South Africa vs Sri Lanka
-
SL Vs SA: రసవత్తరంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక రెండో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక టెస్టు రెండో మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దోబూచులాడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక లక్ష్యానికి 143 పరుగుల దూరంలో నిలవగా... దక్షిణాఫ్రికా గెలుపునకు 5 వికెట్లు కావాల్సి ఉంది.ఓవర్‌నైట్ స్కోరు 191/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 86 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (116 బంతుల్లో 66; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... ట్రిస్టన్ స్టబ్స్ (47; 2 ఫోర్లు), బెడింగ్హమ్ (35; 3 ఫోర్లు) రాణించారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 348 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆదివారం ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.కమిందు మెండిస్ (35; 4 ఫోర్లు, 1 సిక్స్), ఏంజెలో మాథ్యూస్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ చండీమల్ (29; 5 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (64 బంతుల్లో 39 బ్యాటింగ్? 7 ఫోర్లు), కుశాల్ మెండిస్ (56 బంతుల్లో 39 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడుతున్నారు.దక్షిణాప్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ప్యాటర్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో ఐదు వికెట్లు ఉన్న శ్రీలంక విజయానికి 143 పరుగుల దూరంలో ఉంది.చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాకంటే మెర్గుగా ఆడారు: రోహిత్ -
శ్రీలంకతో రెండో టెస్టు.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.ఎయిడెన్ మార్క్రమ్ (75 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవగా... కెప్టెన్ తెంబా బవుమా (48 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (36 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ అజేయమైన నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం 221 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 242/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 99.2 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (44; 6 ఫోర్లు), కమిందు మెండిస్ (48; 4 ఫోర్లు) కాస్త పోరాడారు. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (14), కుశాల్ మెండిస్ (16), ప్రభాత్ జయసూర్య (24) మరికొన్ని పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లలో ప్యాటర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. యాన్సెన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే
దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ (101; 11 ఫోర్లు) సెంచరీతో దక్షిణాఫ్రికాను నిలబెట్టాడు. శ్రీలంకతో గురువారం మొదలైన రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.మిడిలార్డర్లో కెప్టెన్ తెంబా బవుమా (78; 8 ఫోర్లు, 1 సిక్స్), కైల్ వెరీన్ (48 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగగానే అసిత ఫెర్నాండో... ఓపెనర్ టోని డి జోర్జి (0)ని డకౌట్ చేశాడు. కాసేపటికే లహిరు కుమార నిప్పులు చెరగడంతో మార్క్రమ్ (20; 4 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (4) పెవిలియన్ దారి పట్టారు.44 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోగా, బవుమాతో జతకట్టిన రికెల్టన్ సఫారీని ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించాక 177 స్కోరు వద్ద బవుమాను ఫెర్నాండో అవుట్ చేశాడు. కాసేపటికే బెడింగ్హామ్ (6) జయసూర్య బౌలింగ్‌లో 186 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయింది.ఈ దశలో రికెల్టన్, వెరీన్ నింపాదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. 250 పైచిలుకు స్కోరు నమోదయ్యాక సెంచరీ పూర్తయిన వెంటనే రికెల్టన్ వికెట్‌ను లహిరు పడగొట్టగా, ఓవర్ వ్యవధిలో యాన్సెన్ (4)ను విశ్వ ఫెర్నాండో అవుట్ చేయడంతో సఫారీ ఏడో వికెట్‌ను కోల్పోయింది. లహిరు కుమార 3, అసిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
WTC: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 233 పరుగుల తేడాతో శనివారం జయభేరి మోగించింది. కాగా రెండు టెస్టులు ఆడే క్రమంలో శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. నాలుగో రోజుల్లోనే ముగిసిపోయింది. కింగ్స్‌మేడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్టబ్స్, బవుమా శతకాలుఅనంతరం సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జి రెండు, కగిసో రబడ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా దుమ్ములేపింది.ట్రిస్టన్ స్టబ్స్(122), కెప్టెన్ బవుమా(113) శతకాలతో విరుచుకుపడటంతో భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 515 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడేఈ క్రమంలో 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 282 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రబడ, కోయెట్జి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పదకొండు వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.ఆస్ట్రేలియాకు భారీ షాక్ఇదిలా ఉంటే.. లంకపై భారీ గెలుపుతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండోస్థానానికి ఎగబాకి.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్టులో ఓడించిన టీమిండియా మాత్రం అగ్రస్థానం నిలబెట్టుకుంది.PC: ICCఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో ఒకటి, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడూ సొంతగడ్డపైనే జరుగనుండటం సౌతాఫ్రికాకు సానుకూలాంశం. వీటన్నింటిలోనూ ప్రొటిస్ జట్టు గెలిచిందంటే.. ఫైనల్ రేసులో తానూ ముందు వరుసలో ఉంటుంది.టీమిండియా పరిస్థితి ఏంటి?ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆసీస్ గడ్డపై ఐదింటిలో కనీసం నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే ఒక విజయం సాధించింది కాబట్టి.. ఇంకో మూడు గెలిస్తే చాలు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన తదుపరి ఆసీస్‌తో అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో తలపడనుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక పరాజయానికి చేరువైంది. 516 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 103 పరుగులే చేసింది.కరుణరత్నే (4), నిసాంక (23), మాథ్యూస్ (25), కమిందు (10), ప్రభాత్ (1) ఇప్పటికే పెవిలియన్ చేరారు. దినేశ్ చండీమల్ (29 బ్యాటింగ్), ధనంజయ డిసిల్వ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక గెలుపు కోసం మరో 413 పరుగులు చేయాల్సి ఉంది. రబడ, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 132/3తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 366 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (221 బంతుల్లో 122; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (228 బంతుల్లో 113; 9 ఫోర్లు) సెంచరీలు నమోదు చేయడం విశేషం. స్టబ్స్ కెరీర్లో ఇది రెండో శతకం కాగా...బవుమాకు మూడోది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 249 పరుగులు జోడించారు.చదవండి: ‘గులాబీ’ బంతితో సాధనకు సిద్ధం -
శతక్కొట్టిన తెంబా బవుమా.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుత శతకంతో మెరిశాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డర్బన్ వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. కింగ్స్‌మెడ్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డర్ కుదేలైన వేళ బవుమా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.తొలి ఇన్నింగ్స్‌లో బవుమానే ఆదుకున్నాడుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(9), టోనీ డి జోర్జి(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతను భుజాన వేసుకున్న బవుమా 117 బంతులాడి 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో టెయిలండర్ కేశవ్ మహరాజ్(24) ఒక్కడే 20 పరుగుల మార్కు దాటాడు.లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార మూడేసి వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, సౌతాఫ్రికాను 191 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎక్కువ సేపు ఉండలేదు.42 పరుగులకే లంక ఆలౌట్ఆతిథ్య జట్టు పేసర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. కేవలం 42 పరుగులకే ధనంజయ డి సిల్వ బృందం కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ సాధించిన 13 పరుగులే టాప్ స్కోర్. ఐదుగురేమో డకౌట్.ఫలితంగా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్ టోనీ 17 పరుగులకే నిష్క్రమించినా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 47 రన్స్‌తో రాణించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 15 పరుగులకే అవుట్ కాగా.. స్టబ్స్, బవుమా మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు.స్టబ్స్, బవుమా శతకాలు.. లంకకు భారీ టార్గెట్స్టబ్స్ 221 బంతుల్లో 122 పరుగులు సాధించగా.. బవుమా 228 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి శతకాల వల్ల సౌతాఫ్రికా భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా శ్రీలంక ముందు 516 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో తెంబా బవుమాకు ఇది మూడో సెంచరీ. అంతేకాదు ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం తద్వారా అతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకపై సెంచరీ చేసిన సౌతాఫ్రికా మూడో కెప్టెన్‌గా నిలిచాడు. బవుమా కంటే ముందు షాన్ పొలాక్, హషీం ఆమ్లా మాత్రమే సారథి హోదాలో లంకపై శతకం సాధించారు.శ్రీలంకతో మ్యాచ్‌లో శతక్కొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్లు👉షాన్ పొలాక్- సెంచూరియన్- 2001- 111 పరుగులు👉హషీం ఆమ్లా- కొలంబో- 2014- 139 పరుగులు(నాటౌట్)👉తెంబా బవుమా- డర్బన్- 113 పరుగులు.చదవండి: ‘అతడిని లారా, సచిన్ అంటూ ఆకాశానికెత్తారు.. ఇలాంటి షాక్ తగిలితేనైనా.. కాస్త’ -
సౌతాఫ్రికా ప్లేయర్ వరల్డ్ రికార్డు.. 120 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
డర్బన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సంచలన బౌలింగ్‌తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి లంకేయులు విల్లవిల్లాడారు.తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జాన్సెన్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా పర్యాటక లంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది.చరిత్ర సృష్టించిన జాన్సెన్...ఇక సంచలన ప్రదర్శన చేసిన జాన్సెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 7 వికెట్ల ఘనత సాధించిన ఆసీస్ దిగ్గజం హ్యూ ట్రంబుల్ రికార్డును జాన్సెన్ సమం చేశాడు. మార్కో జాన్సెన్ 6.5 ఓవర్ల(41 బంతులు)లో ఈ ఫీట్ సాధించగా.. హ్యూ ట్రంబుల్ కూడా సరిగ్గా 6.5 ఓవర్ల(41 బంతులు)లోనే ఈ రికార్డును నమోదు చేశాడు.1902లో ఇంగ్లండ్‌పై హ్యూ ట్రంబుల్ ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇప్పుడు 120 ఏళ్ల తర్వాత జాన్సెన్ ఈ రేట్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దిరి తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా లెజెండ్ మాంటీ నోబెల్ ఉన్నారు. నోబెల్ ఈ రికార్డును 7.4 ఓవర్లలో క్రియేట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ప్రోటీస్ ప్రస్తుతం 406 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
42 పరుగులకే ఆలౌట్.. శ్రీలంక చెత్త రికార్డు! ప్రపంచంలోనే తొలి జట్టుగా
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి లంకేయులు వణికిపోయారు.వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్(13), లహురు కుమారా(10) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 7 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కోయిట్జీ రెండు, రబాడ ఒక్క వికెట్ సాధించారు.కాగా అంతకుముందు 80/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(70) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 77 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శ్రీలంక చెత్త రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో 42 పరుగులకే ఆలౌటైన శ్రీలంక ఓ చెత్త రికార్డు మూటకట్టుకుంది. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యల్ప టోటల్‌ను జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2013లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో 45 పరుగులకే కివీస్ ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంకకు ఇదే టెస్టుల్లో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.చదవండి: IND vs AUS: ఒకే ఒక్క వికెట్.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా -
దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపికయ్యాడు. బవుమా మోచేతి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 4 ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సందర్భంగా బవుమా గాయపడ్డాడు.రబాడ రీఎంట్రీలంకతో సిరీస్‌తో కగిసో రబాడ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రబాడ భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన మార్కో జన్సెన్, గెరాల్ట్ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా దర్శనమిచ్చారు. గాయాల కారణంగా ఈ సిరీస్‌కు లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ దూరమయ్యారు. ర్యాన్ రికెల్టన్, డేన్ పీటర్సన్, సెనూరన్ ముత్తుస్వామి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే..?సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు తదుపరి (డిసెంబర్, జనవరి) స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనూరన్ ముత్తుస్వామి, డేన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రిన్సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్ షెడ్యూల్తొలి టెస్ట్- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 (డర్బన్)రెండో టెస్ట్- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 (గెబెర్హా)కాగా, సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రీలంక జట్టును కూడా ఇవాళ్లే ప్రకటించారు. లంక జట్టుకు సారధిగా ధనంజయ డిసిల్వ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబుల్దెనయ, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, కసున్ రజిత -
SL vs SA: చెత్త షాట్ సెలక్షన్: ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు సంధించాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ వైఫల్యం వల్లే లంక చిత్తుగా ఓడిందని అభిప్రాయపడ్డాడు.కాగా న్యూయార్క్ వేదికగా శ్రీలంక సోమవారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. బౌన్సీ పిచ్‌పై సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 19.1 ఓవర్లలోనే లంక కథ ముగిసిపోయింది.ఇక ఈ వికెట్‌పై సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తడబడినా.. ఆచితూచి ఆడి ఎట్టకేలకు గట్టెక్కారు. 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు 80 పరుగులు చేసి.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక బ్యాటర్ల తీరును తప్పుబట్టాడు. బంతి బౌన్స్ అవుతున్నా.. ఏమాత్రం ఆలోచన లేకుండా చెత్త షాట్లకు యత్నించి అవుటయ్యారని విమర్శించాడు.ఒక్క బ్యాటర్ కూడా బ్యాట్స్‌మన్‌షిప్ ప్రదర్శించలేదంటూ పెదవి విరిచాడు. వికెట్‌ను గమనిస్తూ బ్యాటింగ్ చేస్తే కనీసం 120 పరుగులైనా స్కోరు చేసేవారని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.అదే జరిగితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక కచ్చితంగా సౌతాఫ్రికాపై గెలిచేదని పేర్కొన్నాడు. అనూహ్య బౌన్స్‌తో బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపికగా ఆడి విజయం సొంతం చేసుకున్నారని ఇర్ఫాన్ పఠాన్ ప్రొటిస్ జట్టును అభినందించాడు.వాస్తవానికి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. నసావూ కౌంటీ పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనపుడు లంక కెప్టెన్ వనిందు హసరంగా బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పే చేశాడని విమర్శించాడు. ఫలితంగా శ్రీలంక తమ టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు పరిమితమైందని పఠాన్ పేర్కొన్నాడు. -
చాలా సంతోషంగా ఉంది.. కానీ పిచ్ మాత్రం: మార్క్రమ్
టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. న్యూయర్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. 78 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రోటీస్ తీవ్రంగా శ్రమించింది.బౌన్స్‌కు సహకరిస్తున్న డ్రాప్ ఇన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా చెమటోడ్చుతూ 78 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్(19 నాటౌట్), డికాక్(20) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో కెప్టెన్ హసరంగా రెండు, తుషారా, షనక తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లంక.. ప్రోటీస్ బౌలర్ల దాటికి విలవిల్లాడింది. 19.1 ఓవర్లలో శ్రీలంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. దక్షిఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహారాజ్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. న్యూయర్క్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉందని మార్క్రమ్ తెలిపాడు."టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా కాస్త ఇబ్బంది పడ్డాం. న్యూయర్క్ వికెట్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంది. అదృష్టవశాత్తూ మా బ్యాటర్లు కాస్త ఓపికతో ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గతంలో కూడా మాకు ఇటువంటి పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్ధితుల్లో ఆడుతూ వస్తున్నాం. అయితే న్యూయర్క్ వికెట్ నుంచి కూడా మేము నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మా తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా ఇక్కడే ఆడనున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వికెట్‌కు అలవాటు పడాలి.ఇక నోర్జే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఫామ్ గురించి ఏ రోజు మేము ఆందోళన చెందలేదు. అతడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడని నేను అశిస్తున్నాను. నోర్జే ప్రదర్శన పట్ల మా డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్క్రమ్ పేర్కొన్నాడు. -
T20 WC: అందరినీ ఓడిస్తాం.. ఈసారి ట్రోఫీ మాదే: మార్క్రమ్
ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలో అదరగొట్టడం.. నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోయి ఇంటి బాట పట్టడం.. ఫలితంగా ‘చోకర్స్’ అనే ముద్ర. అవును.. సౌతాఫ్రికా గురించే ఈ ప్రస్తావన. పటిష్ట జట్టుగా పేరొందిన ప్రొటిస్ జట్టు 1998లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించింది.అదే మొదలు.. అదే ఆఖరుహాన్సీ క్రోంజీ సారథ్యంలో ఫైనల్లో వెస్టిండీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అయితే, ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ ఒక్కసారి కూడా మెగా టోర్నీ విజేతగా నిలవలేకపోయింది. కానీ.. ఈసారి మాత్రం ఆ అపవాదును చెరిపేసుకుంటామంటున్నాడు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్.టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు మార్క్రమ్. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ప్రొటిస్ జట్టు.. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డీ లో ఉంది.ఈ క్రమంలో న్యూయార్క్ వేదికగా సోమవారం శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ వరల్డ్‌కప్ గెలిచేందుకే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నాడు.ఈసారి ట్రోఫీ మాదే‘‘నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ టోర్నీలో పోటీపడుతున్న జట్లన్నీ గొప్పగానే ఆడుతున్నాయి. అయితే, మేము గనుక ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చామంటే.. మా అత్యుత్తమ ప్రదర్శనతో ముందుకు సాగుతూనే ఉంటాం.ప్రత్యర్థి ఎవరైనా ఓడించే తీరతాం. మా ఆట తీరుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, మేము ఇక్కడికి వచ్చింది మాత్రం ట్రోఫీ గెలిచేందుకే!’’ అని పేర్కొన్నాడు. ఈసారి చాంపియన్లుగా నిలిచేది తామేనంటూ మార్క్రమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సౌతాఫ్రికా జట్టు ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది? -
T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది?
టీ20 వరల్డ్‌కప్-2024లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం(జూన్ 3) న్యూయర్క్ వేదికగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఈ పొట్టిప్రపంచకప్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దం.దక్షిణాఫ్రికా దంచికొడుతుందా?దక్షిణాఫ్రికా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబాడ, మార్కో జానెసన్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు.కానీ ఇప్పుడూ వీరంతా జట్టులోకి రావడంతో శ్రీలంకకు గట్టిసవాలు ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ప్రోటీస్ జట్టు పటిష్టంగా కన్పిస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్లో రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, వండర్ డస్సెన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.అయితే కెప్టెన్ మార్క్రమ్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇక బౌలింగ్‌లో కూడా కగిసో రబాడ, అన్రిచ్ నోర్డే, జానెసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇక శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయలేం.లంకేయులు పోటీ ఇస్తారా?శ్రీలంకలో మునపటి జోష్ లేనప్పటికి తమదైన రోజున ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపించగలదు. ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగిన వార్మాప్ మ్యాచ్‌ల్లో శ్రీలంకకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి వార్మాప్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి చవిచూసింది.అయితే ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో మాత్రం లంక భారీ విజయాన్ని అందుకుంది. అదే ఆత్మవిశ్వాసంతో శ్రీలంక ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనుంది. శ్రీలంక కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దృఢంగా కన్పిస్తోంది.బ్యాటింగ్‌లో పాథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక, మాథ్యూస్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా కెప్టెన్ వనిందు హసరంగా గాయం నుంచి కోలుకోని తిరిగి జట్టులోకి రావడం లంకకు కలిసొచ్చే ఆంశం. బౌలింగ్‌లో చమీరా, పతిరానా వంటి కీలక ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. చివరగా లంక సమిష్టగా రాణిస్తే ప్రోటీస్‌కు కష్టాల్లు తప్పవు.దక్షిణాఫ్రికాదే పై చేయి..కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంకపై దక్షిణాఫ్రికాదే పై చేయి. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. సౌతాఫ్రికా మూడింట, శ్రీలంక కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.తుది జట్లు(అంచనా)శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, వనిందు హసరంగా (కెప్టెన్), దసున్ షనక, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, మతీషా పతిరణ. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, ఒట్నీల్ బార్ట్‌మన్. -
CWC 2023 SA VS SL: 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఇలా..!
శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌కు సంబంధించిన రికార్డులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వరల్డ్‌కప్‌లో హయ్యెస్ట్ టీమ్ స్కోర్ (సౌతాఫ్రికా, 428) రికార్డు, వరల్డ్‌కప్‌లో తొలిసారిగా ఓఇన్నింగ్స్లో ముగ్గురు సెంచరీలు చేయడం, వరల్డ్‌కప్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (మార్క్రమ్, 49 బంతుల్లో) రికార్డు, వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్ స్కోర్ (సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు కలిపి 754 పరుగులు చేశాయి) రికార్డు, వరల్డ్‌కప్‌లో 200 సెంచరీలు పూర్తి చేసుకున్న రికార్డు (వరల్డ్‌కప్‌లో 200వ సెంచరీ, మార్క్రమ్), వరల్డ్‌కప్‌లో తొలిసారి ఓ ఇన్నింగ్స్‌లో నలుగురు బౌలర్లు 80 అంతకంటే ఎక్కువ పరుగులు, ఇద్దరు బౌలర్లు 90 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు (శ్రీలంక).. ఇలా ఈ మ్యాచ్ పలు ఆసక్తికర వరల్డ్‌కప్ రికార్డులు నమోదయ్యాయి. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో రికార్డు వెలుగుచూసింది. వరల్డ్‌కప్ టోర్నీల్లో తొలిసారి ఓ మ్యాచ్‌లో 100 కంటే ఎక్కువ బౌండరీలు నమోదు కావడం. నిన్నటి మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 105 బౌండరీలు (సౌతాఫ్రికా 45 ఫోర్లు, 14 సిక్సర్లు, శ్రీలంక 29 ఫోర్లు, 17 సిక్సర్లు) నమోదయ్యాయి. 48 ఏళ్ల వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ స్థాయిలో బౌండరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేయగా.. శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో విరుచుకుపడగా.. లంక ఇన్నింగ్స్‌లో చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీలు నమోదు చేశారు. -
CWC 2023: శ్రీలంక-సౌతాఫ్రికా మ్యాచ్.. రికార్డులు బద్దలు
2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ వరల్డ్‌కప్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ (428) నమోదు చేసింది. దీంతో పాటు వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం (వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)) లాంటి అత్యంత అరుదైన రికార్డు కూడా ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. అలాగే ఈ మ్యాచ్‌లో సుడిగాలి వేగంతో శతక్కొట్టిన ఎయిడెన్ మార్క్రమ్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (49 బంతుల్లో) రికార్డును నమోదు చేశాడు. ఈ మూడు రికార్డులతో పాటు ఈ మ్యాచ్‌లో మరో వరల్డ్‌కప్ రికార్డు కూడా నమోదైంది. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక ఇన్నింగ్స్‌లో చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక.. సౌతాఫ్రికాకు అంత సునయాసంగా విజయాన్ని దక్కనీయలేదు. లంకేయులు ఓడిపోతామని తెలిసి, ఎదురుదాడి చేశారు. వికెట్లు ఉండి ఉంటే వారు కూడా 400 మార్కును రీచ్ అయ్యేవారు. లంకన్లు సైతం భారీ స్కోర్ చేయడంతో ఈ మ్యాచ్‌లో వరల్డ్‌కప్ హైయెస్ట్ మ్యాచ్ స్కోర్ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు, లంకేయులు కలిపి 754 పరుగులు చేశారు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్. 2019లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 714 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్‌గా చలామణి అయ్యింది. -
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
CWC 2023 SA VS SL: సెంచరీలతో డబుల్ సెంచరీ కొట్టిన డికాక్, డస్సెన్
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సెంచరీల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లు అత్యధిక టీమ్ స్కోర్ నమోదు కావడంతో పాటు పలు ఇతర రికార్డులు కూడా నమోదయ్యాయి. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (మార్క్రమ్- 49 బంతుల్లో), వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతక్కొట్టడం.. ఇలా సౌతాఫ్రికా, ఆ జట్టు ఆటగాళ్లు పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఈ రికార్డులతో పాటు డికాక్, డస్సెన్‌లు మూడు వేర్వేరు ఘనతలను సాధించి, రికార్డుపుటల్లోకెక్కారు. అవేంటంటే.. ఈ మ్యాచ్‌లో డికాక్ చేసిన సెంచరీ వన్డేల్లో వికెట్కీపర్లు చేసిన 200వ సెంచరీగా రికార్డైంది. ఈ సెంచరీ వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున కూడా 200వ సెంచరీ కావడం విశేషం. ఇదే మ్యాచ్‌లో డస్సెన్ చేసిన సెంచరీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో 200వ శతకంగా నమోదైంది. ఇలా డికాక్, డస్సెన్ చేసిన సెంచరీలతో డబుల్ సెంచరీని మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్ధేశించిన కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 21 ఓవర్లలో 154 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. షకన (3), అసలంక (28) క్రీజ్‌లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (0), కుశాల్ పెరీరా (7), ధనంజయ డిసిల్వ (11), సమరవిక్రమ (23) విఫలం కాగా.. కుశాల్ మెండిస్ క్రీజ్‌లో ఉన్నంతసేపు విధ్వంసం (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సృష్టించాడు. -
లంక బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. 3 శతకాలు.. వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు రికార్డు స్థాయిలో 400కి పైగా పరుగులు స్కోర్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సఫారీ బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కారు. తొలుత క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆతర్వాత రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురు శతక వీరుల్లో మార్క్రమ్ సృష్టించిన విధ్వంసం ఓ రేంజ్లో ఉండింది. మార్క్రమ్ కేవలం 49 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. అతను తన సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), మార్కో జన్సెన్ (7 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. గత రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2015 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌పై 417/6 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. మొత్తంగా వరల్డ్‌కప్‌లో 400కు పైగా స్కోర్ ఐదుసార్లు నమోదు కాగా.. అందులో మూడుసార్లు సౌతాఫ్రికానే ఈ మార్కును దాటింది. వరల్డ్‌కప్‌లో భారత్ ఓసారి 400 ప్లస్ స్కోర్ నమోదు చేసింది. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాపై భారత్ 413/5 స్కోర్ చేసింది. కాగా, సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బవుమా (8) ఒక్కడే విఫలమయ్యాడు. సఫారీ బ్యాటర్ల విధ్వంసం ధాటికి లంక బౌలర్లు విలవిలలాడిపోయారు. దాదాపుగా అందరూ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించకున్నారు. రజిత 10 ఓవర్లలో వికెట్ తీసి 90 పరుగులు, దిల్షన్ మధుషంక 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 89 పరుగులు, దసున్ షనక 6 ఓవర్లలో 36 పరుగులు, ధనంజయ డిసిల్వ 4 ఓవర్లలో 39, మతీష పతిరణ 10 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి అత్యధికంగా 95 పరుగులు, దునిత్ వెల్లలగే 10 ఓవర్లలో వికెట్ పడగొట్టి 81 పరుగులు సమర్పించుకున్నారు. -
CWC 2023 SA VS SL: సెంచరీలతో విరుచుకుపడిన సౌతాఫ్రికా ప్లేయర్లు
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో సెంచరీల మోత మోగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే (152 నాటౌట్), రచిన్ రవీంద్ర (123 నాటౌట్) శతక్కొట్టగా.. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్ (100), రస్సీ వాన్ డర్ డస్సెన్ సెంచరీలతో కదంతొక్కారు. 84 బంతులు ఎదుర్కొన్న డికాక్ 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి, ఆ వెంటనే పతిరణ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 103బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన డస్సెన్ క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. 34.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 244/2గా ఉంది. డస్సెస్, మార్క్రమ్ (24 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి శ్రీలంక సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో ఓవర్లోనే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను (8) దిల్షన్ మధషంక ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే 400 స్కోర్ నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు మెహిది హసన్ మీరజ్ ఆల్‌రౌండ్ షోతో (9-3-25-3, 57) ఆదరగొట్టి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 156 పరుగులకే (37.2 ఓవర్లలో) మట్టికరిపించగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కలిస్‌ను అధిగమించిన డికాక్.. ఈ వరల్డ్‌కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని ఇదివరకే ప్రకటించిన డికాక్.. తన ఆఖరి ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీతో డికాక్ సౌతాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్‌ను (17 వన్డే సెంచరీలు) అధిగమించాడు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా (27) టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్ (25), హెర్షల్ గిబ్స్ (21) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. -
లంకేయులను గడగడలాడిస్తున్న సఫారీ స్పిన్నర్.. ఏకంగా 18 వికెట్లు
సౌతాఫ్రికా-ఏ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్) శ్రీలంక-ఏ జట్టును వారి స్వదేశంలో గడగడలాడిస్తున్నాడు. రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా నిన్న (జూన్ 19) మొదలైన రెండో టెస్ట్‌లో ముత్తుసామి మరోసారి 5 వికెట్లు సాధించి, లంకేయులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సిరీస్‌లో ముత్తుసామి 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ముత్తుసామి 3 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ముత్తుసామి ధాటికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మిలన్ రత్నాయకే (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిషాన్ మధుష్క (33), లసిత్ క్రూస్పుల్లే (27), భానుక (32), పసిందు సూరియబండార (41), లహిరు ఉదార (33), ఆర్ మెండిస్ (44) ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. సఫారీ బౌలర్లలో ముత్తుసామితో (26.1-4-101-6) పాటు సిపామ్లా (2), విలియమ్స్ (1), స్వేన్పోయల్ (1) వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సఫారీ కెప్టెన్ టోనీ డి జోర్జి (0)ని ఇన్నింగ్స్ తొలి బంతికే విశ్వ ఫెర్నాండో ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. మాథ్యూ బ్రీట్జ్కీ (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుమందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా-ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
లంకేయులను వారి స్వదేశంలో ముప్పుతిప్పలు పెట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్
మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా ఏ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. అనంతరం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 185 పరుగులకే చాపచుట్టేసి, 160 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లంకేయులకు ముప్పుతిప్పలు పెట్టిన సెనురన్ ముత్తుసామి.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ.. సఫారీ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి అందరి దృష్టిని ఆకర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి, రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే రేంజ్లో రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి లంక బ్యాటర్లకు వారి స్వదేశంలో ముచ్చెమటలు పట్టించాడు. ముత్తుసామికి సహచర బౌలర్ల నుంచి సహకారం లభించకపోవడంతో లంక బ్యాటర్లు పైచేయి సాధించారు. బౌన్సీ పిచ్‌లు అధికంగా ఉండే సౌతాఫ్రికా లాంటి దేశం నుంచి వచ్చిన స్పిన్ బౌలర్ పరాయి గడ్డపై, అందులో ఉపఖండపు పిచ్‌లపై ఈ స్థాయిలో రెచ్చిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకే ముత్తుసామిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నా, ముత్తుసామిని అందరూ ప్రశంసిస్తున్నారు. మున్ముందు ముత్తుసామి సౌతాఫ్రికా జాతీయ జట్టులో కీలకంగా మారతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 29 ఏళ్ల ముత్తుసామి సౌతాఫ్రికా తరఫున ఇదివరకే అరంగేట్రం చేసి, 2 వికెట్లు పడగొట్టాడు. -
హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన శ్రీలంక.. సఫారీలకు మరో షాక్
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022లో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక దిగ్గజాల టీమ్ ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా శ్రీలంక 11 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్‌లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో జీవన్ మెండిస్ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉపుల్ తరంగ (27 బంతుల్లో 36; 7 ఫోర్లు), మునవీరా (24 బంతుల్లో 26; 4 ఫోర్లు), గుణరత్నే (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించగా.. సఫారీ బౌలర్లు క్రుగెర్ 2, ఫిలాండర్, బోథా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. మోర్నీ వాన్ విక్ (56 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినప్పటికీ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సఫారీ జట్టులో విక్ మినహా మరే ఇతర ఆటగాడు రాణించలేకపోయాడు. లంక బౌలర్లలో కులశేఖర 2, దిల్షాన్, ఉడాన, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో శ్రీలంక తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) చేరుకోగా.. 4 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించిన సౌతాఫ్రికా (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) నాలుగో స్థానానికి పడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇండియా లెజెండ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) మూడో ప్లేస్‌లో నిలిచింది. ఆతర్వాత న్యూజిలాండ్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ ఓటమి), ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఆస్ట్రేలియా (ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓటమి) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. -
టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్.. లంక స్పిన్నర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు
Hasaranga Takes Hat Trick Vs South Africa In 2021 T20 World Cup: టీ20 ప్రపంచకప్-2021లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్రమ్(19)ను క్లీన్ బౌల్డ్ చేసిన హసరంగ.. 18వ ఓవర్ తొలి బంతికి బవుమా(46), రెండో బంతికి ప్రిటోరియస్(0) వికెట్లు పడగొట్టి.. కెరీర్లో తొలి టీ20 హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2007లో ఆసీస్ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ పొట్టి ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేయగా.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ క్యాంపర్ నెదర్లాండ్స్‌పై ఈ ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా హసరంగ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా చేరింది. వన్డేల్లో, టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. హసరంగకు ముందు బ్రెట్ లీ, తిసార పెరీరా, లిసత్ మలింగలు ఈ ఘనత సాధించారు. కాగా, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో లంక నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. తొలుత లంక స్పిన్నర్ హసరంగ(3/20) హ్యాట్రిక్ సాధించడంతో మ్యాచ్ లంక వైపు మొగ్గుచూపగా.. ఆఖర్లో మిల్లర్(13 బంతుల్లో 23; 2 సిక్సర్లు) కిల్లర్ ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. మిల్లర్ వరుస సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అతనికి రబాడ(7 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) సహకరించడంతో మరో బంతి మిగిలుండగానే దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారి కెప్టెన్ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో హసరంగతో పాటు చమీరా(2/27) రాణించాడు. చదవండి: షాహిన్ అఫ్రిది తరహాలో టీమిండియాపై విరుచుకుపడతా.. కివీస్ స్టార్ పేసర్ -
SA Vs SL: హసరంగ హ్యాట్రిక్ వృధా.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
హసరంగ హ్యాట్రిక్ వృధా.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం సమయం 7:05.. శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో లంక నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. తొలుత లంక స్పిన్నర్ హసరంగ(3/20) హ్యాట్రిక్ సాధించడంతో మ్యాచ్ లంక వైపు మొగ్గుచూపగా.. ఆఖర్లో మిల్లర్(13 బంతుల్లో 23; 2 సిక్సర్లు) కిల్లర్ ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. మిల్లర్ వరుస సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అతనికి రబాడ(7 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) సహకరించడంతో మరో బంతి మిగిలుండగానే దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారి కెప్టెన్ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో హసరంగతో పాటు చమీరా(2/27) రాణించాడు. హసరంగ హ్యాట్రిక్.. ఓటమి దిశగా దక్షిణాఫ్రికా సమయం 18: 50.. లంక స్పిన్నర్ హసరంగ హ్యాట్రిక్ సాధించాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్రమ్(20 బంతుల్లో 19; 2 ఫోర్లు)ను క్లీన్ బౌల్డ్ చేసిన లంక స్పిన్నర్.. 18వ ఓవర్ మొదటి బంతికి సఫారి కెప్టెన్ బవుమా(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్)ను, రెండో బంతికి ప్రిటోరియస్(0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీ జట్టు స్కోర్ 17.2 ఓవర్ల తర్వాత 112/6గా మారింది. క్రీజ్‌లో మిల్లర్(3), రబాడ ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. మార్క్రమ్(19) ఔట్ సమయం 18: 34.. హసరంగ వేసిన 15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్రమ్(20 బంతుల్లో 19; 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా సఫారి జట్టు 96 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో బవుమా(34), మిల్లర్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. డస్సెన్(16) రనౌట్ సమయం 18: 00.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా జట్టుకు మరో షాక్ తగిలింది. డేంజరస్ బ్యాటర్ వాన్ డర్ డస్సెన్(11 బంతుల్లో 16)ను షనక అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. ఫలితంగా సఫారి జట్టు 49 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో బవుమా(7), మార్క్రమ్ ఉన్నారు. సఫారీలకు షాక్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన చమీరా సమయం 17: 39.. 143 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగో ఓవర్లో లంక పేసర్ చమీరా.. సఫారి ఓపెనర్లు హెండ్రిక్స్(11), డికాక్(12) వికెట్లను పడగొట్టాడు. ఫలితంగా సఫారి జట్టు 26 పరుగులకే 2 వికట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో బవుమా, వాన్ డర్ డస్సెన్(1) ఉన్నారు. సఫారి బౌలర్ల విజృంభణ ..142 పరుగులకే చాపచుట్టేసిన లంకేయులు సమయం 17:10.. సఫారి బౌలర్లు ప్రిటోరియస్(3/17), షంషి(3/17), నోర్జే(2/27) విజృంభించడంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లు ఆడి 142 పరుగులకే చాపచుట్టేసింది. లంక జట్టులో ఓపెనర్ పథుమ్ నిస్సంక(72), అసలంక(21), షనక(11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. నోర్జే వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతికి చమీరా(4 బంతుల్లో 3) క్లీన్ బౌల్డ్ కాగా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి కుమార(0) రనౌట్ కావడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ప్రిట్రోరియస్.. శ్రీలంక 131/8 సమయం 17:02.. ప్రిటోరియస్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో శ్రీలంక జట్టు 2 వికెట్లు కోల్పోయింది. 18.2వ ఓవర్లో కరుణరత్నే(5 బంతుల్లో 5)ను ఔట్ చేసిన ప్రిటోరియస్.. 18.4వ బంతికి నిస్సంక(56 బంతుల్లో 72;6 ఫోర్లు, 3 సిక్సర్లు)ను పెవిలియన్‌కు పంపాడు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 134/8. క్రీజ్‌లో మహీశ్ తీక్షణ, చమీరా ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. షనక(11) ఔట్ సమయం 16:52.. ప్రిటోరియస్ వేసన ఇన్నింగ్స్ 16.4వ ఓవర్లో రబాడకు క్యాచ్ ఇచ్చి షనక(12 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు 110 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో నిస్సంక(56), కరుణరత్నే ఉన్నారు. షంషి మాయాజాలం.. 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక సమయం 16:38..సఫారి స్పిన్నర్ తబ్రేజ్ షంషి.. తన స్పిన్ మాయాజాలంతో శ్రీలంక నడ్డి విరిచాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. షంషి వేసిన 13.4వ ఓవర్లో మార్క్రమ్ క్యాచ్ పట్టడంతో హసరంగ(5 బంతుల్లో 4) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో శ్రీలంక 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో నిస్సంక(45 బంతుల్లో 49), శనక ఉన్నారు. షంషి ఉచ్చులో చిక్కిన ఫెర్నాండో(3).. శ్రీలంక నాలుగో వికెట్ డౌన్ సమయం 16:28.. లంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో(5 బంతుల్లో 3) తబ్రేజ్ షంషి ఉచ్చులో చిక్కుకున్నాడు. 11.4వ ఓవర్లో అవిష్క.. షంషి బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 79/4. క్రీజ్‌లో నిస్సంక(40), వినిందు హసరంగ ఉన్నారు. లంకకు మరో షాక్.. రాజపక్స డకౌట్ సమయం 16:14.. పరుగు వ్యవధిలో లంక జట్టుకు మరో షాక్ తగిలింది. 61 పరుగుల వద్ద తొలుత అసలంక రనౌట్ కాగా.. 62 పరుగుల వద్ద షంషి బౌలింగ్‌లో రాజపక్స డకౌటయ్యాడు. దీంతో శ్రీలంక 9.3 ఓవర్ల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో పథుమ్ నిస్సంక(29), అవిష్క ఫెర్నాండో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(21) రనౌట్ సమయం 16:10.. రబాడ అద్బుతమైన త్రో కారణంగా శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 8.5వ ఓవర్లో రెండో పరుగుకు ప్రయత్నించి అసలంక(14 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) రనౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 61/2. క్రీజ్‌లో పథుమ్ నిస్సంక(29 బంతుల్లో 28), భానుక రాజపక్స ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్ పెరీరా(7) ఔట్ సమయం 15:47.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. 3.5వ ఓవర్లో నోర్జే బౌలింగ్‌లో కుశాల్ పెరీరా(10 బంతుల్లో 7; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 20/1. క్రీజ్‌లో పథుమ్ నిస్సంక(13 బంతుల్లో 12), చరిత్ అసలంక ఉన్నారు. షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా శనివారం(అక్టోబర్ 30) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడగా.. చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. దక్షిణాఫ్రికా.. తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ.. మరుసటి మ్యాచ్‌లో పుంజుకుని విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు శ్రీలంక తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి.. మరుసటి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా.. దక్షిణాఫ్రికా 11, శ్రీలంక 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు జట్లు తలపడిన 3 సందర్భాల్లో సఫారీలదే( 2-1) పైచేయిగా ఉంది. ఇక ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) శ్రీలంక ఘనమైన రికార్డే కలిగి ఉంది. ఆ జట్టు రెండుసార్లు(2009, 2012) ఫైనలిస్ట్‌గా, ఓ సారి ఛాంపియన్(2014)గా నిలిచింది. దక్షిణాఫ్రికా మాత్రం ఈ మెగా టోర్నీలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 2009, 2014లో సెమీస్‌కు చేరడమే ఆ జట్టుకు అత్యుత్తమం. తుది జట్లు: దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), డికాక్(వికెట్‌కీపర్), వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షమ్సీ శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్‌కీపర్), పథుమ్ నిస్సంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లహీరు కుమార -
SL Vs SA: 9 వికెట్ల తేడాతో విజయం.. దక్షిణాఫ్రికాదే టీ20 సిరీస్
South Africa Wins 2nd T20: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో నెగ్గింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత ఆతిథ్య శ్రీలంక 18.1 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్, షమ్సీ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక పర్యాటక దక్షిణాఫ్రికా 14.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది. డికాక్ (48 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 3 వికెట్లు తీసి సత్తా చాటిన తబ్రేజ్ షమ్సీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలుపొందడం గురించి ప్రొటీస్ జట్టు కెప్టెన్ కేశవ్ మహరాజ్ మాట్లాడుతూ.. ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు. సానుకూల దృక్పథంతో ప్రణాళికలు పక్కాగా అమలు చేసి అనుకున్న ఫలితం సాధించినట్లు పేర్కొన్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్: 103-10 (18.1 ఓవర్లు) దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 105-1 (14.1 ఓవర్లు) చదవండి: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు..?