womens world cup
-
ICC: తొలిసారి మెగా టోర్నీలోకి జింబాబ్వే.. భారత్ షెడ్యూల్ ఇదే
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం(FTP) ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్ 2029కు సన్నాహకంగా ఈ షెడ్యూల్ ఉండబోతోందని పేర్కొంది. అంతేకాదు.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీలో అదనంగా మరో జట్టు కూడా చేరుతోందని తెలిపింది. జింబాబ్వే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టనుందని ఐసీసీ పేర్కొంది.44 సిరీస్లుఇక 2025-29 మధ్యకాలంలో వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 44 సిరీస్‌లు నిర్వహించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో 132 వన్డేలు ఉంటాయని.. ప్రతి సిరీస్‌లోనూ మూడు మ్యాచ్‌ల చొప్పున జట్లు ఆడతాయని తెలిపింది.కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక విదేశీ గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లను ఎదుర్కోనుంది.ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా 2025లో ఐసీసీ వుమెన్స్ వనన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అదే విధంగా.. యునైటెడ్ కింగ్డమ్లో 2026లో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, 2028 టీ20 వరల్డ్‌కప్‌నకు మాత్రం ఇంకా వేదికను ప్రకటించలేదు.ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోయే దేశాలుఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే.ఆస్ట్రేలియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. అదే విధంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక పర్యటన.ఇండియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనబంగ్లాదేశ్ షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పర్యటనఇంగ్లండ్ షెడ్యూల్స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక పర్యటనఐర్లాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక పర్యటనన్యూజిలాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్ పర్యటనపాకిస్తాన్ షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనసౌతాఫ్రికా షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే పర్యటనశ్రీలంక షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో... న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనవెస్టిండీస్ షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంకలతో.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనజింబాబ్వే షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్‌లతో.. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటన.చదవండి: ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు -
W T20 WC 2024: కొత్త చాంపియన్ న్యూజిలాండ్
ఒక జట్టు తలరాత మారలేదు. పురుషులు, మహిళల జట్టేదైనా కావొచ్చు కానీ... దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచకప్ భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. మరో‘సారీ’ చోకర్స్గానే మిగిలారు. మరో జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేళ్లయినా న్యూజిలాండ్ పురుషుల జట్టు సాధించలేకపోయిన వరల్డ్‌కప్ (వన్డే, టి20) టైటిల్స్‌ను న్యూజిలాండ్ మహిళల జట్టు (2000లో వన్డే) సాధించి ఔరా అనిపించింది. దుబాయ్: దక్షిణాఫ్రికాను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనక మానరు! సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియా చేతిలో పురుషుల జట్టు, ఇప్పుడేమో న్యూజిలాండ్ చేతిలో మహిళల దక్షిణాఫ్రికా టీమ్ ఫైనల్లో పరాజయంతో ప్రపంచకప్ కలను కలగానే మిగిల్చుకున్నాయి. సఫారీకిది తీరని వ్యథే! మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే గతేడాది సొంతగడ్డపై, ఇప్పుడు దుబాయ్‌లో వరుసగా రన్నరప్ ట్రోఫీనే దిక్కయింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో న్యూజిలాండ్ కొత్త విశ్వవిజేతగా అవతరించింది. అమీతుమీలో కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మూడో ప్రయత్నంలో టి20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. 2009, 2010లలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. విజేత న్యూజిలాండ్ జట్టుకు 23 లక్షల 40 వేల (రూ. 19 కోట్ల 67 లక్షలు) డాలర్లు, రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (43; 4 ఫోర్లు), ఓపెనర్ సుజీ బేట్స్ (32; 3 ఫోర్లు), మిడిలార్డర్లో బ్రూక్ హ్యాలిడే (28 బంతుల్లో 38; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎమ్‌లాబా 2 వికెట్లు తీయగా, అయబొంగ, ట్రియాన్, డి క్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు కెపె్టన్ లౌరా వోల్వార్ట్ (33; 5 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (17; 1 ఫోర్) 6.5 ఓవర్లలో 51 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఇక మిగిలిన 13.1 ఓవర్లలో 108 పరుగులు చేస్తే కప్ గెలిచేసేది. కానీ అదే స్కోరుపై బ్రిట్స్, కాసేపటికి లౌరా అవుట్ కావడంతోనే అంతా మారిపోయింది. తర్వాత వచ్చిన అనెకె (9), మరిజాన్ (8), డి క్లెర్క్ (6), ట్రియాన్ (14), సునె లుస్ (8), డెర్క్సెన్ (10) కివీ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. రోజ్మేరీ, అమెలియా కెర్ చెరో 3 వికెట్లు తీశారు. కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. -
భారత మహిళల ఓటమి
సాంటియాగో (చిలీ): హాకీ మహిళల జూనియర్ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్‌కు తర్వాతి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. టోర్నీ రెండో పోరులో జర్మనీ 4–3 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది. భారత్ తరఫున అన్ను (11వ నిమిషం), రోప్నీ కుమారి (14వ ని.), ముంతాజ్ ఖాన్ (24వ ని.) గోల్స్ కొట్టగా...జర్మనీ తరఫున లౌరా ప్లూత్ (21వ నిమిషం, 36వ ని.), సోఫియా స్వాబ్ (17వ ని.), కరోలిన్ సీడెల్ (38వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్‌లోనే 2 గోల్స్ సాధించి ముందంజలో నిలిచిన భారత్ మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి కూడా 3–2తో ఆధిక్యంలోనే ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకున్న జర్మనీ రెండో అర్ధభాగంలో రెండు నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ కొట్టింది. ఆఖరి క్వార్టర్లో ఇరు జట్లూ పోరాడినా ఒక్క గోల్ నమోదు కాకపోగా, జర్మనీ తమ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడుతుంది. -
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా ప్రీతి
ఈనెల 29 నుంచి డిసెంబర్ 10 వరకు చిలీలో జరిగే జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హరియాణాకు చెందిన ప్రీతి కెపె్టన్‌గా వ్యవహరించనుంది. భారత జట్టు: ప్రీతి (కెప్టెన్), రుతుజా (వైస్ కెప్టెన్), ఖుష్బూ, మాధురి కిండో (గోల్‌కీపర్లు), నీలమ్, జ్యోతి, రోప్ని కుమారి, మహిమా టెటె, మంజూ చోర్సియా, జ్యోతి ఛత్రి, హీనా బానో, సుజాత కుజుర్, సాక్షి రాణా, ముంతాజ్ ఖాన్, అన్ను, దీపిక సోరెంగ్, మోనిక టొప్పో, సునెలితా. రిజర్వ్: నిరూపమా దేవి, ఈదుల జ్యోతి. -
ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్!
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా పరాజాయం పాలైన సంగతి తెలిసిందే. కీలక మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఏడో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసింది. ఊహించని రీతిలో.. కాగా ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను దురుదృష్టం వెంటాడింది. కీలక సమయంలో ఊహించని రీతిలో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. 15వ ఓవర్ వేసిన జార్జియా వేర్హామ్ బౌలింగ్‌లో మొదటి రెండు బంతులకు హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫోర్లను బాదింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 4వ బంతిని హర్మన్ డీప్ మిడి వికెట్ దిశలో స్వీప్ షాట్ ఆడింది. బంతి బౌండరీకి చేరుతుందనే క్రమంలో గార్డనర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఆపింది. అయితే సింగిల్‌ను ఇదే సమయంలో హర్మన్, రిచా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే క్రీజును చేరుకునే క్రమంలో హర్మన్ బ్యాట్ కాస్త ముందు ఇరుక్కుపోయింది. వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీప్ హీలీ బెయిల్స్ పడగొట్టడంతో హర్మన్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. దీంతో మ్యాచ్ ఒక్క సారిగా ఆసీస్ వైపు మలుపు తిరిగింది. ఇక అనూహ్యరీతిలో ఔటైన హర్మన్ అసహనానికి గురైంది. ఈ క్రమంలో డగౌట్ వైపు వెళ్తూ కోపంతో తన బ్యాట్‌ను నేలకేసి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా' pic.twitter.com/D1bYu3qogq — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 23, 2023 -
అండర్–19 మహిళల టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్ (ఫొటోలు)
-
మహిళల క్రికెట్ జట్టు వరల్డ్‌కప్ సాధించడంపై సీఎం జగన్ హర్షం
తాడేపల్లి: భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు టీ 20 వరల్డ్‌కప్ సాధించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టును సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ విజయాల పరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. కాగా, తొట్టతొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 29) జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. 69 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24) పెవిలియన్‌కు చేరగా.. సౌమ్య తివారి (23), హ్రిషత బసు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్, అలెక్సా స్టోన్‌హౌస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రకు న్యాయం చేశారు. టీ20 ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
మన అమ్మాయిలదే ‘ప్రపంచం’
మన అమ్మాయిలు అదరగొట్టారు... అద్భుతమైన ఆటతో ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన మహిళా బృందం చివరకు అగ్రభాగాన నిలిచింది... సీనియర్ స్థాయిలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ గెలవని నిరాశను దూరం చేస్తూ ‘యువ’బృందం చిరస్మరణీయ ఫలితాన్ని సాధించింది. తొలిసారి నిర్వహించిన అండర్–19 ప్రపంచకప్‌లో కొత్త చరిత్రను సృష్టిస్తూ టీమిండియా మహిళలు విశ్వవిజేతగా నిలిచారు. ఏకపక్షంగా సాగిన తుది పోరులో ఇంగ్లండ్ ఆట కట్టించిన మన బృందం జగజ్జేతగా అవతరించింది... మహిళల క్రికెట్లో కొత్త తరానికి ప్రతినిధులుగా దూసుకొచ్చిన అమ్మాయిలు మొదటి ప్రయత్నంలోనే శిఖరాన నిలిచి మన మహిళల క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందనే భరోసాను మరింత పెంచారు. పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల తొలి అండర్–19 ప్రపంచకప్ విజేతగా భారత్ తమ పేరును ఘనంగా లిఖించుకుంది. 16 జట్లు పాల్గొన్న ఈ టి20 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ అండర్ –19పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రస్తుతం పురుషుల అండర్–19 వరల్డ్‌కప్ విజేత భారత్ కాగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా జత చేరడం విశేషం. ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో కూడా 99 పరుగులకే కుప్పకూలి అదృష్టవశాత్తూ విజయంతో బయటపడ్డ ఇంగ్లండ్ బ్యాటింగ్ బలహీనత ఫైనల్లోనూ కనిపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి విఫలం కావడంతో జట్టు సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. టిటాస్ సాధు, అర్చన, పార్శవి ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ర్యానా మెక్‌డొనాల్డ్ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా... ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లే నమోదయ్యాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూసుకుపోయింది. షఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (5) విఫలమైనా... గొంగడి త్రిష (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), సౌమ్య (37 బంతు ల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన టిటాస్ సాధు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ అండర్–19 ఇన్నింగ్స్: స్క్రివెన్స్ (సి) త్రిష (బి) అర్చన దేవి 4; హీప్ (సి అండ్ బి) టిటాస్ సాధు 0; హాలండ్ (బి) అర్చన దేవి 10; సెరెన్ స్మేల్ (బి) టిటాస్ సాధు 3; ర్యానా మెక్‌డొనాల్డ్ (సి) అర్చన దేవి (బి) పార్శవి 19; పేవ్లీ (ఎల్బీ) (బి) పార్శవి 2; స్టోన్‌హౌస్ (సి) సోనమ్ (బి) మన్నత్ 11; గ్రోవ్స్ (రనౌట్) 4; బేకర్ (సి) రిచా ఘోష్ (బి) షఫాలి 0; సోఫియా స్మేల్ (సి అండ్ బి) సోనమ్ 11; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.1 ఓవర్లలో ఆలౌట్) 68. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–16, 4–22, 5–39, 6–43, 7–53, 8–53, 9–68, 10–68. బౌలింగ్: టిటాస్ సాధు 4–0–6–2, అర్చనా దేవి 3–0–17–2, పార్శవి చోప్రా 4–0–13–2, మన్నత్ కశ్యప్ 3–0–13–1, షఫాలీ 2–0–16–1, సోనమ్ 1.1–0–3–1. భారత్ అండర్–19 ఇన్నింగ్స్: షఫాలీ (సి) స్టోన్‌హౌస్ (బి) బేకర్ 15; శ్వేత (సి) బేకర్ (బి) స్క్రివెన్స్ 5; సౌమ్య (నాటౌట్) 24; త్రిష (బి) స్టోన్‌హౌస్ 24; రిషిత (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 3 వికెట్లకు) 69. వికెట్ల పతనం: 1–16, 2–20, 3–66. బౌలింగ్: బేకర్ 4–1–13–1, సోఫియా స్మేల్ 2–0–16–0, స్క్రివెన్స్ 3–0–13–1, గ్రోవ్స్ 2–0–9–0, స్టోన్‌హౌస్ 2–0–8–1, అండర్సన్ 1–0–10–0. -
FIFA Under-17: అమెరికా చేతిలో భారత్ ఘోర పరాభవం
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆతిథ్య భారత్ పరాజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–8 గోల్స్ తేడాతో 2008 రన్నరప్ అమెరికా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అమెరికా తరఫున మెలీనా రెబింబాస్ (9వ, 31వ ని.లో) రెండు గోల్స్ చేసింది. ఆ తర్వాత చార్లోటి కోలెర్ (15వ ని.లో), ఒన్యెకా గమెరో (23వ ని.లో), గిసెలీ థాంప్సన్ (39వ ని.లో), ఎల్లా ఇమ్రి (51వ ని.లో), టేలర్ స్వారెజ్ (59వ ని.లో), మియా భుటా (62వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మరో మ్యాచ్‌లో బ్రెజిల్ 1–0తో మొరాకోపై నెగ్గింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను 14న మొరాకోతో ఆడుతుంది. -
భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత
భారత ఫుట్‌బాల్‌కు ఊరట లభించింది. భారత్‌పై విధించిన నిషే«ధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. నిషేధాన్ని తొలగించాలని ‘ఫిఫా’ కౌన్సిల్ బ్యూరో శుక్రవారం నిర్ణయించింది. భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. -
భారత మహిళల పోరు షురూ
ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్): మహిళల ప్రపంచకప్ హాకీలో భారత్ పోరాటం నేడు మొదలవుతోంది. ఆదివారం జరిగే తమ పూల్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో మన జట్టు కాంస్య పతకంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇంగ్లండ్ దూరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతికారం తీర్చుకోవాలనే లక్ష్యంతో సవిత సేన బరిలోకి దిగుతోంది. ఒలింపిక్స్‌లోనే కాదు... ప్రపంచకప్‌లోనూ మన అమ్మాయిల అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానమే! ప్రారంభ ప్రపంచకప్ (1974)లోనే కాంస్య పతకం కోసం పోరాడిన భారత్ మళ్లీ ఎప్పుడూ పతకం బరిలో నిలువనే లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సీజన్లో మేటి జట్లయిన బెల్జియం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచిన సవిత సేన ఇదే జోరును ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. సీనియర్, మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గాయంతో అందుబాటులో లేకపోయినప్పటికీ... అనుభవజ్ఞురాలైన సవిత జట్టును చక్కగా నడిపిస్తోంది. వైస్ కెప్టెన్ దీప్ గ్రేస్, గుర్జీత్ కౌర్, ఉదిత, నిక్కీ ప్రధాన్‌లు నిలకడగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై తొలి దెబ్బ కొట్టేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. -
ఫిఫా వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల
ఫిఫా అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 షెడ్యూల్ ఇవాళ (జూన్ 15) అధికారికంగా విడుదలైంది. భారత్ రెండోసారి (2017, 2022) ఆతిధ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం అక్టోబర్ 11 నుంచి ప్రారంభంకానుంది. డబుల్ హెడర్ మ్యాచ్‌లతో అక్టోబర్ 30 వరకు సాగే ఈ క్రీడా వేడుకలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఒడిశా, గోవా, మహారాష్ట్ర వేదికలుగా మొత్తం 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు (24 మ్యాచ్‌లు) అక్టోబర్ 18 వరకు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు (4) అక్టోబర్ 21, 22 తేదీల్లో, సెమీస్ (2) అక్టోబర్ 26వ తేదీన (గోవా), ఫైనల్ మ్యాచ్(నవీ ముంబై) అక్టోబర్ 30న జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడబోయే మూడు మ్యాచ్‌లకు (11, 14, 17) భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా -
India vs England: ప్రతీకారానికి సమయం!
దాదాపు ఐదేళ్ల క్రితం...అద్భుత ఆటతీరుతో భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరింది. నాటి మన ఆటను చూస్తే టైటిల్ ఖాయమనిపించింది. అయితే ఆఖరి మెట్టుపై ఇంగ్లండ్ మన విజయాన్ని అడ్డుకుంది. చివరి వరకు పోరాడినా...మిథాలీ సేన 9 పరుగులతో ఓడి రన్నరప్‌గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాటి మ్యాచ్ తర్వాత ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ముఖాముఖీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సారి ఆధిక్యం ఎవరిదనేది ఆసక్తికరం. మౌంట్ మాంగనీ: వరల్డ్ కప్‌లో ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఇంగ్లండ్‌కంటే భారత్ పరిస్థితే మెరుగ్గా ఉంది. న్యూజిలాండ్ చేతిలో ఓడినా...పాకిస్తాన్, వెస్టిండీస్‌లపై సాధించిన ఘన విజయాలు జట్టును ముందంజలో నిలిపాయి. మరో వైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిన ఆ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వాళ్లిద్దరి ఆటతో... కీలక పోరుకు ముందు ఇద్దరు స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం. విండీస్‌పై వీరిద్దరు శతకాలతో చెలరేగారు. మరో ఇద్దరు కీలక ప్లేయర్లు యస్తిక, రిచా ఘోష్ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా సత్తా చాటాల్సి ఉంది. ఆల్రౌండర్లుగా స్నేహ్ రాణా, దీప్తి శర్మ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. జులన్ అనుభవం, పూజ వస్త్రకర్ పదునైన బౌలింగ్ భారత్‌ను బలంగా మార్చాయి. అయితే అన్నింటికి మించి కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. గత మూడు మ్యాచ్‌లలో కలిపి ఆమె 45 పరుగులే చేయగలిగింది. గెలిపించేదెవరు? ఇంగ్లండ్‌లో పేరుకు అంతా గొప్ప ప్లేయర్లు ఉన్నా జట్టుకు ఒక్క విజయం కూడా అందించలేకపోవడం అనూహ్యం. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఆ జట్టు సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోతాయి. సివర్ ఒక సెంచరీ, బీమాంట్ రెండు అర్ధ సెంచరీలు మినహా ఆ జట్టునుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. హీతర్‌నైట్, డన్‌క్లీ, జోన్స్ తగిన ప్రభావం చూపించలేకపోయారు. బౌలింగ్‌లో కూడా ఎకెల్‌స్టోన్, ష్రబ్సోల్ అంచనాలకు అందుకోలేకపోవడంతో టీమ్ గెలవడం సాధ్యం కాలేదు. ఇలాంటి స్థితిలో ఆ జట్టు భారత్‌ను నిలువరించాలంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. -
Womens World Cup: సాహో స్మృతి, హర్మన్
-
Women WC 2022: ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ రాజ్ అరుదైన రికార్డు..
ICC Women ODI World Cup 2022- Mithali Raj: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్(23 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. కాగా ఐసీసీ మెగా టోర్నీలో 39 ఏళ్ల మిథాలీకి కెప్టెన్‌గా ఇది 24వ మ్యాచ్. అదే విధంగా.. విండీస్‌తో మ్యాచ్ ద్వారా మరో ఘనతను కూడా మిథాలీ తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్ ఆరు ఎడిషన్లలో పాల్గొన్న మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రం మిథాలీ ఆకట్టుకోలేకపోయింది. 11 బంతులు ఎదుర్కొన్న ఆమె 5 పరుగులకే అవుట్ అయి అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చింది. మహిళా వన్డే కప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్లు: మిథాలీ రాజ్- భారత్- 24 బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 23 సుసాన్ గోట్మాన్(న్యూజిలాండ్)- 19 త్రిష్ మెకెల్వీ(న్యూజిలాండ్)- 15 మేరీ పాట్ మూరే(ఐర్లాండ్)- 15 చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ము లేపిన ఆస్ట్రేలియా..
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్(727) రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఇక ఆగ్రస్ధానంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ(742) రేటింగ్‌తో కొనసాగుతోంది. అగ్రస్థానానికి కేవలం 15 రేటింగ్ పాయింట్ల దూరంలో లానింగ్ నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లానింగ్ అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో లానింగ్ 110 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఇక మరో ఆసీస్ క్రికెటర్ రిచెల్ హేయన్స్ ఆరు స్ధానాలు ఎగబాకి ఏడో స్ధానానికి చేరుకుంది. ఆదే విధంగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హైలీ మాథ్యూస్ ఏకంగా 12 స్ధానాలు ఎగబాకి 20వ స్ధానానికి చేరుకుంది. ఇక భారత సారథి మిథాలీ ఒక స్థానం దిగజారి నాలుగో స్ధానంకు చేరుకోగా, ఓపెనర్ మంధాన 10వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా తమ కెరీర్లో అత్యత్తుమ స్ధానాలకు చేరుకున్నారు. ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ జానెసన్ తొలి స్దానంలో ఉండగా, ఇంగ్లండ్ బౌలర్ సోఫియా ఎకిలిస్టన్ రెండో స్ధానానికి చేరుకుంది. కాగా భారత్ నుంచి జూలన్ గో స్వామి తప్ప మిగితా బౌలర్లు ఎవరూ టాప్10లో చోటు దక్కలేదు. జూలన్ గో స్వామి బౌలర్ల విభాగంలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: IPL 2022: పాపం రైనా.. మరోసారి బిగ్ షాక్... కనీసం ఆ అవకాశం కూడా లేదుగా! ↗️ Lanning, Haynes move up in batters list 💪 Ayabonga Khaka soars in bowling chart 🚀 Hayley Matthews makes all-round gains A lot of movements in the latest @MRFWorldwide ICC Women’s ODI Player Rankings update. 📝 https://t.co/MaJswVOBIS pic.twitter.com/ho8J1g652X — ICC (@ICC) March 8, 2022 -
మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు.. తొలి క్రికెటర్‌గా
ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సాధించింది. మౌంట్ మౌన్‌గనుయ్ వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్‌తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ ఎడ్వర్డ్స్‌ల రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేసింది. హాక్లీ, ఎడ్వర్డ్స్ వరుసగా ఐదు ప్రపంచకప్‌ల్లో ఆడారు. ఇక ఆరు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. వరుసగా 1992,1996,1999,2003,2007,2011 ప్రపంచకప్‌లలో భారత తరుపున సచిన్ ఆడారు. చదవండి: Ravindra Jadeja: జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా -
న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ సంచలన విజయం
మౌంట్ మాంగనుయ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ సంచలన విజయంతో బోణీ కొట్టింది. ఆతిథ్య న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 3 పరుగుల తేడాతో గెలిచింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు అవసరంకాగా చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. విండీస్ బౌలర్ డీండ్రా డాటిన్ (0.5–0–2–2) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు న్యూజిలాండ్ ఐదు బంతుల్లో 2 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. కేటీ మార్టిన్ (44), జెస్ కెర్ (25)లను డాటిన్ అవుట్ చేయగా... ఫ్రాన్ జొనాస్ రనౌట్ కావడంతో విండీస్ విజయం ఖాయమైంది. అంతకుముందు విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (119; 16 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ సెంచరీ సాధించింది. చదవండి: Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
ఫామ్‌లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది
మహిళల వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (114 బంతుల్లో 103; 9 ఫోర్లు) సెంచరీ చేయగా, యస్తిక భాటియా (58; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించింది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 244 పరుగులు సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది. గత కొంత కాలంగా ఫామ్‌లో లేకపోయినా హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీ సాధించడం జట్టుకు కలిసొచ్చే వచ్చే అంశం. ఇక ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ ఆమె ఫీల్డ్‌ను వదిలి వెళ్లింది. ఇక ప్రపంచ కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. చదవండి: IND Vs SL:లంక క్రికెటర్లు ప్రయాణించిన బస్సులో బుల్లెట్ల కలకలం -
మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్ తర్వాత..!
భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టీ20లకు మిథాలీ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 4-1తేడాతో ఓటమి చవిచూసింది. అయితే అఖరి వన్డేలో గెలిచి భారత్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో మంధానతో పాటు మిథాలీ, హర్మాన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మిథాలీ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించింది. "ఈ టోర్నమెంట్ తర్వాత నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను.. నా రిటైర్మెంట్ తర్వాత జట్టు యువ క్రికెటర్లతో మరింత బలంగా మారుతుందని భావిస్తున్నాను" అని మిథాలీ పేర్కొంది. ఇప్పటి వరకు 222 వన్డేల్లో భారత తరుపున ఆడిన మిథాలీ రాజ్ 7,516 పరుగులు సాధించింది. తన కేరిర్‌లో 7 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎసరు పెట్టిన హిట్‌మ్యాన్ -
'ప్రపంచకప్‌లో భారత వైస్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్'
న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్- 2022లో భారత జట్టు సత్తా చాటడానికి సిద్దమవుతోంది. అయితే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి చవిచూసింది. ఇక కివీస్ పర్యటనలో పేలవ ప్రదర్శన కనబర్చిన భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా వన్డేల్లో భారత జట్టు వన్డే కెప్టెన్‌గా మిథాలీ రాజ్ ఉండగా.. వైస్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ ఉంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేకు కౌర్ దూరం కావడంతో.. దీప్తి శర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. కాగా తిరిగి ఐదో వన్డేలో జట్టులోకి హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చింది. అయినప్పటికీ దీప్తి శర్మనే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించింది. ఈ నేపథ్యంలో రానున్న ప్రప్రంచకప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ నుంచి తొలిగించనున్నట్లు వార్తలు వినిపించాయి. కాగా ఈ వార్తలపై భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది. రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుందని మిథాలీ రాజ్ సృష్టం చేసింది. "దీప్తి శర్మని చివరి రెండు వన్డేలకు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ ప్రపంచకప్‌లో మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్. యువ క్రికెటర్లకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఇటువంటి పెద్ద టోర్నమెంట్లో ఒత్తిడి తట్టుకోని ఆడాలి. ఒత్తిడితో ఆడితే మీరు ప్రపంచ కప్‌లో అంతగా రాణించకపోవచ్చు" అని వర్చువల్ విలేకరుల సమావేశంలో మిథాలీ పేర్కొంది. ఇక మార్చి 4 నుంచి ఐసీసీ మహిళల ప్రపంచకప్- 2022 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. చదవండి: IND vs SL: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు' -
జెమీమా, శిఖాలపై వేటు.. కెప్టెన్‌గా మిథాలీ రాజ్
ముంబై: భారత మహిళల క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్ వరుసగా మూడో వన్డే వరల్డ్ కప్‌లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో వచ్చే ప్రపంచకప్ బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2017లో మిథాలీ కెప్టెన్సీలోనే ఆడిన టీమ్ హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 9 పరుగులతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మార్చి 4నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. మార్చి 6న తౌరంగాలో జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. అంతకు ముందు టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. పేలవ ఫామ్ కారణంగానే... గత కొంత కాలంగా భారత జట్టులో రెగ్యులర్ సభ్యులుగా ఉన్న బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, పేసర్ శిఖా పాండేలకు జట్టులో చోటు దక్కలేదు. గత ఏడాది ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో జెమీమా ఒక్కసారి కూడా రెండంకెల స్కోరు చేయకపోగా, శిఖా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. టి20ల్లో ఆకట్టుకున్న మేఘనా సింగ్, రేణుకా సింగ్‌లను తొలిసారి వన్డే టీమ్‌లోకి ఎంపిక చేశారు. గత ప్రపంచకప్‌లో ఆడిన పూనమ్ రౌత్‌కు కూడా ఈ సారి స్థానం లభించలేదు. 2021 చాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆంధ్ర ప్లేయర్ సబ్బినేని మేఘనను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు వన్డేలు ఆడని మేఘన 6 టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. జట్టు వివరాలు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తానియా భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్, జులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్. స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ బహదూర్. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2022కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తానియా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్ల లిస్ట్‌లో ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నమెంట్ మార్చి 4న బే ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. ఇక మార్చి 4న భారత్ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా భారత్ ఈసారి టైటిల్ బరిలో హాట్ ఫేవరేట్ దిగనుంది. భారత జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన , షఫాలి వర్మ, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, ఝులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ స్టాండ్‌బై: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్ చదవండి: SA Vs IND: ఎవరీ అల్లావుద్దీన్ పాలేకర్.. భారత్‌తో ఏంటి సంబంధం ? #TeamIndia squad for ICC Women's World Cup 2022 & New Zealand ODIs: Mithali Raj (C), Harmanpreet Kaur (VC), Smriti, Shafali, Yastika, Deepti, Richa Ghosh (WK), Sneh Rana, Jhulan, Pooja, Meghna Singh, Renuka Singh Thakur, Taniya (WK), Rajeshwari, Poonam. #CWC22 #NZvIND pic.twitter.com/UvvDuAp4Jg — BCCI Women (@BCCIWomen) January 6, 2022 -
మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీకి కోనేరు హంపి, హారిక అర్హత
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణులు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అర్హత సాధించారు. ఈ ఇద్దరితోపాటు పద్మిని రౌత్, భక్తి కులకర్ణి భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్, రేటింగ్ ప్రకారం హంపి, హారిక బెర్త్‌లు దక్కించుకోగా... ఆసియా జోనల్ కోటా ద్వారా పద్మిని, భక్తి అర్హత పొందారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం హంపి మూడో ర్యాంక్‌లో, హారిక తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ జూలై 10 నుంచి ఆగస్టు 3 వరకు రష్యాలోని సోచి నగరంలో జరగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారిణుల జాబితాను ‘ఫిడే’ విడుదల చేసింది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఏడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్లో రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఒకవేళ ఇద్దరి మధ్య స్కోర్లు సమం గా నిలిస్తే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
టి20 ప్రపంచకప్‌పై డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలలో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌కు అన్ని రకాలుగా అద్భుత ఆదరణ లభించింది. మెల్బోర్న్ మైదానంలో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఈ టోర్నీ విజయగాథను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చింది. ‘బియాండ్ ద బౌండరీ’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో 17 రోజుల పాటు సాగిన ప్రపంచకప్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. (11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి) ముఖ్యంగా అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ టోర్నీ సమయంలో చేసిన సన్నాహకాలు, నాకౌట్ దశలో చేరడంలో సాగిన వ్యూహ ప్రతివ్యూహాలు వంటి విశేషాలతో ఇది రూపొందింది. తొలిసారి ఒక ఐసీసీ టోర్నీకి అర్హత సాధించిన థాయిలాండ్ జట్టుపై కూడా ప్రత్యేక కథనం ఇందులో కనిపిస్తుంది. ‘100 శాతం క్రికెట్’ పేరుతో తాము మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని సిద్ధం చేసినట్లు ఐసీసీ సీఈఓ మను సాహ్నీ వెల్లడించారు. ఇంగ్లీష్‌తో పాటు మరో ఎనిమిది భాషల్లో సబ్‌టైటిల్స్‌తో శుక్రవారం ఈ డాక్యమెంటరీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రసారమవుతుంది. -
‘న్యూజిలాండ్‌ను సాకుగా చూపడం లేదు’
దుబాయ్: వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల క్రికెట్ వరల్డ్‌కప్‌ను 2022కు వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శల వస్తున్న తరుణంలో ఈ మెగా ఈవెంట్ సీఈవో ఆండ్రియా నెల్సన్ స్పందించారు. మహిళల క్రికెట్‌పై చిన్నచూపు చూడటం కారణంగానే వాయిదా వేశారంటూ పలు దేశాల క్రీడాకారిణులు విమర్శలకు దిగడంపై ఆండ్రియా వివరణ ఇచ్చారు. ‘ మహిళల వరల్డ్‌కప్ వాయిదా వేయడానికి చిన్నచూపు కారణం కాదు. ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా సన్నాహకానికి ఆటంకం ఏర్పడుతుంది. అదే సమయంలో ఇంకా క్వాలిఫయర్స్ రౌండ్ కూడా జరగలేదు. ఇది జూలైలో జరగాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగావాయిదా వేయక తప్పలేదు. అటువంటి తరుణంలో వరల్డ్‌కప్ నిర్వహణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించడం ఈజీ కాదు. దాంతోనే 2022 వాయిదా వేశాం.(2021 భారత్‌లో... 2022 ఆస్ట్రేలియాలో) ఇలా వాయిదా వేయడానికి న్యూజిలాండ్‌లోని భద్రతాపరమైన అంశాలు ఎంతమాత్రం కారణం కాదు. న్యూజిలాండ్‌లో కోవిడ్ కంట్రోల్లోనే ఉంది. వరల్డ్‌లో అతి తక్కువ కేసులు నమోదైన దేశాలలో న్యూజిలాండ్ కూడా ఒకటి. దాంతో కరోనాతో న్యూజిలాండ్‌లో ఇబ్బంది ఉండదు. ఇక్కడ న్యూజిలాండ్‌ను సాకుగా చూపడం లేదు. కానీ క్వాలిఫయర్స్ టోర్నీ ఇంకా జరగలేదు కాబట్టి, ఈ మెగా టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెస్టిండీస్ వంటి ఒక దేశాన్ని చూసుకోండి. వారు ఒక జట్టుగా కలిసి పనిచేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇష్టపడటం లేదు. అటువంటప్పుడు ఒక ఈవెంట్‌కు ప్రిపేర్ కావాలని ఎలా ఆదేశిస్తాం’ అని ఆండ్రియా తెలిపారు. మహిళల వరల్డ్‌కప్‌పై ఐసీసీకి పట్టుదలగా లేకపోవడం కారణంగానే ఇంగ్లండ్ క్రికెట్ సారథి హీథర్‌నైట్ వ్యాఖ్యానించారు. (పాపం మహిళలు...) -
పాపం మహిళలు...
దుబాయ్: ఎన్ని భారీ ప్రకటనలు చేసినా ఐసీసీకి మహిళల క్రికెట్ విషయంలో చిన్నచూపు ఉందనే విషయం మరోసారి రుజువైంది. పురుషుల ప్రపంచకప్ నిర్వహణతో ఏమాత్రం సంబంధం లేని మహిళల వన్డే వరల్డ్ కప్‌ను కూడా అనూహ్యంగా ఏడాది పాటు వాయిదా వేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ 2021 ఫిబ్రవరి 6 – జనవరి 7 మధ్య న్యూజిలాండ్‌లో జరగాల్సి ఉంది. దీనిని ఇప్పుడు ఐసీసీ 2022కు వాయిదా వేసింది. కరోనా సాకు కూడా దీనికి చెప్పే అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువగా కరోనా బారిన పడిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. కివీస్ గడ్డపై గురు, శుక్రవారాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు! అయినా సరే... ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. 2017 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోని సభ్యులు మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కెప్టెన్ మిథాలీరాజ్, జులన్ గోస్వామిలాంటి స్టార్లు ఈ టోర్నీతో విజయవంతమైన కెరీర్లకు ముగింపు పలికేలా కనిపించారు. కానీ తాజా నిర్ణయం ప్రకారం మరో ఏడాది పాటు వీరు జట్టులో కొనసాగుతూ ఆటను, ఫిట్నెస్ను కాపాడుకోవడం అంత సులువు కాదు!. ‘ఎలాంటి పరిస్థితులనుంచైనా సానుకూలంగా తీసుకునే అంశాలు కూడా ఉంటాయి. ఈ విషయంలోనూ అంతే. ప్రణాళికకు, సన్నాహానికి మరింత సమయం దొరికింది. లక్ష్యం మాత్రం అదే వరల్డ్ కప్ 2022’ \మిథాలీ రాజ్, భారత వన్డే కెప్టెన్ -
ఇలా అయితే ఎలా?: పాక్ కెప్టెన్ అసహనం
గయానా: మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఆదివారం భారత్ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు 10 పరుగుల పెనాల్టీ పడిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు నిదా దార్, బిస్మా మరూఫ్‌లు బ్యాటింగ్ చేసే క్రమంలో పదే పదే డేంజర్ ఏరియాలో పరుగెత్తడంతో ఆ జట్టు 10 పరుగుల కోతను ఎదుర్కొంది. అయితే దీనిపై పాక్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ జవిరియా ఖాన్..తమ క్రికెటర్లపై అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ సిల్లీ తప్పిదాలు చేయడాన్ని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా వృత్తిధర్మం కాదంటూ క్లాస్ తీసుకున్నారు. ‘మా క్రికెటర్ల చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేము ఇంకా డేంజర్ ఏరియాలో పరుగెత్తుతూ తప్పులు చేయడం మింగుడు పడటం లేదు. మా జట్టు ఇలా చేయడం తొలిసారేం కాదు.. గతంలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా కూడా మేము ఇవే తప్పిదాలు చేశాం. దీన్ని అధిగమించడంపై మా మహిళా క్రికెటర్లు దృష్టి సారించాల్సి ఉంది. ప్రస్తుతం చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటారనే ఆశిస్తున్నా. మేము అలా పెనాల్టీ బారిన పడకుండా ఉండి ఉంటే ఒక మంచి మ్యాచ్ జరిగేది’ అని జవిరియా ఖాన్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించడంతో భారత్ గెలుపును అందుకుంది. -
టీ20ల్లో వరుసగా 11వ విజయం
గయానా: ఒకవైపు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు విజయాల కోసం ఆపసోపాలు పడుతుంటే, ఆ దేశ మహిళల జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది. మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి(భారతకాలమాన ప్రకారం) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 94 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మహిళలు 9.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించారు. అలైస్సా హీలే(56 నాటౌట్) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో టీ20ల్లో ఆసీస్ మహిళలు వరుసగా 11వ విజయాన్ని రుచిచూశారు. ఫలితంగా వరుసగా పది, అంతకంటే ఎక్కువ విజయాల్ని ఆసీస్ మహిళలు రెండోసారి సాధించినట్లయ్యింది. 2014లో ఆసీస్ మహిళలు వరుసగా 16 విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో అత్యధిక వరుస విజయాల్ని సాధించిన ఘనతను సైతం తన పేరిట లిఖించుకుంది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తున్న ఆసీస్ మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జాబితాలో ఇంగ్లండ్(14) రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్(12) మూడో స్థానంలో కొనసాగుతోంది. -
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం
-
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం
-
బ్యాటింగ్ మొదలవకుండానే 10 పరుగులు
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం సాధించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బంతితో కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో చితక్కొట్టి... గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. ప్రొవిడెన్స్ (గయానా): సొంతగడ్డపై పురుషుల జట్టు వెస్టిండీస్‌ను చిత్తు చేసి సిరీస్ సొంతం చేసుకుంటే... విండీస్ గడ్డపై భారత అమ్మాయిలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పని పట్టారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో హర్మన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే... రెండో మ్యాచ్‌లో వెటరన్ మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు) ఆ బాధ్యత తీసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు), నిదా దార్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/22), హేమలత (2/34) ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరిగెత్తినందుకుగాను పెనాల్టీగా అంపైర్లు భారత జట్టుకు 10 పరుగులు అదనంగా కేటాయించారు. లక్ష్య ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మిథాలీ రాజ్, స్మృతి మంధాన (26; 4 ఫోర్లు), చెలరేగడంతో భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసి గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఆ ఇద్దరే... గత మ్యాచ్ మాదిరిగానే భారత్ ఒకే ఒక్క పేస్ బౌలర్‌తో బరిలో దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (1/24) అయేషా జఫర్ (0) వికెట్ పడగొట్టింది. అనంతరం భారత్ చురుకైన ఫీల్డింగ్‌కు ఉమైమా (3), కెప్టెన్ జవేరియా ఖాన్ (17) రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో పాక్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బిస్మా, నిదా సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. నిదా 15 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను వేద కృష్ణమూర్తి, 29 పరుగుల వద్ద మరో క్యాచ్‌ను పూనమ్ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆమె భారీ షాట్లతో చెలరేగింది. 28 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బిస్మా 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించాక హేమలత వేసిన 19వ ఓవర్ తొలి బంతికి బిస్మా మారూఫ్ పెవిలియన్ చేరింది. మరుసటి బంతికే నిదా దార్ సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నా ఆ వెంటనే ఆమె కూడా వెనుదిరిగింది. చివరి ఓవర్లో పూనమ్ యాదవ్ మరో రెండు వికెట్లు పడగొట్టింది. మిథాలీ మెరుపులు... ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందే భారత్ ఖాతాలో 10 పరుగులు చేరడంతో ఓపెనర్లు మిథాలీ, స్మృతి ధాటిగా ఆడారు. రెండో ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు... నాలుగో ఓవర్లో మిథాలీ రెండు బౌండరీలు కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 48/0తో నిలిచింది. ఎనిమిదో ఓవర్లో మిథాలీ మరో రెండు ఫోర్లు బాది దూకుడు పెంచింది. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాక స్మృతి భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయింది. ఆ తర్వాత ఆచితూచి ఆడిన మిథాలీ... జెమీమా రోడ్రిగ్స్ (16; 1 ఫోర్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 42 బంతుల్లో మిథాలీ అర్ధశతకం పూర్తి చేసుకుంది. విజయానికి 14 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో మిథాలీ వెనుదిరిగినా... వేద (8)తో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14 నాటౌట్; 2 ఫోర్లు) మిగతా పని పూర్తిచేసింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: అయేషా (సి) వేద (బి) అరుంధతి రెడ్డి 0; జవేరియా (రనౌట్) 17; ఉమైమా (రనౌట్) 3; బిస్మా (సి) వేద (బి) హేమలత 53; నిదా దార్ (సి) హర్మన్ (బి) హేమలత 52; ఆలియా (స్టంప్డ్) తాన్యా (బి) పూనమ్ 4; నహిద ఖాన్ (నాటౌట్) 0; సనా (స్టంప్డ్) తాన్యా (బి) పూనమ్ 0; సిద్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–30, 4–123, 5–129, 6–133, 7–133. బౌలింగ్: అరుంధతి రెడ్డి 4–1–24–1, రాధ యాదవ్ 4–0–26–0, దీప్తి శర్మ 4–0–26–0, హేమలత4–0–34–2, పూనమ్ యాదవ్ 4–0–22–2. భారత్ ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ (సి) నిదా (బి) డయాన బేగ్ 56; స్మృతి (సి) ఉమైమా (బి) బిస్మా 26; జెమీమా (సి అండ్ బి) నిదా 16; హర్మన్ (నాటౌట్) 14; వేద (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–73, 2–101, 3–126. బౌలింగ్: డయానా బేగ్ 3–0–19–1, ఆనమ్ 3–0–27–0, సనా మిర్ 4–0–22–0, నిదా 4–0–17–1, ఆలియా 2–0–21–0, బిస్మా మారూఫ్ 3–0–21–1. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాకిస్తాన్ పని పట్టేందుకు!
పొట్టి ఫార్మాట్లో... అందులోనూ ప్రపంచ కప్‌లో ఎలా ఆడుతుందోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది భారత మహిళల జట్టు. పటిష్ఠమైన న్యూజిలాండ్‌ను అలవోకగా మట్టి కరిపించింది. ఇప్పుడు అదే ఊపులో పాకిస్తాన్ పని పట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీ ఫైనల్ దిశగా హర్మన్‌ప్రీత్ బృందం ప్రయాణం మరింత ముందుకు సాగుతుంది. అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు 10 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... రెండింటిలో పాకిస్తాన్ విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో పాక్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారతే నెగ్గడం విశేషం. ప్రావిడెన్స్ (గయానా): దూకుడైన ఆటతో కివీస్ రెక్కలు విరిచిన హర్మన్‌ప్రీత్ సేన... ప్రపంచ కప్ స్థాయికి తగిన ప్రారంభాన్ని అందుకుంది. దీంతోపాటు కావాల్సినంత ఆత్మ విశ్వాసం కూడగట్టుకుంది. ఇక ఆదివారం రెండో లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. బలాబలాల్లో ప్రత్యర్థి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న టీమిండియాకు దాయాదిని మట్టి కరిపించడం ఏమంత కష్టమేం కాదు. అలాగని పాక్‌ను పూర్తిగా తీసిపారేయలేం. 2016 ప్రపంచ కప్‌లో సొంతగడ్డపై భారత్‌ను ఓడించి షాకిచ్చిందా జట్టు. అప్పటిలాగా ఏమరుపాటుగా లేకుంటే టీమిండియా వరుసగా రెండో విజయాన్ని ఖాయం చేసుకోవచ్చు. ఆ ఒక్కటే లోటు... కెప్టెన్ హర్మన్‌ప్రీత్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి... ఇలా ఒకరు కాదంటే ఒకరితో భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. మిథాలీ క్రీజులోకి రాకుండానే భారీ స్కోరు నమోదైందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్‌పై శతకం బాదిన హర్మన్ ఇన్నింగ్స్ ధాటిని, జెమీమా దూకుడును చూస్తే ఎంతటి ప్రత్యర్థికైనా వణుకు పుట్టాల్సిందే. హేమలత దయాలన్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మలతో స్పిన్ విభాగమూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హేమలత కివీస్‌కు కళ్లెం వేసింది. మిగతావారూ తమవంతు పాత్ర పోషించారు. కాకపోతే, పేస్‌లోనే లోటుంది. తొలి మ్యాచ్ ఆడిన జట్టులో ఏకైక పేసర్ తెలుగమ్మాయి అరుంధతిరెడ్డి మాత్రమే. మాన్సి జోషి, పూజ వస్త్రకర్ పెవిలియన్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌కు మాత్రం వీరిద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. విండీస్ పిచ్‌లు నెమ్మదిగా ఉన్నందున భారత స్పిన్‌ను ఎదుర్కొనడం పాక్‌కు సవాలే. ఆ జట్టులో కెప్టెన్ జవేరియా ఖాన్, వెటరన్ స్పిన్నర్ సనా మిర్, ఆల్‌రౌండర్ బిస్మా మరూఫ్‌లు నాణ్యమైన ఆటగాళ్లు. అయితే, స్థిరమైన ప్రదర్శన కనబర్చేవారు లేకపోవడంతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. -
త్వరలో వరల్డ్‌కప్ : స్టార్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ : మరో మూడు నెలల్లో ట్వంటీ20 ప్రపంచ కప్ ఉందనగా భారత స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ జులన్ గోస్వామి ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. భారత తొలి టీ20 జట్టులో సభ్యురాలు జులన్ 12 ఏళ్ల కెరీర్ అనంతరం టీ20ల నుంచి వైదొలిగారు. ఆమె నిర్ణయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. టీ20 జట్టులో తనకు చోటు ఇచ్చి, మద్దతు తెలిపిన అందరికీ జులన్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ప్రపంచ కప్‌లో భారత జట్టు మంచి ఫలితాలు రాబట్టాలని ఆమె ఆకాంక్షించారు. డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్ సొంతగడ్డపై ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో జులన్ రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలాంశమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌గా అరుదైన ఘనతను గోస్వామి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా టెస్టులు ఆడని జులన్.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకండతో కేవలం వన్డేలకే పరిమితం కానున్నారు. కెరీర్లో 68 టీ20 మ్యాచ్‌లాడిన జులన్ 56 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాపై 2012లో తీసిన 5/11 ఆమె టీ20 బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన. బ్యాటింగ్‌లో 46 ఇన్నింగ్స్‌లాడి 405 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 37 నాటౌట్. టీ20ల్లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ సైతం జులనే కావడం విశేషం. జులన్ గోస్వామి.. ది గ్రేట్ -
అనూహ్య పరాజయం
లండన్: మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో తొలి విజయం నమోదు చేయాలనుకున్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది. పూల్ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–1తో బలహీన ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలై నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐర్లాండ్ తరఫున 13వ నిమిషంలో అనా ఫ్లానగన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. తొలి మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసి చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకున్న రాణి రాంపాల్ బృందం రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా చతికిలబడింది. ప్రపంచ 16వ ర్యాంకర్ ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేసిన భారత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలు సాధించిన ఐర్లాండ్ 6 పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంతో నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ (2 పాయింట్లు) రెండో స్థానంలో... భారత్, అమెరికా ఒక్కో పాయింట్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. గతేడాది జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్లోనూ భారత్ 1–2తో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరుగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో అమెరికాతో భారత్ తలపడనుంది. ఏడు పెనాల్టీలు వృథా: మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడే మంత్రంగా ఆడిన ఐర్లాండ్ చివరి వరకు అదే తీవ్రత కొనసాగించి భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభ పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్ అమెరికాను చిత్తుచేసిన ఐర్లాండ్ ఈ మ్యాచ్‌లోనూ ఆసాంతం ఆకట్టుకుంది. మ్యాచ్‌లో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించగా వాటిలో ఏ ఒక్కదాన్ని గోల్‌గా మలచలేకపోయింది. ఫీల్డ్ గోల్స్ అవకాశాలు వచ్చినా ఫినిషింగ్ లోపంతో వాటిని వృథా చేసుకుంది. రెండో క్వార్టర్ చివరి నిమిషంలో భారత స్ట్రయికర్ లీలిమ మింజ్ సునాయాస అవకాశాన్ని చేజార్చింది. ‘డి’ ఏరియాలో అందిన పాస్‌ను నేరుగా గోల్‌కీపర్ చేతుల్లోకి కొట్టి నిరాశపరిచింది. 37వ నిమిషంలో వచ్చిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ అద్భుతంగా కొట్టినా ఐరిష్ గోల్‌కీపర్ కుడివైపుకు దూకుతూ అంతే అద్భుతంగా అడ్డుకుంది. మ్యాచ్ ముగియడానికి మ రో ఆరు నిమిషాల ముందు స్కోరు సమం చేయడానికి భారత్‌కు మరో అవకాశం వచ్చినా కెప్టెన్ రాణి రాంపాల్ దాన్ని గోల్‌గా మలచలేకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. -
జాతీయ శిబిరంలో రజని, సౌందర్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ కప్‌నకు ముందు హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రత్యేక జాతీయ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి జూన్ 9 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించే ఈ శిబిరం కోసం హాకీ ఇండియా 48 మంది సీనియర్ క్రీడాకారిణుల పేర్లను శనివారం ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఎతిమరపు రజని, తెలంగాణ ఫార్వర్డ్ ప్లేయర్ యెండల సౌందర్య కూడా ఉన్నారు. ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత మహిళల హాకీ జట్టు తిరిగి సోమవారం నుంచి శిబిరంలో పాల్గొననుంది. చీఫ్ కోచ్ జోయర్డ్ మరీనే నేతృత్వంలో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకునేందుకు ఈ క్యాంప్‌ను వినియోగించుకుంటాం. దీంతో పాటు మానసికంగా ఇంకా ధృడంగా మారేందుకు కృషిచేస్తాం’ అని కోచ్ తెలిపారు. -
గర్వపడేలా చేశారు
మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ ప్రశంస న్యూఢిల్లీ: మహిళల ప్రపంచకప్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో భారత జట్టు ప్రదర్శన కనబర్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. గురువారం మిథాలీ రాజ్ బృందానికి ప్రధాని ఆతిథ్యం ఇచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళలు ఇటీవల అత్యుత్తమ ఫలి తాలు సాధిస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ జట్టు కూడా ప్రపంచకప్ ఫైనల్ వరకు చేరి అబ్బుర పరిచింది. ఆయా విభాగాల్లో మహిళలు సాధిస్తున్న ఈ పురోగతి దేశానికి మేలు చేస్తుంది’ అని మోదీ తెలిపారు. ఈ భేటీలో ఆయనకు తమ సంతకాలతో కూడిన బ్యాట్‌ను క్రికెటర్లు అందించారు. అంతకుముందు భారత జట్టు గురువారమంతా తీరికలేని షెడ్యూల్‌తో బిజీబిజీగా గడిపింది. క్రీడా, రైల్వే శాఖలతో పాటు బీసీసీఐ ఆధ్వర్యంలో జట్టుకు ఘన సన్మానం జరిగింది. బీసీసీఐ జట్టు సభ్యులకు రూ.50 లక్షల చొప్పున... రైల్వే శాఖ ‘తమ’ క్రికెటర్లకు రూ.13 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. రైల్వేస్ తరఫున ఆడే భారత జట్టులోని 10 మంది క్రికెటర్లకు నేరుగా ప్రమోషన్ కూడా ఇచ్చింది. కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్ ‘బి’ గెజిటెడ్ ర్యాంక్ అయిన చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ (చీఫ్ ఓఎస్)గా ప్రమోషన్ దక్కింది. -
మిథాలీ గ్యాంగ్ క్యాష్ ప్రైజ్ పెంపు!
న్యూఢిల్లీ:మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచిన మిథాలీ రాజ్ గ్యాంగ్ ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అడుగులు వేస్తుంది. వరల్డ్ కప్‌లో పాల్గొన్న 15 మందితో కూడిన భారత మహిళా బృందానికి ప్పటికే తలో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన బీసీసీఐ..మరింత నగదు నజరానాను ఇవ్వాలని యోచిస్తోంది. కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఆ మేరకు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా క్రీడాకారిణుల నగదు నజరాను రూ. 60లక్షలకు పెంచాలనే చూస్తోంది. అదే సమయంలో సహాయక సిబ్బందికి రూ.30 లక్షలను ఇవ్వడానికి బోర్డు పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత్ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మహిళా జట్టుకు, సహాయక సిబ్బందికి నజరానాను పెంచినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని వెస్ట్‌జోన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలు ఆడే మ్యాచ్ ఫీజును కూడా పెంచే యెచనలో్ బీసీసీఐ ఉంది. -
భావితరానికి బాట వేశాం
►మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది ►ఫైనల్లో ఒత్తిడిని అధిగమించలేకపోయాం ►మాకూ ఐపీఎల్ ఉంటే మంచిది ►కెప్టెన్ మిథాలీ రాజ్ మనోగతం ఏమాత్రం అంచనాలు లేకుండా... ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా మహిళల ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత జట్టు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పటిష్ట జట్లనే మట్టికరిపిస్తూ ఏకంగా తుది పోరుకే చేరి ఒక్కసారిగా భారత క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. దీంతో అంతా మహిళల క్రికెట్ గురించే మాట్లాడుకోసాగారు. ఇప్పుడు ఈ పరిణామాలే భవిష్యత్ అద్భుతంగా ఉండేందుకు దోహద పడతాయని కెప్టెన్ మిథాలీ రాజ్ ఆకాంక్షిస్తోంది. లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో విశేషంగా రాణించి తమ జట్టు రాబోయే తరాలకు బాట వేసినట్లు టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. అయితే ఫైనల్లో ఓటమి తీవ్రంగా నిరాశపరిచిందని... కీలకదశలో ఒత్తిడికి లోనుకావడమే దీనికి కారణమని వివరించింది. బిగ్‌బాష్, ఐపీఎల్ తరహా లీగ్‌ల్లో ఆడితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చని ప్రస్తుతం లండన్‌లోనే ఉన్న 34 ఏళ్ల మిథాలీ రాజ్ పేర్కొంది. అలాగే ఈ మెగా టోర్నీలో జట్టు ప్రదర్శన, ఇతర అంశాలపై మిథాలీ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... రాబోయే తరానికి వేదికను ఏర్పాటు చేశాం... మా జట్టు ఆడిన తీరుపై నేను గర్వంగా ఉన్నాను. భారత వర్ధమాన మహిళా క్రికెటర్లకు వీరంతా మంచి వేదికను ఏర్పాటు చేసినట్టుగానే భావిస్తున్నాను. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ద్వారాలు తెరిచినట్టయ్యింది. దీనికి ఎవరికి వారు గర్వపడాల్సిందే. ఒత్తిడిని అధిగమించలేకపోయారు... ఫైనల్‌కు ముందు జట్టులోని ప్రతి ఒక్కరు నెర్వస్‌గా ఉన్నారు. ఇది మా ఓటమికి కారణమయ్యింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న అనుభవం వారికి లేదు. కానీ టోర్నీ అంతా వారు పోరాడిన తీరు మెచ్చుకోదగింది. మహిళల జట్టుకు భవిష్యత్ ఉంది... జట్టులో నాణ్యమైన క్రికెటర్లున్నారు. భారత జట్టుకు మెరుగైన భవిష్యత్ ఉంది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తగ్గించుకుని ఆడితే సరిపోతుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో మేం ఆసీస్ చేతిలో 98 పరుగుల తేడాతో ఓడాం. దాంతో పోలిస్తే ఇప్పటికి మేం చాలా మెరుగుపడినట్టే. టెయిలెండర్లకు బ్యాటింగ్ రావాలి... ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ రౌత్ ఆడిన తీరు అద్భుతం. అయితే వారిద్దరి వికెట్లు పడిన తర్వాత పరిస్థితి మొత్తం తలకిందులైంది. లోయర్ మిడిలార్డర్ బ్యాటింగ్‌పై చాలాకాలంగా ఆందోళన ఉంది. వారి నుంచి కాస్త పరుగులు రావాల్సి ఉంది. టెయిలెండర్లకు బ్యాటింగ్ రావడం కూడా ముఖ్యమే. స్పందన అనూహ్యం... ప్రధాని, మాజీ క్రికెటర్లతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు స్పందించిన తీరు నిజంగా సంతోషాన్నిచ్చింది. కచ్చితంగా మమ్మల్ని చూసి బీసీసీఐ గర్విస్తుంది. లీగ్ దశలో వరుసగా దక్షిణాప్రికా, ఆసీస్ జట్ల చేతిలో ఓడిపోయాక మేము ఫైనల్‌కు వస్తామని ఎవరూ అనుకోలేదు. అయితే మేము కలిసికట్టుగా పోరాడి టైటిల్ పోరుకు అర్హత సాధించాం. ఐపీఎల్, బీబీఎల్ ఉపయోగపడతాయి... స్మృతి, హర్మన్‌ప్రీత్‌లకు బిగ్‌బాష్ లీగ్ అనుభవం బాగా ఉపయోగపడింది. మాలో చాలామందికి అలాంటి లీగ్‌ల్లో ఆడగలిగితే ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో తడబడకుండా ఉండగలరు. నాకైతే మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని అనిపిస్తోంది. మరింత మెరుగ్గా రాణించగలం: జులన్ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఓడి నిరాశపరిచినా మరింత మెరుగ్గా రాణించగల సత్తా భారత జట్టుకు ఉందని పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడింది. ‘టోర్నీ ప్రారంభమైన తొలి రోజున మా జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ను ఓడించిన అనంతరం మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జట్టుగా సమష్టి పోరాటం చేస్తే ఫలితం దక్కుతుందని మేం నమ్మాం. ఈ ప్రయాణాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. ఒక్క ఫైనల్ తప్ప మా ఆటతీరు గర్వించే స్థాయిలోనే ఉంది’ అని గోస్వామి పేర్కొంది. -
'భవిష్యత్ మన మహిళా క్రికెట్‌దే'
న్యూఢిల్లీ:భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్ అద్భుతాల్ని సాధించడం ఖాయమంటున్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్. మహిళల వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్ ను మంత్రి గోయల్ అభినందించారు. మహిళా భారత క్రికెట్ జట్టు కొత్త ఎత్తుల్ని అధిరోహించే సమయం ఎంతో దూరంలో లేదని గోయల్ పేర్కొన్నారు. 'వన్డే వరల్డ్ కప్ లో భారతమాత కూతుళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఫైనల్లో ఓడినా యావత్ భారతావని హృదయాలను వారు గెలుచుకున్నారు. మన మహిళలు తుదిపోరుకు చేరిన క్రమం అద్వితీయం. తుదిపోరులో పోరాడి ఓడారు.. అయినా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇది భారత మహిళా క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తుంది. మన మహిళలకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని గోయల్ పేర్కొన్నారు. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ కప్ టైటిల్ పోరులో భారత మహిళలు 9 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. -
మహిళల ఐపీఎల్‌కు ఇదే సరైన సమయం..
లార్డ్స్: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇదే సరైన సమయమని భారత మహిళల కెప్టెన్ మిథాలీరాజ్ అభిప్రాయపడింది. భారత్ మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని అది మహిళా క్రికెట్‌కు ఆర్థికంగానే కాకుండా ఆట నైపుణ్యాలను పెంపొందిస్తుందని మిథాలీ పేర్కొంది. ఇక భారత మహిళలు ఒత్తిడి తట్టుకోలేకపోయారని దీనికి సరైన కారణం అనుభవం లేకపోవడమనే మిథాలీ పేర్కొంది. భారత మహిళలు రాణించాలంటే ఐపీఎల్ లాంటి లీగ్‌లు ఆడే అవకాశం కల్పించాలని ఈ లేడీ కెప్టెన్ వాపోయింది. ఇంగ్లండ్ మహిళలకు ఇక్విలెంట్ సూపర్ లీగ్, ఆస్ట్రేలియాకు బిగ్ బాష్ లీగ్‌లు ఉన్నాయని ఈ తరహాలోనే భారత్‌లో మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని మిథాలీ అభిప్రాయపడింది. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన స్మృతి మంధన, హర్మన్ ప్రీత్ కౌర్ టోర్నిలో అద్భుతంగా రాణించారని గుర్తు చేస్తూ.. మిగిలిన మహిళలు కూడా లీగ్‌లు ఆడటం ద్వారా అనుభవంతో పాటు ఆటను మెరుగు పరుచుకుంటారని మిథాలీ పేర్కొంది. ఈ లీగ్‌లతో మంచి ప్రాక్టీస్ లభించడంతో పాటు మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుందని మిథాలీ వ్యాఖ్యానించింది. ఇంగ్లండ్ గత రెండు సంవత్సరాల నుంచి ఫ్రోఫెషనల్ మ్యాచ్‌లు ఆడుతున్నారని అది వారికి కలిసొచ్చిందని తెలిపింది. మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావడం మహిళా క్రికెటర్లుగా మేం గర్విస్తున్నామని మిథాలీ సంతోషం వ్యక్తం చేసింది. పూనమ్, కౌర్ పోరాటం అద్భుతమని.. ఆ భాగస్వామ్యాన్ని నిలబెట్టలేకపోయామని వారి ప్రదర్శనను ప్రశంసించింది. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, బీసీసీఐ మహిళల ప్రదర్శన పట్ల సుముఖంగా ఉందని భావిస్తున్నామని మిథాలీ తెలిపింది. -
ఫైనల్లో భారత బౌలర్ల జోరు
లండన్:మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇక్కడ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టైటిల్ పోరులో భారత బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. వరుస విరామాల్లో మూడు ప్రధాన వికెట్లను తీసి ఇంగ్లండ్ ను కష్టాల్లోకి నెట్టారు. తొలి వికెట్ గా విన్ ఫీల్డ్ (24)నిష్ర్కమించగా, రెండో వికెట్ గా బీమాంట్(23) పెవిలియన్ చేరారు. దాంతో 60 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ ను నష్టపోయింది. ఆపై మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ హీథెర్ నైట్(1) అవుటైంది. దాంతో 63 పరుగులకే ఇంగ్లండ్ మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మూడు వికెట్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా, గైక్వాడ్ కు ఒక దక్కింది. తొలి వికెట్ కు బీమాంట్ తో కలిసి 47 పరుగులు జోడించిన తరువాత విన్ ఫీల్డ్.. గ్వైక్వాడ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యింది. ఆపై పూనమ్ యాదవ్ బౌలింగ్ భారీ షాట్ కు యత్నించిన బీమాంట్ సైతం పెవిలియన్ చేరింది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ హీథెర్ నైట్ ఎల్బీ రూపంలో మూడో వికెట్ గా పెవిలియన్ బాట పట్టింది. -
వరల్డ్ కప్ ఫైనల్: టాస్ ఓడిన భారత్
లార్డ్స్:మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న తుదిపోరులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కెప్టెన్ హీథర్ నైట్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ వైపు మొగ్గుచూపింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ కు సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించాలని ఇంగ్లండ్ భావిస్తోంది.అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించి మూల్యం చెల్లించుకుంది. ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 282 లక్ష్యాన్ని నిర్దేశించి విజయం సాధించింది. దాంతో ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లండ్‌లు పోరాటంలో సమఉజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఇరు జట్ల క్రికెటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లూ అదరగొడుతున్నారు. ఫీల్డింగ్‌లో మాత్రం భారత్ కాస్తా వెనుకబడివున్నా... మరీ అంత పేలవంగా లేదు. పైగా ఈ టోర్నీలోనే ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచి శుభారంభం చేసిన మిథాలీ సేన ఇప్పుడు మళ్లీ ఆ జట్టుపైనే గెలిచి ప్రపంచకప్‌తో శుభం కార్డు వేయాలని భావిస్తోంది. మరి ఈసారి భారత మహిళలు వరల్డ్ కప్ గెలిచి కొత్త చరిత్ర సృప్టిసారో లేదో చూడాలి. ఈసారి వదలొద్దు! -
మిథాలీ సేనకు ధోని సందేశం
నేడు మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్ ఇంగ్లండ్ మద్య జరగనుంది. నేపథ్యంలో మహిళల బృందానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కోహ్లీ బృందం ఇది వరకే శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని సైతం శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్లో ఇప్పటి వరకూ రాణించిన జట్టులో మార్పులు చేయెద్దని సూచించాడు. "క్రికెట్ అనేది ఒక ఆట మ్రాతమే. కానీ ఇందులో చాలా భ్రమలు ఉన్నాయని వాటి గురించి తాను చెప్తానని అన్నాడు. తన అనుభవాలను, ముఖ్యమైన అంశాలను ఖచ్చితంగా పంచుకుంటానన్నాడు. ప్రపంచ కప్ మహిళల జట్టు అద్భుతంగా ఆడిందన్నాడు. ఆటలో వత్తడిని ఎదుర్కొనడానికి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని సూచించాడు. పైనల్ గెలవడానికి పరిస్థితులను అన్వయించుకోవాలన్నాడు. ఆటలో గెలుపు ఓటముల గురించి ఆలోచించోద్దన్నాడు. సామర్థ్యానికి తగినట్లు ఆడాలని భారత జట్టుకు సూచించాడు. ఆటగాళ్ల అసాధారణ ఆటతీరే ఇండియాకు ప్రపంచ కప్పును అందిస్తుందని పేర్కొన్నాడు. అది ఒక క్యాచ్, ఒక రనౌట్ చేయడం, అత్యుత్తమ బౌలింగ్ చేయడం, ఒక మంచి ఇన్నింగ్స్ నిర్మించడం వంటివి భారత్‌కు కప్పును అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఆటను ఆటగా ఎంజాయ్ చేయండి. ఈ రోజును చరిత్రలో నిలిచిపోయే రోజుగా మార్చండి' అంటూ ధోని మిథాలీ సేనకు శుభాకంక్షలు తెలిపాడు. -
ఫైనల్‌కు ముందు గాయపడిన క్రికెటర్
లార్డ్స్: మహిళా ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు హర్మన్ ప్రీత్ కౌర్ గాయపడ్డారు. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమె భుజానికి గాయమైంది. దీంతో ఆమె వెంటనే నెట్స్ నుంచి నిష్క్రమించారు. సెమీస్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ను హన్మన్ ప్రీత్ ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. గాయంతో ప్రీత్ ఫైనల్ ఆడటంలేదని వార్తలు వచ్చాయి. దీంతో భారత్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, వీటిని కెప్టెన్ మిథాలీ రాజ్ ఖండించారు. నెట్స్ నుంచి వెళ్లిన ఆమె భుజానికి ఐస్ ప్యాక్ పెట్టుకొని ఉపశమనం పొందారని తెలిపారు. కౌర్ తుదిపోరుకు ఫిట్‌గా ఉంటారని చెప్పారు. ముందు జాగ్రత్త కోసమే ఆమె ఐస్ ప్యాక్ పెట్టుకున్నారని తెలిపారు. -
ఈసారి వదలొద్దు!
♦ కప్ తే ఇండియా... ♦ ఇంగ్లండ్‌తో నేడు మహిళల ప్రపంచకప్ ఫైనల్ ♦ సూపర్ ఫామ్‌లో రెండు జట్లు నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో చివరిసారి భారత్ ఫైనల్ చేరి సరిగ్గా పుష్కర కాలమైంది. 2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా ఈవెంట్లో హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ సారథ్యంలోనే టీమిండియా టైటిల్ పోరుకు చేరింది. అయితే ఆస్ట్రేలియా ధాటికి భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సీన్ కట్ చేస్తే... మళ్లీ ఇప్పుడు ప్రపంచకప్ టైటిల్ కోసం ఇంగ్లండ్‌తో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. నాడు, నేడు మిథాలీనే కెప్టెన్. కానీ ఈసారి మాత్రం ‘కప్’ను వదలొద్దు. ఆతిథ్య జట్టును హడలెత్తించాలని... కొత్త చాంపియన్‌గా అవతరించాలని... కప్‌తో స్వదేశం తిరిగి రావాలని... కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష. తొలి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ అంతిమ సమరంలోనూ అదే జట్టును మళ్లీ మట్టికరిపించాలని ఆశిస్తూ... ఆల్ ది బెస్ట్... టీమిండియా... కప్తే ఇండియా! లండన్: 1983... అంటే ఠక్కున గుర్తొచ్చేది కపిల్ డెవిల్స్ ‘షో’నే. భారత్ క్రికెట్ ప్రగతికది తొలి సోపానం. ఎంత చెప్పుకున్నా... ఏం రాసుకున్నా... ఆ చారిత్రక విక్టరీ ఎప్పటికీ ప్రత్యేకమే. సరిగ్గా ఇప్పుడు కూడా మరో చరిత్రకు మళ్లీ ‘లార్డ్స్’ వేదికైంది. అçప్పుడు పురుషుల జట్టును హీరోలని చేస్తే... ఇప్పుడు మహిళల జట్టును ‘క్వీన్స్’గా చేస్తుందేమో వేచి చూడాలి. అదే జరిగితే లార్డ్స్... వన్డే ప్రపంచకప్‌ల్లో ‘నాయక నాయిక’ (కపిల్, మిథాలీ)లను అందించిన స్టేడియంగా భారత క్రికెట్లో చిరకాలం నిలిచిపోతుంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన 2005లో రన్నరప్. అప్పుడు ఆడిన జట్టులో మిథాలీ, జులన్ గోస్వామి మాత్రమే సభ్యులు. మిగతా వారికి ఇదే తొలి ఫైనల్. అయినా పోరాటపటిమలో అందరూ ఆకట్టుకుంటు న్నారు. దీంతో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర పోరు జరగనుంది. ఢీ అంటే ఢీ... ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లండ్‌లు పోరాటంలో సమఉజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఇరు జట్ల క్రికెటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లూ అదరగొడుతున్నారు. ఫీల్డింగ్‌లో మాత్రం భారత్ కాస్తా వెనుకబడివున్నా... మరీ అంత పేలవంగా లేదు. పైగా ఈ టోర్నీలోనే ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచి శుభారంభం చేసిన మిథాలీ సేన ఇప్పుడు మళ్లీ ఆ జట్టుపైనే గెలిచి ప్రపంచకప్‌తో శుభం కార్డు వేయాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అందరికంటే స్థిరంగా ఆడుతోంది. 392 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నప్పటికీ... ఎలీస్ పెర్రీ (ఆస్ట్రేలియా–404 పరుగులు)ని అధిగమించేందుకు కేవలం ఆమె 12 పరుగుల దూరంలోనే ఉంది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో లీగ్ మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో తెగువ చూపింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో, సెమీస్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై చరిత్రకెక్కే అజేయ భారీ సెంచరీతో అదరగొట్టింది. నెట్స్‌లో ఆమె గాయపడినట్లు జట్టు వర్గాలు తెలిపాయి. కానీ కంగారు పడాల్సిన పనిలేదని మిథాలీ స్పష్టం చేసింది. ఫామ్ కోల్పోయిన ఓపెనర్ స్మృతి మంధన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పైనే 90 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై తన ప్రదర్శనను పునరావృతం చేస్తే భారత్‌కు ఢోకా ఉండదు. వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్‌లు కూడా మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసివచ్చే అంశం. బౌలింగ్‌లో దీప్తి శర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండేలు నిలకడగా రాణిస్తున్నారు. ఆల్‌రౌండ్ టీమ్ ఇంగ్లండ్... ఇంగ్లండ్ ఈ టోర్నీలో ఒకే ఒక్కసారి అది కూడా భారత్ చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడింది. ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. బ్యాటింగ్‌లో టామీ బీమోంట్ (387 పరుగులు), కెప్టెన్ హీథెర్ నైట్ (363), సారా టేలర్ (351) అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. అజేయ విజయాలకు వీరి ఇన్నింగ్స్‌లే వెన్నెముకగా నిలిచాయి. ఇక బౌలింగ్‌లో అలెక్స్ హార్ట్లీ, హీథెర్ నైట్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో మ్యాచ్ చివరిదాకా సాగినా... ఒత్తిడి లేకుండా గెలిచింది ఆల్‌రౌండ్ నైపుణ్యంతోనే. ఫీల్డింగ్‌లో భారత్‌కంటే ఇంగ్లండే మెరుగ్గా ఉంది. జట్లు (అంచనా): భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), పూనమ్ రౌత్, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ, వేద కృష్ణమూర్తి, సుష్మా వర్మ, శిఖాపాండే, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్/ఏక్తా బిష్త్. ఇంగ్లండ్: హీథెర్ నైట్ (కెప్టెన్), బీమోంట్, లారెన్ విన్ఫీల్డ్, సారా టేలర్, నటాలీ సైవర్, ఫ్రాన్ విల్సన్, బ్రంట్, జెన్నీ గన్, లౌరా మార్‡్ష, ష్రబ్సోల్, అలెక్స్ హార్ట్లీ. ముఖాముఖి భారత్‌పై ఇంగ్లండ్‌దే పైచేయి. ఓవరాల్‌గా ఇరు జట్లు ఇప్పటివరకు 62 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 26 మ్యాచ్‌లు గెలిస్తే... ఇంగ్లండ్ 34 విజయాలు సాధించింది. రెండింటిలో ఫలితం రాలేదు. భారత్ అత్యధిక స్కోరు 281 అయితే, ఇంగ్లండ్ అత్యధిక స్కోరు 272. ఇక ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా... భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచాయి. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా... చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. పిచ్, వాతావరణం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. చిరుజల్లులు కురిసే అవకాశముంది. కానీ మ్యాచ్‌ను ప్రభావితం చేసేంత వాన ముప్పయితే లేదు. పైగా రిజర్వ్ డే (24, సోమవారం) కూడా ఉంది. ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని సభ్యులందరికీ రూ. 50 లక్షల చొప్పున... సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని తెలిపింది. 1 కెప్టెన్ హోదాలో రెండోసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్ మిథాలీ రాజ్. ‘మెగా’ చరిత్రలో... భారత్ ఒకసారి (2005లో) ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ మాత్రం 3 సార్లు (1973, 1993, 2009) విజేతగా గెలిచింది. హౌస్‌ఫుల్... నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ మ్యాచ్‌ను లార్డ్స్ మైదానంలో ప్రత్యక్షంగా 26,500 మంది ప్రేక్షకులు తిలకించనున్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య డెర్బీ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్ కూడా హౌస్‌ఫుల్ అయింది. అయితే డెర్బీ గ్రౌండ్లో ప్రేక్షకుల సామర్థ్యం 3,100 మాత్రమే. భారత్‌తో ఆరంభమ్యాచ్‌లో ఓడాం. వారితో ఇప్పుడు ఆడేది ఈ జట్టే అయినా... టోర్నమెంట్ జరుగుతున్న కొద్దీ మెరుగయ్యాం. మా వాళ్లంతా టచ్‌లోకి వచ్చారు. ఒకటో నంబర్ నుంచి 11వ నంబర్ వరకు అందరూ ఫామ్‌లోకి వచ్చారు. ఇలాంటి జట్టుకు సారథ్యం వహించడం ఆనందంగా ఉంది. – హీథెర్ నైట్ (ఇంగ్లండ్ కెప్టెన్) ఒత్తిడిని ఎదుర్కోవడమే అసలైన సవాల్. క్లిష్టమైన ఓవర్లలో ఎవరైనా కుదురుగా నిలబడితే... అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కీలక మలుపు అవుతుంది. మా వాళ్లలో ఒకరిద్దరికి మినహా అందరికీ ఇదే తొలి ఫైనల్ అయినా... కంగారేమీ లేదు. సవాళ్లకు సిద్ధంగా ఉన్నారంతా. 2005లో తలపడిన జట్టుకు ఈ జట్టుకు పోలికేలేదు. ఈసారి తప్పకుండా రాణిస్తాం. – మిథాలీరాజ్ (భారత కెప్టెన్) మిథాలీ సేనకు అర్జున్ బౌలింగ్ లండన్: వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటలో ఉన్న భారత మహిళల జట్టుకు అనుకోని అతిథి బౌలింగ్ చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ శనివారం ‘స్పెషల్’ నెట్స్ బౌలర్‌గా మారాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన ఈ జూనియర్ టెండూల్కర్ లార్డ్స్ గ్రౌండ్లో కఠోరంగా చెమటోడ్చుతున్న భారత మహిళల జట్టుకు బౌలింగ్ చేశాడు. పలువురు బ్యాట్స్‌మెన్ అతని పేస్ బౌలింగ్‌లో చక్కగా ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా హిట్టర్ వేద కృష్ణమూర్తి... అర్జున్ బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టింది. నెట్స్ బౌలర్‌గా అర్జున్‌కు ఇదేం కొత్తకాదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు కూడా ఇంగ్లండ్ పురుషుల జట్టుకు ఉత్సాహంగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అర్జున్ లార్డ్స్ మైదానంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో శిక్షణ తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్షప్రసారం -
'హర్మన్ కు అతడే ఆదర్శం'
చండీగఢ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని భారత్ ను ఫైనల్ కు చేర్చిన హర్మన్ ప్రీత్ కు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆదర్శమట. తన క్రికెట్ కెరీర్ లో డాషింగ్ ఓపెనర్ పేరుగాంచిన సెహ్వాన్ ను బ్యాటింగ్ ఐడల్ గా తీసుకునే హర్మన్ పెరిగిందని ఆమె సోదరి హెమ్జిత్ తెలిపారు. 'హర్మన్ బాల్యం నుంచి చూస్తే బాయ్స్ తోనే ఎక్కువగా క్రికెట్ ఆడేది. ఎప్పుడూ పరుగుల కోసం పరితపిస్తూ స్ట్రైక్ రేట్ ను మెరుగ్గా ఉంచుకునేది. హర్మన్ ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటుంది. ప్రధానంగా ఆన్ ఫీల్డ్ లో విరాట్ కోహ్లి తరహాలో దూకుడును ప్రదర్శిస్తుంటుంది. ఆఫ్ ఫీల్డ్ లో కూల్ అండ్ కామ్. ఆమె ఆరాధ్య క్రికెటర్ సెహ్వాగే. సెహ్వాగ్ ఆటను ఎక్కువగా ఆస్వాదించేది. ఇక హర్మన్ రోల్ మోడల్ విషయానికొస్తే తండ్రి హర్మందర్ సింగ్. మా నాన్నే హర్మన్ తొలి కోచ్. మా నాన్న మంచి క్రికెటర్. కానీ ఇబ్బందులు కారణంగా గేమ్ లో ముందుకువెళ్లలేకపోయారు. అతని కల హర్మన్ ప్రీత్ రూపంలో నిజమైంది' అని హెమ్జిత్ అన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ ధనాధన్ ఆటతో ఇండియా టీమ్ ఫైనల్లోకి దూసుకెళడంతో పంజాబ్‌లోని మోగాలో కౌర్ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా హెమ్జిత్ మీడియాతో మాట్లాడారు. -
'వారితో ఫైనల్ ఈజీ కాదు'
డెర్బీ: అద్భుత ప్రదర్శనతో మహిళా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి ఆనందంలో ఉన్న భారత జట్టు సభ్యులను కెప్టెన్ మిథాలీ రాజ్ హెచ్చరించింది. ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ ను అంత తేలికగ్గా తీసుకోవద్దని ముందుగానే జట్టు సభ్యులకు స్పష్టం చేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జాగ్రత్తగా ఉండాలని.. ఆచితూచి ఆడాలని సహచరులకు సూచించింది. ఆదివారం లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. భారత మహిళా జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఇది రోండోసారి. గతంలోనూ మిథాలీ రాజ్ నేతృత్వంలో ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. ఈ సారి ఎలాగైన కప్పు గెలవాలనే కృత నిశ్చయంతో ఉంది. రెండో సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్‌కౌర్ అద్వితీయ ఇన్నింగ్స్‌తో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన అనంతరం మిథాలీ రాజ్ మీడియాతోమాట్లాడింది. ‘ప్రపంచకప్ ఫైనల్లో భాగమవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులందరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో(2005) నా నాయకత్వంలో తొలిసారి భారత జట్టు ఫైనల్‌కి చేరింది. మళ్లీ ఇప్పుడు నా సారథ్యంలోనే ఫైనల్‌కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించాం. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు అనూహ్యరీతిలో పుంజుకొని ఫైనల్‌కు చేరింది. అలాంటి జట్టుతో ఫైనల్లో తలపడటం సులభం కాదు. అది సొంతగడ్డపై మరీ కష్టం. ఫైనల్లో ఇరుజట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని’ మిథాలీ తెలిపారు. -
హర్మన్ ప్రీత్ కౌర్ 'నంబర్ వన్' ఆట
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయం... సెమీఫైనల్లో ఆద్యంతం అద్భుతంగా ఆడిన మిథాలీ సేన ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇది మిథాలీ సేనకు అపూర్వమైన విజయం. హార్డ్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్(171 నాటౌట్;115 బంతుల్లో 20 ఫోర్లు, ఏడు సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడి ఆస్ట్రేలియాను కోలుకోనీయకుండా చేసింది.వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆపై ఆసీస్ ను 40.1 ఓవర్లలో 245 పరుగులకు కట్టడి చేసి ఆదివారం ఇంగ్లండ్ తో జరిగే తుది పోరుకు భారత్ అర్హత సాధించింది. విశేషాలు.. మహిళా ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వారి జాబితాలో హర్మన్ ప్రీత్ కౌరే 'నంబర్ వన్'. సెమీస్ లో ఆస్ట్రేలియాపై కౌర్ అజేయంగా సాధించిన 171 పరుగులే భారత్ తరపున అత్యధికం. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోరు జాబితాలో హర్మన్ ప్రీత్ కౌర్ ఐదో స్థానం సాధించింది. ఆసీస్ క్రీడాకారిణి బెలిండా క్లార్క్(229నాటౌట్) తొలి స్థానంలో, భారత క్రీడాకారిణి దీప్తిశర్మ(188) రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకూ చూస్తే ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక క్రీడాకారిణి చమారి ఆటపట్టు(178 నాటౌట్) ముందంజలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆటపట్టు అత్యధిక స్కోరు సాధించింది. టీమిండియా ఫైనల్ కు చేరడం రెండో సారి. రెండుసార్లు మిథాలీ నేతృత్వంలోనే భారత్ ఫైనల్ కు చేరడం విశేషం. 2005 లో మిథాలీ కెప్టెన్సీలో భారత్ తుది పోరుకు చేరింది. ఇప్పటివరకూ జరిగిన 11 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ మహిళలు ఫైనల్ కు చేరకపోవడం మూడోసారి మాత్రమే. అంతకుముందు 1993,2009ల్లో ఆసీసీ ఫైనల్ కు అర్హత సాధించలేదు. ఆసీస్ ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ ను అందుకోగా, రెండుసార్లు రన్నరప్ గా నిలిచింది. -
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్
-
రెండో సెమీస్‌కు వర్షం అడ్డంకి
డెర్బీ: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరగాల్సిన ఉన్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. డెర్బీలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒకవేళ వరుణుడు తెరిపిస్తే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాని పక్షంలో రిజర్వ్ డే అయిన శుక్రవారం మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నసంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ గెలిచి తుది బెర్తును ఖాయం చేసుకుంది.ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సెమీస్‌లో విజేతతో ఇంగ్లండ్ తలపడనుంది. -
మరో ‘అద్భుతం’ జరిగేనా!
►నేడు మహిళల ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ ►ఆస్ట్రేలియాతో భారత్ ‘ఢీ’ ∙సంచలనంపై మిథాలీ సేన దృష్టి ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఆరుసార్లు చాంపియన్ అయితే భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ వరకు చేరగలిగింది.ఏం ఫర్వాలేదు, మరోసారి ఫైనల్ చేరగల సామర్థ్యం మన ఈ జట్టుకు ఉంది. ఇరు జట్ల మధ్య 42 మ్యాచ్‌లు జరిగితే, భారత్ 34 ఓడి, 8 మాత్రమే గెలిచింది. ఆందోళన అనవసరం, క్రికెట్లో రికార్డులు తిరగరాయడం అసాధ్యమేమీ కాదు! లీగ్ దశ ఆరంభంలో చెలరేగి ఆ తర్వాత తడబడ్డా... న్యూజిలాండ్‌పై అద్భుత విజయం మన మహిళల జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అదే స్ఫూర్తితో ఆసీస్‌పై అద్భుతంగా ఆడి మనోళ్లు తుది పోరుకు అర్హత సాధిస్తారా? తన చివరి వరల్డ్ కప్ ఆడుతున్న కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఇతర సభ్యులు కూడా తమ కెరీర్లో మరో సంచలన విజయంలో భాగమవుతారా? డెర్బీ: మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముఖాముఖి రికార్డు, టోర్నీ లీగ్ దశలో అదే జట్టు చేతిలో పరాజయం భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నా... అచ్చొచ్చిన మైదానంలో అనూహ్య ఫలితం సాధించగల సత్తా కూడా ‘ఉమెన్ ఇన్ బ్లూ’కు ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2005 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది. లీగ్ దశలో భారత్ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మంధన ఫామ్‌పై ఆందోళన... కఠినమైన ప్రత్యర్థే అయినా భారత బ్యాట్స్‌మెన్ తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తే భారత్ భారీస్కోరుకు అవకాశం ఉంటుంది. మరోసారి మిథాలీ రాజ్‌పై భారత్ ఆధార పడుతోంది. జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్న మిథాలీ, ఆసీస్‌తో గత మ్యాచ్‌లో మరీ నెమ్మదిగా ఆడి విమర్శలపాలైంది. దానిని సరిదిద్దుకునేందుకు ఆమెకు ఇది మంచి అవకాశం. అయితే రాజ్కంటే స్మృతి మంధన ఫామ్ భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్‌లలో 90, 106 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వరుసగా 2, 8, 4, 3, 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్‌లో ఆమె చెలరేగడం అవసరం. ఆసీస్‌పైనే సెంచరీ చేసిన పూనమ్ రౌత్ మరో భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టింది. హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మల సహకారం కూడా జట్టు ముందంజ వేయడంలో ఉపయోగపడింది. వీరంతా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ కీలకం కానుంది. న్యూజిలాండ్‌పై ఆమె ఒంటిచేత్తో విజయం అందించింది. 2016 ఫిబ్రవరిలో భారత్ ఆఖరిసారి ఆసీస్‌ను ఓడించినప్పుడు రాజేశ్వరి 2 కీలక వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్లు జులన్, శిఖా పాండే మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. లానింగ్ ఫిట్... జట్టులో 9వ స్థానం వరకు కూడా బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు ఉండటం ఆస్ట్రేలియా ప్రధాన బలం. టోర్నీలో సంయుక్తంగా ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు సాధించిన ఓపెనర్లు బెథ్ మూనీ, నికోల్ బోల్టన్ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఎలీస్ పెర్రీ అద్భుత ప్రదర్శన ఆసీస్‌ను దూసుకుపోయేలా చేస్తోంది. టోర్నీలో 366 పరుగులు చేయడంతో పాటు ఆమె 9 వికెట్లు కూడా పడగొట్టింది. భుజం గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ లానింగ్ కోలుకొని తిరిగి వస్తుండటం ఆసీస్ బలాన్ని పెంచింది. ఆసీస్ స్పిన్నర్లు జొనాసెన్, ఆష్లీ, బీమ్స్ కలిసి మొత్తం 27 వికెట్లు పడగొట్టడం విశేషం. అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాల్సి ఉంటుంది. ఈ మైదానం మాకు సొంత మైదానంలాంటిది కావడం సానుకూలాంశం. ఆస్ట్రేలియా చాలా పటిష్టమైన జట్టు. వారిని ఓడిస్తే ఒక అద్భుతమే అవుతుంది. మాకు సంబంధించి ఇది చాలా పెద్ద మ్యాచ్. అయితే గతంలో ఈ తరహా ఒత్తిడితో కూడిన అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం మా జట్టులో చాలా మందికి ఉంది. పరిస్థితులను బట్టి ఆడటం ముఖ్యం. గెలవాలంటే మా జట్టు సహచరులందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. –మిథాలీ రాజ్, భారత కెప్టెన్ ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ మొదలు టోర్నీ ఆసాంతం ఆ జట్టు ఆటలో దూకుడు ఎక్కువగా కనిపించింది. అయితే మా సామర్థ్యానికి తగినట్లుగా, ప్రణాళికకు అనుగుణంగా ఆడటం ముఖ్యం. మ్యాచ్ వేదిక ఏమిటనేది పట్టించుకోవడం అనవసరం. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రూపొందించుకుంటాం. వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆట మమ్మల్ని ఆకట్టుకుంది. – అలెక్స్ బ్లాక్వెల్, ఆసీస్ వైస్ కెప్టెన్ తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), మూనీ, బోల్టన్, ఎలీస్ పెర్రీ, విలాని, బ్లాక్వెల్, హీలీ, ఆష్లీ గార్డ్నర్, జొనాసెన్, మెగాన్ షుట్, క్రిస్టన్ బీమ్స్ పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్. అయితే స్పిన్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే వేదిక. ఇక్కడ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలవగా, ఆసీస్ మొదటిసారి ఇక్కడ బరిలోకి దిగుతోంది. ఈ గ్రౌండ్లో భారత్ స్పిన్నర్లు 24 వికెట్లు పడగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసి 275 పరుగుల వరకు స్కోరు సాధిస్తే విజయావకాశాలు ఉంటాయి. వర్షం వల్ల మ్యాచ్‌కు ముప్పు లేదు. ► మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
వన్డేల్లో మిథాలీ రాజ్ రికార్డు
జాతీయం జంతువధ నిషేధంపై స్టే కొనసాగింపు జంతువధను నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు జూలై 10న నిర్ణయం తీసుకుంది. ఎద్దులు, దున్నపోతులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, కోడెలు, దూడలు తదితరాలను మాంసం, మతావసరాల కోసం వధించడాన్ని లేదా విక్రయించడాన్ని కేంద్రం నిషేధించింది. అయితే కేంద్రం చర్యపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు సైతం మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. అనిశ్చితి కారణంగా ప్రజల జీవనాధారానికి ఇబ్బంది కలగరాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు. జూన్‌లో 0.90 శాతంగా నమోదైన టోకు ద్రవ్యోల్బణం కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 8 నెలల కనిష్టానికి చేరింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.90 శాతంగా నమోదైంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగావెంకయ్యనాయుడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి అధికార పక్ష అభ్యర్థిగా జూలై 18న నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికవ్వడంతో ఆయన వద్ద ఉన్న సమాచార, ప్రసార శాఖను స్మృతి ఇరానీకి, పట్టణాభివృద్ధి శాఖను నరేంద్రసింగ్ తోమర్‌కు అప్పగించారు. కాగా, ఉప రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ కూడా జూలై 18నే నామినేషన్ దాఖలు చేశారు. అంతర్జాతీయం ఖతార్‌తో అమెరికా ఉగ్ర వ్యతిరేక ఒప్పందం ఖతార్‌తో అమెరికా జూలై 11న ఉగ్రవాద వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకుంది. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపిస్తూ నాలుగు అరబ్ దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా తాజా ఒప్పందం కుదుర్చుకుంది. మానవ అక్రమ రవాణాలో ముందున్న చైనా ప్రపంచంలో అత్యధికంగా మానవుల అక్రమ రవాణా చైనాలో జరుగుతోందని అమెరికా పేర్కొంది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో జూలై 10న వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది అక్రమ రవాణా అయ్యారని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం తెలిపింది. అంటార్కిటికాలో బద్ధలైన భారీ ఐస్‌బర్గ్ అంటార్కిటికాలో అత్యంత భారీ పరిమాణంలోని ఐస్‌బర్గ్ బద్ధలైంది. జూలై 10–13 మధ్య ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు అంటార్కిటికాలో జరిగే మార్పులను పర్యవేక్షిస్తున్న స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 5,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ‘లార్సెన్ సి’ అనే మంచు పలక ప్రధాన విభాగం నుంచి విడిపోయింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో స్వీడన్ ఫస్ట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దేశాల జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 157 దేశాల్లో 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించి రూపొందించిన ఈ జాబితాలో భారత్‌కు 116వ స్థానం దక్కింది. రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఫిన్లాండ్ ఉన్నాయి. కాగా 58.1 పాయింట్లతో భారత్.. నేపాల్, శ్రీలంక, భూటాన్, చైనాల కంటే దిగువన ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి సౌరశక్తి రైలు ప్రారంభం సౌరశక్తిని ఉపయోగించుకొని నడిచే తొలి డీఈఎంయూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలును ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్లో రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు జూలై 14న ప్రారంభించారు. ఈ రైలు బోగీల్లోని విద్యుద్దీపాలు, ఫ్యాన్లు, సమాచార ప్రదర్శక వ్యవస్థలకు అవసరమైన విద్యుత్.. సౌరశక్తి ద్వారా అందుతుంది. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేశారు. కజకిస్థాన్‌లో యురేనియం బ్యాంక్ కజకిస్థాన్‌లోని ఒస్కెమెన్ నగరంలో యురేనియం బ్యాంకును ఏర్పాటుచేయాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) జూలై 10న నిర్ణయించింది. అణు రియాక్టర్లలో వాడే యురేనియంను సోవియట్ యూనియన్ కాలం నాటి కర్మాగారంలో భద్రపరచనున్నారు. ఈ బ్యాంకు నుంచి ఐఏఈఏ సభ్యదేశాలు మార్కెట్ ధరకు యురేనియంను పొందవచ్చు. అసాధారణ పరిస్థితుల్లో తమ అణుకర్మాగారాలకు ఇంధన సరఫరా ఆగిపోయినప్పుడు ఆయా దేశాలకు ఇది ఉపయోగపడుతుందని ఐఏఈఏ పేర్కొంది. గెలాక్సీల సమూహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు భారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల సమూహాన్ని గుర్తించారు. సుమారు 20 బిలియన్ సూర్యుళ్లకు సమానమైన దీనికి ‘సరస్వతి’ అని నామకరణం చేసినట్లు పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ ఆస్ట్రోఫిజిక్స్ వెల్లడించింది. సమీప విశ్వాంతరాళాల్లో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీల్లో ఇదొకటని, 10 బిలియన్ ఏళ్లున్న ఈ సమూహం భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పేర్కొంది. క్రీడలు వన్డేల్లో మిథాలీ రాజ్ రికార్డు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా జూలై 12న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆమె ఈ రికార్డును సాధించింది. మిథాలీ 183 వన్డేల్లో 6,028 పరుగులు సాధించి.. 5,992 పరుగులతో చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్ నెగ్గిన హామిల్టన్ ఫార్ములావన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగోసారి సొంతం చేసుకున్నాడు. సిల్వర్‌స్టోన్(బ్రిటన్) లో జూలై 16న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, వాల్టేరి బొట్టాస్ రెండో స్థానం సాధించాడు. విక్టోరియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న హరీందర్ భారత స్క్వాష్ ఆటగాడు హరీందర్ పాల్ సంధు విక్టోరియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. మెల్బోర్న్లో జూలై 16న జరిగిన ఫైనల్లో రెక్స్ హెడ్రిక్(ఆస్ట్రేలియా)పై హరీందర్ గెలుపొందాడు. 8వ సారి వింబుల్డన్ నెగ్గిన ఫెదరర్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. లండన్‌లో జూలై 16న జరిగిన ఫైనల్లో మారిన్ సిలిక్ (క్రొయేషియా) ను ఓడించి ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలిచిన ఫెదరర్‌కు రూ 18.53 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. కాగా, ఫెదరర్‌కు కెరీర్లో ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 35 ఏళ్ల ఫెదరర్ వింబుల్డన్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డుకెక్కాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను గార్బిన్ ముగురుజా (స్పెయిన్) గెలుచుకోగా, మహిళల డబుల్స్ టైటిల్‌ను ఎకటేరినా మకరోవా–ఎలెనా వెస్నినా(రష్యా) జోడీ, పురుషుల డబుల్స్ టైటిల్‌ను లుకాజ్ కుబోట్–మర్సెలో మీలో జోడీ కైవసం చేసుకుంది. వార్తల్లో వ్యక్తులు యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా లిల్లీ సింగ్ భారత సంతతికి చెందిన లిల్లీ సింగ్.. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీలో జూలై 15న ‘యూత్ ఫర్ ఛేంజ్’ పేరుతో యూనిసెఫ్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జియావోబో మృతి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త లియు జియావోబో అనారోగ్యంతో జూలై 13న షెన్యాంగ్లో మరణించారు. చైనాలో అత్యంత ప్రముఖ రాజకీయ ఖైదీ అయిన జియావోబో.. ఆ దేశ రాజకీయ వ్యవస్థలో సంస్కరణలు, మానవ హక్కుల కోసం పోరాడారు. ఆయనకు 2009లో 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2010లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. గణిత మేధావి మిర్జాఖానీ మృతి గణితశాస్త్ర ప్రావీణ్యురాలు, ఇరాన్ సంతతికి చెందిన మరియమ్ మిర్జాఖానీ(40).. కేన్సర్‌తో బాధపడుతూ జూలై 14న అమెరికాలో మరణించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె గణితంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఫీల్డ్స్ మెడల్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందారు. సిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి మృతి సిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి (77) జూలై 15న ఢిల్లీలో మరణించారు. ఆయన తొలిసారి 1979లో, తర్వాత 1984, 1989లో సిక్కిం సీఎంగా ఎన్నికయ్యారు. -
మిథాలీ సేన బ్యాటింగ్
డెర్బీ:మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బేట్స్ భారత్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత రెండు మ్యాచ్‌ల పరాభవం భారత మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచినప్పటికీ నాకౌట్ చేరాలంటే న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ ఆర్డర్ తిరిగి గాడిన పడితేనే కివీస్‌ను పడేయొచ్చు. లేదంటే టీమిండియాకు మరోసారి లీగ్ దశతోనే ప్రపంచ కప్ ముచ్చట ముగుస్తుంది. ఒకవేళ వరుణుడు కరుణించి మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. మహిళల ప్రపంచకప్‌లో ఇంకా లీగ్ దశ ముగియలేదు.. కానీ భారత్ మాత్రం నాకౌట్‌కు ముందే నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణా ఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరా యి. దీంతో మిగిలున్న ఒక బెర్త్ కోసం భారత్, కివీస్‌లు హోరాహోరీ పోరుకు సై అంటున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో 8, న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లున్నాయి. వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే మాత్రం రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ 9 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. -
ఆసీస్‌ను పడగొడతారా?
ప్రపంచకప్‌లో నేడు భారత మహిళల కీలక పోరు బ్రిస్టల్: మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్ అవకాశాలను పటిష్ట పరుచుకునేందుకు భారత జట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. తమ అప్రతిహత విజయాలకు దక్షిణాఫ్రికా అడ్డుకట్ట వేసిన అనంతరం నేడు పటిష్టమైన ఆస్ట్రేలియాతో మిథాలీ సేన తలపడనుంది.వరుసగా నాలుగు విజయాల అనంతరం ఎదురైన ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోయి తిరిగి గెలుపుబాట పట్టాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సరిగ్గా భారత్‌లాంటి పరిస్థితే ఆసీస్‌కు ఉంది. ఈ జట్టు కూడా వరుసగా నాలుగు విజయాలు సాధించినా తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భంగపడింది. దీంతో ఈ రెండు జట్లు వీలైనంత త్వరగా తమ ఓటములను వెనక్కినెట్టి సెమీస్ రేసులో ముందుండాలని చూస్తున్నాయి. దూకుడుగా ఆడాల్సిందే.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. 17 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే టాప్ ఆర్డర్ దూకుడును ప్రదర్శించి మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉంది. మరోసారి భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే తడబాటుకు లోను కాకుండా ఆడితేనే ఫలితం ఉంటుంది. పటిష్టంగా ఆసీస్... ఈ ప్రపంచకప్‌లో ఆసీస్ జోరు బలంగా సాగుతోంది. వారికి ఎదురైన ఓటమి కూడా కేవలం మూడు పరుగుల తేడాతోనే ఉండడం గమనించాలి. కెప్టెన్ మెగ్ లానింగ్ జోరును అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించాల్సిందే. ఎలిస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రతిభ జట్టుకు కీలకం కానుంది. పేసర్లు విల్లాని, షట్ స్పిన్నర్లు జొనాసెన్, బీమ్స్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గానే నిలవనుంది. ఆసీస్‌పై ఫలితం తేలిన 41 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది 8 మాత్రమే. ► మ. గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
1993 తర్వాత ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు
మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు 1993 తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేయగా... అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసి ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో విండీస్ 47 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. -
పాకిస్తాన్‌కు ఐదో ఓటమి
టాంటన్: మహిళల ప్రపంచకప్‌లో పాకిస్తాన్ మళ్లీ ఓడింది. న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో పాక్‌పై గెలుపొందింది. మొదట పాకిస్తాన్ 46.5 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ సనా మీర్ (50) ఒంటరి పోరాటం చేయగా, కివీస్ బౌలర్లలో హన్నా రో 3, తహుహు, కాస్పెరెక్, కెర్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ కేవలం 15 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి గెలిచింది. సోఫి డెవిన్ (41 బంతుల్లో 93; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వరుసగా ఐదో ఓటమితో పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. -
భారత్xదక్షిణాఫ్రికా
జొహన్నెస్‌బర్గ్: వచ్చే ఏడాది లండన్‌లో జరిగే మహిళల ప్రపంచ కప్‌నకు అర్హత సాధించడమే లక్ష్యంగా... శనివారం మొదలయ్యే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది. పూల్ ‘బి’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి మ్యాచ్ తర్వాత భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా అమెరికా (10న), చిలీ (12న), అర్జెంటీనా (16న) జట్లతో తలపడుతుంది. పూల్ ‘ఎ’లో మరో ఐదు జట్లున్నాయి. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన జట్లు ఈ ఏడాది నవంబరులో జరిగే హెచ్‌డబ్ల్యూఎల్ ఫైనల్స్ టోర్నీకి... వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ కప్ పోటీలకు అర్హత పొందుతాయి. -
ప్రపంచ రికార్డు చేరువలో మిథాలీ..
డెర్బీ: భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉంది. ఈ పరుగుల రాణి 34 పరుగులు చేస్తే మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల సాధించిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ షార్లెట్ ఎడ్వర్డ్స్(5992) పేరిట ఉంది. ఈ ఘనత షార్లెట్ 191 మ్యాచుల్లో సాధించగా, మిథాలీ 181 మ్యాచుల్లో 5959 పరుగులు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మిథాలీ చెలరేగితే అత్యధిక పరుగులతో పాటు తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన లేడిగా చరిత్రనెక్కనుంది. అంతేగాకుండా 6 వేల పరుగుల మైలు రాయి దాటిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందనుంది. ఇక మిథాలీ చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తుంది. గత నాలుగు మ్యాచుల్లో 71, 46, 8, 53 లతో రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇక రేపు జరిగే మ్యాచులో రాణించి వరల్డ్ రికార్డుతో పాటు ప్రపంచ కప్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. మిథాలీకి రికార్డులు కొత్తేమి కాదు. ఆమె ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 1999లో ఐర్లాండ్‌పై మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇంత కాలం క్రికెట్ ఆడుతున్న మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందింది. ఇక టెస్టుల్లో డబుల్ సెంచరీ, మహిళా టెస్టుల్లో 10 టెస్టులు ఆడటం ఆమె అదనపు రికార్డు. -
విధ్వంసకర ఆటపట్టు అవుట్..
డెర్బీ: శ్రీలంక డేంజరేస్ బ్యాట్ ఉమెన్ చమరి ఆటపట్టు (25) అవుటైంది. పూనమ్ యాదవ్ వేసిన 17 ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 22 ఫోర్లతో 178 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలో పెరారా(10) వికెట్ కోల్పోయి ఎదురు దెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటపట్టు మరో ఓపెనర్ హన్సిక తో ఆచూతూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 47 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోతున్న ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను పూనమ్ చక్కటి బంతితో వీడదీసింది. ఇక క్రీజులో హన్సిక (23) సిరి వర్దనే (4) క్రీజులో ఆడుతున్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక మహిళలు 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
అదర గొట్టిన మిథాలీ సేన.. శ్రీలంక లక్ష్యం 233
♦ అర్ద సెంచరీలతో రాణించిన దీప్తీ, మిథాలీ ♦ చివర్లో చితక్కొట్టిన వేద, కౌర్ డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మీథాలీ సేన శ్రీలంకకు 233 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ బ్యాటింగ్ ఉమెన్ లో దీప్తీ శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53)లు రాణించారు. ఇక చివర్లో వేద కృష్ణమూర్తి(29), హర్మన్ ప్రీత్ కౌర్(20) లు దాటిగా ఆడటంతో భారత్ 200 పై చిలుకు పరుగులు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు స్మృతి మందన(8), పూనమ్ రౌత్(16)లు నిరాశపరచడంతో శుభారంభం అందలేదు. దీంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను దీప్తీ శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ లు అర్ద సెంచరీలతో గట్టెక్కించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత 89 బంతుల్లో దీప్తీ అర్ద సెంచరీ చేసుకోగా మిథాలీ 72 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన దీప్తీ శర్మ (78) కాంచన బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన గోస్వామి(9) నిరాశ పరచగా మరుసటి బంతికే కెప్టెన్ మిథాలీ(53) కూడా ఎల్బీగా అవుటైంది. దీంతో 169 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్ దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. వీరిద్దరూ 52 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇక 49 ఓవర్ వేసిన శ్రీపాలి విరొక్కడే వరుస బంతుల్లో వీరిద్దరిని పెవిలియన్ కు చేర్చింది. చివరి ఓవర్లో జోషి రనౌట్ అవ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. భారత మహిళలు చివరి 5 ఓవర్లలో 46 పరుగులు చేయడం విశేషం. ఇక శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి విరొక్కడే 3 వికెట్లు తీయగా రణవీర(2), కాంచన, గుణరత్నే చెరో వికెట్ పడగొట్టారు. -
అర్ధశతకాలతో రాణించిన దీప్తీ, మిథాలీ..
► 5 వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మీథాలీసేన 5 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 44 ఓవర్లకు 182 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంబాన్ని అందించకపోవడంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తీ శర్మ, కెప్టెన్ మిథాలీ రాజ్ లు జట్టు బాధ్యతలు మీదేసుకున్నారు. విరీద్దరూ మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం అందించడంతో జట్టు 200 పరుగుల దిశగా దూసుకెళ్తుంది. తొలుత 89 బంతుల్లో దీప్తీ అర్ద సెంచరీ చేసుకోగా మిథాలీ 72 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన దీప్తీ శర్మ (78) కాంచన బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన గోస్వామి(9) వచ్చి రావడంతోనే బంతిని గాల్లోకి లేపింది. ఒక లైఫ్ వచ్చిన ఆమె అలానే ఆడుతనూ రణవీర బౌలింగ్ లో వెనుదిరిగింది. ఆ మరుసటి బంతికే కెప్టెన్ మిథాలీ(53) కూడా ఎల్బీగా అవుటైంది. దీంతో 169 పరుగులకే వికెట్లు కోల్పోయింది. క్రీజులో కృష్ణమూర్తి(7), హర్మన్ ప్రిత్ కౌర్ (6) పోరాడుతున్నారు. -
నిరాశ పరిచిన స్మృతి మందన..
♦ రెండు వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత ఓపెనర్ శతక వీరమణి స్మృతి మందన మరో సారి నిరాశ పరిచింది. ఈ టోర్నిలో సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మందన గత పాక్ మ్యాచ్ లోను విఫలమైంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు శుభారంబాన్ని అందించ లేకపోయారు. జట్టు 21 పరుగుల వద్ద మందన(8) గుణరత్నే బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగింది. కొద్దిసేపటికి మరో ఓపెనర్ పూనమ్ రౌత్(16) వీరొక్కడే బౌలింగ్ లో వెనుదిరిగింది. ఇక క్రీజులో కెప్టెన్ మిథాలీ రాజ్(7), దీప్తీ శర్మ(28)లు ఆచుతూచి ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు రెండు వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. -
టాస్ నెగ్గిన మిథాలీ సేన
డెర్బీ: మహిళా ప్రపంచకప్ లోభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్నమ్యాచ్ లో మిథాలీ సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకోగా శ్రీలంక ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక భారత్ జట్టులోకి మోన శర్మ స్థానంలో వేదా శర్మను తీసుకున్నారు. పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందనే బ్యాటింగ్ తీసుకున్నామని 250 పరుగుల చేస్తే స్పిన్నర్లతో మ్యాచ్ గెలువచ్చని మిథాలీ ధీమా వ్యక్తం చేసింది. ఇక శ్రీలంక కెప్టెన్ ఇనోకా రణవీర బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. -
ఈ మహిళా క్రికెటర్ చాయ్ వాలా కూతురు..
న్యూఢిల్లీ: మహిళా ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎక్తా బిష్త్ అబ్బాయిలతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టిందని ఆమె తల్లి తండ్రులు పేర్కొన్నారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమది పేదకుటుంబ నేపథ్యమని అయినా ఎక్తా పట్టుదలతో రాణించి జట్టుకు ఎంపికైందని సంతోషం వ్యక్తం చేశారు. ఎక్తా నాన్న కుందన్ సింగ్ బిష్త్ మిలటీరి నుంచి రిటైర్మెంట్ అయిన తరువాత చాయ్ అమ్మెవాడినని తెలిపారు. తన కూతురు కలల కోసం ప్రోత్సహించేవాడినని చెప్పుకొచ్చారు . ఎక్తాకు క్రికెట్ అంటే పిచ్చి అని అదే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. ఓ చాయ్ వాల కూతురుగా దేశానికి ఆడటం గర్వంగా ఉందన్నారు. ఎక్తా 6 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతుందని, అబ్బాయిలతో ఆడటం మొదలు పెట్టిందని జట్టులో ఒక్కతే అమ్మాయి కావడంతో ఎక్తా ఆడే మ్యాచ్ లు చూడటానికి జనాలు ఎగబడేవారని కుందన్ తెలిపారు. ఎక్తా జాతీయ జట్టుకు ఎంపికైన అనంతరం మా ఆర్ధిక పరిస్తితి మెరుగుపడిందన్నారు. భారత్ మహిళలు ప్రపంచకప్ గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎక్తా బిష్త్ పాక్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగి పాక్ ను కుప్పకూల్చిన విషయం తెలిసిందే. -
పాక్‌పై భారత్ ఘన విజయం
► 74 పరుగులకే కుప్పకూలిన పాక్ ► 5 వికెట్లతో ఎక్తా బిష్త్ విజృంభణ డెర్బీ: మహిళా ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కాగా, మహిళల ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన మిథాలీ సేన.. అదే దూకుడును కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది భారత్. భారత బౌలర్లలో స్పిన్నర్ ఎక్తా బిస్త్ ఐదు వికెట్లను నేలకూల్చారు. దీంతో తోక ముడవడం దాయాది జట్టు వంతైంది. 170 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళల జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ఎక్తా బిస్త్ బౌలింగ్‌లో ఓపెనర్ అయేషా జఫర్ వికెట్ల ముందు దొరికిపోయింది. అక్కడి నుంచి పాక్ పతనం ప్రారంభమైంది. 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బ్యాట్స్విమెన్లలో సనామిర్ మాత్రమే ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో గోస్వామి, దీప్తీ శర్మ, జోషి, హర్మిత్ కౌర్‌లు తలో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత్ మహిళల్లో పూనమ్ రౌత్ (47), దీప్తీ శర్మ(28), సుష్మా వర్మ(33) పరుగులతో రాణించారు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన శతక్కొట్టిన సృతి మంధన(2), కెప్టెన్ మిథాలీ రాజ్(8) అభిమానులను నిరాశపర్చారు. -
పాక్ ఎల్బీడబ్ల్యూ..విజయం దిశగా భారత్
♦ 29 పరుగులకే 6 వికెట్లు ♦ ఎక్తా బిష్త్ విజృంభణ డెర్బీ: భారత్ పాక్ మధ్య జరుగుతున్న మహిళా ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్ బౌలర్ ఎక్తా బిష్త్ దాటికి పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 29 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాక్ బ్యాట్స్ఉమెన్లలో నలుగురు ఎల్బీడబ్య్లూ కావడం విశేషం. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళల జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ఎక్తా బిష్త్ బౌలింగ్‌లో ఓపెనర్ అయేషా జఫర్ వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ వికెట్ ప్రారంభమైన పాక్ పతనం 15 ఓవర్లకు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్ బౌలర్ ఎక్తా బిష్త్ మూడు వికెట్లతో చెలరేగగా గోస్వామి, దీప్తీ శర్మ, జోషి తలో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత్ మహిళల్లో పూనమ్ రౌత్ (47), దీప్తీ శర్మ(28), సుష్మా వర్మ(33) లు రాణించారు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన శతక వీరమణి సృతి మందన(2), కెప్టెన్ మిథాలీ రాజ్(8) తీవ్రంగా నిరాశపర్చారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
-
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
డెర్బీ:మహిళల ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ తో ఇక్కడ జరుగుతున్న వన్డేలో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపారు.ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్ రౌండర్ శిఖా పాండే స్థానంలో మీడియం పేసర్ మన్షి జోషిని తుది జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు పాకిస్తాన్ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ బిస్మా మరూఫ్ స్థానంలో ఇరామ్ జావెద్ ను జట్టులోకి తీసుకోగా, కైనత్ ఇంతియాజ్ స్థానంలో మీడియం పేసర్ దియానా బాయిగ్ కు చోటు కల్పించారు. పాకిస్తాన్‌పై భారత మహిళలది తిరుగులేని రికార్డు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది. మిథాలీ సారథ్యంలోనే ఏకంగా 8 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక ప్రపంచకప్ చరిత్ర కూడా భిన్నంగా ఏమీ లేదు. ఈ మెగా ఈవెంట్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిథాలీ సేననే విజయం వరించింది. ఇక ఈ చరిత్రను పక్కనపెట్టి... కేవలం ఈ టోర్నీనే పరిశీలిద్దామంటే... ఇందులోనూ భారత్ జోరు, హోరు ఏమాత్రం తక్కువలేదు... ప్రత్యర్థులకు తలొగ్గలేదు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను, రెండో మ్యాచ్‌లో గత రన్నరప్ విండీస్‌ను కంగుతినిపించింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మొదలు బౌలర్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. -
మరో విజయంపై భారత్ దృష్టి
టాంటన్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ తొలుత విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇది భారత్ కు రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు మరో విజయంపై కన్నేసింది. అయితే వెస్టిండీస్ కూడా పటిష్టమైన జట్టే కావడంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. గత వన్డే ప్రపంచకప్ రన్నరప్, టీ 20 ప్రపంచ చాంపియన్ అయిన విండీస్ తో ఏమాత్రం ఆదమరిచినా భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విండీస్ తుది జట్టు: స్టెఫానీ టేలర్(కెప్టెన్), హేలే మాథ్యూస్, వాల్టర్స్, డాటిన్, అగ్విల్లెరా, ఐషోనా ఏ నైట్, చెడియన్ నేషన్, డాలే, ఏఎస్ఎస్ ఫ్లెచర్, అనిషా మొహ్మద్, ఎస్ఎస్ కానెల్ భారత్ తుది జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), మందనా, పూనమ్ రౌత్, హర్మన్ కౌర్, దీప్తి శర్మ, మెష్రామ్, శిఖా పాండే, జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, సుష్మా వర్మ పూనమ్ యాదవ్ -
నికోల్ సెంచరీ
టాంటన్: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. ఆసీస్ ఓపెనర్ నికోల్ బోల్టన్ (116 బంతుల్లో 107 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు 47.5 ఓవర్లలో 204 పరుగుల వద్ద ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (63 బంతుల్లో 46; 7 ఫోర్లు), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (57 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. చెదిన్ నాషన్ 39, డియాండ్ర డాటిన్ 29 పరుగులు చేశారు. ఒక దశలో 161/4 స్కోరుతో పటిష్టంగా కనిపించిన విండీస్ అనూహ్యంగా 43 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో ఎలైస్ పెర్రీ 3, జెస్ జొనసెన్, క్రిస్టెన్ బీమ్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 38.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు నికోల్, బెథ్ మూనీ (85 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 171 పరుగులు జోడించడంతో ఆసీస్ విజయం సులువైంది. విండీస్ బౌలర్ స్టెఫానీ టేలర్ 2 వికెట్లు తీసింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ ఆడుతుంది. -
ఇంగ్లండ్ కు టీమిండియా భారీ లక్ష్యం
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత టాపార్డర్ రాణించింది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ కు భారత్ 282 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేశారు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 26.5 ఓవర్లలో 144 పరుగులు జోడించారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఓపెనర్ మంధన సెంచరీ చేజార్చుకుంది. నైట్ బౌలింగ్ లో హజెల్ క్యాచ్ పట్టడంతో మంధన (72 బంతుల్లో 90: 11 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ బాట పట్టింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ హాఫ్ సెంచరీ (86: 7 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి స్కోరు బోర్డును నడిపించింది. 222 పరుగుల వద్ద హజెల్ బౌలింగ్ లో రౌత్ రెండో వికెట్ గా నిష్ర్రమించింది. కాగా చివర్లో కెప్టెన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 71: 8 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 26) వేగంగా ఆడటంతో 50 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి నైట్ బౌలింగ్ లో మిథాలీ ఔటయింది. ఇంగ్లండ్ బౌలర్లలో నైట్ రెండు వికెట్లు తీయగా, హజెల్ కు ఓ వికెట్ దక్కింది. -
మిథాలీ సేన బ్యాటింగ్
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తో ఆరంభపు మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీథెర్ నైట్ తొలుత భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇంగ్లండ్‌తో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో భారత్ ఎనిమిదిసార్లు ఓడిపోయింది. అయితే అన్ని విభాగాల్లో సమతుల్యంతో ఉన్న భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. భారత బ్యాటింగ్ లో ఓపెనర్లు దీప్తిశర్మ, పూనమ్ రౌత్, మిడిల్ ఆర్డర్ లో హర్మన్ ప్రీత్ కౌర్, మేశ్రమ్లతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా కీలకం. మరోవైపు స్వదేశంలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలోనూ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ముచ్చటగా మూడోసారి మళ్లీ గెలవాలని తహతహలాడుతోంది. సారా టేలర్, కెప్టెన్ హీథెర్ నైట్, పేసర్ కేథరీన్ బ్రంట్, సివెర్ రాణిస్తే ఇంగ్లండ్ శుభారంభం చేసే అవకాశముంది.ఓవరాల్‌గా భారత్, ఇంగ్లండ్ జట్లు 61 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 25 మ్యాచ్‌ల్లో భారత్... 34 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు ముఖాముఖి తలపడగా... మూడుసార్లు భారత్, ఆరుసార్లు ఇంగ్లండ్ విజయం సాధించాయి. దాంతో ఇంగ్లండ్ పై సమష్టిగా పోరాడితేనే భారత్ విజయం సాధించే అవకాశం ఉంది. -
రాణించిన మిథాలీ
వార్మప్ మ్యాచ్‌లో భారత్ గెలుపు చెస్టెర్ఫీల్డ్: మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ సన్నాహాల్లో బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 109 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. హైదరాబాద్ అమ్మాయి, కెప్టెన్ మిథాలీరాజ్ (89 బంతుల్లో 85; 11 ఫోర్లు), పూనమ్ రౌత్ (79 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత శ్రీలంక 48.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ రాజేశ్వరి (4/12) స్పిన్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తలవంచారు. శిఖా పాండే 2 వికెట్లు తీసింది. -
కెప్టెన్‌గా మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. వచ్చే నెల 24 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌కు సంబంధించి 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఇందులో మిథాలీరాజ్‌కే జట్టు పగ్గాలు అప్పజెబుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2005లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అదే ఇప్పటికీ భారత మహిళల అత్యుత్తమ ప్రదర్శన. భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పునమ్ రౌత్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మాన్సి జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పునమ్ యాదవ్, నుజ్హత్ పార్వీన్, స్మృతీ మందనా. -
శ్రీలంక విజయలక్ష్యం 260
కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ జట్టు 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు ఆదిలో ఓపెనర్ మిశ్రామ్(6) వికెట్‌ను కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ దీప్తి శర్మ(54) రాణించడంతో తేరుకుంది. అనంతరం దేవికా వైద్య(89), మిథాలీ రాజ్(70నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ జోడి రెండో వికెట్ కు 123 పరుగుల జోడించి భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. -
ఫేవరెట్ భారత్
కొలంబో: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అర్హత సాధించేందుకు 10 జట్లు పోటీ పడనున్నాయి. నాలుగు బెర్త్‌ల కోసం జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ మంగళవారం ప్రారంభ మవుతుంది. ఈనెల 21న ముగిసే ఈ టోర్నీలో భారత్‌తోపాటు శ్రీలంక, ఐర్లాండ్, థాయ్‌లాండ్, జింబాబ్వే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, పాపువా న్యూగినియా జట్లు పాల్గొంటున్నాయి. టాప్-4లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారుు. మంగళవారం తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. ఈ పోరులో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.