ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment