World Cup Cricket
-
పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీ
దుబాయ్: వచ్చే నెలలో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. పురుషుల వరల్డ్‌కప్ విజేతతో సమానంగా... మహిళల ప్రపంచకప్ చాంపియన్‌కు నగదు బహుమతి ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. దీంతో మహిళల టి20 వరల్డ్ కప్ విజేతకు రూ. 19.60 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. గత ప్రపంచకప్ నగదు బహుమతితో పోల్చుకుంటే... ఇది 134 శాతం ఎక్కువ కావడం విశేషం. 2023లో నిర్వహించిన మహిళల టి20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 20.52 కోట్లు (2.45 మిలియన్ అమెరికన్ డాలర్లు) కాగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ. 66.67 కోట్ల(7,958,080 అమెరికన్ డాలర్లు)కు పెంచారు. దీంతో రానున్న మెగాటోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు కూడా భారీగా నగదు బహుమతి అందుకోనున్నాయి. ‘వచ్చే నెల జరగనున్న టి20 ప్రపంచకప్ నుంచి మహిళలకూ పురుషులతో సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఇది క్రీడా చరిత్రలోనే సరికొత్త నిర్ణయం’అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదే జరిగిన పురుషుల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.20 కోట్ల నగదు బహుమతి లభించింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. -
భారీ విజయం... భావి ప్రయాణం...
శనివారం రాత్రి పొద్దుపోయాక... అద్భుతమే జరిగింది. గతంలో అనేకసార్లు ఊరించి ఉసూరుమనిపించినట్టే ఈసారీ ఫలితం అటూ ఇటూగా ఉంటుందేమోనని భయపడుతున్న క్రీడాభిమానుల సందేహాలు తుదిఘట్టంలో పటాపంచలయ్యాయి. పదిహేడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్ జట్టు విజయపతాకం ఎగరేసింది. పొట్టి క్రికెట్ విధానంలో తొలి ప్రపంచ కప్‌ను 2007లో గెలిచిన భారత జట్టు... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తొమ్మిదో ప్రపంచ కప్‌ను అందుకుంది. మరెక్కడా లేనంత భారీగా, హంగులూ ఆర్భాటాలతో ఆకర్షణీయంగా, అత్యంత సంపన్నంగా టీ20 లీగ్‌ను జరిపే భారత్ మరోసారి ఆ ఫార్మట్‌లో జగజ్జేతగా నిలిచింది. జూన్ 29న వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో ఆఖరు దాకా ఉత్కంఠగా సాగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్– 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు సాధించిన విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, న్యూయార్క్‌లో కొత్తగా వెలసిన స్టేడియమ్ మొదలు వివిధ కరేబియన్ దీవుల్లో సాగిన ఈ వరల్డ్ కప్ కొత్త ఉత్తేజం తెచ్చింది. చివరకు కప్ గెలుపుతో కోచ్‌గా ద్రావిడ్‌కూ, టీ20ల నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజాలకూ తీయటి వీడ్కోలు దక్కింది.గతంలో ఎన్నో విజయాలు సాధించినా... ఫార్మట్ ఏదైనప్పటికీ ప్రపంచ కప్ విజేతగా నిలవడమనేది ఎప్పుడూ ప్రత్యేకమే. 1983లో తొలిసారిగా కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు వన్డేలలో వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచి సామాన్య ప్రజానీకంలో సైతం క్రికెట్ పట్ల, ప్రపంచ కప్ పట్ల పెరిగిన ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 20 ఓవర్ల పొట్టి క్రికెట్ వచ్చాక, 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సేన తొలి టీ20 వరల్డ్ కప్ మనం దక్కించుకోవడంతో ఇక ఆకాశమే హద్దయింది. 2011లో మరోసారి వన్డేల్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్నాం. లెక్కలు తీస్తే... మనం టీ20 వరల్డ్ కప్ గెలిచి 17 ఏళ్ళయితే, అసలు ఏదో ఒక ఫార్మట్‌లో ప్రపంచ కప్ గెలిచి 13 ఏళ్ళవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే ఏదో ఒక టోర్నీలో విజేతగా నిలిచి, స్వదేశానికి ట్రోఫీ పట్టుకొచ్చి కూడా కనీసం 11 ఏళ్ళవుతోంది. 2013లో ఇంగ్లండ్‌లో ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ తర్వాత ఐసీసీ పోటీల్లో మనకు మళ్ళీ ట్రోఫీలు దక్కలేదు. ఇన్నాళ్ళకు ఆ కొరత తీరింది. కొన్నేళ్ళుగా విజయావకాశాలు పుష్కలంగా ఉన్న ఫేవరెట్‌గా భారత క్రికెట్ జట్టు రకరకాల టోర్నీలలో బరిలోకి దిగుతోంది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక దశలో విఫలమవుతోంది. కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్‌ల జోడీ సంగతికే వస్తే, ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్’లో జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. చివరకు ఏడు నెలల క్రితం గత నవంబర్‌లో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఆఖరి ఘట్టంలో అహ్మదాబాద్‌లో తడబడింది. ఆ రెండుసార్లూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ తాజా టీ20 వరల్డ్ కప్‌లో సైతం మొదటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకువచ్చిన మన జట్టు శనివారం నాటి ఫైనల్లో ఒక దశలో ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు 30 బంతుల్లో 30 పరుగులే చేయాలి. పైగా 6 వికెట్లున్నాయి. ఆ పరిస్థితుల్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా తెలివైన ఆట తీరు, బౌండరీ దాటుతున్న బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకొని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ మ్యాచ్ దిశను మార్చేశాయి. ఎట్టకేలకు సమష్టి స్ఫూర్తితో ఓటమి కోరల నుంచి కూడా విజయాన్ని అందుకొనే కళలో భారత్ ఆరితేరింది. జట్టు అవసరాలకు తగ్గట్టు భిన్నమైన ఆట శైలిని ఆటగాళ్ళు అవలంబించడం నేర్చుకున్నారు. పోయిన పాత ఫామ్‌ను మళ్ళీ అత్యవసరమైన ఫైనల్లో అందుకొని, అవతల వికెట్లు పడిపోతున్నా తడబడకుండా పిచ్ వద్ద పాతుకుపోయి, కోహ్లీ 76 పరుగులు చేసిన తీరు అందుకు మచ్చుతునక. రోహిత్ శర్మ సారథ్యం, అక్సర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ల ప్రదర్శన, కీలకమైన ఫైనల్లో ప్రమాదకరంగా మారిన క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్మన్లను ఔట్ చేసిన యువ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ పరిణతి... ఇలా అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచ విజేత పట్టం. దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన ఆట... అందులోనూ వరల్డ్‌కప్ విజయం... అర్ధరాత్రి దాటినా సరే దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చి మరీ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొన్నది అందుకే! మన దేశంలోనే కాదు... దేశదేశాల్లో పెరుగుతున్న భారత క్రికెట్ క్రీడాభిమానులకూ ఇది పండుగ వాతావరణం తెచ్చింది. ఒక్కమాటలో, మన దేశం ఇప్పుడు క్రికెట్ సూపర్‌పవర్. ఒకప్పుడు 1970లు – 80లలో బలమైన బ్యాటింగ్, బౌలింగ్ సేనతో వీరవిహారం చేసిన వెస్టిండీస్ జట్టుతో ఇప్పుడు భారత్ ఆటగాళ్ళను విశ్లేషకులు పోలుస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ నుంచి మన క్రికెట్ ప్రయాణం ఎలా ముందుకు సాగనుందన్నది ఇక కీలకం. కోచ్ ద్రావిడ్ మొదలు కీలక ఆటగాళ్ళ దాకా పలువురి రిటైర్మెంట్తో ఒక శకం ముగిసింది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ళపై గతంలో పెట్టుబడి పెడితేనే ఇప్పుడీ ఫలితాలు వచ్చాయని మర్చిపోరాదు. భవిష్యత్తే లక్ష్యంగా జట్టుకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ ఖాళీ అవుతున్న కీలక స్థానాల భర్తీపై దృష్టి పెట్టాలి. మ్యాచ్‌లు ఆడకున్నా ఈ వరల్డ్‌కప్ జట్టులో భాగమైన యశస్వీ జైస్వాల్ సహా పలువురు ప్రతిభావంతుల్ని ఏరి, ఇకపై మరింత సానబెట్టాలి. కొద్ది నెలల్లోనే 2025లో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ట్రోఫీ నాటికి సర్వసన్నద్ధం కావాలి. ఆ పునర్నిర్మాణానికి తాజా విజయం ఓ బలమైన పునాది. -
ఫైనల్ లో బోల్తా పడ్డ కుర్రోళ్ళు
-
ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
ప్రపంచకప్ క్రికెట్‌ను ఎంతమంది చూశారంటే..
భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ చాలాఎక్కువ. గల్లీలో క్రికెట్ ఆడే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఇండియా మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతారు. అదీ ఫైనల్ మ్యాచ్ అంటే మరీ ఎక్కువ. అందులోనూ వరల్డ్‌కప్ ఫైనల్స్ అంటే చెప్పనక్కర్లేదు. ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో భారత ఆటగాళ్లు పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రికార్డుస్థాయిలో ఈసారి వరల్డ్‌కప్ టోర్నమెంట్‌ను వీక్షించినట్లు తెలిసింది. ఏకంగా 51.8 కోట్ల మంది భారతీయులు ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్‌ను తిలకించినట్లు డిస్నీ సంస్థ తెలిపింది. ఐసీసీ ఆధ్యర్యంలో 48 రోజుల పాటు జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది భారతీయులు వీక్షించారని డిస్నీ చెప్పింది. హాట్‌స్టార్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా 5.9 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్‌ను చూసి రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. 2024 నుంచి 2027 వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి దాదాపు రూ.25 వేల కోట్లు చెల్లించి డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇదీ చదవండి: 15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే.. పన్నెండేళ్ల తర్వాత భారత్‌లో ఆడిన ఐసీసీ ఫైనల్ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది చూసినట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఇండియా(బీఏఆర్సీ) నిర్ధారించింది. దాదాపు 42,200 కోట్ల నిమిషాల టీవీ స్క్రీన్ టైం నమోదైందని బీఏఆర్సీ తెలిపింది. కేవలం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను 13 కోట్ల మంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ను 8 కోట్ల మంది, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను 7.5 కోట్ల మంది వీక్షించారని వివరించింది. -
CWC 2023 Final: పోరాట యోధులు.. మ్యాచ్ ఓడినా, మనసులు గెలుచుకున్నారు..!
తాడేపల్లి : వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2023 వరల్డ్ కప్‌లో మన క్రికెటర్లు మంచి పోరాట పటిమ చూపించారు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేకపోయినా వారి క్రీడా స్ఫూర్తి, యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇండియా టీమ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అంటూ సీఎం వైస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. My admiration and respect for our warriors of the Indian Cricket Team for their incredible journey in the 2023 Cricket World Cup. Although the match didn’t go in our favour, their spirit, sportsmanship and innumerable moments through this journey have greatly inspired the entire… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 19, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: బీజేపీ ట్వీట్‌కు కాంగ్రెస్ రీట్వీట్..!
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్‌లో జరుగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-భారత్ నేడు తలపడుతున్నాయి. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అటు.. టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ టీమిండియాకు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ చమత్కారంగా రీట్వీట్ చేసింది. 'కమాన్ టీమిండియా.. మీపై నమ్మకం ఉంది' అని పేర్కొంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 'నిజమే.. జితేగా ఇండియా' అంటూ ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ రీట్వీట్ చేసింది. అయితే.. ఇండియా అనే అనే పదంపై ఇటీవల పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించే లక్ష్యంతో దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంపై రాజకీయంగా పెద్ద వివాదం నడిచింది. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలు పేర్లు పెట్టుకోవడంలో నిబంధనలు విధించలేమని ఎలక్షన్ కమిషన్ కూడా తెలిపింది. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టిన తర్వాత జరిగిన జీ-20 సమావేశంలో దేశం పేరును కేంద్రం భారత్‌గా పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన పత్రంలోనూ భారత్ ప్రెసిడెంట్ అని సంబోధించింది. దీనిపై కేంద్రంలోని బీజేపీని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం.. ఫ్రీ-పాలస్తీనా టీషర్ట్‌తో మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి -
వరల్డ్ కప్ ఫైనల్, దేశంలో బిజినెస్ అప్ & డౌన్
ప్రపంచకప్ ఫైనల్లో అహ్మాదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియాలో హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన భారత్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ సందర్భంగా భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రభావం భారత్‌లోని పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆయా రంగాలకు చెందిన వ్యాపార విభాగాలకు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. వాటిల్లో యూపీఐ లావాదేవీలు డల్ మ్యాచ్ జరిగే సమయంలో యూపీఐ చెల్లింపులతో సహా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. జనమంతా మ్యాచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉండడంతో.. UPI ట్రాన్సాక్షన్లు బాగా తగ్గిపోతాయని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత వరల్డ్ కప్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా UPIలపై తీవ్రప్రభావం పడింది. కేవలం ఫుడ్ ఆర్డర్, హోటళ్ల బిజినెస్ మాత్రం జరిగింది. గత ఏడాది దీపావళి సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు UPI లావాదేవీలు పూర్తిగా క్షీణించాయి. కింద ఇచ్చిన గ్రాఫ్ లో ఆ వివరాలను గమనించవచ్చు. ముఖ్యంగా కొహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు UPIలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత లావాదేవీలు సాధారణంగా మారాయి. అమ్మకాలలో హెచ్చుతగ్గులు ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో ఆన్లైన్ విక్రయాలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. టీమ్ జెర్సీలు, ఫ్లాగ్‌లు, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరగవచ్చు. మరోవైపు, ప్రజలు మ్యాచ్‌పై దృష్టి సారించడంతో క్రీడలకు సంబంధించిన ఆన్లైన్ విక్రయాలు భారీగా క్షీణించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్‌లు ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో బెట్టింగ్ యాప్స్ వినియోగం విపరీతంగా ఉంటుంది. మ్యాచ్ ఫలితం లేదా గేమ్‌లోని వివిధ ఈవెంట్లపై బెట్టింగ్‌పై ఎక్కువ మొగ్గు చూపుతారు. బెట్టింగ్ కార్యకలాపాల పెరుగుదల, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ , బెట్టింగ్ సెక్టార్లో నిర్వహించే వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ కొనసాగుతున్న ఈ సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగించేందుకు ఔత్సాహికులు పోటీపడుతుంటారు. జరుగుతున్న లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వినియోగదారులు ఫాంటసీ లీగ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త జట్లను ఏర్పాటు చేసి ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. బిజినెస్ ప్రమోషన్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను లేదా సేవలను అందించేందుకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుంది. టీవీలు, యాప్స్, లైవ్ స్ట్రీమ్‌లలో యూజర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని, సేవల ప్రచారానికి ఉపయోగిస్తుంటాయి. రెస్టారెంట్లు, బార్లపై ప్రభావం ప్రపంచ కప్ ఫైనల్‌ను ప్రదర్శించే రెస్టారెంట్లు, బార్లలో మ్యాచ్‌ను తిలకించేందుకు ఎగబడుతుంటారు. ఆ సమయంలో మద్యం, బిర్యానీతో పాటు ఇతర ఆహార వంటకాలు విపరీతంగా అమ్ముడు పోతుంటాయి. సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈవెంట్ జరిగే సమయంలో భారీగా ఎత్తున నెటిజన్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా ఉపయోగిస్తుంటారు. మ్యాచ్ ఫలితాల్ని బట్టి మీమర్స్.. మీమ్స్ క్రియేట్ చేసి వారి వారి సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. -
WC Final: టీమిండియాకు మోదీ శుభాకాంక్షలు
అహ్మదాబాద్: క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాలని కోరారు. 140 కోట్ల మంది భారత్ టీంకు అండగా నిలబడతారని అన్నారు. All the best Team India! 140 crore Indians are cheering for you. May you shine bright, play well and uphold the spirit of sportsmanship. https://t.co/NfQDT5ygxk — Narendra Modi (@narendramodi) November 19, 2023 అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. న్యూజిలాండ్‌పై విజయం సాధించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అటు.. సౌతాఫ్రికాపై గెలిచి ఆసిస్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఇదీ చదవండి: భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ! -
ఆస్ట్రేలియాతో ఫైనల్ సమరానికి రెడీ
-
స్లో పిచ్?..టీమిండియానే ఫేవరెట్
-
భారత్ గెలుస్తుందని అభిమానుల ధీమా
-
తిరుపతిలో క్రికెట్ ఫీవర్
-
దేశమంతటా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్
-
భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు
భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ట్రాన్స్జెండర్ల సంఘం సభ్యులు ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినా, తరువాత జరిగిన అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చూపాయి. అటువంటి స్థితిలో ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం! -
ఇండియా టీం కి ఆల్ ది బెస్ట్ చెబుతున్న హీరో వెంకటేష్
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
టీం ఇండియాకి భారీ షాక్..ఎందుకంటే..!
-
రివేంజ్ పక్కా అంటున్న భారత్..!
-
వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ కు మొదలైన కౌంట్ డౌన్
-
World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్‌లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్‌కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు. చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279. బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269. బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2, ధనంజయ డిసిల్వా 3–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
అలాంటి రికార్డ్ కింగ్ కోహ్లీకి మాత్రమే సాధ్యం.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ ఇవాళ 35వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విరాట్‌కు క్రికెటర్స్, ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం విరాట్ స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశారు. మరో సెంచరీ చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంచరీల రికార్డ్‌ను సమం చేయనున్నారు. నవంబర్ 5న కోహ్లీ బర్త్ డే కావడంతో ఆయన భార్య, నటి అనుష్క శర్మ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన భర్తకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో రాస్తూ..'తన జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగానే ఉంటాడు! కానీ ఏదో ఒక విధంగా నేను కూడా అతని అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతున్నా. నా ఈ జీవితంలో అంతకు మించి ప్రేమిస్తున్నా. అది ఏ రూపంలోనైనా, ఏదైనా కావచ్చు. లవ్ యూ విరాట్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే తన పోస్ట్‌లో కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన ఫోటోను పంచుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క బంతి కూడా వేయకుండా వికెట్ సాధించిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ అంటూ పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్‌ను అవుట్ చేశాడు. అయితే ఆ బాల్ వైడ్ వెళ్లగా.. ధోని అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. దీంతో ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇలాంటి ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదంటూ అనుష్క శర్మ తన భర్తపై ప్రేమను కురిపించింది. ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. (ఇది చదవండి: హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!) కాగా.. అనుష్క, విరాట్ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట జనవరి 2021లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించారు. తమ ముద్దుల కూతురికి వామిక అని పేరు పెట్టారు. సినిమాల విషయాకొనిస్తే అనుష్క శర్మ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చక్దా ఎక్స్‌ప్రెస్‌లో కనిపించనుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
రషీద్ ఖాన్‌కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారా?
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషిద్ ఖాన్‌కు రూ.10 కోట్ల వరకు ఆర్ధిక సహాయం చేసినట్లు సోషల్ మీడియాలోని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని రతన్ టాటా కొట్టిపారేశారు. గత వారం ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు.. పాక్‌పై పంజా విసిరింది. పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆఫ్గాన్ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్గాన్ క్రికెటర్ రషిద్ ఖాన్ ఇండియన్ ఫ్లాగ్‌ను ప్రదర్శించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రషిద్ ఖాన్‌కు ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రతన్ టాటా..రషిద్ ఖాన్‌కు భారీ మొత్తంలో ఆర్ధిక సహాయం చేసేలా హామీ ఇచ్చారంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players. I have no connection to cricket whatsoever Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official… — Ratan N. Tata (@RNTata2000) October 30, 2023 ఆ కథనాల్ని రతన్ టాటా ఖండించారు. తనకు క్రికెట్‌తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ క్రికెటర్‌కి రివార్డ్ ఇవ్వలేదని, అలా ఇచ్చేలా ఐసీసీకి సైతం ఎలాంటి సూచనలు చేయలేదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుండి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌లు, తప్పుడు వీడియో కథనాల్ని నమ్మొద్దని రతన్ టాటా నెటిజన్లను కోరారు. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
ఇంగ్లాండ్ ఫెయిల్యూర్ కి కారణం అదేనా..?
-
కోహ్లి సెంచరీ..బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం