శ్రీలంక తడబాటు
పోర్ట్ ఎలిజిబెత్: దక్షిణాఫ్రికాను కట్టడి చేశామన్న ఆనందం శ్రీలంక జట్టుకు ఎక్కువ సేపు నిలువలేదు. తమ తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ కూడా తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 267/6 తో మంగళవారం తొలి ఇన్నింగ్ప్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయి 286 పరుగులకే ఆలౌటైంది.
లంక బౌలర్లలో సురంగ లక్మల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సువాన్ ప్రదీప్, రంగన హెరాత్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఫిలాండర్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పొయింది. ఆ తర్వాత కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (39 ; 5 ఫోర్లు), దినేష్ చండీమల్ (28; 5 ఫోర్లు), ధనుంజయ డిసిల్వా ( 43 బ్యాటింగ్ ; 5 ఫోర్లు) పోరాడటంతో శ్రీలంక స్కోరు 150 పరుగులు దాటింది.