఖాతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ishan Kishan ✅ Suryakumar Yadav ✅ Relive Matheesha Pathirana's double-delight over which also included a magnificent catch by Mustafizur Rahman at the ropes 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/XbSsEiXLgZ — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
IPL 2024 CSK Vs KKR: కేకేఆర్‌తో నేటి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు బిగ్ న్యూస్
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 8) జరుగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ న్యూస్ అందింది. వేర్వేరు కారణాల చేత ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు దూరంగా ఉండిన ఆ జట్టు స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీశ పతిరణ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారని తెలుస్తుంది. టీ20 వరల్డ్‌కప్ వీసా ప్రాసెస్ కోసం స్వదేశానికి (బంగ్లాదేశ్) వెళ్లిన ముస్తాఫిజుర్ చెన్నైకి బయల్దేరాడని సమాచారం. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పతిరణ పూర్తి ఫిట్నెస్ సాధించాడని తెలుస్తుంది. ముస్తాఫిజుర్, పతిరణ కేకేఆర్‌తో జరుగబోయే నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు అందుబాటులోకి రాకపోయినా సీఎస్కే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. కేకేఆర్‌తో మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కాగా ముస్తాఫిజుర్, పతిరణ లేని లోటు సీఎస్కేకు గత మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ ఇద్దరి గైర్హాజరీలో ఆ జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. ముస్తాఫిజుర్, పతిరణ స్థానాల్లో వచ్చిన విదేశీ ప్లేయర్లు రాణించినప్పటికీ (మొయిన్, తీక్షణ).. లోకల్ పేసర్లు ముకేశ్ చౌదరీ, తుషార్ దేశ్‌పాండే దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్‌తో నేటి మ్యాచ్‌లో సీఎస్కే వీరిద్దరిని నమ్ముకుని బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చు. ప్రస్తుత ఎడిషన్‌లో ముస్తాఫిజుర్ 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు.. పతిరణ 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే సీఎస్కే విజయావకాశాలు మెరుగవుతాయి. ఇదిలా ఉంటే, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కేకేఆర్ రెండో స్థానంలో.. సీఎస్కే నాలుగో స్థానంలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధిస్తే.. సీఎస్కే నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని మట్టికరిపించగా.. సీఎస్కే సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు CSKకు బిగ్ షాక్
ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. వీసా పనులు పూర్తి చేసుకునేందుకు మంగళవారమే అతడు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.కాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సీఎస్కే.. అనంతరం గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. అయితే, మూడో మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది రుతురాజ్ గైక్వాడ్ సేన.విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మాత్రం అభిమానులను అలరించాయి. ఇక తదుపరి మ్యాచ్‌లో సీఎస్కే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా శుక్రవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు సీఎస్కే లీడింగ్ వికెట్ టేకర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ దూరం కానున్నట్లు సమాచారం. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్‌లో ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో యూఎస్ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారం రోజుల పాటు ముస్తాఫిజుర్ స్వదేశంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సీఎస్కే మ్యాచ్(ఏప్రిల్ 8) నాటికి ముస్తాఫిజుర్ ఇండియాకు తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపినట్లు ఇన్సైడ్ స్పోర్ట్ పేర్కొంది.కాగా ఐపీఎల్-2024లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీశాడు. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్‌గా పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. మరోవైపు.. ఢిల్లీతో మ్యాచ్‌లో ధోని కుంటుతూ కనిపించడం కూడా అభిమానులను కంగారూ పెడుతోంది. The ruler of our hearts! 💛✨ #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/jTxedB9sQa— Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2024చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు CSKకు బిగ్ షాక్
ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. వీసా పనులు పూర్తి చేసుకునేందుకు మంగళవారమే అతడు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సీఎస్కే.. అనంతరం గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. అయితే, మూడో మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది రుతురాజ్ గైక్వాడ్ సేన. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మాత్రం అభిమానులను అలరించాయి. ఇక తదుపరి మ్యాచ్‌లో సీఎస్కే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా శుక్రవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు సీఎస్కే లీడింగ్ వికెట్ టేకర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ దూరం కానున్నట్లు సమాచారం. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్‌లో ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారం రోజుల పాటు ముస్తాఫిజుర్ స్వదేశంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సీఎస్కే మ్యాచ్(ఏప్రిల్ 8) నాటికి ముస్తాఫిజుర్ ఇండియాకు తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపినట్లు ఇన్సైడ్ స్పోర్ట్ పేర్కొంది. కాగా ఐపీఎల్-2024లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీశాడు. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్‌గా పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. మరోవైపు.. ఢిల్లీతో మ్యాచ్‌లో ధోని కుంటుతూ కనిపించడం కూడా అభిమానులను కంగారూ పెడుతోంది. The ruler of our hearts! 💛✨ #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/jTxedB9sQa — Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2024 చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024- CSK Vs RCB: చెన్నై జోరు
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో శుభారంభం చేసింది...ఐపీఎల్ కొత్త సీజన్ తొలి పోరులో సమష్టి ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై పైచేయి సాధించింది...ముందుగా బౌలింగ్‌లో పదునైన బంతులతో చెలరేగిన ముస్తఫిజుర్ బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేశాడు. ఆపై ఛేదనలో ఎలాంటి ఆటంకం లేకుండా చెన్నై సులువుగా పని పూర్తి చేసింది. కెప్టెన్ గా రుతురాజ్ తొలి పోరులో తన పేరిట విజయాన్ని నమోదు చేసుకోగా...ఐపీఎల్లో తన మొదటి మ్యాచ్‌లోనే రచిన్ రవీంద్ర ఆకట్టుకోవడం హైలైట్. చెన్నై: ఐపీఎల్–2024ను సూపర్ కింగ్స్ దర్జాగా గెలుపుతో మొదలు పెట్టింది. శుక్రవారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. ముస్తఫిజుర్ రహమాన్ (4/29) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (15 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... బెంగళూరు ఇన్నింగ్స్‌లో 11.4 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78/5...ఈ స్థితినుంచి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగిందంటే రావత్, కార్తీక్ భాగస్వామ్యమే కారణం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో బెంగళూరు ఇన్నింగ్స్ మెరుగ్గానే మొదలైంది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 21; 1 సిక్స్) పెద్దగా ప్రభావం చూపకపోయినా తొలి వికెట్‌కు 27 బంతుల్లో 41 పరుగులు వచ్చాయి. అయితే ముస్తఫిజుర్ చెలరేగడంతో పరుగు వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ చక్కటి ఫీల్డింగ్‌కు డుప్లెసిస్ వెనుదిరగ్గా, రహానే ఫీల్డింగ్ నైపుణ్యంతో కోహ్లి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ (0) తొలి బంతికే అవుట్ కాగా, గ్రీన్ (18)ను ముస్తఫిజుర్ బౌల్డ్ చేశాడు. ఇలాంటి సమయంలో 28 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా ఆర్సీబీ ఖాతాలో చేరలేదు! అయితే కుదురుకున్న తర్వాత రావత్, కార్తీక్ దూకుడు పెంచి బౌండరీలతో పరుగులు రాబట్టారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో రావత్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టగా, కార్తీక్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 71 పరుగులు సాధించింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు అంతా తలా ఓ చేయి వేశారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో రుతురాజ్ (15) విఫలమైనా...ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రచిన్ చక్కటి షాట్లతో అలరిస్తూ బౌండరీలతో వేగంగా పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత రహానే (19 బంతుల్లో 27; 2 సిక్స్‌లు), డరైల్ మిచెల్ (18 బంతుల్లో 22; 2 సిక్స్‌లు) కీలక పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా...దూబే, రవీంద్ర జడేజా (17 బంతుల్లో 25 నాటౌట్; 1 సిక్స్) కలిసి 8 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 21; డుప్లెసిస్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 35; పటిదార్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 0; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) చహర్ 0; గ్రీన్ (బి) ముస్తఫిజుర్ 18; రావత్ (రనౌట్) 48; కార్తీక్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–42, 4–77, 5–78, 6–173. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–37–1, తుషార్ 4–0–47–0, తీక్షణ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–29–4, జడేజా 4–0–21–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) గ్రీన్ (బి) దయాళ్ 15; రచిన్ (సి) పటిదార్ (బి) కరణ్ 37; రహానే (సి) మ్యాక్స్‌వెల్ (బి) గ్రీన్ 27; మిచెల్ (సి) పటిదార్ (బి) గ్రీన్ 22; దూబే (నాటౌట్) 34; జడేజా (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–38, 2–71, 3–99, 4–110. బౌలింగ్: సిరాజ్ 4–0–38–0, యశ్ దయాళ్ 3–0–28–1, జోసెఫ్ 3.4–0–38–0, కరణ్ శర్మ 2–0–24–1, డాగర్ 2–0–6–0, గ్రీన్ 3–0–27–2, మ్యాక్స్‌వెల్ 1–0–7–0. అలరించిన ఆరంభ వేడుకలు తొలి మ్యాచ్‌కు ముందు చిదంబరం స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ నేతృత్వంలో గాయకులు సోనూ నిగమ్, మోహిత్ చౌహాన్, నీతి మోహన్ తమ పాటలతో అలరించారు. అంతకు ముందు నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు లేజర్ షోతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగియి. పెద్ద సైజు ఐపీఎల్ ట్రోఫీ రెప్లికాను ఈ సందర్భంగా మైదానంలో ప్రదర్శించారు. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ఢిల్లీ వేదిక: ముల్లన్పూర్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్‌కతా X హైదరాబాద్ వేదిక: కోల్‌కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-204 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమవుతాడనుకున్న బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్.. త్వరలోనే సీఎస్కే జట్టుతో కలవనున్నాడు. ముస్తాఫిజుర్ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగమయ్యేందుకు మంగళవారం భారత్‌కు బయలుదేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రెహ్మాన్ వెల్లడించాడు. "ఐపీఎల్-2024 కోసం చెన్నైకు వెళుతున్నాను. నా కొత్త ఆసైన్మెంట్ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. మీ అభిమానంతో పాటు ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలి. తద్వారా మైదానంలో నేను అత్యుత్తమ ప్రదర్శన చేయగలను" అని ఎక్స్‌లో తన ఫోట్ను షేర్ చేస్తూ ఫిజ్ రాసుకొచ్చాడు. కాగా సోమవారం శ్రీలంకతో మూడో వన్డే సందర్భంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొడ కండరాలు పట్టేశాయి. తీవ్రమైన నొప్పితో మైదానంలోనే ముస్తాఫిజుర్ విల్లావిల్లాడు. దీంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ ఫస్ట్ హాఫ్‌కు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అంతలోనే రెహ్మన్ భారత్‌కు బయలు దేరి అందరిని షాక్‌కు గురి చేశాడు. ఇక ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. Excited and Looking forward to my new assignment. Heading to Chennai for IPL 2024. Keep me in your prayers so that I can deliver my best.#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/mMS56cp38T — Mustafizur Rahman (@Mustafiz90) March 19, 2024 -
చెన్నై స్టార్ బౌలర్ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలకు గాయమైంది. ముస్తాఫిజుర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం(ఫిబ్రవరి 19)న సిల్హెట్ స్ట్రైకర్స్‌తో కొమిల్లా తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సెషన్లో కొమిల్లా జట్టు పాల్గోంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో కొమిల్లా కెప్టెన్ లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతి.. బౌలింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ముస్తాఫిజుర్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. వెంటనే నుంచి అతడి తల నుంచి రక్తం కారింది. అక్కడే ఉన్న ఫిజియోలు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ముస్తాఫిజుర్‌ను స్థానికంగా ఉన్న ఇంపీరియల్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే ముస్తాఫిజుర్ గాయంపై కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఫిజియో జహిదుల్ ఇస్లాం అప్డేట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సమయంలో ఓ బంతి నేరుగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తల ఎడమ బాగంలో బలంగా తాకింది. మేము వెంటనే స్పందించి కంప్రెషన్ బ్యాండేజ్‌తో రక్తస్రావం కాకుండా చూశాము. ఆ తర్వాత ఇంపీరియల్ ఆసుపత్రికి తరిలించి ‘సిటీ స్కాన్ చేయంచాము. అయితే అదృష్టవశాత్తూ తల పై భాగంలో మాత్రమే గాయమైంది. ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ లేదు. అతడికి తలపై కొన్ని కుట్లు పడ్డాయి. ముస్తఫిజుర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు’ అని ప్రకటనలో జహిదుల్ ఇస్లాం పేర్కొన్నాడు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్ శ్రీలంక పర్యటనకు వెళ్ల నుంది. ఈ పర్యటనకు ముందే స్టార్ బౌలర్ గాయపడటం బంగ్లా జట్టును కలవరపెడుతోంది. అదే విధంగా ఐపీఎల్-2024 వేలంలో రూ. 2 కోట్లకు ముస్తాఫిజుర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ⚠️ MUSTAFIZUR RAHMAN GOT HIT BALL ON HIS HEAD During practice session of Comillael Victorians a shot from Matthew Ford, the ball hit on Mustafizur's head then start bleeding . Instantly he has taken into the hospital.#BPL2024 pic.twitter.com/sY3HaLtEc8 — bdcrictime.com (@BDCricTime) February 18, 2024 -
ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం
ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లకు వ్యక్తిగత రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఆ ఆటగాళ్లు ఎవరు.. వారు అందుకునే రికార్డులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ 400 సిక్సర్ల మైలురాయిని అందుకోవడానికి కేవలం రెండు సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు కొడితే రోహిత్ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. భారీ సిక్సర్లను అలవోకగా బాదే రోహిత్‌కు ఇదేం పెద్దలెక్క కాదు. ఇక 211 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5,571 పరుగులు చేసిన రోహిత్ ముంబై ఇండియన్స్ తరపునే 4,300 పరుగులు సాధించడం విశేషం. చదవండి: Virat Kohli: తగ్గేదే లే.. గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్ ఇచ్చాడు ఇషాన్ కిషన్: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ఫామ్ కోల్పోయి పరుగులు సాధించడానికి కష్టాలు పడుతున్నాడు. అయితే అతను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున 1000 పరుగుల అందుకోవడానికి కేవలం ఒక్క పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఫామ్‌లో లేకపోయినప్పటికి ఒక్క పరుగు చేయడం ద్వారా ఇషాన్ కిషన్ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. ఇక ముంబై తరపున 39 మ్యాచ్‌ల్లో 999 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్: Courtesy: IPL Twitter రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న డేవిడ్ మిల్లర్ 2వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 41 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన మిల్లర్ 109 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ 88 మ్యాచ్‌ల్లో 1959 పరుగులు చేశాడు. చదవండి: Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' ముస్తాఫిజుర్ రెహమాన్: Courtesy: IPL Twitter ఐపీఎల్లో 50వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ముస్తాఫిజుర్ కేవలం రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ దృశ్యా ముస్తాఫిజుర్‌కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ 12 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు సంబంధించి తొలి మూడుస్థానాలు ఖరారు కావడంతో నాలుగో స్థానానికి మూడుజట్లు పోటీ పడుతున్నాయి. 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రాజస్తాన్, ముంబైలకు ఈ మ్యాచ్ కీలకం. ఇక ఐదో స్థానంలో ఉన్న కేకేఆర్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది. చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే! -
ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్ ఫీల్డింగ్.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Mustafizur Rahmans Outstanding Effort Saves SIX For Side: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుత ఫీల్డింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో.. గ్లెన్ మాక్స్వెల్ బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ముస్తాఫిజుర్ సరైన సమయంలో జంప్ చేసి ఆ బంతిని సిక్స్‌గా వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో సిక్స్‌కు బదులుగా సింగిల్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముస్తాఫిజుర్ సూపర్ ఫీల్డింగ్కునెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(58), యశస్వి జైస్వాల్(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. చదవండి: రాజస్తాన్ స్టార్ ఆటగాడిపై ఆ జట్టు కోచ్ కీలక వాఖ్యలు. Mustafizur Rahman's brilliance 😍#RCBvRR #IPL2021 pic.twitter.com/i2vXWZI6D8 — Kart Sanaik (@KartikS25864857) September 29, 2021 -
ముస్తాఫిజుర్ స్టన్నింగ్ క్యాచ్.. మోచేతికి దెబ్బ తగిలినా
ఢాకా: బంగ్లాదేశ్,న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన ఐదో టీ20లో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోల్ మెక్కొంచీని కాట్ అండ్ బౌల్డ్‌తో డక్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఒంటి చేత్తో క్యాచ్ అందుకునే క్రమంలో మోచేతికి దెబ్బ తగిలినా బంతిని మాత్రం విడువలేదు. అతని క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. కివీస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ 3.3 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల తీశాడు. మరో బంగ్లా బౌలర్ నసూమ్ అహ్మద్ స్టన్నింగ్ బౌలింగ్‌తో మెరిశాడు. 4-2-10-4తో టీ20ల్లో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. చదవండి: Rohit Vs Shardul : అసలు హీరో శార్దూల్ ఠాకూర్.. నాకంటే అతనే అర్హుడు ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 93 పరుగులకే ఆలౌట్ అయింది. విల్ యంగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బంగ్లా బౌలర్ల దాటికి ముగ్గురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రంగా మారిన చివరి టీ20 రేపు(శుక్రవారం) జరగనుంది. చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి.. Mustafizur magic #BANvNZ pic.twitter.com/dJoUIamwE3 — Aaron Murphy💉💉 (@AaronMurphyFS) September 8, 2021 -
కెరీర్ బెస్ట్ సాధించిన బంగ్లా బౌలర్.. ఐదో స్థానంలో బుమ్రా
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో బంగ్లా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్నర్ మెహదీ హసన్ 3 స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. మరో బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 652 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మెహదీ హసన్ రెండు మ్యాచ్‌లు కలిపి 7 వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ 6 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు హసన్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బంగ్లా నుంచి ఒక స్పిన్నర్ టాప్2లో నిలవడం ఇదే మూడోసారి. ఇంతకముందు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2009లో తొలిసారి బౌలింగ్ విభాగంలో నెంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. ఇక 2010లో మరో బంగ్లా స్పిన్నర్ అబ్దుర్ రజాక్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో నిలిచాడు. ఇక తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 737 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. అఫ్గన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్ 708 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ బౌలర్ మాట్ హెన్రీ(691 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 690 పాయింట్లతో ఒకస్థానం దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. బుమ్రా తప్ప మరో టీమిండియా బౌలర్ టాప్‌టెన్‌లో లేకపోవడం విశేషం. ఇక బ్యాటింగ్ విభాగానికి వస్తే బాబర్ అజమ్(865 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి(857), రోహిత్ శర్మ 825 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 396 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి జడేజా 245 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. చదవండి: World Cup Super League: భారీ విజయం.. టాప్‌లో బంగ్లాదేశ్! ⬆️ Mehidy Hasan Miraz climbs to No.2 ⬆️ Mustafizur Rahman breaks into top 10 Huge gains for Bangladesh bowlers in the @MRFWorldwide ICC Men’s ODI Player Rankings 👏 pic.twitter.com/nr1PGH0ukT — ICC (@ICC) May 26, 2021\ -
Mustafizur: ఆ ఐదు రోజులు నరకంలా అనిపించింది
ఢాకా: బయోబబుల్ తనకు నరకంలా కనిపించిందని బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ తెలిపాడు. కొన్ని నెలలుగా బమోబబూల్‌లో ఉంటూ మ్యాచ్‌లు ఆడడం విసుగు తెప్పించదని పేర్కొన్నాడు. కాగా ముస్తాఫిజుర్ న్యూజిలాండ్ పర్యటన అనంతరం ఐపీఎల్లో ఆడేందుకు ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముస్తాఫిజుర్ ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించి 8 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. కాగా ఐపీఎల్ 2021కి కరోనా మహమ్మారి సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ముస్తాఫిజుర్, సహచర ఆటగాడు.. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌లు తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్టడ్ ఫ్లైట్‌లో బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న ముస్తాఫిజుర్ ఇన్‌స్టా వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' ఇంటికి తిరిగివచ్చినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా బయోబబుల్‌లో ఉండడం ఇబ్బందిగా అనిపించింది. మమ్మల్ని ఇంటికి క్షేమంగా పంపించినందుకు రాజస్తాన్ రాయల్స్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. అయితే టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు కరోనా సోకడంతో మమ్మల్ని ఐదు నుంచి ఆరు రోజుల పాటు ఒకే రూంలో ఉంచారు. ఆ సమయంలో మాత్రం నాకు నరకంగా అనిపించింది. ఇప్పుడు ఇంటికి చేరడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. కొన్నిరోజుల పాటు క్రికెట్‌కు విరామమిచ్చి కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు' కెప్టెన్‌గా పంత్.. కోహ్లి, రోహిత్‌లకు దక్కని చోటు View this post on Instagram A post shared by Mustafizur Rahman (@mustafizur_90) -
బౌలర్ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్ దాటితే మాత్రం
ముంబై: 2019 ఐపీఎల్ సీజన్లో అప్పటి కింగ్స్ పంజాబ్( పంజాబ్ కింగ్స్) బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రేమికులు రెండుగా చీలిపోయి.. అశ్విన్ చేసింది కరెక్టేనంటూ కొందరు సమర్థిస్తే.. మరికొందరు మాత్రం అశ్విన్ చర్య క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ పేర్కొన్నారు. కొన్నాళ్ల పాటు మన్కడింగ్ వివాదంపై సోషల్ మీడియాలోనూ పెద్ద డిబేట్ నడిచింది. తాజాగా సోమవారం సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ బౌలింగ్ వేయడానికి ముందే డ్వేన్ బ్రావో క్రీజు దాటి ముందుకు వెళ్లిపోయాడు. వాస్తవానికి ఒక బౌలర్ బంతి విసిరేవరకు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు విడిచే అవకాశం లేదు. అయితే అప్పటికే బ్రావో క్రీజును దాటేయడం.. ముస్తాఫిజుర్ బంతిని విసరడం జరిగింది. అయితే బౌలర్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో రూల్ ప్రకారం అవతలి జట్టుకు ఫ్రీ హిట్ ఆడే అవకాశం వచ్చింది. ఈ విషయం పక్కనపెడితే.. టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ బ్రావో, ముస్తాఫిజుర్ ఉన్న ఫోటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. 'ఒక బౌలర్ గీత దాతి బంతిని వేస్తే నోబాల్‌గా పరిగణించి అతనికి పెనాల్టీ విధిస్తారు. మరి అదే సమయంలో బౌలర్ బంతిని విడవకుండానే బ్యాట్స్‌మన్ క్రీజు దాటి వెళితే దానికి ఎలాంటి చర్యలు ఉండవా... అక్కడ బౌలర్‌కు మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా.. క్రీడాస్పూర్తికి విరుద్ధమని మీరే కామెంట్స్ చేస్తారు. అయితే మరి ఇలాంటి చర్యలకు పరిష్కారం చూపండి అంటూ ఐసీసీనీ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. వెంకటేష్ ప్రసాద్ పెట్టిన ఫోటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్ అలీ (3/7), స్యామ్ కరన్ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: ధోని బ్యాట్ నుంచి మరీ ఎక్కువ ఆశించకూడదు ధోని వారసుడు అతడే.. తనే నెక్ట్స్ కెప్టెన్: మైకేల్ వాన్ The bowler overstepping by a few inches is penalised, but a batsman backing up a few yards isn’t. The bowler has every right to run out a batsman backing up so far. PERIOD. Calling it against the spirit of the game is a joke @ICC .#CSKvRR pic.twitter.com/vIHqbe6fWU — Venkatesh Prasad (@venkateshprasad) April 20, 2021 -
'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను'
ఢాకా: ఐపీఎల్ కంటే దేశం తరపున ఆడడమే తనకు ముఖ్యమని బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్పష్టం చేశాడు. ఏప్రిల్‌లో మొదలవనున్న ఐపీఎల్ 2021 సీజన్ సమయంలోనే బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) లంకతో టెస్టు సిరీస్ ఆడాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. కాగా బీసీబీ నిర్ణయం తీసుకున్న రోజే తాను ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ కోరాడు.దీనిపై నిరాశ చెందిన బీసీబీ ఐపీఎల్ ఆడాలనుకునేవారికి ఎన్వోసీ ఇస్తామని... లీగ్‌లో పాల్గొనే వారిని తాము అడ్డుకోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ స్పందించాడు. ' నాకు దేశ భక్తి ఎక్కువ. ఐపీఎల్ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తా. బంగ్లా బోర్డు ఏది చెబితే అదే చేస్తా. ఒకవేళ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు నా పేరును ప్రకటిస్తే దేశానికి ఆడేందుకే ప్రాధాన్యమిస్తా. ఐపీఎల్ దృష్యా ఒకవేళ బోర్డు లంకతో సిరీస్‌కు తన పేరును పరిగణలోకి తీసుకోకుంటే ఆ విషయం వాళ్లే స్వయంగా చెబుతారు. వారు ఎన్వోసీ ఇచ్చేవరకు వేచిచూస్తా.. అప్పుడే ఐపీఎల్లో ఆడేందుకు వెళ్తా. ఐపీఎల్లో పాల్గొనమని బోర్డు ఎన్వోసీ ఇచ్చినా నా మొదటి ప్రాధాన్యం దేశ భక్తిపైనే ఉంటుంది.' అని రెహ్మాన్ స్పష్టం చేశాడు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రాజస్తాన్ రాయల్స్ కనీస ధర రూ. కోటికి దక్కించుకోగా.. ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్‌ను కేకేఆర్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ తరపున ముస్తాఫిజుర్ 14 టెస్టుల్లో 30 వికెట్లు, 61 వన్డేల్లో 115 వికెట్లు, 41 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ముస్తాఫిజుర్ చక్కగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆ ఏడాది ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2018 ఐపీఎల్ సీజన్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్ మొత్తం 24 మ్యాచ్‌లాడి 24 వికెట్లు తీశాడు. చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! -
ఐపీఎల్ 2020: ముస్తాఫిజుర్‌కు లైన్ క్లియర్
ఢాకా: గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడటానికి తమ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీకి దూరమైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు ఈసారి క్లియరెన్స్ లభించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ముస్తాఫిజుర్‌కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ సీజన్లో జరుగనున్న ఐపీఎల్ వేలానికి ముస్తాఫిజుర్ అందుబాటులో ఉండనున్నాడు. దాంతో డిసెంబర్-19 వ తేదీన ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని ముస్తాఫిజుర్ పరీక్షించుకోనున్నాడు. దీనిపై బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ ముస్తాఫిజుర్‌ను ఎక్కువగా క్రికెట్ ఆడనివ్వకుండా చేయడానికి కారణం అతను తరచు గాయాల బారిన పడటమే. ప్రధానంగా విదేశీ లీగ్‌ల్లో ఆడకుండా ముస్తాఫిజుర్‌ను అడ్డుకుంటూ వచ్చాం. ప్రస్తుతం ముస్తాఫిజుర్ ఎటువంటి సీరియస్ గాయాలు కాకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అందుకోసమే ఐపీఎల్ ఆడటానికి అనుమతి ఇచ్చాం. అతని ఐపీఎల్ ప్రదర్శనతో తిరిగి గాడిలో పడతాడని ఆశిస్తున్నాం. అది మా జట్టుకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ముస్తాఫిజుర్ మాకు చాలా కీలకమైన బౌలర్. మళ్లీ సత్తాచాటుకుని పూర్వ వైభవాన్ని చాటుకుంటాడని అనుకుంటున్నాం’ అని అక్రమ్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్–2020 కోసం జరిగే వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. ఇందులో 713 మంది భారత ఆటగాళ్లు కాగా, 258 మంది విదేశీయులు. భారత క్రికెటర్లలో 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 634 మంది ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. మరో 60 మంది కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ అయినా ఆడినవారున్నారు. అయితే ఈ 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు డిసెంబర్ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది. ఐపీఎల్లో ప్రస్తుతం గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 19న కోల్‌కతాలో వేలం నిర్వహిస్తారు. -
షకీబుల్ తర్వాత అతనే..
బర్మింగ్‌హామ్: బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌కప్ వేదికలో బంగ్లాదేశ్ తరఫున ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, మహ్మద్ షమీల వికెట్లను ముస్తాఫిజుర్ సాధించాడు. దాంతో ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ హసన్ ఐదు వికెట్లు సాధించగా, తాజాగా ముస్తాఫిజుర్ ఐదు వికెట్లతో రాణించాడు. 2011 వరల్డ్‌కప్‌లో షఫిల్ ఇస్లామ్ బంగ్లా తరఫున నాలుగు వికెట్లు సాధించాడు. ఇదే ఈ వరల్డ్‌కప్ ముందు వరకూ బంగ్లా తరఫున ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన కాగా, దాన్ని షకీబుల్, ముస్తాఫిజుర్‌లు బ్రేక్ చేశారు. అది కూడా ఈ వరల్డ్‌కప్‌లోనే సాధించడం విశేషం. భారత్‌పై మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసుకుని ఐదు వికెట్లు సాధించి 59 పరుగులు ఇచ్చాడు. -
దక్షిణాఫ్రికాకు షాక్.. బంగ్లా ఘనవిజయం
లండన్: ఎన్నో ఆశలు.. అంతకుమించి అంచనాలతో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. డుప్లెసిస్ సేన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభావం మరిచిపోకముందే బంగ్లా చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవాలని ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన బంగ్లా తొలి మ్యాచ్‌లోనే సఫారీ జట్టును బొల్తా కొట్టించి ఆగ్రశ్రేణిజట్లకు హెచ్చరికలు జారీ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్(42: 30 బంతుల్లో 9 ఫోర్లు), షకీబుల్ హసన్(75: 84 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ముష్పికర్ రహీమ్(78: 80 బంతుల్లో 8 ఫోర్లు), మహ్మదుల్లా(46 నాటౌట్: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో బంగ్లాదేశ్ ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సఫారీ బౌలర్లలో మోరిస్, తాహీర్, ఫెహ్లుకోవియా తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లా నిర్దేశించిన 331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 309 పరుగులకే పరిమితమైంది. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమిని రెండో ఖాతాలో పడింది. ఆది నుంచి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వని బంగ్లా బౌలర్లు సఫారీ ఆటగాళ్లను కట్టడి చేశారు. వీలుచిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తు ఒత్తిడి పెంచారు. అయితే సఫారీ ఆటగాళ్లలో డుప్లెసిస్(62) అర్దసెంచరీతో రాణించాడు. మక్రామ్(45), డసన్(41), డుమినీ(45)లు విజయానికి కావాల్సిన పరుగులు సాధించడంలో విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో రాణించగా, సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టారు. -
ముస్తాఫిజుర్‌కు నో క్లియరెన్స్
ఢాకా: గత కొన్ని సీజన్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడుతూ వస్తున్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్.. వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఐపీఎల్లో ఆడటానికి క్లియరెన్స్ ఇవ్వాలంటూ ముస్తాఫిజుర్ చేసుకున్న విజ్ఞప్తి ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) తాజాగా తిరస్కరించింది. ముస్తాఫిజుర్ తరుచు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో పాల్గొంటూ గాయాల బారిన పడుతున్నాడు. దాంతో ముస్తాఫిజుర్‌ను టీ20 లీగ్‌లకు అనుమతి నిరాకరిస్తూ గత జూన్ మాసంలో బీసీబీ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కూడా ముస్తాఫిజుర్‌ను విదేశాల్లో జరిగే టీ20ల్లో పాల్గొనకుండా బీసీబీ నియంత్రిస్తుంది. ప్రధానంగా జాతీయ జట్టు ఆడే మ్యాచ్‌లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు చెప్పిన బోర్డు.. మరొకసారి అదే విషయాన్ని ముస్తాఫిజుర్‌కు తెలియజేస్తూ ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇవ్వడానికి నిరాకరించింది. 2016 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధించడంలో ముస్తాఫిజుర్ కీలక పాత్ర పోషించాడు . 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు సాధించి ప్రధాన పాత్ర పోషించాడు. అయితే 2017కు వచ్చేసరికి హైదరాబాద్ తరఫున కేవలం మ్యాచ్ మాత్రమే ఆడాడు. కాగా, 2018లో ముంబై ఇండియన్స్ ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకుంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన ముస్తాఫిజర్ గాయం బారిన పడి టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ ముస్తాఫిజుర్‌ను వదలుకుంది. ముంబై ఇండియన్స్ 10 మంది ఆటగాళ్లను విడుదల చేయగా అందులో ముస్తాఫిజుర్‌ను కూడా చేర్చింది. త్వరలో ఐపీఎల్ వేలం జరుగనున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ తమ దేశ క్రికెట్ బోర్డును ఆశ్రయించగా అతని చుక్కెదురైంది. -
ముస్తాఫిజుర్‌కు షాక్!
ఢాకా: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) షాకిచ్చింది. రెండేళ్ల పాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు దూరంగా ఉండాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో సహా ఇతర విదేశీ లీగ్‌ల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాల్గొనకూడదంటూ ముస్తాఫిజుర్‌ను హెచ్చరించింది. విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువగా హాజరవుతున్న ముస్తాఫిజుర్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని రెండేళ్ల పాటు టీ20 లీగ్‌లకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ స్పష్టం చేశారు. ‘లీగ్‌లు ఆడటం వల్ల ముస్తాఫిజుర్ గాయాల పాలవుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని మేం సీరియస్‌గా తీసుకున్నాం. విదేశీ లీగ్‌ల్లో ఆడి గాయాలపాలై స్వదేశానికి వచ్చి బోర్డు ఫిజియోల సమక్షంలో కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల ర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లి లీగ్‌లు ఆడి వచ్చి గాయపడుతున్నాడు. దాంతో అతన్ని రెండేళ్లు టీ 20 లీగ్‌లు ఆడొద్దని చెప్పాం. బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ ఎంతో కీలకమైన ఆటగాడు. అలాంటివాడిని మేం కోల్పోవడం వల్ల జట్టుకు ఓటములు ఎక్కువవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ’ అని నజ్ముల్ తెలిపారు. -
అతని కోసమే నా బెంగ: వాల్ష్
డెహ్రాడూన్: ఇటీవల కాలంలో తరుచు గాయాల బారిన పడుతున్న ముస్తాఫిజుర్ రహ్మాన్ తన ఫిట్నెస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్ కోట్నీ వాల్ష్ అభిప్రాయపడ్డాడు. యువకుడైన ముస్తాఫిజుర్ గాయాల బారిన పడటం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నాడు. ‘ ముస్తాఫిజర్ కోసమే నా బెంగ. అతను గాయాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ముస్తాఫిజుర్‌ను తిరిగి శక్తిమంతంగా తీర్చడంపై దృష్టి సారించా. అతనొక యువ క్రికెటర్. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముస్తాఫిజుర్ గాయాల పాలు కాకుండా చూసుకోవాలి. అతని బౌలింగ్ ప్రమాణాలు అసాధారణం. ఈ ఆధునిక క్రికెట్లో ఒక ఫాస్ట్ బౌలర్ వివిధ రకాలైన ఫార్మాట్లలో ఆడటం కారణంగానే ఎక్కువగా గాయాల బారిన పడతాడనే విషయాన్ని అర్థం చేసుకోగలను. ముస్తాఫిజుర్ విషయంలో కూడా ఇదే జరిగిందని నేను అనుకుంటున్నా’ అని వాల్ష్ పేర్కొన్నాడు. -
'టీమిండియాపై ఆఫ్ కట్టర్లు సంధిస్తా'
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్ తో తలపడబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ కట్టర్లు సంధిస్తానని అంటున్నాడు బంగ్లాదేశ్ ఆశాకిరణం ముస్తాఫిజుర్ రెహ్మాన్. ప్రస్తుతం ఇంగ్లండ్ లో పరిస్థితులు పేసర్లకు పెద్దగా అనుకూలించడం లేదని పేర్కొన్న ముస్తాఫిజుర్.. భారత్ తో జరిగే అమీతుమీ పోరులో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 'నా బౌలింగ్ ను మెరుగుపరుచుకోవడంలో ముగింపు అనేది లేదు. నా ఆయుధం ఆఫ్ కట్టర్లే. కాకపోతే పేసర్లకు ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించడం లేదు. అయినప్పటికీ ఆఫ్ కట్టర్లు వేయడానికే శతవిధాలా ప్రయత్నిస్తా. నా శక్తివంచన లేకుండా బంగ్లాదేశ్ విజయానికి కృషి చేస్తా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి నిలిపా. అంతా మాకు మంచే జరుగుతుందని ఆశిస్తున్నా'అని ముస్తాఫిజుర్ తెలిపాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మూడు గేమ్‌లు ఆడిన ముస్తాఫిజుర్ కేవలం వికెట్ మాత్రమే తీశాడు. -
'ఈసారి ఐపీఎల్లో ఆడలేనేమో'
హైదరాబాద్:గతేడాది ఐపీఎల్ టైటిల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించడంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఐపీఎల్ సీజన్లో ముస్తఫిజుర్ ఇంకా సన్ రైజర్స్ జట్టుతో కలవలేదు. శుక్రవారం నాటికి ముస్తఫిజుర్ జట్టుతో కలుస్తాడని సన్ రైజర్స్ యాజమాన్యం ఆశించనప్పటికీ అది జరగలేదు. ప్రస్తుతం శ్రీలంక పర్యటన ముగించుకున్న తరువాత ముస్తఫిజుర్ నేరుగా స్వదేశానికి వెళ్లిపోయాడు.ప్రధానంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుమతి కోసం ముస్తఫిజుర్ నిరీక్షిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆ యువ బౌలర్ స్పష్టం చేశాడు. 'గతేడాది ఐపీఎల్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈసారి ఐపీఎల్లో ఆడతానని అనుకోవడం లేదు. మా జాతీయ జట్టు షెడ్యూల్ బిజీగా ఉండటంతో నేను ఐపీఎల్లో ఆడటంపై ఇంకా స్పష్టత లేదు. మా క్రికెట్ బోర్డు అనుమతి కోసం చూస్తున్నా. బోర్డు అంగీకారం తెలిపితే ఐపీఎల్లో ఆడతా' అని ముస్తఫిజర్ రెహ్మాన్ తెలిపాడు. గతేడాది ఐపీఎల్లో 17 వికెట్లు తీసి సన్ రైజర్స్ టైటిల్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఒకవేళ ముస్తఫిజుర్ కు అనుమతి లభిస్తే మాత్రం రెండు రోజుల్లో సన్ రైజర్స్ తో కలిసే అవకాశం ఉంది.