చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు? | Relief for CSK: Mustafizur Rahman leaves for Chennai after injury scare | Sakshi
Sakshi News home page

IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు?

Published Tue, Mar 19 2024 1:18 PM | Last Updated on Tue, Mar 19 2024 1:31 PM

Relief for CSK: Mustafizur Rahman leaves for Chennai after injury scare - Sakshi

PC: CSK(IPL.com)

ఐపీఎల్‌-204 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమవుతాడనుకున్న బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌.. త్వరలోనే సీఎస్‌కే జట్టుతో కలవనున్నాడు. ముస్తాఫిజుర్ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో భాగమయ్యేందుకు మంగళవారం భారత్‌కు బయలుదేరాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రెహ్మాన్‌ వెల్లడించాడు.

"ఐపీఎల్‌-2024 కోసం చెన్నైకు వెళుతున్నాను. నా కొత్త ఆసైన్‌మెంట్‌ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. మీ అభిమానంతో పాటు ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలి. తద్వారా మైదానంలో నేను అత్యుత్తమ ప్రదర్శన చేయగలను" అని ఎక్స్‌లో తన ఫోట్‌ను షేర్‌ చేస్తూ ఫిజ్‌ రాసుకొచ్చాడు.

కాగా సోమవారం శ్రీలంకతో మూడో వన్డే సందర్భంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ తొడ కండరాలు పట్టేశాయి. తీవ్రమైన నొప్పితో మైదానంలోనే ముస్తాఫిజుర్ విల్లావిల్లాడు. దీంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 సీజన్‌ ఫస్ట్‌ హాఫ్‌కు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి.

కానీ అంతలోనే రెహ్మన్‌ భారత్‌కు బయలు దేరి అందరిని షాక్‌కు గురి చేశాడు. ఇక ఐపీఎల్‌-2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement