చెన్నై స్టార్‌ బౌలర్‌ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్‌ | Bangladesh's Mustafizur Rahman rushed to hospital after being hit on head | Sakshi
Sakshi News home page

IPL 2024: చెన్నై స్టార్‌ బౌలర్‌ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్‌

Published Mon, Feb 19 2024 7:31 AM | Last Updated on Mon, Feb 19 2024 9:12 AM

Mustafizur Rahman rushed to hospital after being hit on head in nets - Sakshi

బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలకు గాయమైంది. ముస్తాఫిజుర్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం(ఫిబ్రవరి 19)న సిల్హెట్ స్ట్రైకర్స్‌తో కొమిల్లా తలపడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఆదివారం చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో కొమిల్లా జట్టు పాల్గోంది. ఈ క్ర‌మంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయ‌ప‌డ్డాడు. ప్రాక్టీస్‌లో కొమిల్లా కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ కొట్టిన ఓ బంతి.. బౌలింగ్‌ ఎండ్‌వైపు వెళ్తున్న ముస్తాఫిజుర్ తల వెనుక భాగంలో బలంగా తాకింది.

వెంటనే నుంచి అతడి తల నుంచి రక్తం కారింది. అక్కడే ఉన్న ఫిజియోలు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ముస్తాఫిజుర్‌ను స్థానికంగా ఉన్న ఇంపీరియల్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే ముస్తాఫిజుర్‌ గాయంపై కొమిల్లా విక్టోరియన్స్‌ టీమ్ ఫిజియో జహిదుల్ ఇస్లాం అప్‌డేట్‌ ఇచ్చాడు.

ప్రాక్టీస్ సమయంలో ఓ​ బంతి నేరుగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తల ఎడమ బాగంలో బలంగా తాకింది. మేము వెంటనే స్పందించి కంప్రెషన్ బ్యాండేజ్‌తో రక్తస్రావం కాకుండా చూశాము. ఆ తర్వాత ఇంపీరియల్ ఆసుపత్రికి తరిలించి ‘సిటీ స్కాన్ చేయంచాము. అయితే అదృష్టవశాత్తూ తల పై భాగంలో మాత్రమే గాయమైంది.

ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ లేదు. అతడికి తలపై కొన్ని కుట్లు పడ్డాయి. ముస్తఫిజుర్‌ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు’ అని ప్రకటనలో జహిదుల్ ఇస్లాం పేర్కొన్నాడు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్‌ శ్రీలంక పర్యటనకు వెళ్ల నుంది. ఈ పర్యటనకు ముందే స్టార్‌ బౌలర్‌ గాయపడటం బంగ్లా జట్టును కలవరపెడుతోంది. అదే విధంగా ఐపీఎల్‌-2024 వేలంలో రూ. 2 కోట్లకు ముస్తాఫిజుర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement