Suranga Lakmal
-
Ind Vs Sl 2nd Test: శ్రీలంక ‘పేసర్’కు ద్రవిడ్, కోహ్లి విషెస్.. వీడియో
Ind Vs Sl 2nd Test:- శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు అతడి కెరీర్లో చివరిది. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా లక్మల్ చివరి బంతిని వేశాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఆఖరి బంతిని సంధించాడు. ఈ క్రమంలో టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అతడి దగ్గరకు వెళ్లి పలకరించారు. నవ్వుతూ కరచాలనం చేస్తూ.. భవిష్యత్తు బాగుండాలంటూ ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా అభిమానులను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రీలంక జట్టు సురంగను గార్డ్ ఆఫ్ ఆనర్తో గౌరవించింది. ఇక 35 ఏళ్ల సురంగ కెరీర్ విషయానికొస్తే.. శ్రీలంక తరఫున 70 టెస్టుల్లో 171 వికెట్లు పడగొట్టాడు. నాలుగు సార్లు 5 వికెట్లు ఘనతను సాధించాడు. 86 వన్డేలు ఆడిన అతడు 109 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 11 టీ20 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీశాడు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జట్టు నుంచి తప్పుకొంటున్నానని, ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు సురంగ ప్రకటించాడు. Head Coach Rahul Dravid and former #TeamIndia Captain @imVkohli congratulate Suranga Lakmal as he is all set to bid adieu to international cricket.@Paytm #INDvSL pic.twitter.com/Vroo0mlQLB — BCCI (@BCCI) March 13, 2022 WATCH: Suranga Lakmal | Farewell Press Briefing https://t.co/wOsjdRWrIM#ThankYouLakmal — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 11, 2022 -
శ్రీలంక క్రికెట్‌కు మరో షాకింగ్ న్యూస్
Suranga Lakmal Retirement: వరుస అపజయాలతో సతమతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ సురంగ లక్మల్ (35).. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. భారత్‌తో సిరీస్ తనకు ఆఖరిదని ముందే ప్రకటించిన లక్మల్.. తన అంతర్జాతీయ కెరీర్లో చివరి బంతిని వేసేశాడు. పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో లక్మల్ చివరి బంతిని టీమిండియా బ్యాటర్ రవీంద్ర జడేజా ఎదుర్కొన్నాడు. లక్మల్ తన ఆఖరి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కాగా, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం జట్టు నుంచి తప్పుకుంటున్నాని, రిటైర్ అవడానికి ఇదే సరైన సమయమని లక్మల్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక తరఫున 70 టెస్ట్‌ల్లో 171 వికెట్లు పడగొట్టిన లక్మల్.. 86 వన్డేల్లో 109 వికెట్లు, 11 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో అతను నాలుగు సార్లు 5 వికెట్లు ఘనతను సాధించాడు. 2018 కాలంలో టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన లక్మల్.. సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-0తో ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ (67), పంత్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, లంక బౌలర్లలో జయవిక్రమ 4, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
ఎంతైనా వందో టెస్టు కదా.. ఆ మాత్రం ఉండాలి
టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి మాములుగానే అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. తన గంభీరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టడంలో సిద్ధహస్తుడు. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నోసార్లు తన అగ్రెసివ్నెస్తో అభిమానులను అలరించాడు. కోపం వచ్చినా.. సంతోషం వేసినా కోహ్లిని ఆపడం ఎవరి తరం కాదు. ఇక లంకతో జరుగుతున్న తొలి టెస్టు కోహ్లికి వందోదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వందో టెస్టు ఆడుతున్న కోహ్లి మాములుగా ఉంటే ఏం మజా వస్తుంది. అందుకే లంక్ బౌలర్ సురంగ లఖ్మల్ను తన స్టన్నింగ్ లుక్‌తో భయపెట్టాడు. విషయంలోకి వెళితే.. టీమిండియా ఇన్నింగ్స్ 27వ ఓవర్లో మూడో బంతిని కోహ్లి బౌండరీ తరలించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వెళుతున్న కోహ్లిని బౌండరీ కొట్టావా అన్నట్లుగా లక్మల్ చూశాడు. అంతే ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోయిన కోహ్లి.. వెనక్కి తిరిగి కోపంతో లక్మల్‌ను ఒక చూపు చూశాడు. ఆ చూపు లక్మల్‌ను భయపెట్టేలా ఉందనడంలో సందేహం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక తన వందో టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. 45 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికి దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలవడంలో కోహ్లి విఫలమయ్యాడు. లసిత్ ఎంబుల్డేనియా బౌలింగ్‌లో ఒక సూపర్ డెలివరీకి కోహ్లి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగడం విశేషం. చదవండి: ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్.. మేనేజ్మెంట్కు ధన్యవాదాలు: కోహ్లి IND vs SL 1st Test: 'బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు రోహిత్.. అదేంటి అలా ఔటయ్యావ్' That stare from virat kohli 🥵🥵#ViratKohli #100thTestForKingKohli pic.twitter.com/rDX2FLtis6 — straight drive from kohli 🥵 (@channkitthan) March 4, 2022 -
