
ఢిల‍్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న భారత్-శ్రీలంక మూడో టెస్టులో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. లంక బౌలర్ పెరీరా వేసిన పదో ఓవర్‌లో ధావన్ ఆడిన షాట్‌ను బ్యాక్ వర్డ్ స్వ్కేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లక్మల్ క్యాచ్ అందుకున్నాడు.
అయితే ఈ క్యాచ్ అందుకున్న తీరు మైదానమంతా నవ్వులు పూయించింది. ధావన్ (23) క్యాచ్ కోసం పరుగెత్తుకొచ్చిన లక్మల్ షూ జారీపోయినా కిందపడి మరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక ఈ వికెట్ తీసిన పెరీరాకు టెస్టుల్లో 100వ వికెట్ కావడం విశేషం. ఆ సన్నివేశాన్ని మీరు చూడండి.
Comments
Please login to add a commentAdd a comment