Documentary series
-
OTT: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఎలా ఉందంటే?
నయనతార జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన డ్యాక్యుమెంటరీ సిరీస్‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నేటి(నవంబర్ 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంట ఇరవైరెండు నిమిషాల నిడివిగల ఈ డ్యాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది? అందులో ఏం చూపించారు?🔸నయనతార జీవితం మొత్తాన్ని ఓ బ్యూటిఫుల్ స్టోరీగా మలిచి తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్🔸నయనతార చిన్నప్పటి ఫోటోలను చూపుతూ..ఆమె స్కూల్ డేస్ సీన్‌తో ఈ డ్యాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది.🔸ఆమెకు సినిమా చాన్స్ ఎలా వచ్చింది? మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది ఆయాన డైరెక్టర్లతో చెప్పించారు.🔸కెరీర్ తొలినాళ్లతో నయనతార పడిన ఇబ్బందులను, బాడీ షేమింగ్ చేసినప్పుడు తను పడిన మానసిక క్షోభను పంచుకున్నారు.🔸తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన కొన్ని విమర్శల కారణంగా సినిమా చాన్స్‌లు కోల్పోయినా.. తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారనేది ఆసక్తికరంగా తెలియజేశారు.🔸శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు నయనతారను తీసుకున్నప్పడు వచ్చిన విమర్శలను చూసి ఆమె ఎంత బాధపడిందనే విషయాలను ఆయా దర్శక నిర్మాతలతో చెప్పించారు.🔸తనపై వచ్చిన విమర్శలన్నింటిని పక్కన పడేసి.. ‘లేడీ సూపర్ స్టార్’గా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా చూపించారు.🔸ఫస్టాఫ్ మొత్తం నయనతార బాల్యం, సినీ కెరీర్‌ని చూపించి..సెకండాఫ్‌లో విఘ్నేశ్‌తో ప్రేమాయణం ఎలా మొదలైంది? వివాహ జీవితం ఎలా ఉందనేది చూపించారు.🔸‘నానుమ్ రౌడీ దాన్’సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి? విఘ్నేశ్‌కి నయన్ ఎలాంటి సపోర్ట్‌ని అందించింది? ఎలా ప్రేమలో పడిపోయారనేది చక్కగా చూపించారు.🔸పెళ్లికి ముందు వీరిద్దరి రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో అనేది వారి మాటల్లోనే చూపించారు. ప్రేమలో ఉన్నప్పడు వారిపై వచ్చిన మీమ్స్ గురించి కూడా సరదాగా పంచుకున్నారు.🔸గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజు వీరిద్దరు ధరించిన దుస్తుల వెనున ఉన్న కథ, వాటిని తయారు చేయడానికి డిజైనర్లు పడిన కష్టాలను చూపించారు.🔸ఇక ఈ డ్యాక్యుమెంటరీ చివరల్లో నయనతార-విఘ్నేశ్‌ల కవల పిల్లలను చూపిస్తూ.. ఆహ్లాదకరమైన ముగింపును ఇచ్చారు.🔸మొత్తంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ సిరీస్ సరదాగా సాగుతూ.. నయనతార లైఫ్‌లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు.. విమర్శలను చూపిస్తూనే..వాటిని ఎదుర్కొని ఎలా ‘లేడీ సూపర్‌స్టార్’గా ఎదిగారనేది చూపించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ సిరీస్.. ఇందులో అదే స్పెషల్!
కూసీ మునిసామి వీరప్పన్ అంటే చాలా మందికి తెలియదు. అదే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈయన అసలు పేరు కూసీ మునిసామి వీరప్పన్. ఈయన గురించి ఇప్పటికే పలు చిత్రాలు, సీరియల్స్ రూపొందాయి. తాజాగా ఆయన నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'కూసీ మునిసామి వీరప్పన్' అనే డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కింది. దీన్ని నక్కీరన్ గోపాల్(ఈయన టీమ్.. వీరప్పన్‌ను అప్పట్లో ఇంటర్వ్యూ చేశారు) కూతురు ప్రభావతి.. ధీరన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. శరత్ జ్యోతీ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ నేటి(డిసెంబర్ 14) నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నక్కిరన్ గోపాలన్‌తో ఆయన కూతురు ప్రభావతి చాలామంది నా దగ్గరకు వచ్చారు ఈ సందర్భంగా యూనిట్ వర్గాలు చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నక్కీరన్ గాపాలన్ మాట్లాడుతూ.. నక్కీరన్ అంటే ధైర్యం కావాలనీ, ఆ తరువాత వీరప్పన్ అంటే ఇంకా ధైర్యం కావాలని అన్నారు. కూసీ మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్‌తో ఈ రెండింటినీ సాధ్యం చేశారని పేర్కొన్నారు. వీరప్పన్ కథతో చిత్రాన్ని చేయడానికి చాలా మంది తన వద్దకు వచ్చారని, తన కూతురు అడగడానికి ముందు దివంగత దర్శకుడు బాలు మహేంద్ర కూడా తనను అడిగారనీ చెప్పారు. అయితే దాన్ని సరిగా చేయాలన్న ఉద్దేశంతో తాను వీరప్పన్‌ను ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. వీరప్పన్‌కు నేనంటే ఇష్టం ఈ వీడియో కోసం తన టీమ్ చాలా కోల్పోయినట్లు పేర్కొన్నారు. వీరప్పన్ గురించి ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలు, సీరియల్స్ అన్నీ పోలీసుల కథనాలతో రూపొందాయన్నారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ మాత్రమే వీరప్పన్ స్వయంగా చెప్పిన సంఘటనలతో రూపొందించబడిందన్నారు. దీన్ని తన కూతురు టీమ్ చాలా బాగా రూపొందించిందని చెప్పారు. తనకు వీరప్పన్ అంటే ఇష్టం అనీ, ఆయనకు తానంటే ఇష్టం అనీ, అలాగని తాను ఈ సిరీస్‌తో వీరప్పన్‌కు అనుకూలంగా రిపోర్ట్ చేయలేదనీ చెప్పారు. తాము బాధింపుకు గురైన ప్రజల తరపునే నిలిచామని చెప్పారు. చదవండి: ఆ సీన్ లేకుంటే ‘యానిమల్’ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు: బాబీ డియోల్ -
టీ20 ప్రపంచకప్.. త్వరలో ధోనిని చూసే ఛాన్స్..!
టీ20 క్రికెట్ మొదటి ప్రపంచకప్ విజేత ఎవరంటే క్రికెట్ ప్రేమికులు ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ధోని సారథ్యంలోని యంగ్ ఇండియా అని. ఆ టోర్నీలో ఆద్యంతం అధిపత్యం చలాయిస్తూ దాయాదిని మట్టికరిపించి ట్రోఫిని ఎగరేసుకొచ్చింది టీంఇండియా. ఆ మరపురాని దృశ్యాలు మరోసారి తెరపై చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే సరికొత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఆనాటి మధుర క్షణాలను మీకు రుచి చూపించేందుకు వెబ్ సిరీస్ రూపంలో వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. చదవండి: ‘అలిపిరికి అల్లంత దూరంలో’ మూవీ రివ్యూ) జార్ఖండ్ డైనమెట్ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీంఇండియా 2007లో జరిగిన ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది. సీనియర్లు లేకున్నా యంగ్ ఇండియా కలను సాకారం చేసింది. తుదిమెట్టుపై దాయాది పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటారు. 2007 టీ20 ప్రపంచకప్ మాత్ర అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ మ్యాచ్‌లు మిస్సయినవారికి త్వరలోనే స్క్రీన్‌పై చూపించనున్నారు. యూకేకు చెందిన వన్ వన్ సిక్స్ నెట్ వర్క్ ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. దీనికి ఆనంద్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. పలు భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను డాక్యుమెంటరీగా సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. అప్పటి భారత జట్టులోని 15 మంది ఆటగాళ్లు, తమ అనుభవాలను ఇందులో పంచుకోనున్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #ItStartedWithThem One One Six Network announces Team HAQ SE INDIA’s squad@harbhajan_singh @GautamGambhir @virendersehwag @DineshKarthik @robbieuthappa @IrfanPathan @iamyusufpathan @rpsingh @MJoginderSharma @sreesanth36 @RaviShastriOfc @BumbleCricket @oneonesixltd @haqseindia pic.twitter.com/OFOUn6B3jI — Gaurav Bahirvani (@gauravbahirvani) October 9, 2021 -
సల్మాన్ ఖాన్ 30 ఏళ్ల సినీ జీవితంపై..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మూడు దశాబ్దాలు సుదీర్ఘంగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్‌హిట్స్ అందుకొని స్టార్‌గా వెలుగొందుతున్నాడు. ఈ తరుణంలో సల్లు భాయ్ సినీ ప్రయాణంపై డాక్యుమెంటరీ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఆయన కుంటుంబ సభ్యులు, సహా నటులు, దర్శకులు, నిర్మాతలను ఇంటర్వూ చేయనున్నారు. చదవండి: ఆ గేమ్ నన్ను వ్యంగ్యంగా చూపిస్తోంది: సల్మాన్ ఖాన్ ఈ డాక్యుమెంటరీని విజ్ ఫిల్మ్స్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సల్మాన్ ఖాన్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఇది సల్లు భాయ్ సినీ ప్రయాణం, వివాదాలు, విఫల ప్రేమాయణాలపై ఉంటుందని తెలుస్తోంది. ఓటీటీలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ డాక్యుమెంటరీకి సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్, రచయిత జావేద్ అక్తర్ కలిసి కథ అందించనున్నట్లు సమాచారం. కాగా, సల్మాన్ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న టైగర్ సిరీస్‌లో మూడో భాగం ‘టైగర్ 3’లోనూ, తన బావమరిదితో కలిసి ‘అంతిమ్’ మూవీలోనూ నటిస్తున్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై బిగ్‌బాస్ 15 షోకి హోస్ట్ చేయనున్నాడు. -
World Elephant Day 2021: మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం?
ఏనుగమ్మ ఏనుగు... బాల్యం ఏనుగుతో మొదలవుతుంది. తాతలు, నానమ్మలు వీపు మీద పిల్లలను కూచోబెట్టి ఏనుగాట ఆడతారు. ఏనుగును విఘ్నేశ్వరుడిగా పూజించుకుంటాం. కాని ఏనుగుల గురించి పట్టించుకుంటున్నామా? ప్రపంచంలో 40 వేల ఆసియా ఏనుగులు ఉంటే వాటిలో దాదాపు 27 వేలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో మగ ఏనుగుల శాతం దారుణంగా పడిపోయింది. వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వాటిని బంధించి పెట్టే సంస్కృతి ఉంది. అవన్నీ ఏనుగుల స్వేచ్ఛను హరించేవే అంటారు సంగీతా అయ్యర్. ‘ఏనుగుల రక్షకురాలి’గా పేరుపొందిన సంగీత ఏనుగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఏనుగమ్మ అయారు. ఆమె తీసిన 26 భాగాల డాక్యు సిరీస్ నేడు టీవీలో టెలికాస్ట్ కానుంది. డైనోసార్లు అంతరించి పోయాయంటే మన కాలంలో కాదు కనుక కారణాలు కచ్చితంగా తెలియవు కనుక ఏమిటో అనుకోవచ్చు. కాని ఆఫ్రికా ఏనుగులు ‘ప్రమాదం’లో ఉన్నాయని, ఆసియా ఏనుగులు ‘అంతరించిపోయే’ జాబితాలో ఉన్నాయని తెలిస్తే అందుకు కారణం వర్తమానంలో మనిషి తప్పిదం తప్ప, మనిషి నిర్దాక్షిణ్యం తప్ప, మనిషి బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు. అంత పెద్ద జంతువును వేటాడి, వెంటాడి, చంపి, దాని దంతాల కోసం దారుణంగా నిర్మూలించాలని చూసే మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం? అడవుల్లో ఉన్న ఏనుగుల బాధ ఒకవైపు ఉంటే మనిషి తన మాలిమి కోసం వాటిని చేరదీసి, బంధించి వాటికి పెట్టే బాధ మరోవైపు. ఇవన్నీ ఎంతకాలం అని అడుగుతారు సంగీతా అయ్యర్. ‘నేనే గనుక ప్రధానిని అయితే ఈపాటికి దేశంలోని ఏనుగులన్నీ స్వేచ్ఛాగాలులు పీలుస్తూ ఉండేవి’ అంటారామె. బాల్యం నుంచి బంధం కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నప్పుడు తన తాతయ్య, నానమ్మతో దగ్గరిలోని దేవస్థానానికి వెళ్లేవారు. అక్కడ పెద్దలు గుడి దర్శనంలో ఉంటే సంగీత దేవస్థానంలో కట్టేసి ఉన్న ఏనుగును చూస్తుండేవారు. ‘ఏనుగు కాళ్లకు ఉన్న పెద్ద పెద్ద సంకెళ్లను చూసి మా నానమ్మను అవి ఎందుకున్నాయి అని అడగడం మొదలుపెట్టాను. వాళ్లు ఏం చెప్పినా నేను సమాధాన పడలేదు. అప్పుడు మా నానమ్మ నా కాళ్లకు పట్టీలు వేసి ఇప్పుడు నీకూ ఉన్నాయిగా అని చెప్పింది. కాని ఏనుగులకు ఉన్న సంకెళ్లు రెండు కాళ్లను కదలకుండా చేసేలా ఉన్నాయి. నాకు అలా లేవు అని చెప్పాను. అప్పుడే ఏనుగుల గురించి నా మనసులో పడింది’ అంటారు సంగీత. కెనడా నుంచి తిరిగి వచ్చి కాలక్రమంలో సంగీత జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్ అయ్యి కెనడాలో స్థిరపడ్డారు. కాని 2013లో భారత్‌కు వచ్చినప్పుడు కేరళలోని దేవస్థానాలు తిరుగుతున్నప్పుడు దారుణంగా గాయాలైనా సరే సంకెళ్లతో బంధించి ఉన్న ఏనుగులను చూసి చలించిపోయారు. ‘కేరళలో ఉత్సవాల కోసం మగ ఏనుగులను మాలిమి చేస్తారు. కాని అవి వయసులోకి వచ్చినప్పుడు మదంతో ప్రవర్తించకుండా ఉండేందుకు సంకెళ్లతో కట్టి దారుణంగా కడుపు మాడుస్తారు. జబ్బు చేసినా, చూపు మందగించినా ఉత్సవాల్లో నిలబెడతారు. దీని మీద గొంతెత్తాలని నిశ్చయించుకున్నాను’ అంటారు సంగీత. అప్పుడే ఆమె ‘గాడ్స్ ఇన్ షాకల్స్’ డాక్యుమెంటరీ తీశారు. మానవ హింస వల్ల ఆ తర్వాతి కాలంలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో ఏనుగులు ఎలా బాధ పడతాయో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆమె తీసిన ఈ డాక్యుమెంటరీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో స్క్రీన్ అయ్యింది. అంత గొప్పగా ఆమె సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లింది. మనిషే శత్రువు ‘ఏనుగులకు మనిషే శత్రువు. నిజానికి ఏనుగులు మనిషిని ఎంతో ప్రేమిస్తాయి. మనిషికి సాయం చేసేందుకు చూస్తాయి. గిరిజనులకు వాటితో పాటు ఎలా అడవిలో జీవించాలో తెలుసు. కాని నాగరీకులు అడవిగా ఉండాల్సిన దానిని వ్యవసాయంలోకి తెచ్చి ఏనుగులు తిరగాల్సిన భూమిని కుదిస్తున్నారు. వాటి నీటి ఆవాసాలను ఆక్రమిస్తున్నారు. అవి తిరుగాడే స్థలంలో పంటలు వేసి ఆ పంటల్ని అవి తినకుండా కరెంటు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్ షాక్ కొట్టి ఏనుగులు చనిపోవడం ఎంత అన్యాయం’ అంటారు సంగీత. ‘ఎక్కడైతే ఏనుగులు తిరగాల్సిన భూమి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందో ఆ భూమిని ప్రభుత్వం తిరిగి కొని ఏనుగులకు వదిలిపెడితే సగం సమస్య తీరుతుంది’ అంటారు సంగీత. ‘రైల్వే అధికారులు ఏనుగులు ఉండే ప్రాంతంలో రైళ్ల వేగం అదుపు చేస్తే, ట్రాన్స్పోర్ట్ అధికారులు రోడ్లపై వాహనాల వేగం అదుపు చేస్తే, విద్యుత్ అధికారులు కంచెలకు కరెంట్ లేకుండా అడ్డుకుంటే చాలా ఏనుగులు ప్రాణాలతో మిగులుతాయి’ అంటారు సంగీత. ఆసియన్ ఎలిఫెంట్స్ 101 సంగీత అయ్యర్ తీసిన తాజా డాక్యు సిరీస్ ‘ఏసియన్ ఎలిఫెంట్స్ 101’ మనిషి–ఏనుగు కలిసి చేయాల్సిన సహవాసం గురించి చర్చిస్తుంది. మనిషి బంధనాల్లో దారుణంగా దెబ్బ తిన్న ఏనుగుల కోసం, అడవి నుంచి బయటపడిన ఏనుగు పిల్లల కోసం అస్సాంలో, కర్నాటకలో, కేరళలో రిహాబిలేషన్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వాటి బాగోగులను చూపిస్తుంది. అంతే కాదు వాటి బాగు కోసం పర్యావరణ కార్యకర్తలకు శాంక్చరీలను తెరిచే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మావటీలకు ఇవ్వాల్సిన శిక్షణ, ఏనుగుల కాళ్లకు అవసరమైన కేరింగ్, వాటి ఆహారం, స్నానం, ప్రాణాంతక జబ్బుల గురించి వైద్యం... వీటన్నింటినీ చర్చిస్తుంది. ఈ సిరీస్‌లోని కొన్ని భాగాలు నేడు జియో టీవీ ఇండియాలో ప్రసారం కానున్నాయి. ఏనుగుల సంరక్షణ కోసం ‘వాయిస్ ఆఫ్ ఏసియన్ ఎలిఫెంట్స్ సొసైటీ’ అనే సంస్థ నడుపుతున్న సంగీత ఏనుగులకు సిసలైన రక్షకురాలు. కాని ప్రజలు ఇలాంటి వారికి తోడు నిలిచినప్పుడే గజరాజు నిజంగా అడవికి రాజయ్యి మనుగడ సాగిస్తాడు. -
శ్రీదేవిపై డాక్యుమెంటరీ సిరీస్
సాక్షి, బెంగళూర్ : లెజెండరీ పర్సనాలిటీలపై బయోపిక్‌లు రూపొందుతున్న క్రమంలో ఈ జాబితాలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి చేరనుందనే ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్‌తో పాటు సౌత్ స్క్రీన్‌పై తనదైన ముద్రవేసిన నటి శ్రీదేవి జీవితంపై డాక్యుమెంటరీ రానుంది. చిత్రపరిశ్రమలో ఈ లెజెండరీ హీరోయిన్ ఐదు దశాబ్ధాల నట ప్రస్ధానాన్ని పూర్తిచేసుకుంటున్న క్రమంలో బెంగళూర్‌కు చెందిన ఓ ఫ్యాన్స్ క్లబ్ శ్రీదేవి జీవితంపై ఐదు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను చేపట్టింది. ఇంకా పేరుపెట్టని ఈ డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. శ్రీదేవి భర్త బోనీకపూర్‌తో క్లబ్ వ్యవస్ధాపకులు పలుమార్లు చర్చలు జరిపిన మీదట డాక్యుమెంటరీకి బోనీ గ్రీన్‌సిగ్నల్ లభించింది. హిందీలో, దక్షిణాదిలో శ్రీదేవితో నటించిన నటీనటుల ఇంటర్వ్యూలు, సినిమా క్లిప్పింగ్‌లు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో ఒక్కో సిరీస్ గంట నిడివితో ఉంటుందని తెలిసింది. తొలి ఫిల్మ్ బాలనటిగా శ్రీదేవి కెరీర్ ఎలా సాగిందనే దానిపై రూపొందించనున్నారు. రెండవ, మూడవ భాగాలు ఆమె బాలీవుడ్ కెరీర్‌కు అద్దంపడతాయి. సుదీర్ఘ సినీప్రస్ధానంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, అందుకున్న బ్లాక్‌బస్టర్స్ వంటి పలు విశేషాల సమాహారంగా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకోనుంది. -
మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!
భారతీయ సినిమా ఇప్పటికి 101 ఏళ్ళు పూర్తి చేసుకొని, దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. మూగగా మొదలై మాటలు నేర్చిన సినిమా తెలుగు భాషలోనూ ఇప్పటికి 82 ఏళ్ళుగా సామాన్యుల్ని అలరిస్తూనే ఉంది. అయితే, వేషభాషలతో సహా మానవ జీవితాన్నే ఎంతో మార్చేసిన ఈ శతాధిక వత్సర అద్భుతం తాలూకు చరిత్ర ఇప్పటికీ సమగ్రంగా రికార్డు కాలేదనే చెప్పాలి. కొద్దిమంది ప్రయత్నాలు చేసినా, ఆర్థిక వనరుల కొరత మొదలు అనేక ఇబ్బందులతో సంతృప్తికర ఫలితాలు తెరపైకి రానే లేదు. ఈ నేపథ్యంలో మన తెలుగు హీరో - నిర్మాత మంచు విష్ణు తాజాగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. నూరు వసంతాల భారతీయ సినిమాపై ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను తీయాలని భావిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వంలో రూపొందిన తొలి భారతీయ మూకీ ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ (1913) దగ్గర మొదలుపెట్టి, హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో 1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మీదుగా ఇప్పటి వరకు మన సినీ ప్రస్థానాన్ని పలు భాగాల డాక్యుమెంటరీగా తెర కెక్కించనున్నట్లు భోగట్టా. విష్ణు తీసే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు ఆయన తండ్రి, నటుడు, నిర్మాత అయిన మోహన్‌బాబు ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లూ, తెలుగు సినీ పరిశ్రమకు తమ వంతు సేవగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లూ కృష్ణానగర్ కబురు. ఈ విశిష్ట ప్రయత్నంపై వినవస్తున్న వార్తల గురించి ‘సాక్షి’ ప్రతినిధికి విష్ణు వివరణనిస్తూ, ‘‘అవును. డాక్యుమెంటరీ సిరీస్ తీయాలనుకుంటున్నది నిజమే’’ అని అంగీకరించారు. ‘‘నేను కొన్ని భాగాలు తీస్తే, మరో ప్రముఖ దర్శకుడు కొన్ని భాగాలు తీస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం’’ అని ఈ యువ హీరో తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం గురించి పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వివరాల మాట అటుంచితే, మన సినిమా చరిత్ర రికార్డు కాలేదని ఆవేదన చెందుతున్న సినీ ప్రియులకు ఇది శుభవార్తే. సాధికారికమైన సమాచారంతో, సమగ్రంగా ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి! ఆల్ ది బెస్ట్ విష్ణూ!