
అందాల తార కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి రిలేషన్‌షిప్ కొన్నిరోజులుగా హిందీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ వారికి నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు షికారు చేయగా.. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదే వారు జంటగా కొత్త ఇల్లు తీసుకోబోతున్నారని.
గతేడాది విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట ముంబైలోని జుహులో కొత్త ఇల్లు తీసుకున్నారు. వారి ఇంటి పక్కనే ఉన్న ఇంటిని విక్కీ, కత్రినా (అభిమానులు విక్యాట్‌గా పిలుస్తుంటారు) జంట కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైందని రూమర్స్ వస్తున్నాయి. ఆ ఇంటిని రెండు నెలల క్రితమే ఈ కపుల్ సందర్శించినట్లు, అది వారికి బాగా నచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వచ్చే డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వారి వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా అనుష్క, కత్రినాకి ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ‘జబ్ తక్ హై జాన్’కి ఇద్దరూ కలిసి పని చేశారు. గతంలో కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్’కి ఇద్దరు భామలు అతిథులుగా వచ్చి తమ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడారు. దీంతో విక్యాట్ల పెళ్లి గురించి, కొత్త ఇల్లు గురించి ఉన్నవి రూమర్స్ కాదని, జరగబోయే నిజాలని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.
చదవండి: కత్రినా కైఫ్‌తో ఎంగేజ్‌మెంట్.. నవ్వొస్తుందన్న విక్కీ కౌశల్
Comments
Please login to add a commentAdd a comment