టీమిండియతో సిరీస్ ఆఖరు.. రిటైర్ కానున్న స్టార్ క్రికెటర్
శ్రీలంక మాజీ కెప్టెన్ సురంగ లక్మల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. టీమిండియాతో టెస్టు సిరీస్ అనంతరం లక్మల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు లంక క్రికెట్ బోర్డు బుధవారం ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. 34 ఏళ్ల లక్మల్ 2009లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల కాలంలో సురంగ లక్మల్ లంక తరపున 68 టెస్టుల్లో 168 వికెట్లు, 86 వన్డేల్లో 100 వికెట్లు, 11 టి20ల్లో ఏడు వికెట్లు తీశాడు. లక్మల్ తాను ఆడిన తొలి టెస్టుమ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసి అరుదైన ఘనత సాధించి ఇమ్రాన్ ఖాన్, కపిల్ దేవ్ సరసన నిలిచాడు. చదవండి: Shahrukh Khan: 'ఏడాది కిందట అర్హత లేదు.. ఇప్పుడు సిద్ధం; ధోనిలా మంచి ఫినిషర్ అవడమే లక్ష్యం' కాగా 2018 కాలంలో లక్మల్ శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో ఐదు టెస్టులు ఆడింది. లక్మల్ కెప్టెన్సీలో లంక జట్టు సౌతాఫ్రికా గడ్డపై 2-0తో టెస్టు సిరీస్‌ను గెలిచింది. ఆ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక నిలిచింది. ఆ తర్వాత విండీస్ గడ్డపై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇక శ్రీలంక జట్టు ఫిబ్రవరి చివరి వారంలో టీమిండియా పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో లంక జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: PSL 2022: 'నా కూతురు కోరిక.. అందుకే వింత సెలబ్రేషన్' -
శ్రీలంకతో తొలి టెస్ట్: కుప్పకూలిన సఫారీ జట్టు
గాలె: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లంక బ్యాట్స్‌మెన్ అదరగొట్టగా.. అనంతరం బౌలర్లు చెలరేగారు. శ్రీలంక బౌలర్ల ధాటిక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌటైంది. ఆతిథ్య గడ్డపై ప్రొటీస్ జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. వికెట్ నష్టానికి నాలుగు పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టును లంక బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. నైట్ వాచ్‌మన్ కేశవ్ మహారాజ్‌ను ఔట్ చేయడంతో రెండో రోజు శ్రీలంక వికెట్ల ఖాతా తెరిచింది. మరో ఓపెనర్ ఎల్గర్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మన్ ఆమ్లా(15), బవుమా(17), డికాక్(3), ఫిలాండర్(18) తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ డుప్లెసిస్ 49(88 బంతుల్లో 5ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో కనీసం వంద పరుగుల మార్క్‌ను ప్రోటీస్ జట్టు దాటింది. లంక బౌలర్లలో డి పెరీరా (4/46), కెప్టెన్ సురంగ లక్మల్(3/21), హెరాత్(2/39), లక్షాన్ సందకదన్(1/18) ఆకట్టుకున్నారు. అనంతరం 161 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకకు మరో సారి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కరుణరత్నే 60( 80 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు సాధించింది. శ్రీలంక ప్రస్తుతం 272 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రొటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు తీయగా, రబడా ఒక్క వికెట్ సాధించారు. -
మరోసారి అస్వస్థతకు గురైన లంక క్రికెటర్
-
మరోసారి అస్వస్థతకు గురైన లంక క్రికెటర్
ఢిల్లీ: నగరంలోని వాయు కాలుష్యం శ్రీలంక పేసర్ సురంగా లక్మల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్ తో మూడో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్న లంక క్రికెటర్ లక్మల్.. నాల్గో రోజు ఆటలో కూడా వాంతులు చేసుకున్నాడు. మంగళవారం నాల్గో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్దిసేపటికే లక్మల్ ఇబ్బంది పడటం కనిపించింది. ఈ క్రమంలోనే వాంతులు చేసుకున్న లక్మల్‌కు వైద్య సాయం అవసరమైంది. ఈ రోజు ఆటలో లక్మల్ మూడు ఓవర్లు వేసిన తరువాత అస్వస్థతకు లోనయ్యాడు. దాంతో జట్టు ఫిజియో సాయంతో లక్మల్ ఫీల్డ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ రోజు ఆటలో కూడా చండిమల్, ఏంజెలో మాథ్యూస్‌లు మాస్క్‌లు ధరించే ఫీల్డ్‌లోకి దిగడం గమనార్హం. ఆదివారం రెండో రోజు ఆటలో పొగ కాలుష్యం కారణంగా పలువురు లంకేయులు మాస్క్‌లు ధరించి ఫీల్డింగ్ చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా లక్మల్, లహిరు గామేజ్‌లు ఇబ్బందికి గురై ఫీల్డ్ నుంచి వెళ్లిపోయారు. ఆపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని, మ్యాచ్‌ను నిలిపివేయాలని పదేపదే అంపైర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే మ్యాచ్ కొనసాగింపుపై రిఫీరీదే తుది నిర్ణయం కావడంతో లంక క్రికెటర్లు బలవంతంగా ఆటను కొనసాగిస్తున్నట్లు కనబడుతోంది. -
గమ్మత్తుగా అవుటైన ధావన్..!
ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న భారత్-శ్రీలంక మూడో టెస్టులో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. లంక బౌలర్ పెరీరా వేసిన పదో ఓవర్లో ధావన్ ఆడిన షాట్‌ను బ్యాక్ వర్డ్ స్వ్కేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లక్మల్ క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ అందుకున్న తీరు మైదానమంతా నవ్వులు పూయించింది. ధావన్ (23) క్యాచ్ కోసం పరుగెత్తుకొచ్చిన లక్మల్ షూ జారీపోయినా కిందపడి మరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక ఈ వికెట్ తీసిన పెరీరాకు టెస్టుల్లో 100వ వికెట్ కావడం విశేషం. ఆ సన్నివేశాన్ని మీరు చూడండి. -
గమ్మత్తుగా అవుటైన ధావన్..!
-
లక్మల్ విజృంభణ
కోల్ కతా:భారత్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్ లోనూ శ్రీలంక పేసర్ సురంగా లక్మల్ విజృంభణ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు సాధించి భారత్ ను కట్టడి చేసిన లక్మల్.. రెండో ఇన్నింగ్స్ లోనూ చెలరేగిపోతున్నాడు. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాకిచ్చాడు లక్మల్. తొలుత కేఎల్ రాహుల్(79;125 బంతుల్లో8 ఫోర్లు) ను అవుట్ చేసిన లక్మల్..కాసేపటికి చతేశ్వర పుజారా(22), అజింక్యా రహానే(0)లను వరసు బంతుల్లో అవుట్ చేశాడు. 21 పరుగుల వ్యవధిలో ముగ్గరు టాపార్డర్ ఆటగాళ్లను లక్మల్ అవుట్ చేసి లంక శిబిరంలో ఆనందం నింపాడు. 213 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను నష్టపోయిన భారత్..91 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇది చివరి రోజు ఆట కావడంతో మ్యాచ్ లో ఫలితం తేలే అవకాశాలు దాదాపు లేనట్లే. -
శ్రీలంక తడబాటు
పోర్ట్ ఎలిజిబెత్: దక్షిణాఫ్రికాను కట్టడి చేశామన్న ఆనందం శ్రీలంక జట్టుకు ఎక్కువ సేపు నిలువలేదు. తమ తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ కూడా తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 267/6 తో మంగళవారం తొలి ఇన్నింగ్ప్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయి 286 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లలో సురంగ లక్మల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సువాన్ ప్రదీప్, రంగన హెరాత్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఫిలాండర్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పొయింది. ఆ తర్వాత కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (39 ; 5 ఫోర్లు), దినేష్ చండీమల్ (28; 5 ఫోర్లు), ధనుంజయ డిసిల్వా ( 43 బ్యాటింగ్ ; 5 ఫోర్లు) పోరాడటంతో శ్రీలంక స్కోరు 150 పరుగులు దాటింది. -
శ్రీలంక తడబాటు
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాను కట్టడి చేశామన్న ఆనందం శ్రీలంక జట్టుకు ఎక్కువసేపు నిలువలేదు. తమ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కూడా తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 267/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయి 286 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లలో సురంగ లక్మల్ ఐదు వికెట్లు పడగొట్టగా... నువాన్ ప్రదీప్, రంగన హెరాత్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఫిలాండర్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (39; 5 ఫోర్లు), దినేశ్ చండీమల్ (28; 5 ఫోర్లు), ధనంజయ డిసిల్వా (43 బ్యాటింగ్; 5 ఫోర్లు) పోరాడటంతో శ్రీలంక స్కోరు 150 పరుగులు దాటింది. ప్రస్తుతం డిసిల్వాతో చమీరా (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
శ్రీలంకతో తొలి టెస్టు: దక్షిణాఫ్రికా 267/6
పోర్ట్ ఎలిజబెత్: శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ (4/62) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఫలితంగా తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు సోమవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. జేపీ డుమిని (63; 10 ఫోర్లు), స్టీఫెన్ కుక్ ( 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. -
కుప్పకూలిన బంగ్లా
ఢాకా: శ్రీలంక పేసర్లు షమింద ఎరంగ (4/49), సురంగ లక్మల్ (3/66) పదునైన బంతులకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. పిచ్ నుంచి అందివచ్చిన సహకారంతో చెలరేగిన ఈ జోడి సంయుక్తంగా ఏడు వికెట్లను తీయడంతో బంగ్లా జట్టు కోలుకోలేకపోయింది. ఫలితంగా షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో 63.5 ఓవర్లలో 232 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీం (122 బంతుల్లో 61; 9 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (91 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా... గజీ (56 బంతుల్లో 42; 6 ఫోర్లు; 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ నిర్ణయాన్ని లంక బౌలర్లు వమ్ము చేయలేదు. వీరి ధాటికి ఏడుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. బంగ్లాదేశ్ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో షకీబ్, ముష్ఫికర్ కలిసి 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. కరుణరత్నే (58 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), సిల్వ (57 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు.