PC: X.com
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ హైవోల్టేజ్ పోరులో సీఎస్‌కే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో దంచి కొట్టిన సీఎస్‌కే.. తర్వాత బౌలింగ్‌లోనూ సత్తాచాటింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మన్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు.
ముస్తాఫిజుర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ముస్తాఫిజుర్ అద్బుతమైన క్యాచ్‌తో ముంబై విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పతిరాన తొలి బంతికే ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అయితే ఆ ఓవర్‌లో మూడో బంతిని పతీరణ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధిచాడు.
సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బౌండరీ లైన్‌వద్ద ముస్తాఫిజుర్ అద్బుత విన్యాసం చేశాడు. థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెహ్మాన్ కాస్త ఎడమవైపు జరిగి జంప్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు.
కానీ జంప్ చేసే క్రమంలో సమన్వయం కోల్పోయిన రెహ్మన్.. బంతిని గాల్లోకి విసిరేసి తిరిగొచ్చి అందుకున్నాడు. ఇది చూసిన మిస్టర్ 360 బిత్తరపోయాడు. చేసేదేమి లేక సూర్య ఖాతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ishan Kishan ✅
— IndianPremierLeague (@IPL) April 14, 2024
Suryakumar Yadav ✅
Relive Matheesha Pathirana's double-delight over which also included a magnificent catch by Mustafizur Rahman at the ropes 👏👏
Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/XbSsEiXLgZ
Comments
Please login to add a commentAdd a comment