Anushka Sharma Lashes Out At Fan For Secretly Recording Video Of Virat Kohli - Sakshi
Sakshi News home page

Anushka Sharma : 'ఇది నిజంగా చెత్తగా ఉంది.. మీ బెడ్‌రూమ్‌లో జరిగితే అప్పుడేంటి'?

Published Mon, Oct 31 2022 1:39 PM | Last Updated on Mon, Oct 31 2022 2:39 PM

Anushka Sharma Lashes Out At Fan For Secretly Recordfing Video Of Virat Kohli - Sakshi

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో విరాట్‌ హోటల్‌ రూమ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కోహ్లి రూమ్‌లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కోహ్లి వాడే వస్తువులు, వార్డ్‌ రోబ్ సహా అన్నింటిని చిత్రీకరించాడు. కింగ్ కోహ్లి హోటల్ రూమ్ అంటూనెట్టింట పోస్ట్‌ చేశాడు.

ఈ ఘటనపై కింగ్‌ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'సాధారణంగా తమకు ఇష్టమైన ఆటగాళ్ల  గురించి తెలుసుకోవడానికి, వాళ్లను కలవడానికి  అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నా ప్రైవసీకి సంబంధించనది. నా రూమ్‌లో నాకు ప్రైవసీ లేకపోతే ఇంక ఎక్కడ ఉంటుంది?దయచేసి అందరీ వ్యక్తిగత ప్రైవసీని గౌరవించండి. మమ్మల్ని వినోద వస్తువులుగా పరిగణించవద్దు. వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బంది కలిగించే ఇలాంటి వీడియోలు తీయవద్దు' అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇక హోటల్‌ రూమ్‌ లీక్‌ కావడంపై అనుష్క శర్మ సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో కూడా కొంతమంది అభిమానులు చేసిన దారుణమైన సంఘటనలను ఎదుర్కొన్నాను. కానీ ఇది నిజంగా చెత్తగా ఉంది. సెలబ్రిటీ అయితే వీటన్నింటిని హ్యాండిల్‌ చేయాలి అని మాట్లాడే వాళ్లకి ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను.. ఒకవేళ ఇలాంటిదే మీ బెడ్‌రూమ్‌లో జరిగితే అప్పుడు ఏంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం సహించలేనివి అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఇక కోహ్లీ హోటల్‌ రూం లీక్‌ కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రికెటర్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement