ఫామ్‌లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే | Fans Questions Mumbai Indians For Dropping Ishan Kishan Vs PBKS Match | Sakshi
Sakshi News home page

IPL 2021: ఫామ్‌లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే

Published Wed, Sep 29 2021 4:41 PM | Last Updated on Wed, Sep 29 2021 9:43 PM

Fans Questions Mumbai Indians For Dropping Ishan Kishan Vs PBKS Match - Sakshi

Courtesy: IPL Twitter

Ishan Kishan Dropped From MI Vs PBKS Match... ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌ ఓటములకు బ్రేక్‌ వేస్తూ విజయం సాధించిన ముంబై ప్లేఆఫ్‌ రేసులోనూ నిలిచింది. అంతేగాక హార్దిక్‌ పాం‍డ్యా పంజాబ్‌తో మ్యాచ్‌ ద్వారా ఫామ్‌లోకి రావడమే గాక దగ్గరుండి మరీ జట్టును గెలిపించడం శుభపరిణామం. మరికొద్ది రోజుల్లో టి20 ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీమిండియాకు ఎంపికైన జట్టులో ముంబై ఇండియన్స్‌ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా నిన్నటి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ను పక్కనబెట్టారు.

చదవండి: IPL 2021: ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్‌, రోహిత్‌ క్రీడాస్పూర్తికి రాహుల్‌ ఫిదా

టీమిండియా తరపున డెబ్యూ మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా ఉంటాడని టి20 ప్రపంచకప్‌ జట్టులో ఎంపిక చేశారు. కానీ ప్రస్తుతం ఈ యువ బ్యాటర్‌ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 8 మ్యాచ్‌లాడిన ఇషాన్‌ కేవలం 107 పరుగులు మాత్రమే సాధించి ఘోరంగా విఫలమయ్యాడు. అతనితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అయితే ఇషాన్‌ కిషన్‌ను పక్కనబెట్టడంపై ముంబై ఇండియన్స్‌ అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. కొందరు ఇషాన్‌ పక్కనబెడుతూ రోహిత్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు. '' ఆర్సీబీపై ఓటమి అనంతరం కోహ్లి వచ్చి ఇషాన్‌కు గైడెన్స్‌ ఇచ్చాడు.. అది రోహిత్‌కు నచ్చలేదు.. అందుకే పక్కనబెట్టాడు. ఇషాన్‌ కిషన్‌ టి20 జట్టులో సభ్యుడు.. కుర్రాళ్లకు ఎక్కువ అవకాశమివ్వాలి.. రోహిత్‌ ఆ విషయం ఎలా మరిచిపోయాడు.. రేపు టీమిండియాకు కెప్టెన్‌ అయితే యువ ఆటగాళ్లకు కష్టమే... ఫాంలో లేకపోతే అంతే.. ఎవరైనా మూలకు కూర్చోవాల్సిందే.. ఇప్పుడు ఇషాన్‌.. రేపు సూర్య..'' అంటూ పేర్కొన్నారు.

ఇక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయాన్ని సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో చేధించింది. హార్దిక్‌ పాండ్యా తొలిసారి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 30 బంతుల్లో 40 పరుగులు చేసిన పాండ్యా ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 

చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్‌ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement