ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్ లు... ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చేది విధ్వంసకర బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యూవీ పెను సంచలనం సృష్టించాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు డర్భన్ వేదికగా యువీ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఈ విధ్వంసానికి యావత్ క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టింది.