
డెహ్రాడూన్: ఇటీవల కాలంలో తరుచు గాయాల బారిన పడుతున్న ముస్తాఫిజుర్ రహ్మాన్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్ కోట్నీ వాల్ష్ అభిప్రాయపడ్డాడు. యువకుడైన ముస్తాఫిజుర్ గాయాల బారిన పడటం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నాడు. ‘ ముస్తాఫిజర్ కోసమే నా బెంగ. అతను గాయాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ముస్తాఫిజుర్‌ను తిరిగి శక్తిమంతంగా తీర్చడంపై దృష్టి సారించా. అతనొక యువ క్రికెటర్. అతనికి చాలా భవిష్యత్తు ఉంది.
దాన్ని దృష్టిలో పెట్టుకునే ముస్తాఫిజుర్ గాయాల పాలు కాకుండా చూసుకోవాలి. అతని బౌలింగ్ ప్రమాణాలు అసాధారణం. ఈ ఆధునిక క్రికెట్‌లో ఒక ఫాస్ట్ బౌలర్ వివిధ రకాలైన ఫార్మాట్లలో ఆడటం కారణంగానే ఎక్కువగా గాయాల బారిన పడతాడనే విషయాన్ని అర్థం చేసుకోగలను. ముస్తాఫిజుర్ విషయంలో కూడా ఇదే జరిగిందని నేను అనుకుంటున్నా’ అని వాల్ష్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment