ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది.
ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అదేవిధంగా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. ఇక అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది.
మిగిలిన రెండు రిటెన్షన్‌లకు తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. ఇక రిటెన్షన్‌కు సంబంధించి విధి విధానాలు ఖారారు కావడంతో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి.
రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్!
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఫైనలైజ్ చేసినట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్‌గా 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది సీజన్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచే ముంబైతో రోహిత్ తెగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్ కూడా ఆ ఫ్రాంచైజీని నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడంట.
అతడితో పాటు స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను కూడా విడిచిపెట్టాలని ముంబై నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు సీజన్ల నుంచి కిషన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని వేలంలోకి విడిచిపెట్టన్నట్లు వినికిడి.
రిటెన్షన్ ఆటగాళ్లు వీరే?
కెప్టెన్ హార్దిక్ పాండ్యా(రూ.18 కోట్లు), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(రూ.14 కోట్లు), యువ ఆటగాడు తిలక్ వర్మ(రూ.11 కోట్లు)లను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
వీరితో పాటు ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లగా నమాన్ ధీర్(రూ. 4 కోట్లు), ఆకాశ్ మధ్వాల్(రూ. 4కోట్లు) అంటిపెట్టుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరిగే అవకాశముంది.
చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా?
Comments
Please login to add a commentAdd a comment