అలాంటి రికార్డ్ కింగ్ కోహ్లీకి మాత్రమే సాధ్యం.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్! | Anushka Sharma Pens Sweet Note For Virat Kohli On His 35th Birthday | Sakshi
Sakshi News home page

Anushka Sharma: విరాట్ బర్త్ డే స్పెషల్.. ఆ పోస్ట్‌తో విష్ చేసిన అనుష్క శర్మ!

Nov 5 2023 1:35 PM | Updated on Nov 5 2023 2:16 PM

Anushka Sharma Pens Sweet Note For Virat Kohli On His 35th Birthday - Sakshi

టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ ఇవాళ 35వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విరాట్‌కు క్రికెటర్స్, ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.  ప్రస్తుతం విరాట్ స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశారు. మరో సెంచరీ చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంచరీల రికార్డ్‌ను సమం చేయనున్నారు. నవంబర్‌ 5న కోహ్లీ బర్త్ డే కావడంతో ఆయన భార్య, నటి అనుష్క శర్మ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన భర్తకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

(ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్‌ ఫ్రెండ్‌!)

అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో రాస్తూ..'తన జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగానే ఉంటాడు! కానీ ఏదో ఒక విధంగా నేను కూడా అతని అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతున్నా. నా ఈ జీవితంలో అంతకు మించి ప్రేమిస్తున్నా. అది ఏ రూపంలోనైనా, ఏదైనా కావచ్చు. లవ్‌ యూ విరాట్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

అయితే తన పోస్ట్‌లో కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన ఫోటోను పంచుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క బంతి కూడా వేయకుండా వికెట్ సాధించిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ అంటూ పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్‌ చేసిన కోహ్లీ.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్‌ను అవుట్ చేశాడు. అయితే ఆ బాల్ వైడ్ వెళ్లగా.. ధోని అతన్ని స్టంప్‌ అవుట్ చేశాడు. దీంతో ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇలాంటి ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదంటూ అనుష్క శర్మ తన భర్తపై ప్రేమను కురిపించింది. ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. 

(ఇది చదవండి: హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!)

కాగా.. అనుష్క, విరాట్ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట జనవరి 2021లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించారు. తమ ముద్దుల కూతురికి వామిక అని పేరు పెట్టారు. సినిమాల విషయాకొనిస్తే అనుష్క శర్మ  నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చక్దా ఎక్స్‌ప్రెస్‌లో కనిపించనుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement