ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ముంబై ఇండియన్స్ తరపున అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ తుది జట్టులోకి మయాంక్ అగర్వాల్ వచ్చాడు.
ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. ఈమ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార
Comments
Please login to add a commentAdd a comment