ICC Mens T20 World Cup 2022: Team India Full Schedule, Timings, Date And Venues - Sakshi
Sakshi News home page

Team India T20 World Cup Schedule: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌పై ప్ర‌తీకారం తీర్చుకోనుందా?

Published Fri, Jan 21 2022 11:37 AM | Last Updated on Fri, Jan 21 2022 1:36 PM

T20 World Cup 2022: Team Indias Full schedule for the tournament - Sakshi

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక భార‌త్ జ‌ట్టు త‌మ‌ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. దాయాదుల పోరు అక్టోబర్ 23న ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌నుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 అక్టోబర్ 16నుంచి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 జ‌ట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్‌-2లో టీమిండియా,పాకిస్తాన్,ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జ‌ట్లు ఉన్నాయి.

కాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022లో టీమిండియా షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదిక‌గా పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అక్టోబర్ 30న పార్ల్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో, న‌వంబ‌ర్ 2న బంగ్లాదేశ్‌తో ఆడ‌నుంది. ఇక గ్రూపు-బిలో విజేత‌తో న‌వంబ‌ర్ 6న చివ‌రి లీగ్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. భార‌త్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్‌ను స్టార్ స్పోర్ట్స్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది.

చ‌ద‌వండిAxar Patel: ప్రేయసి మేహాతో అక్షర్ పటేల్ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement