
ఢాకా: బంగ్లాదేశ్,న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన ఐదో టీ20లో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోల్ మెక్కొంచీని కాట్ అండ్ బౌల్డ్‌తో డక్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఒంటి చేత్తో క్యాచ్ అందుకునే క్రమంలో మోచేతికి దెబ్బ తగిలినా బంతిని మాత్రం విడువలేదు. అతని క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. కివీస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ 3.3 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల తీశాడు. మరో బంగ్లా బౌలర్ నసూమ్ అహ్మద్ స్టన్నింగ్ బౌలింగ్‌తో మెరిశాడు. 4-2-10-4తో టీ20ల్లో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు.
చదవండి: Rohit Vs Shardul : అసలు హీరో శార్దూల్ ఠాకూర్.. నాకంటే అతనే అర్హుడు
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 93 పరుగులకే ఆలౌట్ అయింది. విల్ యంగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బంగ్లా బౌలర్ల దాటికి ముగ్గురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక నామమాత్రంగా మారిన చివరి టీ20 రేపు(శుక్రవారం) జరగనుంది.
చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి..
Mustafizur magic #BANvNZ pic.twitter.com/dJoUIamwE3
— Aaron Murphy💉💉 (@AaronMurphyFS) September 8, 2021