T20 worldcup
-
నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సా(షా)మి
-
Car Accident: టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ క్రికెటర్‌కు గాయాలు
శ్రీలంక మాజీ క్రికెటర్ లాహిరు తిరిమన్నె, అతడి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనురాధపుర సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో తిరిమన్నెతో పాటు అతడి ఫ్యామిలీ కూడా గాయపడినట్లు న్యూయార్క్ స్ట్రైకర్స్ వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన లెఫ్టాండర్ బ్యాటర్ తిరిమన్నె లంక తరఫున 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2088, 3164, 291 పరుగులు చేశాడు. కెరీర్లో మొత్తంగా మూడు టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లలో పాల్గొన్న లాహిరు తిరిమన్నె.. 2014లో టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు కూడా! అదే విధంగా ఐదు వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. రెండు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లోనూ భాగమయ్యాడు. ఇక గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లాహిరు తిరిమన్నె ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఈవెంట్లో భాగమైన అతడు.. న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం క్యాండీ స్యాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లోనూ లాహిరు తిరిమన్నె ఆడాడు. 14 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం కుటుంబానికి సమయం కేటాయించిన తిరిమన్నె గుడికి వెళ్లే క్రమంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. లారీని ఢీకొన్న ఘటనలో అతడి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తూ లాహిరు తిరిమన్నెతో పాటు అతడి కుటుంబం కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 🚨UPDATE🚨 Lahiru Thirimanne, former Sri Lankan cricketer, hospitalized after a road accident in Thrippane, Anuradhapura.#LahiruThirimanne #SriLanka #Icc #Cricket pic.twitter.com/qqpuYcZ8h5 — Cricadium CRICKET (@Cricadium) March 14, 2024 -
ఆస్తమాను అధిగమించి.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా! 600 వికెట్లతో..
దాదాపు పదహారేళ్ల క్రితం... 21 ఏళ్ల కుర్రాడికి అది కేవలం ఎనిమిదో అంతర్జాతీయ మ్యాచ్. ఉరకలెత్తే ఉత్సాహం మినహా తగినంత అనుభవం లేదు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి ఆ మ్యాచ్‌ను ఒక సాధారణ మ్యాచ్‌లాగే చూశాడు. కానీ మైదానంలో ఆ రోజు అతనికి జీవితకాలం మరచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు! వేసిన ప్రతి బంతినీ భారత స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ సిక్సర్‌గా మలుస్తుంటే ఆ మొహం రంగులు మారుతూ వాడిపోయింది. ఆ దెబ్బ నుంచి మానసికంగా కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. బ్రాడ్ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా సగటు క్రికెట్ అభిమానులందరికీ ఆ మ్యాచ్ మాత్రమే గుర్తుకొస్తుంది. ఎప్పటికీ ఆ కాళరాత్రి వెంటాడుతూ ఉంటే మరో ఆటగాడి కెరీర్ ఎన్ని ఆటుపోట్లకు గురయ్యేదో! కానీ స్టూ్టవర్ట్ బ్రాడ్ మాత్రం నిరాశ చెందలేదు. ఉవ్వెత్తున మళ్లీ పైకి లేచి, క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. ఆరు సిక్సర్ల దెబ్బ నుంచి కోలుకొని టెస్టుల్లో ఆరు వందల వికెట్లు సాధించే వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. సహజంగానే నేనూ చాలా బాధపడ్డాను. అయితే వాస్తవానికి అది నాకు మరో రూపంలో మేలు చేసింది. పట్టుదలగా నిలబడి పోరాడేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి నన్ను మానసికంగా దృఢంగా మార్చింది. ఈ రోజు ఆ స్థాయికి చేరానంటే నాటి మ్యాచ్ కూడా కారణం. చాలా మంది క్రీడాకారుల జీవితాల్లో ఇలాంటి రోజులు ఉంటాయి. అయితే మీరు ఎంత తొందరగా దానిని వెనక్కి తోసి పైకి దూసుకుపోగలరనేది ముఖ్యం. తండ్రి క్రిస్ బ్రాడ్‌తో స్టువర్ట్ ఆటలో ఆనందించే రోజుల కంటే బాధపడే రోజులే ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించగలిగితే మీరు గొప్ప రోజులు చూస్తారనేది నా నమ్మకం. ఇది నా విషయంలో నిజమైంది’... రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ‘ఆరు సిక్సర్ల’ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. టెస్టు క్రికెట్లో అతను సాధించిన ఘనత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాడ్ గణాంకాలు చూస్తే అతని గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. 17 ఏళ్ల కెరీర్లో 167 టెస్టు మ్యాచ్‌లు... 604 వికెట్లు...అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంతో అతను ఇప్పుడు ఆటను సగర్వంగా ముగించాడు. బ్యాటర్ నుంచి బౌలర్‌గా... స్టూవర్ట్ తండ్రి క్రిస్ బ్రాడ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్. జాతీయ జట్టుకు 25 టెస్టులు, 34 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే తండ్రి కారణంగా అతనికేమీ క్రికెట్‌పై అమాంతం ఆసక్తి పెరగలేదు. చిన్నప్పటి నుంచి బ్రాడ్ హాకీని ఇష్టపడ్డాడు. వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ లీసెస్టర్‌షైర్ టీమ్‌కు గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ యువ జట్టు సెలక్షన్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహం, ఇతర మిత్రుల కారణంగా క్రికెట్ వైపు మళ్లాడు. తండ్రిలాగే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా స్కూల్, కాలేజీ దశలో రాణిస్తూ వచ్చిన అతను లీసెస్టర్‌షైర్ బెస్ట్ యంగ్ బ్యాట్స్‌మన్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఇక్కడా అతని కెరీర్ మళ్లీ మలుపు తిరిగింది. అయితే కాలేజీలు మారుతూ వచ్చిన దశలో బ్యాటర్‌గా కంటే పేస్ బౌలర్‌గా మంచి ప్రతిభ ఉన్నట్లు కోచ్‌లు గుర్తించారు. ఒకే విభాగంలో దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుందనే సూచనతో పూర్తిగా బౌలింగ్ వైపు మళ్లిన అతను చివరకు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలవడం విశేషం. ఫ్యామిలీతో స్టువర్ట్ సీనియర్ స్థాయికి... ఇంగ్లండ్ యువ క్రికెట్ జట్టును లయన్స్ పేరుతో పిలుస్తారు. ఆ టీమ్‌లో స్థానం దక్కడం అంటే మున్ముందు సీనియర్ టీమ్‌కు సిద్ధమైనట్లే లెక్క. ఏజ్ గ్రూప్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో బ్రాడ్ ఆ అవకాశం చేజిక్కించుకున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్ యువ జట్లతో జరిగిన సిరీస్‌లలో రాణించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిపై మరింత నమ్మకం ఉంచింది. భవిష్యత్తు కోసం ఎంపిక చేసే 25 మంది సభ్యుల డెవలప్మెంట్ గ్రూప్‌లో కూడా బ్రాడ్‌కు చోటు దక్కింది. జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ బృందానికి శిక్షణ ఇస్తున్నప్పుడు బ్రాడ్ ప్రతిభతో పాటు అతను కష్టపడే తత్త్వం, బౌలింగ్‌లో ప్రత్యేకత సెలక్టర్లను ఆకర్షించాయి. ఫలితంగా 20 ఏళ్ల వయసులో తొలి ఇంగ్లండ్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం (టి–20ల్లో) చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత వన్డేల్లోనూ అడుగు పెట్టగా, మరి కొద్ది రోజులకే టెస్టు అవకాశం కూడా వెతుక్కుంటూ రావడం మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ రెగ్యులర్ ఆటగాడిగా బ్రాడ్ స్థాయి పెరిగింది. తండ్రితో బ్రాడ్ చిన్నప్పటి ఫోటో పదునైన పేసర్‌గా.... కెరీర్ ఆరంభంలో మొహంలో ఇంకా వీడని పసితనపు ఛాయలు, రంగుల జుట్టుతో అమాయకత్వం దాటని ఆటగాడిగా అతను కనిపించేవాడు. కానీ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్లో చరిత్రలో అత్యంత భీకరమైన ఫాస్ట్బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు బ్రాడ్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. బౌలింగ్ సత్తాతో పాటు మొండి పట్టుదల, ఒక్కసారిగా ప్రత్యర్థిపై ఆధిపత్యం మొదలైతే ఆగని అతని తత్త్వం బ్రాడ్‌ను ప్రత్యేకంగా మార్చాయి. కెరీర్లో 100వ టెస్టు ఆడే సమయానికే బ్రాడ్ ఒకే స్పెల్‌లో ఐదేసి వికెట్లు సాధించిన ఘనతను ఏడుసార్లు నమోదు చేశాడు. పాకిస్తాన్‌తో 3–0తో ఘన విజయంలో కీలక పాత్ర, విండీస్, న్యూజిలాండ్‌లపై లార్డ్స్‌లో ఏడేసి వికెట్ల ప్రదర్శన, దక్షిణాఫ్రికా గడ్డపై ఆరు వికెట్ల ఇన్నింగ్స్, మాంచెస్టర్‌లో భారత్‌ను 6 వికెట్లతో కుప్పకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సమరం... ఇలా బ్రాడ్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలు ఉన్నాయి. అతని సహజ నాయకత్వ లక్షణాలు బ్రాడ్‌ను టి20ల్లో కెప్టెన్‌గా పనిచేసే అవకాశం కల్పించాయి. యాషెస్‌లో అద్భుతం... టెస్టు క్రికెట్లో యాషెస్ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ చిరకాల సమరం ఇరు జట్లు ఆటగాళ్ల కెరీర్‌ను నిర్దేశిస్తుందనేది వాస్తవం. హీరోలుగా మారినా, జీరోలుగా మారినా ఈ సిరీస్‌తోనే సాధ్యం. ఇలాంటి సిరీస్‌లో బ్రాడ్ తన ప్రత్యేకత ప్రదర్శించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించి యాషెస్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. 2009–2023 మధ్య కాలంలో 40 యాషెస్ టెస్టులు ఆడిన బ్రాడ్ 153 వికెట్లతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2009 ఓవల్‌లో 5 వికెట్లు, ఆ తర్వాత బ్రిస్బేన్, లీడ్స్, చెస్టర్ లీ స్ట్రీట్లలో ఆరేసి వికెట్లు...ఇలా యాషెస్‌లో మధుర జ్ఞాపకాలెన్నో. అయితే బ్రాడ్ కెరీర్లో అత్యుత్తమ క్షణం 2015 యాషెస్‌లో వచ్చింది. సొంత మైదానం ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 8 ఆస్ట్రేలియా వికెట్లు పడగొట్టిన తీరుకు హ్యట్సాఫ్. ఆ స్పెల్‌లో ఒక్కో బంతి ఒక్కో అద్భుతం. ఆ సమయంలో బ్రాడ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అతని కెరీర్లో బెస్ట్ పోస్టర్‌గా నిలిచిపోయాయి. ఆస్తమాను అధిగమించి... బ్రాడ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో కోణం కూడా దాగి ఉంది. 2015లో అతను బయటకు చెప్పే వరకు దీని గురించి ఎవరికీ తెలీదు. బ్రాంకో పల్మనరీ డిస్ప్లాజియా (అస్తమా) అనే శ్వాసకోస వ్యాధితో అతను చిన్నతనంలో బాధపడ్డాడు. మూడు నెలల ముందుగా ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టడంతో అతని ఊపిరితిత్తులో ఒకటి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణం. అయితే మందులతో పాటు క్రమశిక్షణ, ఆహార నియమాలతో అతను దీనిని అధిగమించగలిగాడు. ఒక పేస్ బౌలర్ ఇలాంటి సమస్యను దాటి రావడం అరుదైన విషయం. పుట్టిన సమయంలో తన ప్రాణాలు కాపాడిన జాన్ పేరును తన పేరు మధ్యలో చేరుస్తూ స్టూవర్ట్ జాన్ బ్రాడ్‌గా మార్చుకొని అతను కృతజ్ఞత ప్రకటించడం విశేషం. -
పాక్‌తో పోరుకు భారత్ ‘సై’
కేప్‌టౌన్: టి20 ప్రపంచకప్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత మహిళల జట్టు నేడు గ్రూప్ ‘బి’ తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. కీలకమైన పోరుకు ముందు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్నెస్ సమస్యలు జట్టును సతమతం చేస్తున్నాయి. తొలి మ్యాచ్‌కు స్మృతి గాయంతో జట్టుకు దూరమవడం బ్యాటింగ్‌పై ప్రభావం చూపగలదు. అయితే ఇటీవల షఫాలీ వర్మ, రిచా అండర్–19 ఈవెంట్లో రాణించారు. ఇప్పుడు కూడా బాధ్యతను పంచుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. జెమీమా, హర్లీన్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మిడిలార్డర్లో రాణిస్తే జట్టుకు ఢోకా ఉండదు. బౌలింగ్ లో రేణుక, శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు విజయం సులువవుతుంది. -
టీమిండియాకు తొలి ఓటమి
ICC U19 Womens T20 World Cup: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2023లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్‌ల్లో 3 వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా ఉండిన టీమిండియా.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జనవరి 21) ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలై, సెమీస్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలగా, ఆసీస్ 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. భారత ఇన్నింగ్స్‌లో శ్వేత సెహ్రావత్ (21) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హ్రిషిత బసు (14), టిటాస్ సాధు (14)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఆసీస్ బౌలర్లలో సియన్నా జింజర్ 3 వికెట్లు పడగొట్టగా.. మిల్లీ ఇల్లింగ్‌వర్త్, మ్యాగీ క్లార్క్ తలో 2 వికెట్లు, కెప్టెన్ రైస్ మెక్కెన్నా, ఎల్లా హేవర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు. స్వల్ప లక్ష్య ఛేదనలో క్లెయిర్ మూర్ (25), ఆమీ స్మిత్ (26) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో టిటాస్ సంధూ, అర్చనా దేవీ, సోనమ్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, రువాండ, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్‌లో రేపు (జనవరి 22) శ్రీలంకను ఢీకొట్టనుంది. కాగా, మహిళ అండర్-19 విభాగంలో టీ20 వరల్డ్‌కప్ జరగడం ఇదే తొలిసారి. -
పేరుకు మాత్రమే అమెరికా.. జట్టు మొత్తం మనోళ్లే
వచ్చే ఏడాది జనవరిలో తొలిసారి ఐసీసీ అండర్-19 వుమెస్స్ టి20 వరల్డ్‌కప్ జరగనుంది. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొననున్నాయి. కాగా 11 దేశాలు ఐసీసీ ఫుల్‌టైం మెంబర్స్ కాగా.. మిగతా ఐదు దేశాలను మాత్రం ఐసీసీ రీజియన్స్ నుంచి ఎంపిక చేశారు. వాటిలో అమెరికా(యూఎస్ఏ) కూడా ఒకటి. తాజాగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్-19 వుమెన్స్ టి20 టోర్నమెంట్‌కు యూఎస్ఏ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే క్రికెట్ అమెరికా ప్రకటించిన జట్టు చూస్తుంటే.. అసలు ఆడుతుంది అమెరికా లేక భారత్ అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే జట్టుకు ఎంపికచేసిన 15 మంది భారత సంతతికి చెందినవాళ్ల కావడం గమనార్హం. ఇక రిజ్వర్స్ కేటగిరలో ఎంపిక చేసిన ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత్‌కే చెందిన వారే ఉన్నారు. ఇలా జట్టు మొత్తం భారతీయుల పేర్లతో నిండిపోయింది. ఇది గమనించిన క్రికెట్ ఫ్యాన్స్.. అమెరికా జట్టులాగా లేదు.. ఇండియా-బి టీమ్ స్క్వాడ్లాగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇక జట్టు హెడ్‌కోచ్‌గా విండీస్ మాజీ క్రికెటర్ శివ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఎంపిక చేసింది. ఇక ఐసీసీ తొలి అండర్-19 వుమెన్స్ టి20 వరల్డ్‌కప్ 2023 జనవరి 14 నుంచి జనవరి 29 వరకు జరగనుంది. జనవరి 27న జరిగే సెమీఫైనల్స్‌కు జేబీ మార్క్స్ ఓవల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జనవరి 29న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. U-19 టోర్నమెంట్ కోసం యూఎస్ఏ ప్రకటించిన జట్టు: గీతిక కొడాలి (కెప్టెన్), అనికా కోలన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), అదితి చూడసమా, భూమిక భద్రిరాజు, దిశా ధింగ్రా, ఇసాని వాఘేలా, జీవన అరస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేష్ (వికెట్ కీపర్), పూజా షా, రీతూ సింగ్ ,సాయి తన్మయి ఎయ్యుణ్ణి,స్నిగ్ధా పాల్, సుహాని తడాని, తరణం చోప్రా రిజర్వ్ ప్లేయర్స్: చేతన ప్రసాద్, కస్తూరి వేదాంతం, లిసా రామ్‌జిత్, మిటాలి పట్వర్ధన్, త్యా గొన్సాల్వేస్ కోచింగ్, సహాయక సిబ్బంది: ప్రధాన కోచ్: శివనారాయణ్ చంద్రపాల్ టీమ్ మేనేజర్: జాన్ ఆరోన్ జట్టు విశ్లేషకుడు: రోహన్ గోసాల అసిస్టెంట్ కోచ్: బర్ట్ కాక్లీ ఫిజియో/మెడికల్: డా. ఆడ్రీ ఆడమ్స్ అసిస్టెంట్ టీమ్ మేనేజర్: జోన్ అలెగ్జాండర్-సెరానో 📡MEDIA RELEASE: USA Cricket Women's U19s Squad for Historic First World Cup Appearance Named 15-player squad to represent Team USA is named for the inaugural ICC Under-19 Women’s T20 World Cup in South Africa next month ➡️: https://t.co/xB789FYppc#WeAreUSACricket🇺🇸 #U19CWC pic.twitter.com/x6Y00UXrE7 — USA Cricket (@usacricket) December 14, 2022 United States of India — Rahul Goyal (@rahulgoyalactor) December 14, 2022 USA Cricket team or India B team?? — Vignesh (@vickki93) December 14, 2022 The USA women's cricket team is a more diverse representation of India than the Indian women's cricket team!:) — Sandeep Ramesh (@SandeepRamesh) December 14, 2022 చదవండి: కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
టీ20 ప్రపంచకప్.. త్వరలో ధోనిని చూసే ఛాన్స్..!
టీ20 క్రికెట్ మొదటి ప్రపంచకప్ విజేత ఎవరంటే క్రికెట్ ప్రేమికులు ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ధోని సారథ్యంలోని యంగ్ ఇండియా అని. ఆ టోర్నీలో ఆద్యంతం అధిపత్యం చలాయిస్తూ దాయాదిని మట్టికరిపించి ట్రోఫిని ఎగరేసుకొచ్చింది టీంఇండియా. ఆ మరపురాని దృశ్యాలు మరోసారి తెరపై చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే సరికొత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఆనాటి మధుర క్షణాలను మీకు రుచి చూపించేందుకు వెబ్ సిరీస్ రూపంలో వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. చదవండి: ‘అలిపిరికి అల్లంత దూరంలో’ మూవీ రివ్యూ) జార్ఖండ్ డైనమెట్ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీంఇండియా 2007లో జరిగిన ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది. సీనియర్లు లేకున్నా యంగ్ ఇండియా కలను సాకారం చేసింది. తుదిమెట్టుపై దాయాది పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటారు. 2007 టీ20 ప్రపంచకప్ మాత్ర అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ మ్యాచ్‌లు మిస్సయినవారికి త్వరలోనే స్క్రీన్‌పై చూపించనున్నారు. యూకేకు చెందిన వన్ వన్ సిక్స్ నెట్ వర్క్ ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. దీనికి ఆనంద్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. పలు భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను డాక్యుమెంటరీగా సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. అప్పటి భారత జట్టులోని 15 మంది ఆటగాళ్లు, తమ అనుభవాలను ఇందులో పంచుకోనున్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #ItStartedWithThem One One Six Network announces Team HAQ SE INDIA’s squad@harbhajan_singh @GautamGambhir @virendersehwag @DineshKarthik @robbieuthappa @IrfanPathan @iamyusufpathan @rpsingh @MJoginderSharma @sreesanth36 @RaviShastriOfc @BumbleCricket @oneonesixltd @haqseindia pic.twitter.com/OFOUn6B3jI — Gaurav Bahirvani (@gauravbahirvani) October 9, 2021 -
బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్ ఫైనల్ చేరినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం అంతగా రాణించలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో బాబర్ కెప్టెన్సీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. మరికొంత మంది బాబర్ కెప్టెన్‌గా పనికిరాడని, తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా బాబర్‌ను ఉద్దేశించి పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బాబర్ టీ20 కెప్టెన్సీని వదులుకుని వన్డేలు, టెస్టుల్లో జట్టును నడిపించడంపై దృష్టి సారించాలని అఫ్రిది సూచించాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా పెషావర్ జల్మీ కెప్టెన్సీ బాధ్యతలు ఆజం చేపట్టకూడదని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ వరకు కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బాబర్.. వచ్చే ఏడాది సీజన్లో పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. "బాబర్ ఆజంను నేను చాలా గౌరవిస్తాను. అందుకే అతడు టీ20 క్రికెట్లో కెప్టెన్సీ ఒత్తిడిని తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అతడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, టెస్టు ఫార్మాట్లపై దృష్టిపెట్టాలి. షాదాబ్, రిజ్వాన్, షాన్ మసూద్ వంటి వంటి ఆటగాళ్లకి టీ20 ఫార్మాట్లో జట్టును నడిపించే సత్తా ఉంది. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా బాబర్ సారథ్య బాధ్యతలు చేపట్టకూడదు. అతడు ప్రస్తుతం తన బ్యాటింగ్‌పై దృష్టిసారించాలని" సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్.. టీమిండియా ఓపెనర్‌గా రావాలి -
భారత ఆటగాడిపై సెటైరికల్ ట్వీట్.. మింత్రాపై మండిపడుతున్న నెటిజన్స్!
ఇటీవల కంపెనీలు మార్కెటింగ్ కోసం కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం కంటెంట్‌తో పాటు కాంట్రవర్శీని కూడా జత చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటివి బాగా పెరిగాయి.ఈ తరహాలో ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పాటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆన్లైన్ ప్లాట్‌పాం మింత్రా(MYNTR) కూడా చేరింది. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ వైఫల్యాలపై మింత్రా వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అని ప్రింట్ చేసిన టీ-షర్టులో.. కేవలం 'అవుట్' మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. ఆ ఫోస్ట్‌కు ‘కేఎల్ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్‌గా క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు సంబంధించి నెట్టింట దుమారమే రేగుతోంది. మింత్రా చేసని పనికి సోషల్‌మీడియాలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ స్టంట్స్ ఆపాలంటూ మండిపడుతున్నారు. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలుపెవరిది.. రికార్డులు ఏం చెబుతున్నాయి..?
టీ20 వరల్డ్‌కప్-2022 తొలి సెమీఫైనల్లో రేపు (నవంబర్ 9) న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ సమరంలో ఇరు జట్లు కత్తులు దూసుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-1లో అగ్రస్థానంతో న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 నుంచి పాకిస్తాన్ రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో సెమీస్‌లో భారత్.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుండటంతో పాక్-కివీస్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలన్న ఆతృత భారతీయ అభిమానుల్లో పెరిగింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచి, ఇంగ్లండ్‌పై టీమిండియా గెలిస్తే.. ఫైనల్లో దాయదాల రసవత్తర సమరాన్ని వీక్షించవచ్చన్నదే టీమిండియా ఫ్యాన్స్ ఆకాంక్ష. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టీమిండియా ఫ్యాన్స్ అయితే పాక్ తప్పక గెలిచి, ఫైనల్లో తమతో తలపడాలని ఆశపడుతున్నారు. బలాబలాలు, రికార్డులతో సంబంధం లేకుండా పాకే గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయో ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకు కివీస్-పాక్‌ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ 17 మ్యాచ్‌ల్లో, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు 6 సందర్భాల్లో ఎదురెదురు పడగా.. పాక్ 4 సార్లు, కివీస్ 2 సార్లు విజయం సాధించాయి. గత 5 టీ20ల్లో పాక్ 4 మ్యాచ్‌ల్లో గెలువగా.. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. మరోవైపు వన్డే, టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ల్లో పాక్‌కు న్యూజిలాండ్ చేతుల్లో ఓటమన్నదే లేదు. ఈ రెండు జట్లు వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో మూడుసార్లు సెమీఫైనల్స్‌లో తలపడగా.. అన్నింటిలో పాకిస్థానే విజయం సాధించింది. 1992 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం, 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం, 2007 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లెక్కన టీ20ల్లో న్యూజిలాండ్‌పై పాక్ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. చదవండి: కెప్టెన్‌గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా -
జింబాబ్వేతో టీమిండియా ‘ఢీ’.. గెలిస్తే గ్రూప్ టాపర్‌గా రోహిత్ సేన
సరిగ్గా రెండు వారాల క్రితం మెల్బోర్న్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌పై సాధించిన ఈ గెలుపు అభిమానులందరికీ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించింది. ఇప్పుడు అదే వేదికపై లీగ్ దశను ముగించేందుకు టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. బలహీన ప్రత్యర్థిని ఓడించి గ్రూప్–1లో మొదటి స్థానంలో నిలవాలని రోహిత్ బృందం పట్టుదలతో ఉంది. అయితే స్టార్లు లేకపోయినా జింబాబ్వేను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే! అలసత్వంతో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్ ఇప్పటికీ టోర్నీలో సెమీస్ స్థానం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆదివారం మధ్యాహ్నం అభిమానులకు వినోదం ఖాయం. మెల్బోర్న్: పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై విజయాలు, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టు టి20 వరల్డ్‌కప్ లీగ్ దశలో తమ చివరి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. అధికారికంగా భారత్‌కు ఇంకా సెమీస్ స్థానం ఖరారు కాలేదు కానీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూప్ టాపర్‌గా భారత్ సెమీస్ చేరుతుంది. అదే జరిగితే ఈ నెల 10న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో రెండో సెమీఫైనల్లో టీమిండియా తలపడుతుంది. టోర్నీ ఆసాంతం స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్ తరహాలోనే 90 వేలకు పైగా సామర్థ్యం ఉన్న ఎంసీజీలో ఈ పోరు కు కూడా అన్ని టికెట్లూ అమ్ముడవడం విశేషం. చహల్‌కు అవకాశం దక్కేనా... గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై చివర్లో గట్టెక్కినా... తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. టాపార్డర్ బ్యాటర్ల నుంచి బౌలర్ల వరకు అందరూ సమష్టిగా రాణిస్తున్నారు. ఒక్క వికెట్ కీపర్ విషయంలోనే కాస్త సందేహాలు అనిపించాయి. బంగ్లాతో పోరులోనే కార్తీక్ బదులుగా పంత్ ఆడతాడని అనిపించినా, చివరకు అది జరగలేదు. అంటే ఫినిషర్‌గా కార్తీక్‌పైనే జట్టు మేనేజ్మెంట్ ఎక్కువగా నమ్మకముంచుతోంది. పేసర్లు షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్ ప్రతీ మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించారు. జింబాబ్వేపై కూడా ఈ ముగ్గురు ప్రభావం చూపగలరు. సమష్టిగా రాణిస్తే... పాకిస్తాన్‌పై విజయంతో ఒకదశలో జింబాబ్వే జట్టులో కూడా సెమీస్ ఆశలు రేగాయి. అయితే బంగ్లా, నెదర్లాండ్స్ చేతుల్లో పరాజయాలు ఆ జట్టును దెబ్బకొట్టాయి. ఈ రెండుసార్లు బ్యాటింగ్ వైఫల్యంతోనే జింబాబ్వే ఓడింది. సికందర్ రజా, విలియమ్స్‌పైనే జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. మరోవైపు జింబాబ్వే బౌలింగ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. పేసర్లు చటారా, ఎన్‌గరవ, ముజరబానిలను జట్టు నమ్ముకుంటోంది. ఈ ముగ్గురూ టోర్నీలో వేర్వేరు దశల్లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. పట్టుదలగా బౌలింగ్ చేస్తే వీరు భారత బ్యాటింగ్‌ను కొంత వరకు ఇబ్బంది పెట్టగలరేమో చూడాలి. పిచ్, వాతావరణం ఎంసీజీలో ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు షెడ్యూల్ కాగా, మూడు రద్దయ్యాయి. ఒక మ్యాచ్‌ను కుదించగా, భారత్–పాక్ మ్యాచ్ మాత్రమే పూర్తిగా సాగింది. ఆదివారం వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. కొత్త పిచ్‌పై పేసర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ ఓవరాల్‌గా బ్యాటింగ్‌కే అనుకూలం. 1: టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, జింబాబ్వే మధ్య ఇదే తొలి మ్యాచ్. -
Ind Vs Pak: నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్ చూశా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
నరాలు తెగే ఉత్కంఠగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌లో భారత్ విజయం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్పందించారు. విరాట్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాలో అనుష్క శర్మ రాస్తూ..' ఈ దీపావళికి ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపారు. మీరు ఒక అద్భుతం. మీ పట్టుదల, నమ్మకం, మనస్సును కదిలించేలా ఉన్నాయి. నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్ చూశా. నేను మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ చేస్తుంటే మా పాపకు అర్థం కానీ పరిస్థితి. కానీ ఏదో ఒక రోజు తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారని తెలుసుకుంటుంది. అత్యంత కఠిన పరిస్థితుల నుంచి ఎన్నడు లేనంతగా పుంజుకున్నారు మీరు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీపై నా ప్రేమ అపరిమితం' అంటూ రాసుకొచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
వాట్ యాన్ ఎక్సలెంట్ రన్ ఛేజ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
వాట్ ఏ విన్.. వాట్ ఏ మాసివ్ ఫర్ఫామెన్స్.. కింగ్ కోహ్లీ కా కమాల్.. టీ ట్వంటీ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో భారత్ సెన్సేషనల్ విన్. ఇలా ఏ పదం వాడినా టీమిండియా ఘనతను వర్ణించడానికి సరిపోదేమో. అలాంటి విజయాన్ని సాధించింది టీమిండియా. 30 పరుగులకే టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ చివరి ఓవర్లో చివరి బంతికి దాయాది పాకిస్తాన్‌పై గెలుపును రుచి చూసింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి టోర్నీలో ఘనంగా బోణి కొట్టింది. తాజాగా ఈ ఘనవిజయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. (చదవండి: జపనీస్ భాష నేర్చుకుంటున్న ఎన్టీఆర్.. యువతులతో సరదా సంభాషణ..!) జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్: నరాలు తెగే ఉత్కంఠకు తెరతీసిన మ్యాచ్‌పై తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం స్పందించాడు. టీమిండియా ఘనతను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. ఈ మేరకు టీమిండియా ప్రదర్శను పొగుడుతూ ట్వీట్ చేశారు. ' చాలా అద్భుతమైన ఛేదన , కోహ్లీ అండ్ టీం సంచలన విజయం సాధించింది. నేను మ్యాచ్‌ను చాలా ఎంజాయ్ చేశాను' అంటూ ట్వీట్ చేశారు. జూనియర్ సైతం టీమిండియా ఘనతకు ఫిదా అయ్యారు. అది కాస్తా వైరలవడంతో అభిమానులు రీ ట్వీట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. What an excellent run chase !! Kohli and the team pulled off a sensational win ! Enjoyed it. — Jr NTR (@tarak9999) October 23, 2022 -
లంకకు నమీబియా షాక్
గిలాంగ్: ఆసియా టి20 చాంపియన్ శ్రీలంకకు క్రికెట్ కూన నమీబియా పెద్ద షాకే ఇచ్చింది. టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్ (క్వాలిఫయర్స్) మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో 2014 టి20 ప్రపంచకప్ విజేత లంకను చిత్తు చేసింది. గతేడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న నమీబియా ఇక్కడ తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేసింది. మొదట నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జాన్ ఫ్రయ్‌లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఒకదశలో 14.2 ఓవర్లలో 93 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నమీబియాను ఫ్రయ్‌లింక్, స్మిట్ ధాటిగా ఆడి ఆదుకున్నారు. ఇద్దరు చివరి 5.4 ఓవర్లలోనే ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మదుషాన్ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ దాసున్ షనక (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), రాజపక్స (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) తప్ప ఇంకెవరూ ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయారు. ఫ్రయ్‌లింక్ (2/26), స్మిట్ (1/16) బంతితోనూ ఆకట్టుకున్నారు. వీస్, బెర్నార్డ్, షికొంగో తలా 2 వికెట్లు తీశారు. నెదర్లాండ్స్ బోణీ ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నెదర్లాండ్స్ ఆఖరిదాకా చెమటోడ్చి నెగ్గింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్ ఆఖర్లో కాస్త ఉత్కంఠ రేపినా... నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో గట్టెక్కింది. తొలుత యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. ఓపెనర్ వసీమ్ (47 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. బస్ డి లీడే (3/19) ఒక్క ఓవర్‌తో మలుపు తిప్పాడు. 91/2 స్కోరుతో ఒకదశలో పటిష్టంగానే కనిపించిన యూఏఈకు అదేస్కోరుపై వసీమ్ వికెట్‌ను కోల్పోయాక కష్టాలు మొదలయ్యాయి. 18వ ఓవర్లో ఫరీద్ (2) రనౌటయ్యాడు. ధనాధన్ ఆడే డెత్ ఓవర్లలో పరుగులకు బదులు వికెట్లు రాలడంతో యూఏఈ ఊహించనిరీతిలో కట్టడి అయ్యింది. 19వ ఓవర్ వేసిన డి లీడే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. అరవింద్ (18), బాసిల్ హమీద్ (4), కెప్టెన్ రిజ్వాన్ (1)లను లీడే అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో అఫ్జల్ ఖాన్ (5)ను క్లాసెన్ పెవిలియన్ చేర్చడంతో... కేవలం 19 పరుగుల వ్యవధిలోనే యూఏఈ 6 వికెట్లను కోల్పోయింది. తర్వాత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఓడోడ్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో కెప్టెన్ ఎడ్వర్డ్స్ (16 నాటౌట్), ప్రింగిల్ (5) కుదురుగా ఆడి గెలిపించారు. జునైద్ సిద్ధిఖ్ 3 వికెట్లు తీశాడు. చివరి 12 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో 19 ఓవర్లో ప్రింగిల్ను జహూర్ ఖాన్ అవుట్ చేయగా 4 పరుగులే వచ్చాయి. 6 బంతుల్లో 6 పరుగుల విజయ సమీకరణం యూఏఈని ఊరించినప్పటికీ ఎడ్వర్డ్స్, వాన్ బిక్ (4) షాట్ల జోలికి వెళ్లకుండా ఒకట్రెండు పరుగులు తీసి జట్టును గెలిపించారు. గ్రూప్ ‘బి’లో నేటి మ్యాచ్‌లు స్కాట్లాండ్ vs వెస్టిండీస్ (ఉదయం గం. 9:30 నుంచి) ఐర్లాండ్ vs జింబాబ్వే (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్, కోహ్లి కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే!
Ricky Ponting Picks Two Indians In World T20I Top 5 List: ఆస్ట్రేలియా వేదికగా జరగన్న టీ20 ప్రపంచకప్-2022కు సమయం దగ్గర పడతుండడంతో ఆయా జట్లు తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ధ్వైపాక్షిక సిరీస్‌లతో జట్లు బీజీ బీజీగా గడపనునున్నాయి. ఇక భారత విషయానికి వస్తే.. ప్రపంచకప్ ముందు ప్రస్తుత జరుగుతున్న ఆసియాకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడనుంది. కాగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో గెలిచి భారత్‌కు టైటిల్ అందించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. 'ఐసీసీ రివ్యూ' షో పాల్గొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్లో టాప్- ఫైవ్ ప్లేయర్ల పేర్లు చెప్పమని ఆడగగా.. పాంటింగ్ తన మొదటి ఎంపికగా భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంచుకున్నాడు. అదే విధంగా మిగితా నాలుగు స్ధానాల్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, పాకిస్తాన్ సారథి బాబర్ ఆజాం, ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంపిక చేశాడు. చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4 Match: పంత్, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! -
2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
టీ20 వరల్డ్‌కప్- 2022 క్వాలిఫియర్ మ్యాచ్‌లో భాగంగా జర్మనీతో బహ్రెయిన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ స్పిన్నర్ జునైద్ అజీజ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో జునైద్ అజీజ్ తన స్పిన్ మయాజాలంతో ప్ర్యతర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అజాజ్ 2 ఓవర్లు పూర్తి చేయకుండానే 5 వికెట్లు పడగొట్టాడు. కేవలం 10 బంతుల్లోనే 5 వికెట్లు సాధించాడు. తొలి ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన అజాజ్.. రెండో ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. అయితే టీ20 క్రికెట్లో రెండు ఓవర్లు పూర్తి కాకుండానే 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా అజాజ్ నిలిచాడు. అజాజ్ స్పిన్ ధాటికి 106 పరుగులకే జర్మనీ కుప్పకూలింది. జర్మనీ బ్యాటర్లలో విజయ్ శంకర్ ఒక్కడే 50 పరుగులతో రాణించాడు. ఇక బహ్రెయిన్ బౌలర్లలో అజాజ్ వికెట్లు పడగొట్టగా, వసీం అహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. ఇక 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బహ్రెయిన్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. బహ్రెయిన్ బ్యాటర్లలో సర్ఫరాజ్ ఆలీ(69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND Vs WI 3rd T20: దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైరలవుతున్న సూర్యకుమార్ నమసెలబ్రేషన్స్ 1 2 W W . W 2 W . W Bahrain's Junaid Aziz delivered a dream spelling taking five wickets in 10 balls against Germany! 🤯#T20WorldCup pic.twitter.com/a33aPdlqIU — T20 World Cup (@T20WorldCup) February 19, 2022 -
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోనుందా?
టీ20 ప్రపంచకప్-2022కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక భారత్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. దాయాదుల పోరు అక్టోబర్ 23న ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. మొత్తం 8 జట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్-2లో టీమిండియా,పాకిస్తాన్,దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 30న పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక గ్రూపు-బిలో విజేతతో నవంబర్ 6న చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది. భారత్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను స్టార్ స్పోర్ట్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. చదవండి: Axar Patel: ప్రేయసి మేహాతో అక్షర్ పటేల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్ -
క్రికెట్ అభిమానులుకు గుడ్ న్యూస్.. పాకిస్తాన్‌తో భారత్ తొలిపోరు
ICC T20 World Cup India First Match: టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూ ల్ను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే మరోసారి భారత అభిమానులుకు ఐసీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ వరల్డ్‌కప్‌లో కూడా ఒకే గ్రూపులో పాక్, భారత జట్లు ఉన్నాయి. దీంతో మరోసారి దాయాదుల పోరుకు టీ20 ప్రపంచకప్ వేదిక కానుంది. అక్టోబర్ 23న ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్తాన్‌తో తమ తొలిపోరులో భారత్ తలపడనుంది. కాగా టీ20 ప్రపంచకప్-2021 లీగ్ దశలో పాక్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక ఫైనల్ మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరగనుంది. మొత్తం 8 జట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్-2లో టీమిండియా,పాకిస్తాన్,దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ! The fixtures for the ICC Men’s #T20WorldCup 2022 are here! 👇 pic.twitter.com/4ySJPOollF — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 21, 2022 -
T20 World Cup: బిల్డప్ ఎక్కడికి పోయింది బాస్!
దుబాయ్: ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో మ్యాచ్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచింది షాహిన్ అఫ్రిది. భారత్‌ను ఆదిలోనే కోలుకోలేని దెబ్బకొట్టడంతో షాహిన్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఎక్కడ చూసినా షాహిన్.. షాహిన్. ఇది హోరు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కూడా షాహిన్ అఫ్రిది ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. మనోడు కూడా ఎక్కడా తగ్గేది లే అన్నట్లు వరుసగా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చుకుంటూ పోయాడు. అది చూసిన భారత ఫ్యాన్స్ బిల్డప్ కాస్త ఎక్కువైందనే చమత్కరించుకున్నారు. ఇప్పుడు ఆ బిల్డప్ ఎక్కడికో పోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కావాలా షాహిన్ ఆటోగ్రాఫ్‌లు అంటూ జోక్స్ వేస్తున్నారు. ఇందుకు కారణం ఆసీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచే. అది కూడా కేవలం ఒక్క ఓవర్‌తోనే అప్పటివరకూ హీరోగా నిలిచిన షాహిన్.. విలన్ అయిపోయాడు. పొగిడిన నోళ్లే.. ఏమి బౌలింగ్ అంటూ నోరు పారేసుకున్నారు. హీరోగారి బిల్డప్ ఎక్కడికి పోయిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన షాహిన్.. 31 పరుగులిచ్చి 3 మూడు వికెట్లు తీశాడు. అవి కూడా రోహిత్, రాహుల్, కోహ్లిలు వికెట్లు కావడంతో షాహిన్ పేరు మార్మోగిపోయింది. మరి ఆసీస్‌తో మ్యాచ్‌లో షాహిన్ బౌలింగ్ గణాంకాలు బాగానే ఉన్నాయి. నాలుగు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చిన వికెట్ మాత్రమే తీశాడు. తన ఆఖరి ఓవర్(మ్యాచ్‌కు చివరి ఓవర్) ముందు వరకూ 13 పరుగులే ఇచ్చాడు షాహిన్. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ మాథ్యూవేడ్..షాహిన్ వేసిన ఆఖరి ఓవర్ మూడో బంతికి బతికి బయటపడటంతో ఆపై మ్యాచ్ స్వరూపమే మారింది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఏమిటో మరొకసారి నిజం చేశాడు వేడ్. ఆసీస్‌కు ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయిన తరుణంలో వేడ్ వరుసగా కొట్టిన సిక్స్‌లు మ్యాచ్ స్థితిని మొత్తం మార్చేశాయి. షాహిన్ వేయడం వేడ్ సిక్సర్ల మోత మోగించడం చకచకా జరిగిపోయాయి. అసలు ఏమౌతుందో తెలుసుకునే లోపే మ్యాచ్ ముగిసి కంగారులు ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయం కాగా, పాక్ ఆటగాళ్లు తలపై చేతులు పెట్టుకుని గ్రౌండ్లో కూలబడిపోయారు. పాకిస్తాన్‌ను సెమీ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన అఫ్రిదిని సెమీస్ తర్వాత ఏమనాలో ఆ జట్టుకు అంతుబట్టలేదు. అభిమానులు మాత్రం షాహిన్‌ను ఆడేసుకుంటున్నారు. ఏం బాస్.. మొత్తం మీద సెమీస్‌కు చేరడానికి, సెమీస్ నుంచి వైదొలగడానికి కారణం అయ్యావ్.. ఏం చేస్తాం.. టైమ్ బాలేనట్లు ఉంది.. నెక్స్టైమ్ బెటర్ లక్ అంటూ ఆటపట్టిస్తున్నారు. చదవండి: T20 World Cup 2021: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా -
ఆస్ట్రేలియా మ్యాచ్‌తో కెరీర్ ముగించిన విండీస్ దిగ్గజాలు
-
KL RAHUL: నేను జట్టులో ఉండాలి.. భారత్ ప్రపంచకప్ గెలవాలి
Want to win a World Cup one or two or three Says KL Rahul: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా శుక్రవారం(నవంబర్5)న కీలక స్కాట్లాండ్తో మ్యాచ్ నేపథ్యంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తాను జట్టులో ఉండగా టీమిండియా ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించాలని రాహుల్ ఆకాంక్షించాడు. రాహుల్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే రాహుల్ కోరిక ఈ ఏడాది ప్రపంచకప్‌లో నెరవేరే అవకాశం లేదు. ఎందుకంటే టీమిండియా ఇప్పటికే సెమిస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కాగా భారత జట్టుకు భవిష్యత్తు నాయకులలో ఒకరిగా పేరుపొందిన రాహుల్ గతంలో 2019లో వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా ఆ మ్యాచ్‌ను గెలవలేకపోయినందుకు తాను ఎంత బాధపడ్డాడో అతడు చాలా ఇంటర్వ్యూల్లో తెలిపాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రపంచకప్ గెలవాలనే తన కోరిక గురించి రాహుల్ వెల్లడించాడు. "2011లో భారత్ సాధించిన ప్రపంచకప్ విజయాన్ని నేను చూశాను. అప్పుడే నా దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలని, గెలిచిన భారత జట్టులో నేను భాగమై చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నాను' అని ఇన్స్టాగ్రామ్ రీల్లో రాహుల్ పేర్కొన్నాడు. చదవండి: ఆ భారత బౌలర్ టీ20లకు పనికిరాడు.. పక్కన పెట్టండి -
విశాఖపట్నంలో T20 ఫీవర్
-
తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు
Lowest T20I Totals In T20 World Cups.. టి20 క్రికెట్ అంటేనే భారీ స్కోర్లకు పెట్టింది పేరు. అటువంటి టి20 క్రికెట్లో లోస్కోరింగ్ మ్యాచ్‌లు జరగడం సహజమే. ఇక టి20 ప్రపంచకప్ లాంటి మేజర్టోర్నీల్లో అత్యల్ప స్కోర్లు నమోదు కావడం కనిపిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన క్వాలిఫయర్ గ్రూఫ్-బి మ్యాచ్‌లో పపువా న్యూ గినియా తృటిలో లోస్కోరింగ్ రికార్డు నుంచి తప్పించుకుంది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి పపువా 10 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. అయితే కిప్లిన్ డోరిగా 46 పరుగులతో పపువాను చెత్త రికార్డు నుంచి బయటపడేశాడు. 97 పరుగులకు ఆలౌటై అత్యల్ప స్కోరు రికార్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది.ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో మూడు జట్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేశాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.. చదవండి: T20 WC 2021 BAN Vs PNG: బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత! ఐసీసీ టి20 ప్రపంచకప్ 2014( నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక) టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోరు నెదర్లాండ్స్ పేరిట ఉంది. 2014 టి20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌట్ అయింది. అజంతా మెండిస్, అంజెల్లో మాథ్యూస్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. లసిత్ మలింగ, కులశేఖర చెరో రెండు వికెట్లు తీశారు. ఇక 40 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు 5 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: T20 WC 2021: వారెవ్వా షకీబ్.. ఇలాంటి ఆల్‌రౌండర్ ఒక్కడున్నా చాలు ఐసీసీ టి20 ప్రపంచకప్ 2014(శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్) టి20 ప్రపంచకప్‌లో రెండో అత్యల్ప స్కోరు న్యూజిలాండ్‌పై ఉంది. 2014 టి20 ప్రపంచకప్‌లోనే మరోసారి శ్రీలంక ప్రత్యర్థిగా న్యూజిలాండ్ ఈ స్కోరు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌలఅయింది. లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం బ్లాక్‌క్యాప్స్‌కు ఎక్కువసేపు నిలవలేదు. లంక స్పిన్నర్లు రంగన హెరాత్(5/3) కెరీర్ బెస్ట్స్పెల్కు తోడూ.. సుచిత్ర సేనానాయకే(2/3) దెబ్బకు న్యూజిలాండ్ 60 పరుగులకే తోక ముడిచి 59 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐసీసీ టి20 ప్రపంచకప్ 2010( ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్) ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు ఐర్లాండ్ పేరిట ఉంది. టి20 ప్రపంచకప్ 2010లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 68 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 138 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక మిగిలిన ఐదు వికెట్లను కేవలం 18 పరుగుల తేడాతో జార్చుకొని అత్యల్ప స్కోరును నమోదు చేసింది. విండీస్ బౌలర్లు రవి రాంపాల్, డారెన్ సామీలు ఐర్లాండ్ లైనఫ్‌ను కుప్పకూల్చారు. చదవండి: T20 WC 2021: మెంటార్‌గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్ -
KL Rahul: పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్న కేఎల్ రాహుల్!
KL Rahul Likely to Say Good Bye to Punjab Kings: ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన పంజాబ్ కింగ్స్‌కు మరో గట్టి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రస్తుత సీజన్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించడం లేదని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్ బజ్ తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది. త్వరలో జరగనున్న మెగా వేలంలోకి వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు రాహుల్ సంప్రదించినట్లు సమాచారం. అయితే రిటేన్ పాలసీ ప్రకారం ప్రతీ జట్టు ముగ్గురు ప్లేయర్స్‌ను రిటేన్ చేసుకునే హక్కు ఫ్రాంచైజీకి ఉంటుంది. అయితే బ్యాట్స్‌మన్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి.. కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్ అందించకపోవడంపై రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వినికిడి. కాగా బీసీసీఐ తదుపరి సీజన్ కోసం రిటేన్ పాలసీ మార్గదర్శకాలను ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ సీజన్లో 13 మ్యాచ్‌లలో రాహుల్ 626 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా బబుల్‌లో చేరాడు. అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి! -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస
లండన్: ఇంగ్లండ్ జాతీయ జట్టుకు 2011-2014 మధ్యలో 24 వన్డేలు, 34 టీ20లు ఆడిన జేడ్ డెర్న్‌బాచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోవడంతో ఇంగ్లండ్‌ను వీడి మరో దేశానికి ప్రాతినధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 ఐరోపా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటలీ జట్టు తరఫున ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తన తల్లి ద్వారా ఇదివరకే ఇటలీ పాస్ పోర్ట్ కలిగిన డెర్న్‌బాచ్.. మాజీ సహచర ఆటగాడు ప్రస్తుత ఇటలీ కోచ్ కమ్ కెప్టెన్ గారెత్ బెర్గ్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. డెర్న్బాచ్తో పాటు కెంట్ కౌంటీ జట్టు ఆటగాడు గ్రాండ్ స్టువార్ట్ కూడా ఈ ప్రపంచకప్ క్వాలిపయర్స్లో ఇటలీకి ఆడనున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఓవైస్ షా ఇటలీ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోచ్, అసిస్టెంట్ కోచ్, ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతనిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉంటే, 35 ఏళ్ల వెటరన్ బౌలర్ జేడ్ డెర్న్‌బాచ్.. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 31, టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. అతను ప్రస్తుతం సర్రే కౌంటీ జట్టు కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. చదవండి: పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్ -
4 ఓవర్లు.. 4 మెయిడెన్స్..4 వికెట్లు.. చెలరేగిన మహిళా బౌలర్
అబుజా: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో పలు రికార్డులు నమోదు అవుతున్నాయి. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు మన్కడింగ్‌లు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కామెరూన్, నైజీరియా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో తాజాగా మరో రికార్డు నమోదైంది. నైజీరియా బౌలర్ బ్లెస్సింగ్ ఎటిమ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా నాలుగు మెయిడెన్లు వేసి, నాలుగు వికెట్లు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కామెరూన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో కేవలం 47 పరుగులకే కూప్పకులిపోయింది. కామెరూన్ బ్యాట్స్ఉమెన్లో 23 పరుగులు సాదించి నాంటియా కెన్‌ఫెక్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. నైజీరియా బౌలర్ ఎటిమ్ నాలుగు వికెట్లు సాధించి కామెరూన్ నడ్డి విరిచింది. అలాగే మిరాకిల్ ఇమ్మోల్, మేరీ డెస్మండ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 48 పరగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నైజీరియా కేవలం 6.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. చదవండి: MS Dhoni: పాకిస్తాన్‌పై చారిత్రత్మక విజయానికి నేటికి 14 ఏళ్లు.. -
అరంగేట్ర మ్యాచ్‌లోనే నలుగురిని మన్కడింగ్ చేసిన బౌలర్
కంపాలా: అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఆటగాళ్లు సెంచరీలు, హ్యాట్రిక్‌లు సాధించడం వంటి రికార్డులను క్రికెట్లో సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఓ రికార్డు సాధించింది. ఏకంగా ఐదుగురుని ఔట్ చేసింది. అయినప్పటికీ తమ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి విసిరిన 191 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చేతులెత్తేశారు. కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. ఇక ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో మేవా డౌమా సాధించిన రికార్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె తీసిన ఐదు వికెట్లలో నాలుగు వివాదాస్పద మన్కడింగ్ ద్వారానే రావడం గమనార్హం. కామెరూన్, ఉగాండా జట్ల మధ్య ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. మొత్తం మీద తన నాలుగు ఓవర్ల కోటాలో ఐదుగురిని పెవిలియన్ పంపిన మేవా డౌమా మన్కడింగ్‌తో కాకుండా ఒక వికెట్ మాత్రమే తీసింది. అయితే, మన్కడింగ్ ద్వారా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపినప్పటికీ అప్పటికే స్కోరు బోర్డు పరుగులు పెట్టడంతో ఉగాండా ముందు భారీ లక్ష్యం నిలిచింది. మన్కడింగ్ అంటే ఏమిటి? క్రికెట్ నియమావళిలోని వివాదాస్పద నిబంధనల్లో ఇదొకటి. రూల్ 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ ఉపయోగించారు. దీంతో.. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా నియమావళిలో చేర్చింది. చదవండి: Virat Kohli: అవన్నీ తప్పుడు ప్రచారాలు.. అతడే కెప్టెన్: బీసీసీఐ క్లారిటీ pic.twitter.com/KjVCYGvQoh — hypocaust (@_hypocaust) September 12, 2021 -
అఫ్గాన్ టీ20 జట్టు: కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అఫ్గాన్ టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌కు అఫ్గానిస్తాన్ క్రికెట్ సెలక్టర్లు.. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే విధంగా ప్రపంచ కప్‌లో పాల్గొనే అఫ్గాన్ జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) ప్రకటించింది. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అనంతరం టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx — Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021 ‘బాధ్యతయుతమైన జట్టు కెప్టెన్‌గా టీ20 జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కును కలిగిఉన్నాను. కానీ, సెలక్షన్ కమిటీ, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) కనీసం నా అభిప్రాయం తీసుకోలేదు. నేను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను దేశం తరఫున ఆడేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0 — Rashid Khan (@rashidkhan_19) September 9, 2021 -
తండ్రైన క్రికెటర్.. నీకు స్వాగతం చిట్టితల్లీ!
Aaron Finch announces arrival of a baby girl: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తండ్రయ్యాడు. అతడి భార్య అమీ ఫించ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపాయికి ఎస్తేర్ కేట్ ఫించ్గా నామకరణం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్న ఆరోన్ ఫించ్.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘ఎస్తేర్ కేట్ ఫించ్.. ఈ అందమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా చిన్నారి రాకుమారి నిన్న సాయంత్రం 4 గంటల 58 నిమిషాల సమయంలో జన్మించింది. తను 3.54 కిలోల బరువు ఉంది. అమీ, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని భార్యాబిడ్డలతో దిగిన ఫొటోలను ఆరోన్ ఫించ్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చదవండి: హింట్ ఇచ్చావుగా కోహ్లి; ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట! ఇక కెరీర్ విషయానికొస్తే.. గాయాలతో సతమవుతున్న ఆరోన్ ఫించ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌లో మోకాలి గాయం కారణంగా వన్డే సిరీస్ మిస్సయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. మోకాలికి చికిత్స చేయించుకుంటున్న అతడు.. అంతా సవ్యంగా సాగితే అక్టోబరులో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Aaron Finch (@aaronfinch5) -
ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది
దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌ని నిర్ణయించారు. రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. రౌండ్ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్‌నకు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 23న ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్‌తో సూపర్ 12 లీగ్ స్టేజీ మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఇక సూపర్ 12లో గ్రూఫ్ 2లో ఉన్న భారత్.. అక్టోబర్ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గనిస్తాన్‌తో, నవంబర్ 5న బి1 క్వాలిఫయర్‌తో, నవంబర్ 8న ఏ1 క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్, నవంబర్ 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
కోలుకున్నాడు.. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌నకు రెడీ!
బెంగళూరు: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకున్నట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తెలిపింది. అతను పోటీ క్రికెట్ ఆడుకోవచ్చని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వాయిదా పడిన ఐపీఎల్ సహా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌నకు అతను అందుబాటులో ఉంటాడు. మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అయ్యర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఇక బ్యాట్ మాట్లాడుతుంది.. ‘‘గాయం నుంచి కోలుకునేందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యుద్ధానికి రెడీ. ఆడటానికి సిద్ధం. ఇక రాబోయే కాలంలో బ్యాట్ మాట్లాడుతుంది’’ అంటూ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు శ్రేయస్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ గాయపడటంతో అతడి స్థానంలో టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్ విషయంపై నీరజ్ చోప్రా క్లారిటీ -
ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా
న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తన పీక కోస్తానని వార్నింగ్ ఇచ్చాడని సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటి ఇంగ్లండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్ తనను రెచ్చగొట్టడం వల్లే స్టువర్డ్ బ్రాడ్‌పై ఎదురుదాడికి దిగానని, ఈ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పానని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ 17వ ఓవర్లో ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో తాను వరుసగా రెండు ఫోర్లు కొట్టానని, దీంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్ తనపై నోరుపారేసుకున్నాడని పేర్కొన్నాడు. రెండు చెత్త షాట్లు ఆడి సంబర పడొద్దని, తనను గేలి చేశాడని తెలిపాడు. దీనికి తాను కూడా అదే రితీలో స్పందించడంతో మాటామాటా పెరిగి కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఫ్లింటాఫ్.. ‘నీ గొంతు కొస్తా' అని నన్ను హెచ్చరించగా, నేను కూడా బ్యాట్‌తో తలపై బాదుతానని బదులిచ్చానన్నాడు. అయితే ఫ్లింటాఫ్‌పై కోపానికి ఆ మరుసటి ఓవర్ బౌల్ చేసిన స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడని యువీ తెలిపాడు. బ్రాడ్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందెన్నడూ ఆడని షాట్లను ఆడానని, యార్కర్ బంతులను సైతం స్టాండ్స్‌లోకి పంపానని అలనాటి మధుర క్షణాలను స్మరించుకున్నాడు. ఆఖరి బంతిని సిక్సర్ బాదాక ఫ్లింటాప్ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వానని యువీ చెప్పుకొచ్చాడు. యువీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రముఖ స్కోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ నాటి అద్భుత క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చదవండి: కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు -
కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు
న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా పగ్గాలు తనకే ఇస్తారని భావించానని సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అయితే, సెలెక్టర్లు ధోనీ పేరు తెరపైకి తేవడంతో తాను కూడా అదే సరైన నిర్ణయంగా భావించానని ఆయన తెలిపాడు. ధోనీ కెప్టెన్ అయ్యాక అతనికి పూర్తిగా మద్దతిచ్చానని చెప్పుకొచ్చాడు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ.. 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని, దీంతో టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు సీనియర్లందరూ అయిష్టత చూపారని, ఆ సమయంలో నేను కెప్టెన్సీ రేసులో ముందున్నాని గుర్తు చేసుకున్నాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి సీనియర్ల గైర్హాజరీలో తనకే కెప్టెన్సీ వస్తుందని అందరూ భావించారని, అయితే సెలక్టర్లు సడెన్‌గా ధోనీ పేరును తెరపైకి తేవడం, అతను టీమిండియా పగ్గాలు చేపట్టడం చకాచకా జరిగిపోయాయని తెలిపాడు. అయితే, ఆ విషయాన్ని తాను అప్పుడే వదిలేశానని, కెప్టెన్ ఎవరైనా సరే ఆటగాడిగా తాను రాణించడమే ముఖ్యమని భావించానని పేర్కొన్నాడు. కాగా, ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన యువీ 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆ క్రమంలో అతను 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ యువీ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉంటే, 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత, పెద్దగా అంచనాలు లేని యువ భారత జట్టు ధోనీ నేతృత్వంలో తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌ను ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ అంచనాలకు మించి రాణించి, రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ విజయం తర్వాత భారత క్రికెట్లో ధోనీకి తిరుగు లేకుండా పోయింది. నాటి నుంచి ధోనీ, యువీ ఇద్దరూ టీమిండియాలో కీలక సభ్యులుగా ఎదుగుతూ భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేశారు. ఈ క్రమంలో వారు భారత్‌ను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. చదవండి: 'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు.. -
ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు..
దుబాయి: 2023-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్టూర్స్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. బోర్డు మెంబర్లతో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే టీ20 ప్రపంచ కప్ రెండేళ్లకోసారి నిర్వహించాలని, అయితే అందులో16 జట్లకు బదులు 20 జట్లను ఆడించాలని నిర్ణయించింది. అలాగే 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ టోర్నీని 10 జట్లకు బదులు 14 జట్లతో జరిపించాలని, ప్రస్తుతం రెండేళ్లకోసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని, నాలుగేళ్లకోసారి జరపాలని ప్రకటించింది. 2019లో చివరిసారిగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 10 పది జట్లు మాత్రమే పాల్గొనగా, 2027, 2031 ప్రపంచకప్‌లలో ఆ సంఖ్య 14కు పెంచాలని, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యను 54కు మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్లో 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-3 జట్లను సూపర్ సిక్స్‌గా పరిగణించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్నిర్వహిస్తారని ప్రకటించింది. ఐసీసీ.. 2003 ప్రపంచకప్‌లో ఇదే పద్ధతిని అనుసరించింది. అలాగే 2024, 2026, 2028, 2030లలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లను 20 జట్లతో నిర్వహించి, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యని 55కి పెంచనున్నట్లు పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లను సూపర్-8గా పరిగణించి, ఆతర్వాత నాకౌట్, సెమీస్, ఫైనల్స్నునిర్వహిస్తారని తెలిపింది. వీటితో పాటు ఎనిమిది జట్లతో నిర్వహించే ఛాంపియన్స్‌ట్రోఫీని ప్రతి నాలుగేళ్లకోసారి (2025, 2029), ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను రెండేళ్లకోసారి (2025, 2027, 2029, 2031) నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఛాంపియన్స్‌ట్రోఫీని గతంలో లాగే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారని పేర్కొంది. చదవండి: శవాలతో రోడ్లపై క్యూ కట్టడం చూశాక నిద్రపట్టేది కాదు.. The ICC events schedule from 2024-2031 has a lot to look forward to 🙌 The Men's events cycle 👇 pic.twitter.com/iNQ0xcV2VY — ICC (@ICC) June 2, 2021 -
T20 World Cup: భారత్‌లో నిర్వహిస్తారా.. లేదా!
దుబాయ్: ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయంపై జూన్ 28లోగా తమకు స్పష్టతనివ్వాలని బీసీసీఐని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరింది. మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో భారత బోర్డు విజ్ఞప్తి మేరకు ఐసీసీ మరో నెల రోజులు గడువిచ్చింది. దీనిపై బీసీసీఐ నుంచి స్పందన వచ్చిన తర్వాత జూన్ 28న తర్వాత జరిగే తమ సమావేశంలో ఐసీసీ అధికారికంగా వరల్డ్‌కప్ వివరాలను ప్రకటిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో టోర్నీ జరగాల్సి ఉంది. అయితే దేశంలోని తాజా పరిస్థితులు, అక్టోబర్ సమయంలో కరోనా మూడో వేవ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. వేదికలు, 16 జట్లకు సాధారణ ఏర్పాట్లతో పాటు బయో బబుల్ కట్టుబాట్లు, అభిమానులను అనుమతించే విషయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 900 కోట్ల రాయితీ పొందడం తదితర అంశాలపై పూర్తి వివరాలతో ఐసీసీకి బీసీసీఐ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో సాధ్యం కాదని తేలితే వరల్డ్‌కప్ ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈ, ఒమన్లను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే వేదిక ఏదైనా నిర్వహణ ఏర్పాట్లు మాత్రమే బీసీసీఐనే చూస్తుంది. 2024 టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు... ఐసీసీ సమావేశంలో 2023–2031 భవిష్యత్ పర్యటన కార్యక్రమానికి (ఎఫ్టీపీ) సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో 14 జట్లు, 2024లో జరిగే టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు ఉంటాయని ఐసీసీ ప్రకటించింది. 2025లో మళ్లీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో నాలుగు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరుగుతాయి. -
రిస్క్ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాలో స్థిరత్వం లోపించిందని.. అందుకే అతను జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడంటూ పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. ఒక యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో భట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభంలోనే రిస్క్ తీసుకొని షాట్లు ఆడుతున్నాడు. ఇది అంత మంచిది కాదు. దీనివల్ల రానున్న టీ20 ప్రపంచకప్‌కు పృథ్వీ ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. టీ20 అంటేనే దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలనేది ప్రథమం. కానీ పృథ్వీ షా ఆరంభంలోనే రిస్క్ షాట్లు ఎక్కువగా ఆడుతున్నాడు. దీనివల్ల తొందరగా వికెట్ కోల్పోయే అవకాశం ఉంది. ప్రతీసారి దూకుడుగా ఆడడం కూడా కరెక్ట్ కాదు. ఆడిన ప్రతీ బంతిని బౌండరీ బాదాలనుకోవడం అతనిలో స్థిరత్వం లేదని చూపిస్తుంది. ఏ జట్టైనా టీ20లో తొలి ఆరు ఓవర్లుగా చెప్పుకొనే పవర్ ప్లేలో స్థిరంగా ఆడే బ్యాట్స్‌మెన్ కావాలి. టీమిండియాకు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు పృథ్వీ షా వారి పక్కన స్థానం సంపాదించాలంటే ముందు స్థిరత్వం చూపించాలి. టీ20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలకు ఇది చాలా కీలకం. షా తన పద్దతి మార్చుకోకుండా ఇలాగే ఆడితే మాత్రం అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కడం కష్టమే'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పృథ్వీ షా ఐపీఎల్ 14వ సీజన్లో మాత్రం దుమ్మురేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అంతకముందు దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం! పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు -
'నేను జోక్ చేశా.. అక్తర్ సీరియస్ అయ్యాడు'
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఆ జట్టులో ఆటగాళ్ల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అంతుచిక్కదు. అనవసర విషయాల్లో తలదూర్చి ఆటగాళ్లు తమ కెరీర్‌ను నాశనం చేసుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. 2007 దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ బౌలర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్‌ల గొడవ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన వాగ్వాదంలో.. కోపంతో అక్తర్ ఆసిఫ్‌పై బ్యాట్‌తో దాడికి దిగాడు.ఆ దెబ్బకు ఆపిఫ్ తొడకు బలమైన గాయం అయింది.ఈ గొడవ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పీసీబీ అతన్ని జట్టు నుంచి తొలగించి టీ20 ప్రపంచకప్ ఆడకుండా సస్పెండ్ చేసింది. అయితే తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అక్తర్ ఆసిఫ్‌కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా 14 ఏళ్ల తర్వాత షాహిద్ అఫ్రిది గొడవకు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేశాడు. ''ఆరోజు ఆసిఫ్, నేను సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇంతలో అక్కడికి వచ్చిన అక్తర్ తన గురించి మాట్లాడుతున్నారని భావించి మమ్మల్ని అడిగాడు. అయితే నీ గురించి మాట్లాడుకోవడానికి మాకు పని లేదా అని నేను జోక్ చేశా.. కానీ అక్తర్ దానిని సీరియస్‌గా తీసుకున్నాడు. దాంతో గొడవ ప్రారంభమైంది.. అలా మాటామాటా పెరిగి తను మాపై బ్యాట్‌తో దాడికి యత్నించాడు. నేను తప్పించుకున్నా.. ఆసిఫ్ మాత్రం గాయపడ్డాడు.. ఈ విషయంలో నేను అక్తర్‌ను తప్పుబట్టలేను.. ఎందుకంటే అతనికి మంచి మనుసు ఉంది. ఆవేశంలో అలా చేశాడు తప్ప వాస్తవానికి అతను చాలా మంచి వ్యక్తి'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అక్తర్ ఆటకు గుడ్‌బై చెప్పాకా తన ఆటోబయోగ్రఫీలో ఆసిఫ్‌తో గొడవను ప్రస్తావించాడు. ''ఆసిఫ్‌తో గొడవ జరగడానికి కారణం అఫ్రిదినే.. ఈ విషయం అతనికి కూడా తెలుసు.. కానీ ఆ సమయంలో నన్ను బ్లేమ్ చేస్తూ తాను తప్పించుకున్నాడు. వాస్తవానికి ఆరోజు జరిగిన గొడవలో అఫ్రిది, ఆసిఫ్‌లను బ్యాట్‌తో కొట్టేందుకు ప్రయత్నించాను. అఫ్రిది తప్పించుకోగా.. ఆసిఫ్ తొడకు మాత్రం గాయం అయింది. కానీ ఇంతకముందు ఏనాడు డ్రెస్సింగ్‌రూమ్‌లో అలా బిహేవ్ చేయలేదు'' అని రాసుకొచ్చాడు. చదవండి: సిగ్గుచేటు.. దేశం ఇలా ఉందంటే నీలాంటి వారి వల్లే -
టీ20 వరల్డ్‌కప్.. ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: కరోనా మహమ్మారి కారణంగా పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మూడు సబ్-రీజినల్ క్వాలిఫయర్ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఐసీసీమెన్స్ టీ20 ప్రపంచకప్ కోసం ఈ అర్హత టోర్నీలను నిర్వహిస్తున్నది. కాగా మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఎ, బి క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఫిన్లాండ్లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్‌కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు క్వాలిఫయర్లను రద్దు చేయడమే మంచిదని నిర్ణయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్స్, ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా ఎంపికచేస్తారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన 2021 టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై బీసీసీఐ ఐసీసీని సంప్రదించినట్లు సమాచారం. -
బ్యాకప్ వేదికగా యూఏఈ.. అనుమతి లభించేనా?
ముంబై: కరోనా దెబ్బకు ఆటలు జరిగే అవకాశం లేని స్థితిలో ఐపీఎల్ వంటి మెగా లీగ్ టోర్నీ అసాధ్యమని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కాస్త లేటుగానైనా గ్రహించింది. ఒకవైపు ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నా ‘జరిపితీరుతాం’ అని నిన్నటి వరకూ పట్టుబట్టుకు కూర్చున్న బీసీసీఐ.. ఎట్టకేలకు దిగివచ్చింది. మళ్లీ ఐపీఎల్ జరగాలంటే దానికి రీషెడ్యూల్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మిగతా బోర్డులకు క్రికెట్ టోర్నీలు లేని సమయం చూసి, అది కూడా కరోనా ఉధృతి తగ్గితేనే ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ముందుకొస్తుంది. గత సీజన్‌ను సెప్టెంబర్ నుంచి నవంబర్ 10వరకూ నిర్వహించినట్లు ప్లాన్ చేసినా అది సాధ్యపడకపోవచ్చు. ఆ సమయంలో టీ20 వరల్డ్‌కప్ ఉంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ ఈ ఏడాదికి వాయిదా పడింది. దానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి భారత్‌లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అప్పటికి ఐపీఎల్‌ను పక్కన పెడితే, టీ20 వరల్డ్‌కప్ కూడా కష్టమే కావొచ్చు. గతేడాది జరగాల్సిన 2020 టి20 ప్రపంచ కప్‌ను 2021లో... 2021లో జరగాల్సిన టోర్నీని 2022లో నిర్వహించనున్నారు. వాస్తవ షెడ్యూల్ ప్రకారం 2023 వన్డే వరల్డ్‌కప్ భారత్‌లో జరగాల్సి ఉంది. సంవత్సరం విషయంలో ఇందులో ఎలాంటి మార్పు లేదు కానీ తేదీలు మారాయి. భారత్‌లో ఫిబ్రవరి–మార్చి మధ్య ఈ టోర్నీ జరగాలి. అయితే రెండు ఐసీసీ టోర్నీల మధ్య ఉండాల్సిన కనీస అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని నవంబరుకు మార్చారు. పాత షెడ్యూల్ ప్రకారం 2021లోనే టి20 ప్రపంచకప్ నిర్వహించాలని, అవసరమైతే ఆస్ట్రేలియా 2022లో నిర్వహించాలని భారత్ కోరడంతో అందుకు గతేడాది గ్రీన్ సిగ్నల్ పడింది. వాస్తవానికి ఈ టీ20 వరల్ట్‌కప్ ఆస్ట్రేలియాలో జరగాలి. అక్కడ జరగాల్సిన టోర్నీ వాయిదా పడటంతో అక్కడే నిర్వహించాలనే సీఎ పట్టుబట్టింది. కానీ అందులో మార్పులు జరగడంతో 2021 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌లో నిర్వహించడానికి ఆమోదముద్ర పడింది. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత్‌లో వరల్డ్కప్లాంటి మెగా ఈవెంట్‌ను నిర్వహించడం అంత ఈజీ కాదు. బ్యాకప్ వేదికగా యూఏఈ టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌లో ఈ సంవత్సరం ద్వితీయార్థం(అక్టోబర్- నవంబరు)లో టోర్నీ నిర్వహణకై బీసీసీఐ హక్కులు సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం దేశంలో కోవిడ్ రోజువారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదు కావడం, కరోనా మరణాలు కూడా పెరుగుతుండటంతో వేదికగా మార్చే దిశగా బీసీసీఐ యోచిస్తోంది. యూఏఈలో నిర్వహిస్తే ఏ ఇబ్బంది ఉండదని భావిస్తోంది. దానికి అనుగుణంగా ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని చూస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌కు పెద్దగా సమయం లేదు. ఇంకా నాలుగు నెలలు మాత్రమే సమయం మాత్రమే ఉండటంతో కనీసం వచ్చే నెల మధ్య నుంచైనా అందుకు సంబంధించిన కార్యాచరణను ముమ్మరం చేయాలి. బ్యాకప్ వేదికగా యూఏఈ అనుకున్నా ప్రస్తుత పరిస్ధితులు దృష్ట్యా యూఏఈ నుంచి అనుమతి లభిస్తుందో లేదో చూడాలి. ఇక్కడ చదవండి: IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ అయోమయంలో ఆసీస్ క్రికెటర్ల పరిస్థితి..! -
నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్, జడ్డూలను తీసుకుంటా..
లండన్: ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినైతే టీ20 ప్రపంచకప్ జట్టులోకి చహల్, కుల్దీప్ యాదవ్‌లను అస్సలు తీసుకోనని, వారి స్థానాల్లో సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లకు అవకాశం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై చహల్-కుల్దీప్ల కంటే అనుభవజ్ఞులైన జడేజా-అశ్విన్‌లవైపు మొగ్గుచూపడమే భారత్‌కు మంచిదని, ఈ ఇద్దరు స్పిన్నర్లు ఆల్‌రౌండర్లనే విషయం మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుత భారత్ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్నర్ల విభాగమే కాస్త కలవరపెడుతోందని ఆయన తెలిపాడు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్, చహల్ కొనసాగుతున్నారని, ఈ ఫార్మట్‌లో వీరి ప్రదర్శన అంత మెరుగ్గా లేకపోవడం వల్లనే తాను ఈ తరహా వ్యాఖ్యలు చేశానని పనేసర్ వెల్లడించాడు. గత 10 మ్యాచ్‌ల్లో చహల్ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టగా, కుల్దీప్ ఆ మాత్రం ప్రభావం కూడా చూపలేకపోయాడన్నాడు. ఈ నేపథ్యంలోనే అశ్విన్-జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్కు ఆయన సూచించాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ చహల్, కుల్దీప్కు అగ్ని పరీక్షలాంటిదని, ఇందులో విఫలమైతే వారి టీ20 ప్రపంచకప్ బెర్త్‌లపై సందిగ్ధత నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేకపోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
'వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు భయపడాల్సిందే'
అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు.. అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లండ్ జట్టు అద్భుతంగా ఆడుతుందని.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను చూసి ప్రత్యర్థులు భయపడే అవకాశముందని తెలిపాడు. 2010లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా కొలింగ్‌వుడ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా.. ఇరు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. కాగా నేడు కీలకమైన ఐదో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో కొలింగ్‌వుడ్ స్పందించాడు. 'గత నాలుగేళ్లుగా చూసుకుంటే పొట్టి ఫార్మాట్లో మా జట్టు ప్రదర్శన అద్బుతంగా సాగుతుంది. ఇప్పుడు జట్టులో ఒకటి నుంచి మొదలుకొని 11వ స్థానం వరకు మ్యాచ్ విన్నర్లు ఉండడం విశేషం. 2010 సమయంలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచినప్పటికి.. ఇప్పటి జట్టుతో పోలిస్తే మేము అంత బలంగా లేము. కానీ అప్పట్లో జట్టు సమిష్టి ప్రదర్శనతో కప్ సాధించాం. ఆ తర్వాత మా జట్టు ప్రదర్శన దిగజారింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి... జట్టులో ఒకరిని మించి ఒకరు మ్యాచ్ విన్నర్లు ఉండడం కలిసొచ్చే అంశం. ఇప్పుడు టీ20ల్లో ఇంగ్లండ్ జట్టు నెంబర్‌వన్ స్థానంలో ఉండడం.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు భయం కలిగించే అంశంగా చెప్పవచ్చు. తాజాగా టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కోల్పోయినా.. పొట్టి ఫార్మాట్‌కు వచ్చేసరికి మాత్రం నెంబర్‌వన్ జట్టు ఆటతీరు ఎలా ఉంటుందనేది ఇంగ్లండ్ చూపించింది. సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవడంతో ఆఖరి టీ20 కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచి టెస్టు సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటాం'అని చెప్పుకొచ్చాడు. కాగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందిన పాల్ కొలింగ్‌వుడ్ ఇంగ్లండ్ తరపున 68 టెస్టుల్లో 4,259 పరుగులు.. 17 వికెట్లు, 197 వన్డేల్లో 5078 పరుగులు.. 117 వికెట్లు, 36 టీ20ల్లో 583 పరుగులు సాధించాడు. 2007-08 మధ్య కాలంలో ఇంగ్లండ్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన కొలింగ్‌వుడ్ 2010లో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆ జట్టు ఒక మేజర్ టోర్నీ(ఐసీసీ 2010 టీ20 ప్రపంచకప్)ని కొల్లగొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్‌లో జరగనుంది. చదవండి: నా లిస్ట్‌లో సూర్య పేరు కచ్చితంగా ఉంటుంది: యువీ అదొక చెత్త నిర్ణయం: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
మ్యాచ్ ఫిక్సింగ్.. ఎనిమిదేళ్ల నిషేధం
దుబాయ్: మ్యాచ్ ఫిక్సర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కొరడా ఝుళిపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాజీ కెప్టెన్ మొహమ్మద్ నవీద్, అతని సహచరుడు షైమన్ అన్వర్‌లపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. వీరిద్దరు 2019లో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఆరోపణలు రావడంతో అదే ఏడాది ఇద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఐసీసీ... తదుపరి అవినీతి నిరోధక శాఖ విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువరిచింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిద్దరు విచారణకు కూడా సహకరించకపోవడంతో ఐసీసీ ఈ చర్య తీసుకుంది. చదవండి: అతడు ఎన్నిసార్లు విఫలమైనా ఛాన్స్.. కానీ పాపం ‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’ -
పాక్ అభిమానులకు వీసాలు కావాలట..
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం వీసాల మంజూరు విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన ప్రతిపాదనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వీసాల మంజూరు విషయంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రతిపాదించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్రీడాకారుల వీసాలకు సంబంధించి ఎటువంటి అంక్షలూ ఉండవని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. పాక్ అభిమానులకు, జర్నలిస్టులకు సైతం వీసాలు మంజూరు చేయాలని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి కోరటాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. వీసాల మంజూరు విషయంపై మార్చి నెలాఖరులోగా తమ నిర్ణయం చెప్పాలని షరతులు విధించడం పాక్ కండకావరంగా పేర్కొంది. తమ డిమాండ్లను తీర్చని పక్షంలో వేదికను యూఏఈకి మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తామని బెదిరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పీసీబీ చేసిన ప్రతిపాదనలు అపరిపక్వతతో కూడినవిగా కొట్టిపారేసింది. టోర్నీ నుంచి నిష్క్రమించే ఉద్ధేశంతోనే పీసీబీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో పీసీబీ ఇలాంటి ప్రతిపాదనలు తెరపైకి తేవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇరు జట్ల మధ్య చివరి సారిగా 2007లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. 2012లో పాక్ జట్టు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. ఆ తరువాత దాయాదుల పోరు ఐసీసీ టోర్నీలకు ఆసియా కప్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పీసీబీ తాజా ప్రతిపాదనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత జటిలంగా మార్చేశాయి. కాగా, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. -
2020 క్రీడలు: ఒక వైరస్... ఒక 36...
ప్రతీ ఏటా క్రీడల క్యాలెండర్... ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో కనిపించేది. చాంపియన్ల విజయగర్జనతో, దిగ్గజాల మైలురాళ్లతో, ఆటకే వన్నెతెచ్చిన ఆణిముత్యాల నిష్క్రమణలతో ముగిసేది. కానీ ఈ ఏడాది మాత్రం కంటికి కనిపించని వైరస్ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. కరోనా కాలం క్రీడలకు కష్టకాలాన్నే మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్, యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలాంటి మెగా ఈవెంట్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆపేసింది. మరెన్నో క్రీడలను రద్దు చేసింది. ప్రేక్షకుల్ని మైదానానికి రాకుండా చేసింది. కొత్తగా ‘బయో బబుల్’ను పరిచయం చేసింది. ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా... మరోవైపు ఫార్ములావన్‌లో హామిల్టన్ రయ్‌మంటూ దూసుకెళ్లాడు. 15 ఏళ్ల తర్వాత బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా భారత క్రికెట్ జట్టు 36కే ఆలౌటై షాక్ ఇచ్చింది. మొత్తానికి 2020 కొందరికి తీపి గుర్తులు, మరికొందరికి చేదు గుళికల్ని పంచివెళ్లింది. అవేంటో చూద్దాం...! –సాక్షి క్రీడా విభాగం మహాబలుడు మళ్లీ వచ్చాడు! అమెరికా బాక్సింగ్ యోధుడు, ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లో దిగేందుకు ‘సై’ అన్నాడు. 15 ఏళ్ల తర్వాత పంచ్ విసిరేందుకు కసరత్తులు కూడా చేశాడు. 54 ఏళ్ల వయసులో ప్రత్యర్థి రాయ్ జోన్స్ జూనియర్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డాడు. త్వరలో హోలీఫీల్డ్‌తో టైసన్ ఢీకొట్టేందుకు అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దిగ్గజాలను తీసుకెళ్లింది... ఈ ఏడాది... క్రీడాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది. ఆయా క్రీడలకు తమ ఆటతీరుతో, అలుపెరగని పోరాటంతో వన్నె తెచ్చిన దిగ్గజాలను తీసుకెళ్లింది. అమెరికాను ఊపేసే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో సూపర్ స్టార్ హోదా పొందిన కోబీ బ్రయాంట్ తన అభిమానులతో శాశ్వత సెలవు తీసుకున్నాడు. హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్‌తోపాటు అతని 13 ఏళ్ల కుమార్తె దుర్మరణం పాలైంది. ఇది ఈ సంవత్సరం క్రీడాలోకంలో పెను విషాదంగా నిలిచింది. అలాగే ఫుట్‌బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా మరణం క్రీడాలోకాన్ని శోకంలో ముంచింది. గుండెపోటుతో అతను మృతి చెందాడు. భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్, అలనాటి ఫుట్‌బాల్ మేటి పీకే బెనర్జీ, చున్నీ గోస్వామి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. క్రికెట్లో చేతన్ చౌహాన్, రాజిందర్ గోయెల్, ఆస్ట్రేలియన్ డీన్ జోన్స్‌లు అనారోగ్యంతో 2020లో తనువు చాలించారు. ‘రికార్డు’ల హామిల్టన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవ్వాల్సిన ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు కరోనా అంతరాయం కలిగించింది. 22 రేసులున్న ఎఫ్1 సీజన్‌ను చివరకు 17 రేసులకు కుదించారు. ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా రేసులను నిర్వహించారు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకొని ఏడోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా ఎఫ్1లో అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్ (91) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ (95) తిరగరాశాడు. ఆన్లైన్లో ఎత్తులు... కరోనా మహమ్మారి పలు క్రీడా టోర్నమెంట్లపై ప్రభావం చూపినా మేధో క్రీడ చెస్ మాత్రం కొత్త ఎత్తులకు ఎదిగింది. ముఖాముఖి టోర్నీలకు బ్రేక్ పడినా ఆన్లైన్లో నిరాటంకంగా టోర్నీలు జరిగాయి. తొలిసారి ఆన్లైన్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. భారత్, రష్యా మధ్య ఫైనల్ కీలకదశలో ఉన్నపుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతగా ప్రకటించారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్నారు. ఆన్లైన్లోనే జరిగిన ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, గుకేశ్, రక్షిత స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ అలరించింది ఈ ఏడాదిలో తొలి మూడు నెలలు క్రికెట్ సాగినా... ఆ తర్వాత కరోనా వైరస్‌తో బ్రేక్ వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలిసారి ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు కరోనా వైరస్‌తో భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా తీవ్రరూపం దాల్చడంతో దాదాపు నాలుగు నెలలు క్రికెట్ ఆట సాగలేదు. జూలై చివరి వారంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘బయో బబుల్’ వాతావరణంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. ప్రతీ ఏటా వేసవిలో వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఒకదశలో ఈ టోర్నీ జరుగుతుందా లేదా అనే అనుమానం కలిగినా... చివరకు ఐపీఎల్ భారత్ దాటింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ‘బయో బబుల్’ వాతావరణంలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13వ సీజన్ నిరాటంకంగా సాగింది. ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 15న ఎమ్మెస్ ధోని హఠాత్తుగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే రోజున సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ ముగిశాక భారత జట్టు దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే–నైట్ తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఓటమి పాలైంది. అయితే మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకొని 2020 ఏడాదిని ఘనంగా ముగించింది. ఫెడరర్...నాదల్ 20–20 ఈ 2020 ఏడాది ఇద్దరు టెన్నిస్ సూపర్స్టార్ల టైటిళ్ల సంఖ్యను ట్వంటీ–ట్వంటీగా సమం చేసింది. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ (2018)తో 20వ టైటిల్ సాధించాడు. ఇతనికి సరైనోడు... సమఉజ్జీ అని టెన్నిస్ ప్రపంచం ప్రశంసలందుకున్న రాఫెల్ నాదల్ దీనికి న్యాయం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌తో ఈ స్పానిష్ లెజెండ్ కూడా 20వ టైటిల్‌తో ఫెడరర్ సరసన నిలిచాడు. ఇలా ఈ ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్స్ ఇపుడు 20–20 స్టార్స్ అయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు మాత్రమే జరిగాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ విజేతగా నిలువగా... కరోనా దెబ్బకు 1945 తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు తొలిసారి రద్దు చేశారు. ప్రేక్షకులు లేకుండా యూఎస్ ఓపెన్‌ను నిర్వహించగా... ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ తన ఆధిపత్యం చాటుకొని 13వసారి చాంపియన్‌గా నిలిచాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా తాను కొట్టిన బంతి లైన్ అంపైర్‌కు తగలడంతో సస్పెన్షన్‌కు గురైన సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
యూవీ మెరుపులకు 13 ఏళ్లు
ఢిల్లీ : భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు వింటే మొదట గుర్తు వచ్చేది 2007 టీ20 ప్రపంచకప్. సెప్టెంబర్ 19, 2007.. యూవీ కెరీర్లో మరుపురానిదిగా నిలిచిన రోజు.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది వీరవిహారం చేసిన రోజు... టీ20 మజా అంటే ఏంటో అభిమానులకు చూపించిన రోజు.. తనకు కోపం వస్తే అవతలి బౌలర్ ఎవరని చూడకుండా సుడిగాలి తుఫాను అంటే ఏంటో చూపించిన రోజు.. సరిగ్గా ఈరోజుతో ఆ విధ్వంసానికి 13 ఏళ్లు నిండాయి. మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్ విశేషాలను గుర్తు చేసుకుందాం. (చదవండి : 'ఐపీఎల్ యాంకరింగ్ మిస్సవుతున్నా') డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 16.4 ఓవర్లు ముగిసే సమయానికి 155/3తో నిలిచిన దశలో యువరాజ్ సింగ్ క్రీజులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదగా.. ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో.. మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అయితే అంపైర్లతో పాటు ఇరు జట్ల కెప్లెన్లు కల్పించుకొని సర్దిచెప్పారు. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న యూవీ తన కోపాన్ని మొత్తం తరువాతి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ మీద చూపించాడు.ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అలానే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం ద్వారా టీ20ల్లో వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. (చదవండి : ఐపీఎల్ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప) ఫ్లింటాఫ్ చేసిన పనికి తాను బలయ్యానని.. చాలా రోజుల వరకు ఈ పీడకల వెంటాడుతుండేదని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 200/6కే పరిమితమై ఓటమిపాలయ్యింది. ఆ తర్వాత భారత్ ఫైనల్లో పాక్‌ను ఓడించి మొదటి టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్.. యూవీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. యూవీ ఆడిన ఇన్నింగ్స్ అభిమానుల్లో ఎంతలా జీర్ణించుకుపోయిందంటే.. ఎవరు మాట్లాడినా.. ఆరు సిక్సులకు ముందు.. ఆ తర్వాత అంటూ పేర్కొనేవారు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని యూవీ 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరల్డ్ కప్ హీరోగా నిలిచి.. 28 ఏళ్ల తర్వాత టీమిండియా కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. క్రికెట్ మిగిలిఉన్నంత వరకు యూవీ ఆడిన ఈ ఇన్నింగ్స్ రికార్డుల పుట్టలో పదిలంగా ఉంటుందనండంలో సందేహం లేదు. టీ20 కెరీర్లో 58 మ్యాచ్‌లాడిన యూవీ 1,177 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా యూవీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. -
ధోని కెప్టెన్ అవుతాడని అప్పుడే ఊహించా
ఢిల్లీ : భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోనితో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్సీ కోసం ధోనీ పేరును తానే సూచించినట్లు సచిన్ చెప్పుకొచ్చాడు. పీటీఐతో జరిగిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. '2007లో దక్షిణాఫ్రికా వేదికగా మొదటిసారి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే గాయాల ఉండడం వల్ల టోర్నీకి దూరంగా ఉండాలని భావించా. అయితే నాతో పాటు గంగూలీ, ద్రవిడ్‌లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే టీ20 జట్టుకు ఎవరిని కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ అడిగినప్పుడు.. నేను ఎంఎస్ ధోని పేరు సూచించా. అంతకు ముందు చాలా మ్యాచ్‌ల్లో ఫస్ట్‌స్లిప్‌లో నిల్చొని ధోనీ ఆటను, మైదానంలో అతను వ్యవహరించే తీరును దగ్గర్నుంచి పరిశీలించా. దీంతా పాటు స్లిప్స్‌లో నిలుచున్నప్పుడు ఫీల్డింగ్‌తో పాటు పలు అంశాలపై ధోనీతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలోనే ధోనికి మ్యాచ్‌ను పూర్తిగా చదివేస్తాడని.. భవిష్యత్తు కెప్టెన్ అతనేనని అప్పుడే ఊహించా. అందుకే బోర్డుకు ధోనీ పేరును సూచించా. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలిసిందే. ' అంటూ సచిన్ పేర్కొన్నాడు. శనివారం(ఆగస్టు 15) సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఎంఎస్ ధోని సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్లో కనిపించనున్నాడు. -
ఈ సమయంలో ఐపీఎల్‌తోనే ఆదరణ సాధ్యం
హోబర్ట్ : ఈ ఏడాది తమ దేశంలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే దాని స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)13వ సీజన్ నిర్వహిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్ జరుగాలని తాను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయని బుధవారం చెప్పాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో అత్యంత విలువైన విదేశీ ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచాడు.('ధోని ప్లాన్ మాకు కప్పును తెచ్చిపెట్టింది') 'ఐపీఎల్ జరుగాలని నేను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ టోర్నీని చూస్తారు. క్రికెట్ చాలా కాలంగా నిలిచిపోయాక ఐపీఎల్ జరిగితే మరింత ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ టోర్నీ చాలా గొప్పది. వీలైంత త్వరగా మళ్లీ క్రికెట్ ఆడాలని తాను ఎదురుచూస్తున్నా' అంటూ కమిన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడనున్నది. 2022 సంవత్సరానికి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ వాయిదాపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ ఆ టోర్నీను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రకాల క్రీడా టోర్నీలు రద్దు అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌ను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్ నిర్వహిస్తారా?
మెల్బోర్న్ : స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించవచ్చంటూ వస్తున్న కొన్ని ప్రతిపాదనలపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ విస్మయం వ్యక్తం చేశాడు. కోవిడ్–19 కారణంగా టోర్నీ నిర్వహణ సమస్యగా మారడంతో టీవీ ప్రేక్షకుల కోసమే మ్యాచ్‌లు జరపాలంటూ కొందరు చేసిన సూచనలపై అతను తీవ్రంగా స్పందించాడు. ‘ఖాళీ స్టేడియాల్లో ప్రపంచ కప్ ఆడటాన్ని నేను అసలు ఊహించలేను. అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టోర్నీతో సంబంధం ఉన్నవారంతా దేశం మొత్తం తిరుగుతూ ఆడవచ్చు. కానీ అభిమానులకు మాత్రం అనుమతి ఉండదా. నాకు తెలిసి ఇది జరిగే అవకాశం లేదు. కరోనా బాధ తగ్గి అంతా సాధారణంగా మారిన తర్వాత దీనిని నిర్వహించండి లేదా దీనిని ప్రస్తుతానికి రద్దు చేసి అవకాశం ఉన్న మరో తేదీల్లో సర్దుబాటు చేయండి’ అని బోర్డర్ సూచించాడు. విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులే రానప్పుడు వరల్డ్ కప్ జరుగుతోందని చెబితే ఎవరూ నమ్మరని, తనకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదని అతను అన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు సుమారు 6,400 మంది కరోనా బారిన పడగా, 61 మంది చనిపోయారు. -
'ప్రపంచకప్ గెలిచే సత్తా ఆ మూడు జట్లకే ఉంది'
ముంబై : అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లకే ఎక్కువుగా ఉన్నాయని విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. అంతేగాక రానున్న ప్రపంచకప్ ఒక అద్బుతమైన ప్రపంచకప్‌గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ.. ' నా దృష్టిలో ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ఘనంగానే ఆరంభిస్తుందనే ఆశిస్తున్నా. టీమిండియాకు కప్‌ను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాకు సొంతగడ్డ కావడం ఆ జట్టుకు బలం చేకూర్చే విషయమే. అయితే ఎంత సొంత గడ్డైనా ప్రదర్శన బాగుంటేనే ఫలితం లభిస్తోంది. ఇక మా జట్టు విషయానికి వస్తే పరిమిత ఓవర్ల ఆటతీరు ఎలా ఉన్నా టీ20ల్లో మాత్రం దుమ్మురేపే ప్రదర్శననే నమోదు చేస్తోంది. అయితే జట్టుకు సుస్థిరత లేకపోవడం వల్ల ప్రపంచకప్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా రానున్న ప్రపంచకప్‌లో రసవత్తరమైన పోరుకు మాత్రం కొదువ ఉండదు' అని లారా తెలిపాడు. కాగా విండీస్ పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచపకప్ టైటిల్ సాధించిన జట్టుగా నిలిచింది. భారత్ విషయానికి వస్తే 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలవగా, ఆసీస్ ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవకపోవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18న మొదలుకానుంది. (కోహ్లి, రోహిత్‌లు కాదు.. రాహులే గ్రేట్!) లారా ప్రసుత్తం రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రోడ్‌సేప్టీపై అవగాహన కల్పించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం ఈ సిరీస్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే బ్రియాన్ లారా వెస్టిండీస్ లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ముంబై క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లన్నింటిని రద్దు చేస్తున్నట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు. కాగా మ్యాచ్‌లన్నీ కొత్తగా రీషెడ్యూల్ చేసి డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) (ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పఠాన్) -
నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!
మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. మూడుసార్లు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఆ గీత దాటాలని పట్టుదలగా ఉంది. తాజా ఫామ్, టోర్నీలో అజేయ ప్రదర్శన అందుకు కావాల్సిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఇది హర్మన్ సేనపై ఉన్న అంచనాలకు సంబంధించి ఒక పార్శ్వం. కానీ అటువైపు చూస్తే ప్రత్యర్థి ఇంగ్లండ్... టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన ఐదు సార్లూ భారత్‌కు పరాజయమే ఎదురైంది. 2018 టోర్నీ సెమీఫైనల్లో కూడా ఇదే జట్టు చేతిలో మన టీమ్ ఓడింది. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే లీగ్ దశలో నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఇప్పుడు గత రికార్డును మన అమ్మాయిలు సవరిస్తారా, లెక్క సరి చేస్తారా వేచి చూడాలి. సిడ్నీ: లీగ్ దశలో నాలుగు వరుస విజయాలతో సత్తా చాటిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో అసలు పోరుకు సన్నద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఓటమి లేకుండా అజేయంగా నిలవగా... ఇంగ్లండ్ మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖీ పోరులో మాత్రం మన ప్రత్యర్థిదే పైచేయి. అయితే ఎక్కువ మంది యువ ప్లేయర్లతో నిండిన మన జట్టు తాజా ఫామ్ మాత్రం ఫైనల్ చేరడంపై ఆశలు రేపుతోంది. హర్మన్ ఫామ్‌తో ఇబ్బంది! లీగ్ దశలో భారత జట్టు వరుస విజయాల్లో 16 ఏళ్ల షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కూడా మారిన షఫాలీ 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 161 పరుగులు చేసింది. అదీ 166 స్ట్రయిక్ రేట్‌తో కావడం విశేషం. మరోసారి షఫాలీ ఇచ్చే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. జెమీమా రోడ్రిగ్స్ (85 పరుగులు), దీప్తి శర్మ (83 పరుగులు) కొంత వరకు ఫర్వాలేదనిపించారు కానీ తొలి స్థానంలో ఉన్న షఫాలీకి వీరిద్దరికి మధ్య పరుగుల్లో చాలా అంతరం ఉంది. అయితే అన్నింటికి మించి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇద్దరు టాప్ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ల ఆట. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా ఆడిన అనుభవంతో స్మృతి ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌ను నడిపిస్తుందని భావిస్తే ఆమె పూర్తిగా నిరాశపర్చింది. 3 మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులే చేసింది. ఇక హర్మన్ కౌర్ మరీ ఘోరం. అటు వన్డేలు, ఇటు టి20ల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హర్మన్ ఈ మెగా టోర్నీలో పూర్తిగా చేతులెత్తేసింది. ఆమె వరుసగా 2, 8, 1, 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. కేవలం షఫాలీ బ్యాటింగ్‌పైనే ఆధారపడితే కీలక మ్యాచ్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగలవచ్చు. బౌలింగ్‌లో స్పిన్నర్లే భారత్‌కు బలం. తుది జట్టులో శిఖా పాండే రూపంలో ఏకైక పేసర్ ఉన్నా విభిన్న శైలి గల స్పిన్నర్లే ఆటను శాసిస్తున్నారు. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్, లెఫ్టార్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పూనమ్ స్పిన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనిగా మారింది. శిఖా పాండే కూడా చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఈ ఐదుగురు బౌలర్ల ఎకానమీ ప్రపంచకప్‌లో 6 దాటకపోవడం విశేషం. గాయాల సమస్య లేదు కాబట్టి శ్రీలంకతో చివరి లీగ్ ఆడిన తుది జట్టునే మార్పుల్లేకుండా భారత్ కొనసాగించనుంది. 2018 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిన జట్టులో ఆడిన ఏడుగురు ప్లేయర్లు ఇప్పుడు భారత జట్టు తరఫున మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జోరు మీదున్న సివెర్.. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను సెమీఫైనల్ చేర్చడంలో ఇద్దరు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. నటాలీ సివెర్ 4 మ్యాచ్‌లలో కలిపి 202 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆమెకు కెప్టెన్ హెథర్ నైట్ (193)నుంచి మంచి సహకారం లభించింది. నైట్ ఖాతాలో ఒక శతకం కూడా ఉండటం విశేషం. మరోసారి ఇంగ్లండ్ జట్టు ఈ ఇద్దరి బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. వీరిని నిలువరించగలిగితేనే ప్రత్యర్థి పని సులువవుతుంది. అమీ జోన్స్, డానియెలా వ్యాట్ వరుసగా విఫలమవుతున్నారు. అయితే ఇంగ్లండ్ కూడా తమ బౌలింగ్‌ను బాగా నమ్ముకుంది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఎకెల్‌స్టోన్ పాత్ర మరోసారి కీలకం కానుంది. ఈ బౌలర్ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 3.23 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. ష్రబ్సోల్ కూడా 8 వికెట్లతో అండగా నిలవగా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సారా గ్లెన్ కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో సెమీస్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. వర్షం పడితే ఫైనల్‌కు భారత్.. రిజర్వ్ డే అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే ఉంచాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసి పుచ్చింది. స్థానిక వాతావరణ శాఖ సూచన ప్రకారం గురువారం రోజంతా వర్ష సూచన ఉంది. దాంతో కీలకమైన పోరు కాబట్టి రిజర్వ్ డే ఉంటే బాగుంటుందని సీఏ భావించింది. ‘టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్ డే ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పుడు కుదరదు’ అని ఐసీసీ తేల్చి చెప్పింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. కనీసం ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంటేనే మ్యాచ్ కొనసాగిస్తారు. అంతకంటే తక్కువ ఓవర్లే సాధ్యమైతే మ్యాచ్ రద్దయినట్లే. ఇదే జరిగితే గ్రూప్‌లో పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంటాయి. రెండో సెమీస్ కూడా.. తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరుగుతుంది. గ్రూప్ ‘బి’లో సఫారీ జట్టు అజేయంగా నిలవగా... ఆసీస్ మాత్రం భారత్ చేతిలో ఓడింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి, జెమీమా, దీప్తి, వేద, తానియా, శిఖా పాండే, రాధ, పూనమ్, రాజేశ్వరి. ఇంగ్లండ్: హెథర్ నైట్ (కెప్టెన్), వ్యాట్, బీమాంట్, సివెర్, విల్సన్, అమీ జోన్స్, బ్రంట్, ష్రబ్సోల్, మ్యాడీ విలియర్స్, ఎకెల్‌స్టోన్, సారా గ్లెన్. పిచ్, వాతావరణం స్పిన్‌కు అనుకూలం. వర్షం పడితే పిచ్ స్వభావంలో మార్పు రావచ్చు. మ్యాచ్ సమయంలో వర్ష సూచన ఉంది. ఆటకు అంతరాయం కలిగించడం ఖాయం. 4 - భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 19 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 4 గెలిచి, 15 ఓడింది. ఇటీవల ముక్కోణపు టోర్నీలో భాగంగా రెండు సార్లు తలపడగా, ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గాయి. -
న్యూ గినియా వచ్చేసింది
దుబాయ్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్‌కు పపువా న్యూ గినియా (పీఎన్జీ) అర్హత సాధించింది. ఆ జట్టు తొలిసారి ఐసీసీ టోర్నీకి ఎంపిక కావడం విశేషం. యూఏఈలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా పపువా న్యూ గినియాకు ఆ అవకాశం దక్కింది. ఈ టోర్నీ లీగ్ దశ ముగిసేసరికి గినియా గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 54 పరుగులతో కెన్యాను ఓడించి గినియా ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గినియా 19.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 19 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా... నార్మన్ వనువా (48 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వాత కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు గ్రూప్ ‘బి’నుంచి కొంత అదృష్టం కలిసొచ్చి ఐర్లాండ్ కూడా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లో ఐర్లాండ్ 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో యూఈఏ చేతిలో ఐర్లాండ్ ఓడింది. ఫలితంగా ఐర్లాండ్‌తో పాటు ఒమన్, యూఏఈ కూడా తలా 8 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే రన్‌రేట్‌తో ఐర్లాండ్ ముందంజ వేసింది. ఐర్లాండ్ 2007లో జరిగిన తొలి ప్రపంచ కప్ మినహా మిగిలిన ఐదు టి20 వరల్డ్ కప్‌లలో కూడా ఆడింది. నేటినుంచి ప్లే ఆఫ్‌లు... టి20 ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించేందుకు మొత్తం 6 జట్లకు అవకాశం ఉండగా ఇప్పటికే 2 జట్లు క్వాలిఫై అయ్యాయి. మరో 4 స్థానాల కోసం నేటినుంచి ఐపీఎల్ తరహాలో ప్లే ఆఫ్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. రెండు గ్రూప్‌లలో 2, 3, 4 స్థానాల్లో నిలిచిన మొత్తం ఆరు జట్లు ఇందు కోసం పోటీ పడుతున్నాయి. నెదర్లాండ్స్–యూఏఈ, నమీబియా–ఒమన్ మధ్య మ్యాచ్‌లలో విజేతగా నిలిచే రెండు జట్లు ముందంజ వేస్తాయి. ఇక్కడ ఓడిన వాటిలో ఒక జట్టు స్కాట్లాండ్తో, మరో జట్టు హాంకాంగ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లలో గెలిచిన టీమ్‌లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. పీఎన్జీ గురించి... పసిఫిక్ మహా సముద్రంలో ఆస్ట్రేలియాకు ఉత్తర భాగంలో ఉండే పపువా న్యూ గినియా ‘ఓషియానియా’ ఖండం పరిధిలోకి వస్తుంది. సమీప దేశం ఇండోనేసియా. బ్రిటన్ నుంచి 1975లో స్వాతంత్య్రం లభించింది. ఎక్కువ భాగం చిన్న చిన్న దీవులతో నిండిన దేశం. సుమారు 80 లక్షల జనాభా. ఇప్పటికీ దీవుల్లోని పెద్ద సంఖ్యలో ప్రజలు సాధారణ ప్రపంచానికి దూరంగా ఆటవిక జీవితాన్ని గడిపేవారే. తమ దేశంలో 851 రకాల భాషలు ఉన్నాయని పపువా న్యూ గినియా అధికారికంగా ప్రకటించుకుంది. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా నమోదయ్యే దేశాల జాబితాలో దీని పేరు తరచుగా ముందు వరుసలోనే వినిపిస్తుంది. పీఎన్‌జీలో రగ్బీ ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడ. గతంలో రెండు సార్లు (2013, 2015లలో) వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు బాగా చేరువగా వచ్చి దానిని చేజార్చుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టు తమ గ్రూప్‌లో నెదర్లాండ్స్, నమీబియా, కెన్యా, బెర్ముడా, సింగపూర్‌లపై గెలిచి స్కాట్లాండ్ చేతిలో ఓడింది.cr -
సిక్స్ సిక్సెస్ బాధిత బౌలర్ ఏమన్నాడంటే
హైదరాబాద్ : మైదానంలో మహరాజు టీమిండియా యువరాజ్ సింగ్ అంటే క్రికెట్ ప్రపంచానికి గుర్తుకొచ్చేది సిక్స్ సిక్సెస్. సోమవారం ఈ సిక్సర్ల కింగ్ తన ఆటకు గుడ్‌బై చెప్పడంతో అతని అభిమానులు ఆటగాళ్లు ఆ మహాద్భుత ఘట్టాన్ని నెమరువేసుకుంటున్నారు. ‘భారత క్రికెట్లో నీది చెరపలేని చరిత్ర.. మరవలేని యాత్ర.. మరెవరిని ఊహించలేని పాత్ర’ అంటూ ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ బ్యాట్‌కు బలైన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ యువీ రిటైర్మెంట్పై స్పందించాడు. ‘ ఓ దిగ్గజం నీ రిటైర్మెంట్ను ఆస్వాదించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. (చదవండి: మైదానంలో ‘మహరాజు’) Enjoy retirement Legend @YUVSTRONG12 🙌🏻 🏏 https://t.co/JM3Wgy3G24 — Stuart Broad (@StuartBroad8) June 10, 2019 6 6 6 6 6 6 2007 తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో యువరాజ్ చూపించిన విశ్వరూపం ఇది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే అతను చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. బహుషా ఈ రికార్డును ఎవరూ అందుకోలేరేమో. ఆ మ్యాచ్‌లో అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వాగ్వాదానికి దిగడంతో అతిని పై యువీకి ఉన్న ఆగ్రహానికి బ్రాడ్ బలయ్యాడు. యువీ బాదుడుకు బ్రాడ్ ఏడ్చేశాడు. యువీ సృష్టించిన ఆ విధ్వంసం మరోసారి మీ కోసం...(చదవండి : యువరాజ్ గుడ్‌బై) -
టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం
-
హర్మన్ హరికేన్
ఏమి ఆ బ్యాటింగ్... ఏమి ఆ సిక్సర్ల జోరు... ఆ దూకుడు, ధాటిని చూసి ఆడుతోంది అమ్మాయేనా అనే సందేహం వస్తే అభిమానుల తప్పేం లేదు! పవర్ గేమ్‌కు కొత్త పాఠాలు చూపిస్తూ ధనా ధన్ షాట్లతో హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించిన వేళ... టి20 క్రికెట్లో భారత్ రికార్డులతో చెలరేగి ప్రపంచకప్‌లో మెరుపు బోణీ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లతో హర్మన్ చూపించిన సూపర్ షోను వర్ణించేందుకు మాటలు చాలవు. మహిళల టి20 క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన కౌర్... కెప్టెన్‌గా కూడా ‘ప్రీత్’పాత్రమైన విజయాన్ని అందుకుంది. ప్రొవిడెన్స్ (గయానా): టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు అదిరే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో భారత్ ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ పోరులో భారత్ 34 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 103; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటింది. వీరిద్దరు రికార్డు స్థాయిలో నాలుగో వికెట్‌కు 76 బంతుల్లోనే 134 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (50 బంతుల్లో 67; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కేటీ మార్టిన్ (25 బంతుల్లో 39; 8 ఫోర్లు) రాణించింది. భారత బౌలర్లలో హేమలత (3/26), పూనమ్ యాదవ్ (3/33) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డికి ఒక వికెట్ దక్కింది. టోర్నీ తదుపరి మ్యాచ్‌లో రేపు పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... తొలి బంతికే తాన్యా భాటియా (9) కొట్టిన ఫోర్‌తో భారత ఇన్నింగ్స్ జోరుగా ప్రారంభమైంది. అదే ఓవర్లో మరో ఫోర్ బాదిన తర్వాత మరుసటి ఓవర్ తొలి బంతికే ఆమె వెనుదిరిగింది. మిడ్ వికెట్ బౌండరీ వద్ద జెన్సన్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో స్మృతి మం«ధాన (2) ఆట కూడా ముగిసింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న హేమలత (7 బంతుల్లో 15; 2 ఫోర్లు) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకుంది. ఈ దశలో జెమీమా, హర్మన్ జత కలిశారు. కొన్ని చూడచక్కటి బౌండరీలతో జెమీమా తన క్లాస్‌ను ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత హర్మన్ తుఫానులా విరుచుకు పడగా... జెమీమా అండగా నిలిచింది. వీరిద్దరు కివీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే జెమీమా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆమె స్టంపౌట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. స్పిన్ మాయాజాలం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు కివీస్ కుదేలైంది. స్టార్ బ్యాటర్ సుజీ బేట్స్ మినహా మిగతావారంతా విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి వికెట్‌కు బేట్స్, అనా పీటర్సన్ (14) కలిసి 52 పరుగులతో శుభారంభం అందించినా... ఆ తర్వాత కివీస్ దానిని కొనసాగించలేకపోయింది. 20 పరుగుల వ్యవధిలో మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. దూకుడుగా ఆడి 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన బేట్స్‌ను తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి చక్కటి బంతితో ఔట్ చేయడంతో కివీస్ గెలుపు ఆశలు వదులుకుంది. లోయర్ ఆర్డర్లో కేటీ మార్టిన్ పోరాడినా లాభం లేకపోయింది. ►మహిళల టి20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. 2014లో ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా (191/4) స్కోరు తెరమరుగైంది. ► టి20ల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా భారత్ తరఫున మిథాలీ (97 నాటౌట్) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరును హర్మన్ దాటింది. ►హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ టి20ల్లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. ►టి20 ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 8 సిక్స్‌లు కొట్టిన భారతీయ మహిళా క్రికెటర్‌గా హర్మన్ నిలిచింది. విండీస్ క్రికెటర్ డిండ్రా డాటిన్ 2010లో దక్షిణాఫ్రికాపై 9 సిక్స్‌లు కొట్టింది. ►అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఎనిమిదో మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్. గతంలో డానియెలా వ్యాట్ (ఇంగ్లండ్), డాటిన్ (వెస్టిండీస్), లానింగ్ (ఆస్ట్రేలియా), సుజీ బేట్స్ (న్యూజిలాండ్), బెథానీ మూనీ (ఆస్ట్రేలియా), షాండ్రీ ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా), టామ్సిన్ బ్యూమోంట్ (ఇంగ్లండ్) ఈ ఘనత సాధించారు. హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు సెంచరీ పరుగులు 103 బంతులు 51 ఫోర్లు 7 సిక్స్‌లు 8 స్ట్రయిక్ రేట్ 201.96 -
సింగ్ సిక్సర్ల విధ్వంసానికి 11 ఏళ్లు!
హైదరాబాద్ : ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు... ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చేది విధ్వంసకర బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీ పెను సంచలనం సృష్టించాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు డర్భన్ వేదికగా యువీ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఈ విధ్వంసానికి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటికే ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి, హెర్ష్లీ గిబ్స్‌లు ఈ ఘనతను అందుకున్నా.. అంతగా ఆదరణ పొందలేదు. రవిశాస్త్రి దేశవాళి క్రికెట్లో ఈ ఘనత సాధించగా.. గిబ్స్ చిన్నదేశంపై అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను నెలకొల్పాడు. కానీ యువరాజ్ సింగ్ క్రికెట్ పుట్టిన దేశం ఇంగ్లండ్‌పైనే ఈ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో యువీ కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
11 ఏళ్ల క్రితం ఇదే రోజు ...!
-
త్వరలో వరల్డ్‌కప్ : స్టార్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ : మరో మూడు నెలల్లో ట్వంటీ20 ప్రపంచ కప్ ఉందనగా భారత స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ జులన్ గోస్వామి ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. భారత తొలి టీ20 జట్టులో సభ్యురాలు జులన్ 12 ఏళ్ల కెరీర్ అనంతరం టీ20ల నుంచి వైదొలిగారు. ఆమె నిర్ణయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. టీ20 జట్టులో తనకు చోటు ఇచ్చి, మద్దతు తెలిపిన అందరికీ జులన్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ప్రపంచ కప్‌లో భారత జట్టు మంచి ఫలితాలు రాబట్టాలని ఆమె ఆకాంక్షించారు. డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్ సొంతగడ్డపై ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో జులన్ రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలాంశమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌గా అరుదైన ఘనతను గోస్వామి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా టెస్టులు ఆడని జులన్.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకండతో కేవలం వన్డేలకే పరిమితం కానున్నారు. కెరీర్లో 68 టీ20 మ్యాచ్‌లాడిన జులన్ 56 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాపై 2012లో తీసిన 5/11 ఆమె టీ20 బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన. బ్యాటింగ్‌లో 46 ఇన్నింగ్స్‌లాడి 405 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 37 నాటౌట్. టీ20ల్లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ సైతం జులనే కావడం విశేషం. జులన్ గోస్వామి.. ది గ్రేట్ -
మిల్లర్ విధ్వంసం
పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ (36 బంతుల్లో 101 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ టి20 క్రికెట్లో సరికొత్త రికార్డును సృష్టించాడు. 35 బంతుల్లోనే శతకాన్ని బాది తమ దేశానికే చెందిన రిచర్డ్ లెవీ (న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో 100) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. మిల్లర్‌తో పాటు హషీమ్ ఆమ్లా (51 బంతుల్లో 85; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో సఫారీలు 83 పరుగులతో గెలుపొంది 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ సైఫుద్దీన్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదిన మిల్లర్... తను ఆడిన చివరి 15 బంతుల్లోనే 58 పరుగుల్ని పిండుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 141 పరుగులకు కుప్పకూలింది. -
వికెట్లు పోతున్నా ఆసీస్ జోరు తగ్గలేదు
మొహాలి: పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (11 ), డేవిడ్ వార్నర్ (9), ఖవాజా (21) ఔటయ్యారు. వికెట్లు పడుతున్నా ఆసీస్ రన్ రేట్ 8కు తగ్గకుండా పరుగులు చేస్తుంది. వచ్చిన బాట్స్ మన్ వచ్చినట్టుగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్(22 పరుగులు), మాక్స్ వెల్(18) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ స్కోరు 42 పరుగుల వద్ద వన్ డౌన్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ (9 పరుగులు: 6 బంతుల్లో 2 ఫోర్లు)ను వాహబ్ రియాజ్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు జట్టు స్కోరు 28 పరుగుల వద్ద ఆసీస్ ఓపెనర్ ఖవాజా ఖవాజా (21: 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ ) రియాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్(0) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ రెండు వికెట్లు, ఇమాద్ వసీం ఓ వికెట్ తీశాడు. -
రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
మొహాలి: పాకిస్తాన్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 5.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ స్కోరు 42 పరుగుల వద్ద వన్ డౌన్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ (9 పరుగులు: 6 బంతుల్లో 2 ఫోర్లు)ను వాహబ్ రియాజ్ బౌల్డ్ చేశాడు. రావడంతోనే దూకుడుగా ఆడుతూ రెండు బౌండరీలు కొట్టిన వార్నర్ రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. అంతకుముందు జట్టు స్కోరు 28 పరుగుల వద్ద ఆసీస్ ఓపెనర్ ఖవాజా ఖవాజా (21: 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ ) రియాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఖవాజా మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ చెత్తబంతును బౌండరీలను తరలించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. కానీ, జట్టు స్కోరు వేగంగా పెంచే క్రమంలో రియాజ్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి.. రెండు బంతుల తర్వాత ఔటయ్యి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆరోన్ ఫించ్ (11 ), కెప్టెన్ స్టీవ్ స్మిత్(0) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ రెండు వికెట్లు తీశాడు. -
బ్యాటింగ్ కు దిగిన ఆసీస్
మొహాలి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆసీస్ ఓపెనర్లుగా ఖవాజా, ఆరోన్ ఫించ్ క్రీజులోకి వచ్చారు. పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తమ బౌలర్ మహ్మద్ ఆమీర్ చేతికి బంతి అందించాడు. ఇరు జట్లు ఒక్క మ్యాచ్ లో గెలిచి రెండు పాయింట్లతో ఉన్నాయి. ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకమైంది. ముఖ్యంగా పాక్ జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉంది. ఈ మ్యాచ్ ఓడితే పాక్ ఇంటిదారి పట్టాల్సిందే. ఆసీస్ జట్టు ఈ ఆదివారం భారత్ తో మ్యాచ్ ఆడనుంది. కనుక ఈ జట్టుకు మరో అవకాశం ఉంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. -
ధోనీ సీరియస్ ఎందుకు అయ్యాడు!
బెంగళూరు: తీవ్ర ఒత్తిడిలోనూ జట్టు చాలా కూల్ గా వ్యహరించిందని, అదే విజయానికి దోహదపడుతుందని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ ఎలా ఆడాలనే దానిపై ప్రతి ఒక్కరికీ ఓ అభిప్రాయం ఉంటుందని, బ్యాట్స్‌మన్ బంతిని ఎలా ఆడతాడన్న దానిపై బౌలర్ కూడా ఓ అభిప్రాయంతో ఉంటాడని పేర్కొన్నాడు. ఆ సమయంలో వికెట్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలర్ బంతులు వేయాలని, బంతి ఎలా స్వింగ్ అవుతుందన్ని విషయాన్ని గమనించాలని అభిప్రాయపడ్డాడు. జట్టు సభ్యులు తగిన సూచనలు ఇచ్చినా వాటన్నింటిని బట్టి చివరికి బౌలర్ తన మైండ్ లో ఏముందో అదే చేస్తాడని ధోనీ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ పై ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాస్త ఆవేశానికి లోనయ్యాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలు అతడిని అసహనానికి గురిచేశాయి. టీమిండియా విజయం ఎంతమేరకు తృప్తినిచ్చిందంటూ విలేకరులు ధోనీని అడిగారు. దీంతో ఆయన ఆవేశానికి లోనైయ్యాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తికయినా కోపం వస్తుందని అలాంటివి పట్టించుకునే విషయాలు కావని ఆ తర్వాత సమర్థించుకున్నాడు మిస్టర్ కూల్. టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేయగా, అనంతరం బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బంగ్లాపై గెలిచినందుకు భారత అభిమానులు సంతోషంగా లేరని తనకు తెలుసునన్నాడు. నెట్ రన్ రేట్ పెంచుకుని సెమీస్ ఆశల్ని మెరుగు పరుచుకోవాలని కానీ అలా జరగలేదని పేర్కొన్నాడు. విలేకరులు తనను ప్రశ్నలు అడిగిన తీరు చూస్తే వారు ఈ విజయంపై ఆనందంగా లేరని అర్థమవుతుందని, మ్యాచ్ గురించి మట్లాడేందుకు తన వద్ద స్క్రిప్టు ఉండదని చెప్పుకొచ్చాడు. అయితే టాస్ గెలిచిన బంగ్లా, టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించినప్పుడే ఎక్కువ పరుగులు చేయడం కష్టమని అర్థమయిందని ధోనీ చెప్పాడు. ఈ పిచ్ పై ఎక్కువ స్కోరు చేసే అవకాశాలు లేవని, పరిస్థితులు ఏంటన్నది విశ్లేషించుకోకుండా ప్రశ్నలు అడుగుతున్నారని కాస్త అసహనానికి గురయ్యాడట. -
షాకింగ్ న్యూస్ చెప్పిన నెహ్రా
బెంగళూరు: టీమిండియా వెటరన్ ఆటగాడు అశిష్ నెహ్రా పిడుగులాంటి వార్త చెప్పాడు. చిన్నస్వామి స్టేడియంలో నెహ్రా మీడియాతో మాట్లాడాడు. తాను సోషల్ మీడియాలో లేనని, తనకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ లలో ఖాతాలు కూడా లేవన్నాడు. తాను ఇప్పటికీ పాత నోకియా మొబైల్ వాడుతున్నట్లు చెప్పగా.. ఆశ్చర్యపోవడం విలేకరుల పని అయింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఏం జరుగుతుందన్న వాటితో తనకు సంబంధం లేదన్నాడు. తనకు ఏం తోచినా అదే విషయాన్ని నిర్మొహమాటంగా మీడియాతో, ఇతర కార్యక్రమాల్లో చెప్పడం నెహ్రాకు కొత్తేమీ కాదు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముందురోజు భారత ఆటగాళ్ల ముఖాలు మార్ఫింగ్ వివాదం గురించి ఎలా స్పందిస్తారని నెహ్రాను విలేకరులు అడిగారు. అందుకు నెహ్రా స్పందిస్తూ.. మీరు రాంగ్ పర్సన్ ను ఈ ప్రశ్న అడుగుతున్నారని, ఎందుకంటే సోషల్ మీడియాలో తనకు ఖాతాలు లేవని వివరించాడు. ఇంకా చెప్పాలంటే న్యూస్ పేపర్స్ కూడా చదవనన్నాడు. అయితే బంగ్లా జట్టు మాత్రం ఈ ఫార్మాట్లో రాణిస్తుందని పేర్కొన్నాడు. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం నాడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. నెహ్రా వ్యవహారంపై బీసీసీఐ కూడా స్పందించింది. వీరేంద్రసెహ్వాగ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, ఎలాగోలా మీరైనా నెహ్రాను సోషల్ మీడియాలోకి తీసుకురాగలరా అని ఓ ప్రశ్న వేసింది. దానికి వీరూ స్పందిస్తూ.. తనకు వీలైనంత వరకు ప్రయత్నిస్తానని ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. ఈ రెండు ట్వీట్లకు స్పందిస్తూ నెటిజన్లు ట్వీట్లతో వెల్లువెత్తించారు. Dear @virendersehwag pa, can you please get Nehra ji on social media ?https://t.co/3SsWb5hj0h — BCCI (@BCCI) March 22, 2016 @BCCI I will try my best . — Virender Sehwag (@virendersehwag) March 22, 2016 -
భారత్ లో మాపై ప్రేమ ఎక్కువ: అఫ్రిది
కోల్ కతా: పాకిస్తాన్ లో ఉన్నప్పటి కంటే భారత్ లోనే ఎక్కువ సంతోషంగా ఉంటానని ఆ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది చెప్పాడు. భారత్ తో క్రికెట్ అనగానే ఎప్పుడూ చాలా ఎంజాయ్ చేస్తానని మీడియా సమావేశంలో అఫ్రిది అన్నాడు. ఇక్కడి వారు తమ జట్టు భారత్ కు వచ్చిన ప్రతిసారి చాలా ప్రేమగా, ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానిస్తారని తెలిపాడు. నిజం చెప్పాలంటే స్వదేశంలో కూడా తమకు అభిమానుల నుంచి ఇంత ప్రేమ దొరకదని వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని, టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మార్చి 19న భారత్ తో జరగనున్న మ్యాచ్ తమకు కీలకమని పాక్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. పాక్, భారత్ దేశాలను క్రికెట్ చాలా దగ్గర చేసిందని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఆట, రాజకీయం అనేది రెండు భిన్నమైన అంశాలని చెప్పాడు. తొలి మ్యాచ్ ఎప్పిటికీ చాలా ముఖ్యమైనదని, అందుకే బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ నుంచే తమ పోరు ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్ భారత్ తో ఉందని, ఆ మ్యాచ్ కూడా తమకు చాలా టఫ్ అని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ లో పాక్ ఓటమి గురించి ప్రస్తావిస్తూ... విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ పోరాటం తమ జట్టు నుంచి విజయాన్ని లాగేసుకున్నాయని తెలిపాడు. తమ బౌలర్ల ప్రదర్శనపై పూర్తి నమ్మకం ఉందని పాక్ కెప్టెన్ అఫ్రిది అంటున్నాడు. -
బంగ్లా ‘ఊగిపోతోంది’
ఢాకా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మామూలుగానే బంగ్లాదేశ్‌లో భారత్‌ను మించిన క్రికెట్ పిచ్చి. అలాంటిచోట టి20 ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్ జరిగితే కావలసినంత సందడి, ఉత్సాహం. ఢాకా మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. నగరం అంతా రోడ్లను రంగు లైట్లతో అలంకరించారు. ప్రధాన రోడ్లన్నింటిపై ‘బంగ్లాదేశ్‌కు స్వాగతం’ అంటూ షకీబ్ బొమ్మతో ఉన్న కటౌట్లు పెట్టారు. రిక్షా వాలా నుంచి ప్రధాన మంత్రి దాకా అందరి ధ్యాసా ప్రస్తుతం ప్రపంచకప్ మీదే ఉంది. రోడ్లపై భారీ స్క్రీన్లు... కార్లలో, ఆటోల్లో రేడియో కామెంటరీ... మొత్తానికి భారత్‌లో కూడా ఇలాంటి సందడి ఉండదేమో! ఇంగ్లిష్ క్రికెటర్... అరబిక్ టాటూ మిర్పూర్: ఇంగ్లిష్ క్రికెటర్ అరబిక్ అక్షరమాలతో టాటూ ముద్రించుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ తన టాటూ ముచ్చటను పరభాషతో తీర్చుకున్నాడు. తన కుడి మణికట్టుపై చక్కగా కనిపించేలా ముద్రించుకున్న భాష ఏంటో అందరికీ అర్థం కాదు సుమా! ఎందుకంటే అతను అరబిక్ భాషలో వేసుకున్నాడు. దాని అర్థం ‘ధైర్యం’ (కరేజ్) అని ముచ్చటగా చెప్పుకొచ్చాడు హేల్స్. పెద్ద పెద్ద టాటూలు వేసుకోవడంలో భారత క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. చేతుల నిండా శిఖర్ ధావన్, కోహ్లిలు ముద్రించుకున్న టాటూలు ఎప్పటి నుంచో ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. -
కాంట్రాక్టులపై సంతకాలు చేయకుండానే...
కొలంబో: వేతనాల విషయమై బోర్డుతో నెలకొన్న వివాదం పరిష్కారం కాకపోవడంతో శ్రీలంక ఆటగాళ్లు కాంట్రాక్టులపై సంతకాలు చేయకుండానే టి20 ప్రపంచకప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం వారు బంగ్లాదేశ్‌కు బయల్దేరనున్నారు. ఐసీసీ నుంచి వచ్చే మొత్తంలో తమకు 20 శాతం చెల్లించాలని శ్రీలంక బోర్డు (ఎస్ఎల్సీ)ను ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు నిరాకరించిన ఎస్ఎల్సీ.. కొత్త ఫార్ములాను ఆటగాళ్ల ముందుంచింది. దీని ప్రకారం ఆటగాళ్లకు ఆరు శాతం మాత్రమే దక్కనుంది. అయితే వారు బెట్టు వీడకపోవడంతో టి20 ప్రపంచకప్‌కు ద్వితీయ శ్రేణి జట్టును పంపిస్తామని ఎస్ఎల్సీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆటగాళ్లు వేతనాల విషయాన్ని పెండింగ్‌లోనే ఉంచి బంగ్లాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.