
శ్రీదేవి సినీప్రస్ధానంపై తెరకెక్కనున్న డాక్యుమెంటరీ
సాక్షి, బెంగళూర్ : లెజెండరీ పర్సనాలిటీలపై బయోపిక్‌లు రూపొందుతున్న క్రమంలో ఈ జాబితాలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి చేరనుందనే ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్‌తో పాటు సౌత్ స్క్రీన్‌పై తనదైన ముద్రవేసిన నటి శ్రీదేవి జీవితంపై డాక్యుమెంటరీ రానుంది. చిత్రపరిశ్రమలో ఈ లెజెండరీ హీరోయిన్ ఐదు దశాబ్ధాల నట ప్రస్ధానాన్ని పూర్తిచేసుకుంటున్న క్రమంలో బెంగళూర్‌కు చెందిన ఓ ఫ్యాన్స్ క్లబ్ శ్రీదేవి జీవితంపై ఐదు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను చేపట్టింది. ఇంకా పేరుపెట్టని ఈ డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
శ్రీదేవి భర్త బోనీకపూర్‌తో క్లబ్ వ్యవస్ధాపకులు పలుమార్లు చర్చలు జరిపిన మీదట డాక్యుమెంటరీకి బోనీ గ్రీన్‌సిగ్నల్ లభించింది. హిందీలో, దక్షిణాదిలో శ్రీదేవితో నటించిన నటీనటుల ఇంటర్వ్యూలు, సినిమా క్లిప్పింగ్‌లు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో ఒక్కో సిరీస్ గంట నిడివితో ఉంటుందని తెలిసింది. తొలి ఫిల్మ్ బాలనటిగా శ్రీదేవి కెరీర్ ఎలా సాగిందనే దానిపై రూపొందించనున్నారు. రెండవ, మూడవ భాగాలు ఆమె బాలీవుడ్ కెరీర్‌కు అద్దంపడతాయి. సుదీర్ఘ సినీప్రస్ధానంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, అందుకున్న బ్లాక్‌బస్టర్స్ వంటి పలు విశేషాల సమాహారంగా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment