
టీ20 క్రికెట్ మొదటి ప్రపంచకప్ విజేత ఎవరంటే క్రికెట్ ప్రేమికులు ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ధోని సారథ్యంలోని యంగ్ ఇండియా అని. ఆ టోర్నీలో ఆద్యంతం అధిపత్యం చలాయిస్తూ దాయాదిని మట్టికరిపించి ట్రోఫిని ఎగరేసుకొచ్చింది టీంఇండియా. ఆ మరపురాని దృశ్యాలు మరోసారి తెరపై చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే సరికొత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఆనాటి మధుర క్షణాలను మీకు రుచి చూపించేందుకు వెబ్ సిరీస్ రూపంలో వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.
చదవండి: ‘అలిపిరికి అల్లంత దూరంలో’ మూవీ రివ్యూ)
జార్ఖండ్ డైనమెట్ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీంఇండియా 2007లో జరిగిన ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది. సీనియర్లు లేకున్నా యంగ్ ఇండియా కలను సాకారం చేసింది. తుదిమెట్టుపై దాయాది పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటారు. 2007 టీ20 ప్రపంచకప్ మాత్ర అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ మ్యాచ్‌లు మిస్సయినవారికి త్వరలోనే స్క్రీన్‌పై చూపించనున్నారు.
యూకేకు చెందిన వన్ వన్ సిక్స్ నెట్ వర్క్ ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. దీనికి ఆనంద్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. పలు భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను డాక్యుమెంటరీగా సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. అప్పటి భారత జట్టులోని 15 మంది ఆటగాళ్లు, తమ అనుభవాలను ఇందులో పంచుకోనున్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
#ItStartedWithThem One One Six Network announces Team HAQ SE INDIA’s squad@harbhajan_singh @GautamGambhir @virendersehwag @DineshKarthik @robbieuthappa @IrfanPathan @iamyusufpathan @rpsingh @MJoginderSharma @sreesanth36 @RaviShastriOfc @BumbleCricket @oneonesixltd @haqseindia pic.twitter.com/OFOUn6B3jI
— Gaurav Bahirvani (@gauravbahirvani) October 9, 2021