పోర్ట్ ఎలిజబెత్: ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక టెస్టు రెండో మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దోబూచులాడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక లక్ష్యానికి 143 పరుగుల దూరంలో నిలవగా... దక్షిణాఫ్రికా గెలుపునకు 5 వికెట్లు కావాల్సి ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 191/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 86 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (116 బంతుల్లో 66; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... ట్రిస్టన్ స్టబ్స్ (47; 2 ఫోర్లు), బెడింగ్‌హమ్ (35; 3 ఫోర్లు) రాణించారు.
లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 348 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆదివారం ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
కమిందు మెండిస్ (35; 4 ఫోర్లు, 1 సిక్స్), ఏంజెలో మాథ్యూస్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ చండీమల్ (29; 5 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (64 బంతుల్లో 39 బ్యాటింగ్? 7 ఫోర్లు), కుశాల్ మెండిస్ (56 బంతుల్లో 39 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడుతున్నారు.
దక్షిణాప్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ప్యాటర్‌సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో ఐదు వికెట్లు ఉన్న శ్రీలంక విజయానికి 143 పరుగుల దూరంలో ఉంది.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాకంటే మెర్గుగా ఆడారు: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment