India- srilanka
-
రోహిత్ మరో చెత్త రికార్డు!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్ తాజా ట్రైసిరీస్‌లో సైతం దారుణంగా విఫలమయ్యాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్ గత ఐదేళ్లలో అత్యధిక డకౌట్లు అయిన భారత ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. మార్చి 6, 2013 నుంచి ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో రోహిత్ 12 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రికార్డును సమం చేశాడు. 11 డక్‌లతో పేసర్ భువనేశ్వర్ కుమార్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనే రోహిత్ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత క్రికెటర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20ల్లో రోహిత్‌కు ఇది ఐదో డకౌట్. 68 టీ20 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 5 సార్లు డకౌట్ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మూడేసి డక్‌లతో ఆశిష్ నెహ్రా, యూసుఫ్ పఠాన్లు కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైనా.. తాజా సిరీస్‌లో రాణిస్తాడని ఎదురు చూసిన అభిమానులకు రోహిత్ నుంచి నిరాశే ఎదురైంది. ఇక తొలి మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం బంగ్లాదేశ్‌తో భారత్ రెండో టీ20 ఆడనుంది. -
వీటి కోసమన్నా నేటి మ్యాచ్ చూడాలి!
సాక్షి, స్పోర్ట్స్ : శ్రీలంక వేదికగా నేటి(మంగళవారం) నుంచి ట్రై నేషన్ (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) నిదాహస్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ట్రైసిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత్-శ్రీలంక మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూడడానికి ఓ 10 కారణాలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు లేకుండా యువభారత్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. 1. ప్రేమదాసు స్టేడియంలో బ్యాట్స్‌మన్ అత్యధిక స్కోరు 99 (నాటౌట్). (అఫ్ఘనిస్తాన్‌పై లూక్రైట్ 2012లో నమోదు చేశాడు) 2. ఈ వేదికలో (4/12) బెస్ట్ బౌలింగ్ హర్బజన్ సింగ్, అజంతా మెండీస్ల పేరిట ఉంది. 2012లో హర్భజన్ ఇంగ్లండ్‌పై, మెండీస్ వెస్టిండీస్‌పై సాధించారు. 3. అత్యధిక ఛేదన 173 పరుగులే. 2015లో శ్రీలంకపై పాకిస్తాన్ ఈఘనతను సాధించింది. 4. తొలి సారి (భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక) ట్రై నేషన్ టీ20 సిరీస్ జరుగుతోంది. 5. బంగ్లాదేశ్, శ్రీలంకలతో భారత్ ఆడిన గత 7 టీ20లకు 7 గెలిచింది. 6.మరో 42 పరుగులు చేస్తే టీ20ల్లో 500 పరుగులు చేసిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ గుర్తింపు పొందనున్నాడు. 7. మరో 104 పరుగులు చేస్తే టీ20ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాట్స్‌మన్‌గా సురేశ్ రైనా రికార్డు నమోదు చేయనున్నాడు. అంతకు ముందు కోహ్లి(1983), రోహిత్ (1679)లు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. 8. టీ20ల్లో శ్రీలంక పై భారత్ విన్నింగ్ పర్సెంట్ 71.43 శాతం 9. ఇక ఈ వేదికలో శ్రీలంక 14 మ్యాచుల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. 10 ఆసియాలో 50 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ 35 గెలిచి 15 మాత్రమే ఓడింది. -
ధోనినా.. మజాకా..!
సాక్షి, ఇండోర్: శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన రెండో టి 20లో భారత్ విజయం సాధించి సరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. మొదటి టి 20లో ధోని రెండు క్యాచ్‌లు, రెండు స్టంప్ అవుట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టి 20లో కూడా అటూ బ్యాటింగ్‌లో, ఇటూ కీపింగ్‌లో అందర్ని అబ్బురపరిచాడు. భారత్ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కుల్దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్లో గుణరాత్నే షాట్ ఆడబోయి వికెట్ల వెనుక ధోనికి చిక్కాడు. అందరూ నాటౌట్అనుకున్నారు.. కానీ ధోని మాత్రం ఆ సమయంలో చాలా కానిఫిడెంట్గా కనిపించారు. లెగ్ ఆంపైర్ నిర్ణయాన్ని థర్డ్ ఆంపైర్కు ఇచ్చాడు. చివరకు అది స్టంప్ అవుట్ అని తేలింది. అలాగే, చాహల్ వేసిన 16 ఓవర్లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ సమరవిక్రమను కూడా ధోని స్టంప్ అవుట్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ధోని ఇటీవల తనపై వచ్చిన రూమర్స్‌కు తనదైన శైలిలో సమాధానం చెబుతున్నాడు. వన్‌డౌన్‌లో ధోని... రోహిత్ అవుట్ అయిన తర్వాత అనూహ్యంగా వన్‌డౌన్‌లో వచ్చిన ధోని (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాహుల్‌కు జత కలిశాడు. 14వ ఓవర్ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మధ్యలో కొంత తగ్గినా... స్పిన్నర్ ధనంజయ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 78 పరుగులు జత చేశాడు. ధోని మరో రికార్డు చేరువలో.. ధోని మరో మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ 20 క్రికెట్లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం 47 అంతర్జాతీయ టీ 20 క్యాచ్‌లతో ధోని ఉన్నాడు. ముంబైలో ఆదివారం జరగనున్న మూడో టి 20 మ్యాచ్‌లో ధోని ఈ ఘనత సాధిస్తాడో లేదో వేచి చూడాలి. -
ధోనినా.. మజాకా..!
-
రోహిత్ నమ్మకం వమ్ము కాలేదు..!
సాక్షి, ఇండోర్: శ్రీలంకతో జరిగిన టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కదం తొక్కాడు. తన అద్భుతమైన ఆటతో టి20లో వేగవంతమైన సెంచరీ(35బంతుల్లో) రికార్డును సమం చేశాడు. భారత్ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరిస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్‌కు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎలా వచ్చిన బంతిని అలా బాదేశాను. యువ ఆటగాళ్లు చాలా బాగా రాణించారు. యువ బౌలర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శంచారు. వారిద్దరూ కలిసి ఆటను మార్చేశారు. వారిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఒత్తిడిని జయించి కూడా బౌలింగ్ చేయగలరు’ అని రోహిత్ ప్రశంసించారు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించారు. హార్దిక్ పాండ్యా, ఉనాద్కత్‌లకు తలో వికెట్ తీశారు. డబుల్ సెంచరీ గురించి ఆలోచించడం అత్యాశేనేమో. ఆరంభం నుంచి చివరి వరకు బ్యాటింగ్‌ను కొనసాగించడంలో నాకంటూ ఒక పద్ధతి ఉంది. దానినే ఇక్కడ చూపించాను’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఇండియా- శ్రీలంక మధ్య మూడో టి20 ఆదివారం ముంబైలో జరగనుంది. -
నాలుగో వికెట్ పడగొట్టిన బర్త్‌డేబాయ్
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 31/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన లంకను ఆరంభంలోనే బర్త్‌డే బాయ్ రవీంద్ర జడేజా దెబ్బ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన ఏంజెలో మాథ్యూస్(1)ను అద్భుత బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. మాథ్యూస్ బ్యాట్‌కు తగిలిన బంతి స్లిప్ వైపు దూసుకురాగా రహానే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లంక కెప్టెన్ చండిమాల్‌తో డిసిల్వా(24) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇక (డిసెంబర్ 6) నేడు 29వ బర్త్‌డే జరుపుకుంటున్న జడేజా.. నాలుగో రోజు చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. -
అయ్యో.. ధావన్ ఎంత పనిచేశావు.?
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ఏమరపాటు శ్రీలంకకు కలిసొచ్చింది. ఫీల్డర్లు క్యాచ్ జారవిడచడంతో లంక బ్యాట్స్‌మన్‌కు లైఫ్ దోరకడమే కాకుండా అంపైర్ విధించిన పెనాల్టీతో ఐదు పరుగులు కలిసొచ్చాయి. టీ బ్రేక్ అనంతరం మహ్మద్ షమీ వేసిన 7 ఓవర్ చివరి బంతి బ్యాట్స్‌మెన్ పెరీరా బ్యాట్ ఎడ్జ్‌ని తాకి ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అయితే ఈ బంతిని సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ శిఖర్ ధావన్ జారవిడిచాడు. ఆ పక్కన ఫస్ట్ స్లిప్‌లో ఉన్న మరో ఫీల్డర్ పుజారా కూడా ఆ బంతిని అందుకోలేకపోయాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి వారి వెనుక ఉన్న కీపర్ హెల్మెట్‌కి తాకింది. కీపర్ సాహా బంతిని ఆపే ప్రయత్నం చేసినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే నిబంధనల ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకున్న అంపైర్ భారత్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. అనంతరం తనది ఎంత తప్పో గుర్తించిన ధావన్ పదేపదే ఆ క్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ కనిపించాడు. -
గమ్మత్తుగా అవుటైన ధావన్..!
ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న భారత్-శ్రీలంక మూడో టెస్టులో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. లంక బౌలర్ పెరీరా వేసిన పదో ఓవర్లో ధావన్ ఆడిన షాట్‌ను బ్యాక్ వర్డ్ స్వ్కేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లక్మల్ క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ అందుకున్న తీరు మైదానమంతా నవ్వులు పూయించింది. ధావన్ (23) క్యాచ్ కోసం పరుగెత్తుకొచ్చిన లక్మల్ షూ జారీపోయినా కిందపడి మరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక ఈ వికెట్ తీసిన పెరీరాకు టెస్టుల్లో 100వ వికెట్ కావడం విశేషం. ఆ సన్నివేశాన్ని మీరు చూడండి. -
గమ్మత్తుగా అవుటైన ధావన్..!
-
లంచ్ బ్రేక్ సమయానికి భారత స్కోర్ 404/3
నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 199 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక 312/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి, పుజారాలు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. తొలుత కెప్టెన్ కోహ్లి 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మూడో వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జంటను దసున్ షనక విడగొట్టాడు. యార్కర్ బంతితో పుజారా143 (362బంతులు,14 ఫోర్లు)ను బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానేతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 404/3. క్రీజులో కోహ్లి 123(161 బంతులు, 13 ఫోర్లు), రహానే 0(5 బంతులు) బ్యాటింగ్ చేస్తున్నారు. -
విధ్వంసకర ఆటపట్టు అవుట్..
డెర్బీ: శ్రీలంక డేంజరేస్ బ్యాట్ ఉమెన్ చమరి ఆటపట్టు (25) అవుటైంది. పూనమ్ యాదవ్ వేసిన 17 ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 22 ఫోర్లతో 178 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలో పెరారా(10) వికెట్ కోల్పోయి ఎదురు దెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటపట్టు మరో ఓపెనర్ హన్సిక తో ఆచూతూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 47 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోతున్న ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను పూనమ్ చక్కటి బంతితో వీడదీసింది. ఇక క్రీజులో హన్సిక (23) సిరి వర్దనే (4) క్రీజులో ఆడుతున్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక మహిళలు 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
అదర గొట్టిన మిథాలీ సేన.. శ్రీలంక లక్ష్యం 233
♦ అర్ద సెంచరీలతో రాణించిన దీప్తీ, మిథాలీ ♦ చివర్లో చితక్కొట్టిన వేద, కౌర్ డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మీథాలీ సేన శ్రీలంకకు 233 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ బ్యాటింగ్ ఉమెన్ లో దీప్తీ శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53)లు రాణించారు. ఇక చివర్లో వేద కృష్ణమూర్తి(29), హర్మన్ ప్రీత్ కౌర్(20) లు దాటిగా ఆడటంతో భారత్ 200 పై చిలుకు పరుగులు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు స్మృతి మందన(8), పూనమ్ రౌత్(16)లు నిరాశపరచడంతో శుభారంభం అందలేదు. దీంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను దీప్తీ శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ లు అర్ద సెంచరీలతో గట్టెక్కించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత 89 బంతుల్లో దీప్తీ అర్ద సెంచరీ చేసుకోగా మిథాలీ 72 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన దీప్తీ శర్మ (78) కాంచన బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన గోస్వామి(9) నిరాశ పరచగా మరుసటి బంతికే కెప్టెన్ మిథాలీ(53) కూడా ఎల్బీగా అవుటైంది. దీంతో 169 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్ దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. వీరిద్దరూ 52 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇక 49 ఓవర్ వేసిన శ్రీపాలి విరొక్కడే వరుస బంతుల్లో వీరిద్దరిని పెవిలియన్ కు చేర్చింది. చివరి ఓవర్లో జోషి రనౌట్ అవ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. భారత మహిళలు చివరి 5 ఓవర్లలో 46 పరుగులు చేయడం విశేషం. ఇక శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి విరొక్కడే 3 వికెట్లు తీయగా రణవీర(2), కాంచన, గుణరత్నే చెరో వికెట్ పడగొట్టారు. -
అర్ధశతకాలతో రాణించిన దీప్తీ, మిథాలీ..
► 5 వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మీథాలీసేన 5 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 44 ఓవర్లకు 182 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంబాన్ని అందించకపోవడంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తీ శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ లు జట్టు బాధ్యతలు మీదేసుకున్నారు. విరీద్దరూ మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం అందించడంతో జట్టు 200 పరుగుల దిశగా దూసుకెళ్తుంది. తొలుత 89 బంతుల్లో దీప్తీ అర్ద సెంచరీ చేసుకోగా మిథాలీ 72 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన దీప్తీ శర్మ (78) కాంచన బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన గోస్వామి(9) వచ్చి రావడంతోనే బంతిని గాల్లోకి లేపింది. ఒక లైఫ్ వచ్చిన ఆమె అలానే ఆడుతనూ రణవీర బౌలింగ్ లో వెనుదిరిగింది. ఆ మరుసటి బంతికే కెప్టెన్ మిథాలీ(53) కూడా ఎల్బీగా అవుటైంది. దీంతో 169 పరుగులకే వికెట్లు కోల్పోయింది. క్రీజులో కృష్ణమూర్తి(7), హర్మన్ ప్రిత్ కౌర్ (6) పోరాడుతున్నారు. -
నిరాశ పరిచిన స్మృతి మందన..
♦ రెండు వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత ఓపెనర్ శతక వీరమణి స్మృతి మందన మరో సారి నిరాశ పరిచింది. ఈ టోర్నిలో సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మందన గత పాక్ మ్యాచ్ లోను విఫలమైంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు శుభారంబాన్ని అందించ లేకపోయారు. జట్టు 21 పరుగుల వద్ద మందన(8) గుణరత్నే బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. కొద్దిసేపటికి మరో ఓపెనర్ పూనమ్ రౌత్(16) వీరొక్కడే బౌలింగ్ లో వెనుదిరిగింది. ఇక క్రీజులో కెప్టెన్ మిథాలీ రాజ్(7), దీప్తీ శర్మ(28)లు ఆచుతూచి ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. -
టాస్ నెగ్గిన మిథాలీ సేన
డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్నమ్యాచ్ లో మిథాలీ సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకోగా శ్రీలంక ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక భారత్ జట్టులోకి మోన శర్మ స్థానంలో వేదా శర్మను తీసుకున్నారు. పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందనే బ్యాటింగ్ తీసుకున్నామని 250 పరుగుల చేస్తే స్పిన్నర్లతో మ్యాచ్ గెలువచ్చని మిథాలీ ధీమా వ్యక్తం చేసింది. ఇక శ్రీలంక కెప్టెన్ ఇనోకా రణవీర బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.