sixes
-
పిచ్చకొట్టుడు కొట్టిన అశ్విన్.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి మరీ..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ఆర్డర్లో ముందుకు వచ్చి మరీ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లో 3 భారీ సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. అశ్విన్ ఈ మూడు సిక్సర్లు బాదింది సాదాసీదా బౌలర్ల బౌలింగ్‌లో అనుకుంటే పొరబడ్డట్టే. తొలుత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయేలా చేసిన అశ్విన్.. ఆ తర్వాత ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జేకు మతి పోగొట్టాడు. కుల్దీప్ బౌలింగ్‌లో ఓ సిక్సర్‌తో సరిపెట్టుకున్న అశ్విన్.. నోర్జే బౌలింగ్‌లో ఏకంగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. SIX-HITTER ASHWIN IN T20..!!! 🔥pic.twitter.com/80j0Dm6uLz — Johns. (@CricCrazyJohns) March 28, 2024 తరుచూ బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్.. కొత్తగా బ్యాట్‌కు పని చెప్పడంతో అతని అభిమానులు తెగ సంబుర పడిపోతున్నారు. యాష్లోని ఈ కోణాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, అశ్విన్‌కు టెస్ట్ క్రికెట్లో బ్యాటర్‌గా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో అతను ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. అయితే యాష్ శతక్కొట్టుడు టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితమైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతను రాణించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో అశ్విన్ శైలికి భిన్నంగా విజృంభించడంతో అభిమానులు కొత్తగా ఫీలవుతున్నారు. అశ్విన్ చితక్కొట్టుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే, అశ్విన్‌తో పాటు రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో డీసీపై రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టిన ఆంధ్ర బ్యాటర్..
కడప స్పోర్ట్స్: కల్నర్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్–23 క్రికెట్ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్ మామిడి వంశీకృష్ణ (64 బంతుల్లో 110; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఒకే ఓవర్లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వంశీకృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు సంధించాడు. అనంతరం ఈ జోరు కొనసాగిస్తూ వంశీకృష్ణ 48 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా వంశీకృష్ణ రికార్డు నెలకొల్పాడు. మామిడి వంశీకృష్ణతోపాటు వన్‌డౌన్ బ్యాటర్, కెపె్టన్ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), ధరణి కుమార్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించారు. ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా)... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్ (భారత్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (మూడు/నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు) గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), లీ జెర్మన్ (న్యూజిలాండ్)... దేశవాళీ వన్డేల్లో తిసారా పెరీరా (శ్రీలంక), రుతురాజ్ గైక్వాడ్ (భారత్)... దేశవాళీ టి20ల్లో రోజ్ వైట్లీ (ఇంగ్లండ్), లియో కార్టర్ (న్యూజిలాండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. -
ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు
టీమిండియా దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సచిన్ బ్యాటింగ్ జోరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 ఏళ్ల వయసులో భారీ షాట్లతో విరుచుకుపడి అభిమానులకు వింటేజ్ సచిన్‌ను గుర్తుచేశాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో సచిన్ కొట్టిన మూడు సిక్సర్లు వేటికవే స్పెషల్ అని చెప్పొచ్చు. అయితే క్రిస్ ట్రెమ్లెట్ బౌలింగ్‌లో అతను కొట్టిన ఒక సిక్స్ మాత్రం 1998 షార్జాను గుర్తుచేసింది. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులు ముద్దగా ''Desert Strome'' అని పిలుచుకున్నారు. ఆ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సచిన్ కళ్లు చెదిరే సిక్సర్లతో మెరిశాడు. అందులో ఫ్రంట్‌పుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్సర్ బాదడం అప్పట్లో ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఇలాంటి షాట్లు సచిన్ కొడుతుంటే అభిమానులు ఉర్రూతలూగిపోయేవాళ్లు. ట్రెమ్లెట్ బౌలింగ్‌లో 6,6,4 బాదిన సచిన్.. ఆ ఓవర్లో మొత్తంగా 16 పరుగులు పిండుకున్నాడు. ఇక సచిన్ షార్జా 1998 గుర్తుచేస్తూ.. ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. దీంతో అభిమానులు 1998 షార్జా, ప్రస్తుతం సచిన్ కొట్టిన సిక్సర్లను ఒకే ఫ్రేమ్‌లో జోడించి ట్వీట్స్ చేశారు. ''సచిన్ సిక్సర్లు చూస్తుంటే మనం 1998లో ఉన్నామా''.. ''వింటేజ్ సచిన్‌ను తలపిస్తున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. సచిన్ మెరుపులకు యువరాజ్ విధ్వంసం తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 𝗦𝗵𝗮𝗿𝗷𝗮𝗵 𝟮.𝟬 😍🙌🔟🏏 whattttt a playerrr 💙@sachin_rt turning back the clock 🕰️🔄#RoadSafetyWorldSeries #sachintendulkar #sharjah #GOAT #God pic.twitter.com/DflUaugI4N — Ashish Verma (@ashu112) September 22, 2022 Vintage Sachin Tendulkar pic.twitter.com/qvogWLkVqC — Sachin Tendulkar🇮🇳FC (@CrickeTendulkar) September 22, 2022 చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్ సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్
Yuvraj Singh Celebrates Six 6s- Video Viral: టీ20 ప్రపంచకప్-2007లో నాటి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఘటన ప్రతి అభిమాని మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందడనంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌తో సెప్టెంబరు 19 నాటి మ్యాచ్‌లో యువీ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయాడు. మ్యాచ్ 19వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న యువీ.. 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 218 పరుగుల భారీ స్కోరు చేయడం సహా 18 పరుగుల తేడాతో మ్యాచ్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు. ముద్దుల కొడుకుతో కలిసి.. ఈ సందర్భంగా క్రికెట్ ప్రేమికులు, యువీ అభిమానులు ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే, యువరాజ్ మాత్రం ఓ స్పెషల్ పార్ట్నర్తో కలిసి తన చిరస్మరణీయ ఇన్నింగ్స్ తాలుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. బుడ్డోడు సైతం కన్నార్పకుండా.. ఆ పార్ట్నర్ మరెవరో కాదు యువీ ముద్దుల తనయుడు ఓరియన్ కీచ్ సింగ్. కుమారుడితో కలిసి ప్రపంచకప్‌లో తన సిక్సర్ల విధ్వంసం వీక్షిస్తున్న వీడియోను యువరాజ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో కొడుకును ఒళ్లో కూర్చోబెట్టుకుని యువీ ఎంజాయ్ చేస్తుండగా.. బుడ్డోడు సైతం కన్నార్పకుండా తండ్రి ఆటను చూస్తూ ఉండిపోవడం విశేషం. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. 2007లో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్లో మొత్తంగా 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా 28 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఆల్‌రౌండర్. ఇక అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసిన యువరాజ్ సింగ్‌ను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సముచిత రీతిలో గౌరవించింది. మొహాలీలో స్టేడియంలోని ఓ స్టాండ్‌కు యువీ పేరును పెట్టగా.. ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆరంభం కానున్న సందర్భంగా మంగళవారం దీనిని ఆవిష్కరించనున్నారు. కాగా యువరాజ్ సింగ్.. నటి హజెల్ కీచ్‌ను 2016లో వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఈ ఏడాది జనవరిలో కుమారుడు జన్మించాడు. అతడికి ఓరియన్ కీచ్ సింగ్‌గా నామకరణం చేశారు. చదవండి: T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ — Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 -
టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ..
