
ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. వీసా పనులు పూర్తి చేసుకునేందుకు మంగళవారమే అతడు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
కాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సీఎస్‌కే.. అనంతరం గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. అయితే, మూడో మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది రుతురాజ్ గైక్వాడ్ సేన.
విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మాత్రం అభిమానులను అలరించాయి. ఇక తదుపరి మ్యాచ్‌లో సీఎస్‌కే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
హైదరాబాద్ వేదికగా శుక్రవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు సీఎస్‌కే లీడింగ్ వికెట్ టేకర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ దూరం కానున్నట్లు సమాచారం. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్‌లో ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యూఎస్‌ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
వారం రోజుల పాటు ముస్తాఫిజుర్ స్వదేశంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సీఎస్‌కే మ్యాచ్(ఏప్రిల్ 8) నాటికి ముస్తాఫిజుర్ ఇండియాకు తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ పేర్కొంది.
కాగా ఐపీఎల్-2024లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీశాడు. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్‌గా పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. మరోవైపు.. ఢిల్లీతో మ్యాచ్లో ధోని కుంటుతూ కనిపించడం కూడా అభిమానులను కంగారూ పెడుతోంది.
The ruler of our hearts! 💛✨ #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/jTxedB9sQa
— Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2024
చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే!
Comments
Please login to add a commentAdd a comment