Arun Jaitley Stadium
-
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
భారత్‌లో మరో టీ20 లీగ్.. తొలి ఎడిషన్ అప్పటి నుంచే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్‌లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.ఇప్పటికే పలు స్థానిక లీగ్లుఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్‌లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.అదే స్పెషల్ ఇక్కడమిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్‌లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని వెల్లడించింది.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్‌గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ హోం మ్యాచ్‌లు విశాఖలో.. ఎందుకంటే..?
ఐపీఎల్ 2024 ఎడిషన్ తొలి విడత షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తొలి విడతలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. డే గేమ్స్ మధ్యాహ్నం 3:30 గంటలకు.. నైట్ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా, తొలి విడత షెడ్యూల్లో ఓ ఆసక్తికర విషయం అందరి దృష్టిని ఆకర్శించింది. అన్ని జట్లు తమ హోం గేమ్స్‌ను సొంత మైదానాల్లో ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే సొంత మైదానంలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆడుతుంది. ఇందుకు కారణంగా ఏంటని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ జరుగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్ సెకెండ్ ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇక్కడ 11 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డీసీ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు హోం గేమ్స్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్.. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ఏప్రిల్ 3న కేకేఆర్‌తో విశాఖలో ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన ఐదు హోం గేమ్స్‌ను సొంత మైదానంలోనే ఆడుతుంది. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 28న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో (రాత్రి 7:30).. మార్చి 31న విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో (రాత్రి 7:30).. ఏప్రిల్ 3న విశాఖ వేదికగా కేకేఆర్‌తో (రాత్రి 7:30) డీసీ తలపడనుంది. అన్ని అనుకూలిస్తే.. విశాఖలో రిషబ్ పంత్ మెరుపులు చూసే అవకాశం కూడా ఉంటుంది. పంత్ కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకుని రానున్న ఐపీఎల్లో ఆడతాడని ప్రచారం జరుగుతుంది. -
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
రిషబ్ పంత్ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. హోంగ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్‌కు రిషబ్ పంత్ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్‌కు హాజరైన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని మ్యాచ్ వీక్షించాడు. పంత్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ పంత్.. RP 17 అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. షార్ట్. వైట్ టీషర్ట్ వేసుకున్న పంత్ కర్ర సాయంతోనే మ్యాచ్‌కు వచ్చాడు. అభిమానులకు అభివాదం చేసిన పంత్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ వైపు చిరునవ్వుతో ఇచ్చిన లుక్స్ ఆకట్టుకున్నాయి. పంత్ రాకను మానిటర్లో గమనించిన సౌరవ్ గంగూలీ, హెడ్‌కోచ్ పాంటింగ్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మిస్ అవుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు పేర్కొంది. సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన తొలి మ్యాచ్‌కు డగౌట్లో పంత్ జెర్సీని డగౌట్లో ప్రదర్శించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా చేయడంపై బీసీసీఐ సీరియస్ అయింది. భౌతికంగా దూరమైనవారికే మాత్రమే అలాంటి గౌరవం ఇస్తారని.. పంత్ మనతోనే ఉన్నాడని.. ఇలాంటివి రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. బీసీసీఐకి క్షమాపణ చెప్పిన ఢిల్లీ ఫ్రాంచైజీ ముందునుంచి చెప్పినట్లుగా పంత్‌ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్‌లు ఆడకపోయినా పంత్ తమతో ఉంటే మాకు ధైరంగా ఉంటుందని పాంటింగ్ కూడా తెలిపాడు. Rishabh Pant acknowledges the crowd👋 #IPL2023 #DCvsGT #RishabhPant pic.twitter.com/YPsylllWN5 — CricTelegraph (@CricTelegraph) April 4, 2023 -
IPL 2023: హోంగ్రౌండ్లో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లకు పంత్!
టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు పంత్ దూరమయ్యాడు. అతను లేని లోటును మరో రకంగా (జట్టుతో పాటు డగౌట్లో అతను ఉండడం లేక అతని జెర్సీ నెంబర్ ఉన్న టీషర్ట్‌ను ఆటగాళ్లు ధరించేలా) తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)రంగంలోకి దిగింది. పంత్‌కు అభ్యంతరం లేకపోతే.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోం గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడే మ్యాచ్‌లను వీక్షించేందుకు డగౌట్లో ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని డీడీసీఏ తెలిపింది. డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. ''ఐపీఎల్ 16వ సీజన్ పంత్ ఆడకపోయినా డగౌట్లో ఉంటే బాగుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. అందుకే మేము ఒక ఆలోచన చేశాం. పంత్ గ్రౌండ్లో ఉంటే కంపర్ట్‌గా ఫీలవుతాడంటే అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. అతన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేక మెడికల్ టీం సహా ఇంటి నుంచి స్టేడియానికి తీసుకురావడానికి ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కల్పిస్తాం. పంత్ దీనికి ఒప్పుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ డగౌట్లో అతని కోసం ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది.'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ కూడా పంత్ విషయమై తెగ ఫీలయ్యాడు. పంత్ లేని లోటు మాకు తెలుస్తుందని.. అతను ఐపీఎల్‌కు దూరమైనప్పటికి ఏదో ఒకలా అతను జట్టుతో పాటు ఉండేలా ప్లాన్ చేసుకుంటామని తెలిపాడు. అందుకు పంత్ జెర్సీ నెంబర్‌తో కూడిన టీషర్ట్లను ప్రత్యేకంగా తయారు చేయించి జట్టు మొత్తం ధరించేలా చూస్తామన్నాడు. అవసరమైతే పంత్‌ను డగౌట్లో కూర్చొబెట్టి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పిస్తాం. అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం అని పాంటింగ్ పేర్కొన్నాడు. తాజాగా డీడీసీఏ ప్రకటన పాంటింగ్ కలను నిజం చేసేలా కనిపిస్తుంది. గతేడాది డిసెంబర్లో రిషబ్ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్ కోలుకుంటున్నాడు. ఫలితంగా దాదాపు తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు.యాక్సిడెంట్‌తో ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యే చాన్స్ ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌కు దూరం కావడంతో పంత్ సేవలను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. వైస్‌కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యహరించనున్నాడు. ఇక ఐపీఎల్లో కెప్టెన్‌గా వార్నర్‌కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఏప్రిల్ ఒకటిన లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. చదవండి: IPL 2023: ఆ జట్టు బాగుంది.. ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండు: రిక్కీ పాంటింగ్ IPL 2023: అర్థం కాని పిచ్‌లు.. పరుగుల వర్షం కష్టమేనట!