ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. హోంగ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్‌కు రిషబ్ పంత్ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్‌కు హాజరైన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని మ్యాచ్ వీక్షించాడు. పంత్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ పంత్.. RP 17 అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.
షార్ట్. వైట్ టీషర్ట్ వేసుకున్న పంత్ కర్ర సాయంతోనే మ్యాచ్‌కు వచ్చాడు. అభిమానులకు అభివాదం చేసిన పంత్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ వైపు చిరునవ్వుతో ఇచ్చిన లుక్స్ ఆకట్టుకున్నాయి. పంత్ రాకను మానిటర్‌లో గమనించిన సౌరవ్ గంగూలీ, హెడ్‌కోచ్ పాంటింగ్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మిస్ అవుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు పేర్కొంది. సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన తొలి మ్యాచ్‌కు డగౌట్‌లో పంత్ జెర్సీని డగౌట్‌లో ప్రదర్శించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా చేయడంపై బీసీసీఐ సీరియస్ అయింది.
భౌతికంగా దూరమైనవారికే మాత్రమే అలాంటి గౌరవం ఇస్తారని.. పంత్ మనతోనే ఉన్నాడని.. ఇలాంటివి రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. బీసీసీఐకి క్షమాపణ చెప్పిన ఢిల్లీ ఫ్రాంచైజీ ముందునుంచి చెప్పినట్లుగా పంత్‌ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్‌లు ఆడకపోయినా పంత్ తమతో ఉంటే మాకు ధైరంగా ఉంటుందని పాంటింగ్ కూడా తెలిపాడు.
Rishabh Pant acknowledges the crowd👋
— CricTelegraph (@CricTelegraph) April 4, 2023
#IPL2023 #DCvsGT #RishabhPant pic.twitter.com/YPsylllWN5
Comments
Please login to add a commentAdd a comment