Rohit Sharma Completed 400 Sixes In T20s: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో 400 సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ తర్వాత 325 సిక్సర్లతో సురేశ్ రైనా, 320 సిక్సర్లతో విరాట్ కోహ్లి, 304 సిక్సర్లతో, ఎంఎస్ ధోని, 261 సిక్సర్లతో తర్వాత స్ధానంలో ఉన్నారు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించాడు. కాగా ఓవరల్‌గా చూస్తే 1042 సిక్సర్లతో క్రిస్ గేల్ ప్రథమ స్ధానంలో ఉన్నాడు కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్తాన్ ముంబై బౌలర్ల ధాటికి నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడగా ఆడారు. 22 పరుగులు చేసిన రోహిత్, చేతన్ సకారియా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకీ ఇషాన్ కిషన్ సిక్సర్ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ రేసు నుంచి నిష్క్రమించింది. చదవండి: MI Vs RR: రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం -
ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్
డబ్లిన్ : భారీ సిక్సర్లకు కేరాఫ్‌గా ఉండే ఐర్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఒబ్రెయిన్‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. మ్యాచ్ గెలిచినందుకు సంతోషించాలా లేక కారు అద్దం పగిలినందుకు బాధపడాలా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. అదేంటి మ్యాచ్ గెలిపించినందుకు సంతోషించాలి గానీ ఇలా సందిగ్ధంలో ఉండడం ఎందుకు అని అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. ఐర్లాండ్‌లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీలో గురువారం డబ్లిన్ వేదికగా నార్త్‌వెస్ట్ వారియర్స్, లీన్స్టర్ లైటనింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆట ప్రారంభంలోనే వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన లీన్స్టర్ జట్టులో ఓపెనర్‌గా వచ్చిన కెవిన్ ఒబ్రెయిన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతులెదుర్కొని 82 పరుగులు చేశాడు. మొత్తం కెవిన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 8 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు.దీంతో 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో డక్త్‌వర్త్ లూయిస్ ప్రకారం లీన్స్టర్ జట్టు 24 పరుగులతో గెలుపొందింది. మ్యాచ్‌లో స్టార్ ఆఫ్ ది పర్సన్‌గా కెవిన్ ఒబ్రెయిన్ నిలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కెవిన్ కొట్టిన 8 సిక్సుల్లో ఒక బంతి వెళ్లి బయట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసింది. మాములుగా మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులదో లేక వేరే వారిదో అని ఊహిస్తాం. కానీ అసలు ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. అద్దం పగిలిన కారు కెవిన్ ఓబ్రెయిన్దే. పాపం అతను కొట్టిన సిక్స్ తన కారు అద్దం ధ్వంసం చేస్తుందని అతను కూడా ఊహంచి ఉండడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని భావించిన కెవిన్ పార్క్ చేసిన తన కారు దగ్గరకు వచ్చాడు. అసలు విషయం తెలుసుకొని వెంటనే తాను కారు కొన్న టయోటా షోరూమ్‌కు కారును తీసుకెళ్లి జరిగిందంతా వివరించాడు. Didn’t need the air-con on the drive up to you lads. 🤣 unreal service once again. Never fails to disappoint. I’ll park further away next time 😝 #BestInTheBusiness https://t.co/tNKTG0tRLA — Kevin O'Brien (@KevinOBrien113) August 27, 2020 కారును ఇన్సురెన్స్ కోటా కింద రిపేయిరింగ్కు తరలించారు. అయితే రిపేరింగ్‌కు వెళ్లే ముందు తన కారుతో కొన్నిఫోటోలు దిగాడు. వీటిని టయోటా తన ట్విటర్లో షేర్ చేసింది. దీనిపై కెవిన్ సరదాగా స్పందించాడు.' ఇలా జరుగుతుందని ఊహించలేదు. నేను కొట్టిన సిక్స్ నా కారు అద్దాలను ధ్వంసం చేసింది. ఇక మీదట నా కారును గ్రౌండ్ ఆవల చాలా దూరంలో పార్క్ చేస్తా' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అయితే కెవిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'పాపం కెవిన్ .. భారీ సిక్సులతో విరుచుకుపడే కెవిన్‌కు ఎంత కష్టం వచ్చింది.. ఆ ఒక్క సిక్స్ అతని పాలిట శాపమైంది.' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : తండ్రి కాబోతున్న కోహ్లి, ఆసీస్ టెన్షన్) (తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి) -
ధోని@ 6, 6, 6, 6 ,6
చెన్నై : మహేంద్ర సింగ్ ధోనీ తన బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. వరుసగా 5 బంతులను ఐదు సిక్సులుగా మలిచి బ్యాటింగ్ పవరేంటో చూపించాడు.దీంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్టేడియం దద్దరిల్లింది. అదేంటీ... ధోనీ ఎప్పుడు మ్యాచ్ ఆడాడు.. ఎప్పుడు సిక్స్‌లు కొట్టాడనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. మరో మూడు వారాల్లో 13 ఐపీఎల్ సీజన్ మొదలవనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. కాగా సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చిదంబరం స్టేడియంలో తన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మహీ నెట్స్‌లోనే నిలబడి వరుసగా 5 బంతులను సిక్స్‌లుగా మలిచి స్టాండ్స్‌లోకి పంపాడు. అయితే బౌలర్ ఆ బంతులు వేశాడా లేక బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను సిక్స్‌లుగా కొట్టాడా అనేది తెలియదు.(భజ్జీ ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఇదే..) ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ తమిళ స్టార్‌స్పోర్ట్స్ చానెల్ తమ ట్విటర్లో షేర్ చేసింది. అయితే 38 ఏళ్ల ధోనీలో ఇంకా బ్యాటింగ్ పవర్ తగ్గలేదని మాత్రం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ 13 సీజన్లో తన ప్రదర్శన చూపించాలనే ఆసక్తిలో ధోనీ ఉన్నట్లు తెలుస్తుంది. మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్లో ధోనీ ప్రదర్శనను చూడాలని అతని అభిమానులు కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం మహీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ధోనిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కూడా తప్పించింది. దాదాపు 8నెలలు తర్వాత ఐపీఎల్ 13వ సీజన్ ద్వారా మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ధోనీ తన ఐపీఎల్ కెరీర్లో 190 మ్యాచులాడి 4432 పరుగులు చేశాడు. అందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో చెన్నైకి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై.. ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది. పదేళ్లు ఈ సీజన్లో ఆడిన చెన్నై.. పదిసార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకుని తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఈ జట్టును ముందుండి నడిపించడమే ఈ విజయ పరంపరకు అసలు కారణం. మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ('కష్టకాలంలో నాకు అండగా నిలిచింది') BALL 1⃣ - SIX BALL 2⃣ - SIX BALL 3⃣ - SIX BALL 4⃣ - SIX BALL 5⃣ - SIX ஐந்து பந்துகளில் ஐந்து சிக்ஸர்களை பறக்கவிட்ட தல தோனி! முழு காணொளி காணுங்கள் 📹👇 #⃣ "The Super Kings Show" ⏲️ 6 PM 📺 ஸ்டார் ஸ்போர்ட்ஸ் 1 தமிழ் 📅 மார்ச் 8 ➡️ @ChennaiIPL pic.twitter.com/rIcyoGBfhE — Star Sports Tamil (@StarSportsTamil) March 6, 2020 -
అద్దాలు పగలగొట్టిన సానియా భర్త
బ్రాంప్టన్: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భర్త షోయబ్ మాలిక్ అద్దం పగలగొట్టాడు. ఒకసారి కాదు రెండు సార్లు. వాళ్లేదో గొడవ పడ్డారని అపార్థం చేసుకోకండి. అతడు కొట్టిన బంతులు తగిలి గ్రౌండ్లో అద్దాలు పగిలిపోయాయి. బౌండరీ వెలుపలికి అతడు కొట్టిన రెండు బంతులు నేరుగా రెండు కిటికీల అద్దాలకు తగలడంతో అవి ధ్వంసమయ్యాయి. గ్లోబల్ టి20 కెనడా లీగ్‌లో అతడీ విన్యాసం చేశాడు. వాంకోవర్ నైట్స్ కెప్టెన్‌గా ఉన్న మాలిక్ గురువారం బ్రాంప్టన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా రసెల్(43), టీపీ వైసీ(40) విజృంభించడంతో వాంకోవర్ నైట్స్ 16 ఓవర్లలో 170 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదిరించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రాంప్టన్ టీమ్ 13.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మున్రో ఒక్కడే అర్ధ సెంచరీ(62)తో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో 77 పరుగులతో బ్రాంప్టన్ వోల్వ్స్ ఓటమిపాలైంది. ఈ విజయంతో వాంకోవర్ నైట్స్ నాకౌట్లో అడుగుపెట్టింది. In an unusual scenario, @realshoaibmalik literally hit two glass breaking sixes.#GT2019 #BWvsVK pic.twitter.com/5kuAQoQBbE — GT20 Canada (@GT20Canada) August 9, 2019 -
11 ఏళ్ల క్రితం ఇదే రోజు ...!
-
ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డు
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్ తుది దశకు వచ్చేసింది. ఇంకా ఐదు మ్యాచ్‌లు ముగిస్తే లీగ్ దశ ముగుస్తుంది. లీగ్ దశలో టాప్-4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్‌కు చేరతాయి. కాగా, ఐపీఎల్ తాజా సీజన్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఐపీఎల్లో 51వ మ్యాచ్ ముగిసే సరికి 748 సిక్సర్లతో ఆల్‌టైమ్ రికార్డు లిఖించబడింది. అంతకుముందు 2012 సీజన్లో 732 సిక్సర్లు నమోదు కాగా, తాజాగా ఆ రికార్డు సవరించబడింది. ఈ సీజన్లో చెన్నై అత్యధికంగా 116 సిక్స్‌లు బాదగా సన్‌రైజర్స్ 62 సిక్సర్లతో చివరి స్థానంలో ఉంది. ఇక ఆటగాళ్ల పరంగా లోకేశ్ రాహుల్(కింగ్స్ పంజాబ్) 32 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, రిషబ్ పంత్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) 31 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ) 30 సిక్సర్లతో మూడో స్థానంలో నిలవగా, ఎంఎస్ ధోని(సీఎస్కే), అంబటి రాయుడు(సీఎస్కే)లు 29 సిక్సర్లతో సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. క్రిస్ గేల్(కింగ్స్ పంజాబ్) 27 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. -
వైరల్.. బూమ్ బూమ్ అఫ్రిది!
సాక్షి, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని అభిమానులు బూమ్ బూమ్ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ మాజీ క్రికెటర్ ఆ పాత బూమ్ బూమ్ అఫ్రిదిని మరోసారి గుర్తు చేస్తూ.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చెలరేగిపోయాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో గురువారం పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది ఏకంగా వరుస నాలుగు బంతుల్లో నాలుగు సిక్స్‌లు బాదాడు. ఇవన్నీ భారీ సిక్సులే కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బూమ్ బూమ్ అఫ్రిదీ అంటూ తెగ సంబరపడిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఐదో బంతిని సైతం సిక్సుకు తరలించాలని భావించిన అఫ్రిది క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లొ అఫ్రిది ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం అఫ్రిది బూమ్ బూమ్ షో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే పీఎస్ఎల్లో ఇది రికార్డు కావడం విశేషం. ఇక పీఎస్ఎల్ తొలి దశలో బౌండరీ లైన్ వద్ద అఫ్రిది అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో సైతం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. -
వరుస సిక్సులతో అలరించిన అఫ్రిది
-
మెకల్లమ్ 'సిక్సర్ల' ఘనత
దునేదిన్:న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ మెకల్లమ్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మెకల్లమ్ ఒక ఓవర్ లో రెండు సిక్సర్లు బాది వంద సిక్సర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా శ్రీలంక స్పిన్నర్ హెరాత్ ఓవర్ ను ఎదుర్కొన్న మెకల్లమ్(17 నాటౌట్; ఆరు బంతుల్లో 2 సిక్సర్లు) హిట్టింగ్ చేసి ఆ ఘనతను అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా లెజెండ్ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన మెకల్లమ్ నిలిచాడు. కాగా గిల్ క్రిస్ట్ 96 మ్యాచ్ ల్లో 100 సిక్సర్లను పూర్తి చేసుకుంటే, మెకల్లమ్ 98 మ్యాచ్ ల్లో ఆ ఘనతను సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో క్రిస్ గేల్(98), కల్లిస్(97), వీరేంద్ర సెహ్వాగ్(91 సిక్సర్లు) లు ఉన్నారు. ఇదిలా ఉండగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 405 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 267/3 వద్ద డిక్లేర్ చేసి భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్(109నాటౌట్) విలియమ్సన్(71) రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరుకు సహకరించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 50.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కరుణరత్నే(29), కుశాల్ మెండిస్(46)ల, జయసుందర్(3) లు పెవిలియన్ కు చేరగా, చండీమాల్(31 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా శ్రీలంక విజయానికి 296 పరుగులు చేయాల్సి ఉండగా, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి.