బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొసేన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌లో ఆడబోయే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. సీనియర్లు, ఇటీవల పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
అయితే, గాయంతో బాధపడుతున్న మరో పేసర్ టస్కిన్ అహ్మద్ అనూహ్య రీతిలో జట్టులో చోటు సంపాదించడంతో పాటు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ లిటన్ దాస్ సైతం చోటు దక్కించుకున్నాడు.
కాగా 29 ఏళ్ల ఈ పేస్ బౌలర్ గతవారం జింబాబ్వేతో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే, ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మాత్రం అదరగొట్టాడు. 4.56 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. షకీబ్ అల్ హసన్ 2007 నుంచి టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌ను ఒక్కసారి కూడా మిస్ కాలేదు.
ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. ఇందులో భాగంగా డల్లాస్‌లోని టెక్సాస్ వేదికగా జూన్ 7న బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో మ్యాచ్‌తో మెగా ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.
టీ20 ప్రపంచకప్- 2024కు బంగ్లాదేశ్ జట్టు:
నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ కుమర్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తవ్హిద్ హృదోయ్, మహమూద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.
Comments
Please login to add a commentAdd a comment