నరాలు తెగే ఉత్కంఠగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచి మ‍్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌లో భారత్ విజయం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్పందించారు. విరాట్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ఇన్‌స్టాలో అనుష్క శర్మ రాస్తూ..' ఈ దీపావళికి ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపారు. మీరు ఒక అద్భుతం. మీ పట్టుదల, నమ్మకం, మనస్సును కదిలించేలా ఉన్నాయి. నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్ చూశా. నేను మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ చేస్తుంటే మా పాపకు అర్థం కానీ పరిస్థితి. కానీ ఏదో ఒక రోజు తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారని తెలుసుకుంటుంది. అత్యంత కఠిన పరిస్థితుల నుంచి ఎన్నడు లేనంతగా పుంజుకున్నారు మీరు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీపై నా ప్రేమ అపరిమితం' అంటూ రాసుకొచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment