
Courtesy: IPL Twitter
Rohit Sharma Completed 400 Sixes In T20s: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో 400 సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ తర్వాత 325 సిక్సర్లతో సురేశ్ రైనా, 320 సిక్సర్లతో విరాట్ కోహ్లి, 304 సిక్సర్లతో, ఎంఎస్ ధోని, 261 సిక్సర్లతో తర్వాత స్ధానంలో ఉన్నారు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్‌లు బాదిన రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించాడు. కాగా ఓవరల్‌గా చూస్తే 1042 సిక్సర్లతో క్రిస్ గేల్ ప్రథమ స్ధానంలో ఉన్నాడు
కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్తాన్ ముంబై బౌలర్ల ధాటికి నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడగా ఆడారు. 22 పరుగులు చేసిన రోహిత్, చేతన్ సకారియా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకీ ఇషాన్ కిషన్ సిక్సర్‌ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ రేసు నుంచి నిష్క్రమించింది.
చదవండి: MI Vs RR: రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment