నిరాశ పరిచిన స్మృతి మందన.. | Disappointed smriti mandhana | Sakshi
Sakshi News home page

నిరాశ పరిచిన స్మృతి మందన..

Published Wed, Jul 5 2017 4:24 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

నిరాశ పరిచిన స్మృతి మందన..

నిరాశ పరిచిన స్మృతి మందన..

♦ రెండు వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన

డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత ఓపెనర్ శతక వీరమణి స్మృతి మందన మరో సారి నిరాశ పరిచింది. ఈ టోర్నిలో సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మందన గత పాక్ మ్యాచ్ లోను విఫలమైంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు శుభారంబాన్ని అందించ లేకపోయారు.

జట్టు 21 పరుగుల వద్ద మందన(8) గుణరత్నే బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. కొద్దిసేపటికి మరో ఓపెనర్ పూనమ్ రౌత్(16) వీరొక్కడే బౌలింగ్ లో వెనుదిరిగింది. ఇక క్రీజులో కెప్టెన్ మిథాలీ రాజ్(7), దీప్తీ శర్మ(28)లు ఆచుతూచి ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement