MI Vs RR 2021: Four Milestones Are Away To Break By Players In MI Vs RR Match - Sakshi
Sakshi News home page

MI Vs RR: ఒక్క మ్యాచ్‌.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం

Published Tue, Oct 5 2021 12:42 PM | Last Updated on Tue, Oct 5 2021 3:55 PM

Four Milestones Are Away To Break By Players In MI Vs RR Match - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ముంబై  ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లకు వ్యక్తిగత రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఆ ఆటగాళ్లు ఎవరు.. వారు అందుకునే రికార్డులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.

రోహిత్‌ శర్మ:


Courtesy: IPL Twitter

ముంబై ఇండియన్స్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న రోహిత్‌ శర్మ 400 సిక్సర్ల మైలురాయిని అందుకోవడానికి కేవలం రెండు సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు కొడితే రోహిత్‌ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. భారీ సిక్సర్లను అలవోకగా బాదే రోహిత్‌కు ఇదేం పెద్దలెక్క కాదు. ఇక 211 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 5,571 పరుగులు చేసిన రోహిత్‌ ముంబై ఇండియన్స్‌ తరపునే 4,300 పరుగులు సాధించడం విశేషం.

చదవండి: Virat Kohli: తగ్గేదే లే..  గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్‌ ఇచ్చాడు

ఇషాన్‌ కిషన్‌: 


Courtesy: IPL Twitter

ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఈ సీజన్‌లో అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ఫామ్‌ కోల్పోయి పరుగులు సాధించడానికి కష్టాలు పడుతున్నాడు. అయితే అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున 1000 పరుగుల అందుకోవడానికి కేవలం ఒక్క పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఫామ్‌లో లేకపోయినప్పటికి ఒక్క పరుగు చేయడం ద్వారా ఇషాన్‌ కిషన్‌ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. ఇక ముంబై తరపున 39 మ్యాచ్‌ల్లో 999 పరుగులు సాధించాడు.

డేవిడ్‌ మిల్లర్‌:


Courtesy: IPL Twitter
రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడుతున్న డేవిడ్‌ మిల్లర్‌ 2వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 41 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన మిల్లర్‌ 109 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌ 88 మ్యాచ్‌ల్లో 1959 పరుగులు చేశాడు.

చదవండి: Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా'

ముస్తాఫిజుర్‌ రెహమాన్‌:


Courtesy: IPL Twitter

ఐపీఎల్‌లో 50వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ముస్తాఫిజుర్‌ కేవలం రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ప్రస్తుత ఫామ్‌ దృశ్యా ముస్తాఫిజుర్‌కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్‌ 12 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు సంబంధించి తొలి మూడుస్థానాలు ఖరారు కావడంతో నాలుగో స్థానానికి మూడుజట్లు పోటీ పడుతున్నాయి. 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రాజస్తాన్‌, ముంబైలకు ఈ మ్యాచ్‌ కీలకం. ఇక ఐదో స్థానంలో ఉన్న కేకేఆర్‌  ఒక్క మ్యాచ్‌ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది.

చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్‌ గెలుస్తాడులే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement