సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు.
క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.
A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN
— ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023
అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326
Comments
Please login to add a commentAdd a comment